3, మే 2011, మంగళవారం

పం చ మహా యజ్ఞాలు - 2 వ వ్యాసము = ఋషి యజ్ఞం = కవి కాననిచో , ఋషి కాంచు నె య్యెడన్

పం చ మహా యజ్ఞాలు - 2 వ వ్యాసము

ముందు వ్యాసంలో - దేవ యజ్ఞం గురిం ఛి చూశాము.

భూమి నుండి  పుట్టి, భూమి నుండే,  ప్రతినిత్యం, ఆహారం నుండి, మందుల వరకు, సమస్తమూ  తీసుకుని,  పెరిగే - మన  చిన్ని   మెదడులో "యింత జ్ఞానం"  వుంటే -  యివన్నీ మనకిచ్చిన భూమికి మరెంత  జ్ఞానం వుంటుందో, మనం అర్థము చేసుకోవాల్సిందే.
   
 సూర్యుడు - మన ఆధారమైన - భూమి మనుగడకే ఆధారం. ఆటువంటి సూర్యుడికి  మరింకెంత జ్ఞానం వుంటుందో మనం అర్థము చేసుకోవాలి. 

అలాగే వాయువు, జలము, ఆకాశము - అన్నిటికీ - అపరిమితమైన పరిజ్ఞానము వుంది.  మన మనుగడకు కావలసిన వన్నీ యివ్వ గల శక్తీ వుంది. త్రిప్పి, వెనుకకు  తీసేసుకోగల సామర్థ్యమూ వుంది.

మన మాటలు, ప్రార్థనలు వినగల సామర్థ్యమూ వుంది.  అంతెందుకు.

మనం చెట్లు నాటడము కూడా దేవ యజ్ఞమే. తులసి చెట్టు, రాగి చెట్టు, మరెన్నో చెట్లను మనం దేవతలతో సమానంగా ఎందుకు  పూజిస్తామో తెలుసా? ప్రతి చెట్టు, ప్రతి పూవూ -ఏదో వొక దేవతకు ప్రీతి పాత్రమైనదని ఎందుకంటామో తెలుసా - వీటన్నిటికి శక్తీ నిచ్చే దేవతలను - వీటి ద్వారా మనం పూజిస్తున్నాము. మరి ఈ చెట్ల ఉపయోగం మనకూ కొంత తెలుసు. అవునా?

యిక ఋషి యజ్ఞాన్ని గురించి కొంత తెలుసుకుందాము.  

షి యజ్ఞం 

సప్తర్షులు, పతంజలి  లాంటి ఋషులు - మనకిచ్చిన జ్ఞానం అపారమైనది. మనకు తెలిసిన ప్రతి శాస్త్రాన్నీ, మనకిచ్చిన వారు మన ఋషులే.

ఋషులు - దేవతలకూ, మనుషులకూ - మధ్య, వారధి వంటి వారు. వారికి, స్వంతంగా కావలసిందేమీ లేదు.
మనకు అతి మూల్యమైన వజ్రం - వారి దృష్టిలో - మట్టిపెళ్ళ కంటే భిన్న మైనది కాదు. 

మనుషులలో - మహా పురుషులంటే - ఋషులే. కొన్ని దృక్కోణాలలో చూస్తే - దేవతల కం టే - ఋషులే గొప్ప వారు. ఆటువం టి వారి - ఆశీర్వాద బలం మనం ఎంత - అని చెప్పలేము. అందుకనే - తల్లులు, తండ్రులు  - తమ బిడ్డలకు - ఋషుల ఆశీర్వాదాలను ఇప్పించడానికి తహ తహ లాడుతారు.  విధినే మార్చ గల శక్తి  వున్న - ఋషులెంత మందో వున్నారు. రుషు యజ్ఞమం టే - అటువంటి ఋషులకు, గురువులకు - మనమేం చేయగలమో, అది చేయడము.  ఆ గురువులు కూడా, ఒప్రతి నిత్యమూ, తమ గురువులను ప్రార్థిస్తారు. 

ఋషి అయిన వాడే సరి ఐన గురువు కాగలడు. మిగతా వారు - ఉపాధ్యాయులుగా మాత్రమే - వుంటారు. ఈ కాలంలో కూడా - చాలా మంది, గొప్ప గురువులు భారత దేశంలో వున్నారు.  

మీరు - అటువంటి, ఏ గురువు దగ్గరి కెళ్ళినా -వారు ప్రతి రోజూ, పాఠం మొదలు పెట్ట డానికి  ముందు, వారి గురువులు, వా....రి గురువులు, ఆది గురువు వరకు   అందరికీ నమస్సులు చెప్పి, వారి ఆశీర్వాదం కొరకు ప్రార్థింఛి, తరువాత పాఠం ఆరంభిస్తారు. ఇది, యిప్పుడు కూడా, వుంది.

"ఓం, సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై, తేజస్వినా వధీత మస్తు, మా విద్ విషావహైహీ..... ఓం శాంతిహ్;  శాంతిహ్; శాంతి హి..    , " అన్న ఉపనిషద్ వాక్యము  యిందుకే.

"సదాశివ సమారంభాం, (వ్యాస)శంకరాచార్య మధ్యమాం, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం"  - అని  గురువులను స్మరించిన తరువాతనే - చాలా గురుకులాల్లో - యిప్పుడు కూడా, రోజువారీ శిక్షణను ఆరంభిస్తారు. కొంత మంది ఈ శ్లోకములో,  నారాయణ, రామానుజ పదాలను వాడుతారు.
.
సరే... మన మధ్య లేని ఋషుల గురింఛి అటు పెడితే - ఈ రోజు   మన మధ్య నున్న ఋషుల గురించి, గురువుల గురిం ఛి అనుకోవలసిన బాధ్యత   చాలా వుంది.

ఈ రోజు కూడా - మన మధ్య ఋషుల లాంటి గురువులు చాలా మంది వున్నారు.
స్వామి దయానంద, వారి అనేక శిష్యులు, స్వామి పరమార్థానంద, జగ్గి వాసుదేవ్, బాబా రాందేవ్,  స్వామి సుఖ బోధానంద,  శ్రీ శ్రీ రవి శంకర్, - లాటి మహానుభావులు  యింకా ఎంతో మంది వున్నారు.  

మీరు - వారి దగ్గరికి వెడితేనే, మీకు తెలుస్తుంది - మానవాళి కోసం - వారు - ఎంతెంత చేస్తున్నారని.     ఎంతగా శ్రమిస్తున్నారని. ఎన్నెన్ని నేర్పుతున్నారని. యిప్పుడు - వారి పాత ప్రసంగాలను - మనం, యు ట్యూబ్ ( ఇంటర్నెట్) లో కూడా విన వచ్చు. 

వినండి. ఎన్నో నేర్చుకుం టారు. మీ మనసు లోని, ఎన్నో ప్రశ్నలకు సులభ సమాధానాలు పొందుతారు. ఎంతో మనశశాంతి కలుగుతుంది. ఎంతో సంతోషమూ కలుగుతుంది. 

 దాదాపు - వీరందరి దగ్గరికి - ఏదో వొక ట్రైనింగు కోసమని, వెళ్ళిన అదృష్టము నాకు కలిగింది. వారందరూ - నాకు గురువులే.  ఋషి యజ్ఞమంటే - ఆటువం టి వారి పట్ల  ప్రతి రోజూ - మానసికంగా మన కృతజ్ఞత   తెలుపడమే. మీకు వచ్చే కష్ట సుఖాలలో - మీ గురువులు - ఎన్నో రకాలుగా   మీకు చాలా మంచి సలహాలనివ్వ గలరు. కొన్ని, మీరు వూహించనే లేనివి గా వుంటాయి.  అందుకే ఋషి యజ్ఞం.

ఋషి యజ్ఞానికి - మీరు ఎన్నో చేయచ్చు. వారి  ప్రయత్నాలకు సహకారం ఇవ్వవచ్చు. మీరు పెద్దగా ఏమీ చేయక పోయినా - ప్రతి రోజూ, వారి, వొక ప్రసంగము వినండి. పది నిమిషాల పాటు.

మీ జీవితం ఎంతో మారుతుంది.  మీకు ఎంతో సంతోషము, శాంతి లభిస్తాయి.

ఎవరినీ - గురువుగా - అంగీకరించని   వారి  జీవితం లో -  తప్పకుండా వుండే, అశాంతి మీ జీవితం లో వుండదు. 

నేను - దాదాపు అయిదేళ్ళు పాశ్చాత్య ప్రొఫెసర్ల - పర్సనాలిటీ డెవలప్మెంటు  పద్ధతులన్నీ - నేర్చుకుని - వాటిపై -  ఎన్నో వందల వర్క్ షాపులను, నడిపాను. అవి బాగున్నాయి. కాదనను. అవీ నేర్చుకోవలసినవే.

కానీ - మన గురువుల పద్ధతి వాటి  కంటే -  మహోన్నతమైనదని మాత్రం  తప్పక చెప్పగలను. 

ఎందుకంటే - మన వారు ఋషులు. 

రవి కాననిచో , కవి కాంచు నెయ్యెడన్ - అం టారు. 

అయితే - కవి కాననిచో - ఋషి కాంచు నె య్యెడన్ - అన్నది అక్షర సత్యం.

- మీ 

వుప్పలధడియం విజయమోహన్

తుది మాట :- క్షరం అంటే - సమసి పోయేది; నాశనమయ్యేది.   అక్షరం - అంటే - నాశనం లేనిది.

4 కామెంట్‌లు:

  1. నమస్కారమండి,
    నాకు ఒక సందేహ నివృత్తి చెయ్యగలరా? అది యజ్ఞము కి చైనం కి గల తేడా మరియు చైనం అనగా ఏమిటి?
    మా తాతగారు సోమయాజి కాని వారు చాలాకాలం క్రితమే కాలం చేసారు.
    మీరు నా సందేహ ని తీర్చగలరని బావిస్తున్నాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేక పోయినందుకు క్షమించ ప్రార్థన.నిజానికి యజ్ఞము అంటే - పరోపకారార్థం చేసే ఏ పనైనా -యజ్ఞము గానే భావించాలి. సరే. యాగాలు, క్రతువులు ఇలాంటివి ఎన్నో వున్నాయి. వీటిని ఋగ్వేదంలో కర్మ కాండ గా పేర్కొంటారు. మనం చెప్పుకున్న పంచ మహా యజ్ఞాలు కూడా - కర్మ కాండ క్రిందనే వస్తాయి.

      నాకు తెలిసినంత వరకు - "చయనులు" అన్న పదం మన ఆంధ్ర దేశం లోనే - కొందరు బ్రాహ్మణుల పేరు చివర వాడడం కనిపిస్తుంది. నేను చాలారాష్ట్రాలు తిరిగాను కానీ - మరెక్కడా ఈ పదం నాకు పేరులో వాడడం కనిపించ లేదు.

      చయనం - అనే పదానికి నాకు తెలిసినంత వరకు - చూడడం, దార్శనికత - లాంటి అర్థాలు వున్నాయి. యిది ఎన్నో భాషలలో వుంది. కానీ - యాగాలకు క్రతువులకు సంబంధించిన రుత్విక్కులలో వొకరుగా యిది వాడడం చూస్తున్నాము. అంతకు మించి నాకు తెలీదు. తెలుసుకోవచ్చు .

      అయితే - నా వరకు - కర్మ కాండ కొంత వరకే పరిచయం. కొంత వరకే ఆసక్తి. జ్ఞాన కాండ అనబడే వుపనిష త్తులపై ఆసక్తి కాస్త ఎక్కువ .

      ఎందుకంటారా? ఈశా వాస్యోపనిషత్తు అంటుంది - "ఎవరైతే అన్ని జీవులలోనూ తననే (ఆత్మనే) చూస్తాడో , అలాగే తనలోనే అన్నే జీవులనూ చూస్తాడో , అతడు ఎవరినీ ద్వేషించ లేడు."

      అంతే కాదు ;అతడిని - అన్ని జీవరాసులూ ప్రేమిస్తాయి. అని కేనోపనిషత్తులోనూ వుంది. మరి, మనం అలా ఎందుకు వుండడం లేదు? అన్నది ప్రశ్న . అవేవీ మనం చదవడం కూడా లేదనేది సమాధానం .

      తొలగించండి
    2. మీ ప్రశ్నకు సమాధానం ఈ మధ్య మరో పుస్తకంలో చదవడం జరిగింది . అది సరిగ్గానే వుందనిపించింది. - చయనం అంటే యజ్న వేదికను అమర్చే విధానం. వేదికను కూడా చయనము అని పిలవ్వొచ్చు . దాన్ని ఎలా కట్టాలి , ఎలాంటి యిటుకలు ఎన్ని, ఎలా వాడాలి - లాంటి వివరాలు - తెలిసున్న వారే చయనం అమరుస్తారు. అది కూడా వొక సైన్స్ లాంటిది . ( యిది కఠో పనిషత్తు కు వొకరి వ్యాఖ్యానం లో చదివాను).

      తొలగించండి
  2. ఆత్మా స్వరూపులు శ్రీ విజయ మోహన్ గారు,
    అద్భుతంగా వ్రాసారు. నేటి ఋషులను తెలుపుతూ జగ్గి, రవిశంకర్ గార్ల పేర్లు ఉద్ఘాటించారు. వారికి గురువుగారైన, పరమ పూజ్య గురూజీ శ్రీ ఋషి ప్రభాకర్ వారు మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా వున్నది.
    బహుశా మీరు వారిచ్చిన ఉపనిషత్తులు చదువలేదనుకుంటాను. ఆసక్తి ఉంటె తప్పకుండా మీకు అందజేయగలను. మీరు అందించే సందేశాలకు అవన్నీ తోడ్పడుతాయని నానమ్మకం.

    రిప్లయితొలగించండి