23, ఆగస్టు 2011, మంగళవారం

లంచ గొండి తనం పైన = యుద్ధం = టీం అన్నా


 లంచ గొండి తనం   పై  టీం అన్నా యుద్ధం

ఈ రోజు మన దేశాన్ని కదిలిస్తూ వున్న గొప్ప యుద్ధం - లంచ గొండి తనం   పైన టీం అన్నా ప్రారంభించిన  యుద్ధమే.

మన దేశ ప్రధాన మం త్రి  మన్మోహన్ సింగు గారు మంచి వారే. కానీ - తన మంత్రి. వర్గం లోనే వున్న లంచగొండి  తనాన్నే  అరికట్ట లేక పోయారన్నది వాస్తవం.

.సుప్రీం కోర్టు వారు అడ్డుకోక పోతే - ఆ లంచగొండులను  ఎవరూ ఏమీ చెయ్య లేక పోయే వారు.

 టీం అన్నా మొదట  అడిగిందల్లా - వొక మంచి లోక్ పాల్ చట్టము తెమ్మని మాత్రమే. 

 కానీ కాంగ్రెసు ప్రభుత్వము వారు   చేసిందల్లా  - టీం అన్నా లోని  వారిపై రక రకాలుగా దుమ్మెత్తి పొయ్యటమే   గాని   మంచి లోక్ పాల్ బిల్లు తేవటానికి ఏ రకమైన ప్రయత్నమూ చెయ్య లేదు.

 తరువాత - టీం అన్నా తో బాటు ప్రభుత్వం కూర్చోక తప్ప లేదు. అప్పుడు కూడా - ప్రభుత్వం - తన బుద్ధి పోనిచ్చు కో లేదు. తను వొక  నామ మాత్రపు బిల్లు తయారు చెయ్యడమూ - టీం అన్నా తయారు చేసిన బిల్లును నామ మాత్రం గా కూడా వొప్పుకోక పోవడమూ - మళ్ళీ టీం అన్నా  సభ్యులపై  బురద చల్లడానికి సన్నాహం చేయడమూ  ప్రజలు చూడనే చూసారు.

తరువాత - అన్నా హజారే గారు ఆమరణ నిరాహార దీక్ష కు కూర్చోవడమూ - దానికి విశేష ప్రజాదరణ లభించడమూ  జరిగింది.

 ఈ రోజు 8 వ రోజు. ప్రధాన మంత్రి గారు - ఆర్థికమంత్రి  ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా అన్నా టీం ను చర్చలకు పిలిచారు. యిదేదో - శుభారంభం మాదిరే కనిపిస్తూ వుంది.

 యికనైనా ప్రభుత్వం  వారు మనస్ఫూర్తి గా, హృదయ పూర్వకం గా  మంచి లోక్ పాల్ బిల్లు  తేవడానికి కృషి చేస్తారని ఆశిద్దాం. 

=మీ
వుప్పలధడియం విజయమోహన్