వచ్చే వొక గంట కాలంలో - మీరు ఏది అడిగితే అది మీకు వచ్చేస్తుంది, మీకు ఎవరో యిచ్చేస్తారు - అనుకోండి. మళ్ళీ ఆ గంట తరువాత , మీ ముందటి స్థితికి మీరు వచ్చేస్తారు - అని కూడా అనుకోండి. యిలా జరిగితే మీరు ఆ వొక గంట కాలంలో - మీకేం కావాలని అడుగుతారు?
ఆఆ.... వస్తుందా, పోతుందా... నేను అడిగేది వచ్చేటట్టుంటే స్వర్గమే అడిగేద్దును కదా!
నిజమే. మీరు స్వర్గము కూడా అడగవచ్చు. కానీ ఎందుకా స్వర్గము మీకు - మీరు ఆ కారణం మాత్రం చెప్పాలి. స్వర్గం ఎందుకేమిటి? మహా సౌఖ్యాలనుభవించ వచ్చు కదా -అంటారు.
నిజమే కావచ్చు. కాకనూ పోవచ్చు. స్వర్గం మీరు చూడలేదు. అక్కడ వున్నవి మీకు నచ్చుతాయో లేదో మీకు తెలీదు. తీరా, స్వర్గం వచ్చి, అక్కడ, అన్నీ ఆ యింద్రుడి మాట ప్రకారం జరిగితే? అయినా - అక్కడ ఉన్నవన్నీ మీకు నచ్చుతాయని మీకు చాలా, ఆనందాన్నిస్తాయని మీకు తెలుసా?
అది బైబిల్ లోని స్వర్గం లాంటిదా. మన పురాణాల లోని స్వర్గం లాంటిదా. కొరాను లోని స్వర్గం లాంటిదా.యివన్నీ కాక మరొక లాంటిదా? అక్కడ ఏముంటుంది? మీ ఉద్దేశంలో - అక్కడ ఏముండాలి? ఏముంటే - మీకు అది స్వర్గం లా అనిపిస్తుంది? ఏమి లేక పొతే, లేదా-ఏమి వుంటే, మీకు మహా బోరు కొట్టగలదు? ఏదో కావాలని వుంది మీకు - కానీ, నిజంగా, స్వర్గం లో ఏమి వుండాలో, ఏమి కావాలో, ఏదుంటే, మీకు చాలా బాగుంటుందో మీకు తెలీదు.
పోనీ, బిల్ గేట్స్ లాంటి వారి అందరి వద్దా వున్న సంపద మీకిస్తే - మీకు చాలా తృప్తా? మరిచి పోకండి, గంట తర్వాత, అంతా పోతుంది మళ్ళీ. సరే. ఆ సంపద వున్న గంట సమయంలో మీకెలా వుంటుంది? చాలా సంతోషంగా వుంటుందా? అదెలా ఖర్చు చెయ్యాలో తెలీకుండా అవస్థ పది పోతారా? యోచన చెయ్యండి. యిప్పుడు బిల్ గేట్స్ ఏం చేస్తున్నారో తెలుసా? అయిదు సంవత్సరాలుగా - తన డబ్బులో - మూడో వంతు దానంగా ఇచ్చేసారు. యింకా ఇస్తూనే వున్నారు.ఆ డబ్బు మరేం చెయ్యాలో - ఆయనకే తెలియడం లేదు. మీకెలా తెలుస్తుంది?
లేదంటే - ఆ వొక్క గంటా, గడచినా అయిదు సంవత్సరాలలో సెలెక్టయిన మిస్ వరల్డు లందరూ మీరేం చెబితే అవి చెయ్యడానికి సిద్ధంగా కూర్చున్నారనుకోండి. అది చాలా మీకు? అది మీకు తృప్తి నిస్తుందా ?
మరి మీరు ఆడవాళ్ళయితే - ఏమి అడుగుతారు? మీకు నచ్చిన హీరోలు మీ యింటి ముందు క్యూ లో నిలబడి, మీరేం చెబితే అవి చెయ్యడానికి సిద్ధంగా కూర్చున్నారనుకోండి. అది చాలా మీకు? అది మీకు తృప్తి నిస్తుందా ?
యోచన చెయ్యండి. వొక గంట - మీరేం అడిగితే - అది మీకివ్వబడుతుంది.
ఏదడిగినా - ఎందుకో మీరు చెప్పాలి. అంతే.
ఎందుకు?
ఎందుకు?
ఎందుకు?
ఎందుకు?
ఎందుకు?
యిలా - మీ ప్రతి కోరికకూ - కారణం చెబుతూ వెళ్ళండి.
ఆరో సారి మీరు కారణం చెప్పేటప్పటికి - మీకు తెలిసి పోతుంది. మీకు కావలసింది - అవేవీ కాదు.
మీకు నిజంగా కావలసింది వొక్కటే. నిజమైన, అసలైన, హృదయాన్ని నింపే సంతోషం. అదే మీకు కావలసినది.
కాని మీరు - నాకు అదివ్వు. సంతోషం వస్తుంది. నాకు యిదివ్వు. సంతోషం వస్తుంది. నాకు యివి రెండూ కాదు - మరోటి యివ్వు. సంతోషం వస్తుంది. యిలా అంటూ వెడతారు.
నిజానికి కోరికలేవీ నిజమైన, పూర్ణమైన సంతోషాన్నివ్వలేవు.
మీకు కావాల్సింది, అదీ, యిదీ, మరొకటీ కావు. మీకు కావలసిందే సంతోషమే.
అదొక్కటుంటే - మరేది లేక పోయినా పరవాలేదు. అది లేకుంటే - జీవితమే వ్యర్థం.
మరో అడుగు ముందుకు వేసి - చూద్దాం.
మీలో అమితమైన, లేదా, ఎంతో కొంత సంతోషం వుందనుకోండి. యిప్పుడు కళ్ళు మూసుకుని మరేం కావాలో యోచన చేయండి.... ఏదో కావాలనుకున్నారు కదా. ఎవరెవరి యిష్టం వారిది. మీరు యిప్పుడు కోరుకున్నది మీ యిష్టం. ఏం కావాలో కోరుకోండి .
యిప్పుడు మళ్ళీ యోచన చేయండి. మీలో యిప్పుడు ముందటి సంతోషం వుందా? అక్కడ అతృప్తి చోటు చేసుకుందా?
ఘంటా పథం గా చెప్పొచ్చు - ఏ క్షణంలో, మీరు మరొకటి కూడా వుంటే మేలనుకున్నారో - ఆ క్షణం నుండే , మీ సంతోషం చాలా తగ్గి, ఆ స్థలంలో, అతృప్తి చోటు చేసుకుంటుందని.
మీ దగ్గర ఏమున్నా, ఎన్నున్నా - యిప్పుడు మీ మనసంతా - మీరు కావాలని కోరుకున్న ఆ మరోటి పైనే వుంది. మీలో సంతోషం వున్న స్థలంలో, యిప్పుడు, ఆ కోరిక వుంది.
అందు వలన మీ దగ్గర ముందున్న సంతోషం లేదని - మీకు చాలా సులభంగా తెలిసిపోతుంది.
మరో రెండు కోరికలు కోరారనుకోండి. మీ సంతోషం ఎనభై శాతం తగ్గి పోతుంది. యిరవై శాతమే మిగులుతుంది.
యిదో పరీక్షగా ,ప్రయోగంగా - చేసి చూడండి. కోరికలు ఎక్కువయ్యే కొద్దీ - సంతోషం అదే శాతంలోనో, అంతకంటే ఎక్కువగానో - తగ్గి పోతుందని యిట్టే అర్థమయి పోతుంది. యిది పచ్చి నిజం. కృష్ణుడి నుండీ, బుద్ధుడి నుండీ, జ్ఞానులందరూ చెప్పేది యిదే.
యిప్పుడు - మరో చిన్న ప్రయోగం చేసి చూడండి. యివన్నీ , మీరు, నేను చేయ గలిగేవే. పెద్ద బ్రహ్మ యజ్ఞంమేం కాదు.
మరో సారి కళ్ళు మూసుకోండి. యిప్పుడు - మీ దగ్గర నిజంగా వున్నవి మాత్రం మీకు చాలు; మరేం అక్కరలేదు మీకు - అని అనుకోండి. మీ భార్య / మీ భర్త - తప్ప మరెవరూమీకు అక్కర లేదు. వారు మీకు బాగా నచ్చినట్టు అనుకోండి. వారు తప్ప మరెవరైనా కూడా - మీతో అంత బాగా వుండలేరని, వున్న వారిలో, వారే మీకు తగిన వారని అనుకోండి. అలాగే - మీ సంతానం - మీకు బాగా నచ్చారనుకోండి. మీ తలిదండ్రులు మీకు బాగా నచ్చారనుకోండి.
మీకు యివ్వ బడినవన్నీ - మీకు తగినవే; మీకు మరేమీ అక్కర లేదు; యివ్వ బడిన వాటితో తృప్తి పడతానని మనః పూర్వకంగా అనుకోండి.
అసలు నిజం కూడా అదే. మీ శరీరం వొక్క సారి చూసుకోండి. మీ రంగు, మీ ఎత్తు, బరువు, లావు - ఎన్నో, మీకు నచ్చక పోవచ్చు. కానీ ఆ శరీరం వదిలేసి, మరో శరీరం తీసుకో గలరా. లేదు కదా?
యిప్పుడు - మీకు వున్న శరీరం మీకు నచ్చితే సంతోషంగా వుండ గలరా? మీకు నచ్చక పోతే సంతోషంగా వుండ గలరా? నచ్చితేనే గదా. కాబట్టి మీ శరీరాన్ని హృదయ పూర్వకంగా వొప్పుకోండి. అది ఎలా వున్నా సరే.
మన పూర్వీకులు "దేహో దేవాలయో ప్రోక్తః" అన్నారు. అంటే - మీ దేహం వొక దేవాలయం. అందులో, నిజమైన దేవుడున్నాడు. మీ దేవాలయాన్ని, అంటే , మీ దేహాన్ని, అది చిన్నదైనా, పెద్దదయినా, ఎలా వున్నా, ప్రేమించండి. గౌరవించండి. శుభ్రంగా పెట్టుకోండి. వీలైనంత ఆరోగ్యంగా పెట్టుకోండి. అది మీకు తప్పకుండా సంతోషం యిస్తుంది.
మీకు జన్మనిచ్చిన తలిదండ్రులు - ఎలా వున్నారు? వయసయిన కాలంలో ఎలా వుంటారు? మీ శరీరాన్ని మీరు మార్చుకోలేనట్టే , దాన్ని ప్రేమించినట్టే - తలిదండ్రులు ఎలా వున్నా, వారిని ప్రేమించడం, గౌరవించడం చేస్తే - ఆ భావన వలన కూడా, మీ మనసులో, తృప్తి, సంతోషం పెరుగుతుంది. లేదంటే - మీ మనసు - అతృప్తితో, నిస్సంతోషంగా తయారవుతుంది. మన సంస్కృతిలో - మొదటి రెండు దేవుళ్ళు ఎవరో తెలుసా? మాతృదేవో భవ; పితృ దేవో భవ; తల్లి కనిపించే దైవం. ఆ తరువాత - తండ్రి కనిపించే దైవం. నిజమైన దేవుడిని, అంటే, శివుడినో, విస్ద్నువునో, ఎహోవానో, మరే పేరున్న దైవాన్నయినా మీరెప్పుడూ మీ కళ్ళతో చూడ లేరు. కానీ - తల్లి దండ్రులలో - వారెవరినైనా చూడొచ్చు. చూడాలి. చూడండి.
మీ సంతానమైనా అంతే. వారినీ మార్చలేరు మీరు. వారెలా వున్నా వారే - మీ సంతానం. వారినీ - మీరు హృదయపూర్వకంగా ప్రేమించండి. మీ సంతోషం వెంటనే పెరుగుతుంది.
కారణం ఏదైనా కానివ్వండి. మీరు వారిని ప్రేమించ లేక పొతే - మీకే నష్టం. మీ సంతోషమే పడిపోతుంది.
మీ శరీరాన్ని గాని, మీ తలిదండ్రులను గాని, మీ సంతానాన్ని గాని - మీరు మార్చు కోలేరు. మరి కాస్త యోచన చేస్తే - మీకు అర్థమవుతుంది - వారంతా, మీకివ్వబడిన వర ప్రసాదమని. వారిని మీరు కాస్త ప్రేమిస్తే - వారిలో - మీ పట్ల ఎంత మార్పు వస్తుందో - మీకు యింకా తెలియలేదు.
మీ చాలెంజి అల్లా వొక్కటే.
కనీసం 48 రోజులు - వారిని పూర్తిగా ప్రేమించండి. వారి తప్పులను (అంటే, మీ దృష్టిలో - వారి తప్పులు) పూర్తిగా ఈ 48 రోజులు క్షమించండి. వారికి మీరు ఏమేమి మంచి చేయ గలరో - అవన్నీ చెయ్యండి. వారి నుండీ, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయండి. వారి పట్ల విమర్శలను పూర్తిగా విడిచి పెట్టండి, ఈ 48 రోజులు. వారు ఏ మంచి పని చేసినా, మీకు నచ్చిన ఏ (మంచి) పని చేసినా - కొద్దిగా పొగడండి.
సరే. 49 వ రోజు - మీ యింట్లో, ఏ మార్పు వచ్చిందీ - మీకే తెలుస్తుంది. చాలా, చాలా మార్పులు మీకే స్పష్టంగా కనిపిస్తాయి. మీ సంతోషం చాలా పెరుగుతుంది. మీ తప్పులు మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ వారు, మీకు నచ్చే విధంగా ప్రవర్తించాలని ప్రయత్నించడం మీరే చూస్తారు. పూర్తిగా అని కాదు సుమా. పూర్తిగా, మీకు నచ్చే విధంగా, మీరే వుండలేరు తెలుసా. మరొకరెలా వుంటారు?
యివన్నీ వొక ఎత్తు. మీరు - యిదే బాణీలో - మీ భార్య / భర్త ను - మీకు దేవుడిచ్చిన అతి గొప్ప వరంగా తీసుకుని - వారిని ప్రేమించండి. 48 రోజులు - మళ్ళీ.
వారిపై మీరు చేసే విమర్శలు పూర్తిగా నిలపండి. వారిని అప్పుడప్పుడు, నిజమైన కారణాలు కనిపించినప్పుడు - కాస్త పొగడండి. పని కట్టుకుని నిజమైన కారణాలు వెదికి - తప్పకుండా పొగడాలి. కనీసం రెండు రోజులకు వొక్క సారైనా (మరీ ఎక్కువ చేయకుండా) పొగడండి.
వారికి, మీరు, ఏమేం సహాయం చేయగలరో, చెయ్యండి. వారికి, మీలో నచ్చని, చెడు విషయాలుంటే - అవి ప్రక్కన పెట్టడానికి కృషి చెయ్యండి.
మీరు యివన్నీ పూర్తిగా, హృదయ పూర్వకంగా చెయ్యాలంటే - ప్రతి దినం ఉదయం వొక చిన్న పని చెయ్యాలి. లేచిన వెంటనే, మొహం కడుక్కున్న వెంటనే - ఏదో వొక దేవుడిని తలుచుకొని, లేదా, దేవుడి విగ్రహం ముందో, పటం ముందో నిలిచి , లేదా మనసులో అనుకుని - వీరందరి ఆరోగ్యం కోసం, సంతోషం కోసం, మంచి కోసం - రెండు నిముషాలు మనస్ఫూర్తిగా ప్రార్థించండి . అందుకు మీ చేతనైన పనులన్నీ మీరు చేస్తానని కూడా చెప్పండి.
వొక్క 48 రోజులు యిలా చెయ్యండి. యిది కష్టమనుకున్నారా ? కానే కాదు. ప్రయత్నం చేసి చూడండి. యిది చాలా, చాలా సులభమైన ప్రయోగం. మీరు కావాలనుకుంటే - దీన్ని, ఎంతో, ఉత్సాహంతో, నాటకీయతతో కూడా చెయ్యొచ్చు. (నిజానికి, కృష్ణుడు జీవితమంతా అలాగే చేసాడట). ఈ ప్రయోగంలో, ప్రతి వారంలోనూ, మీరు ఎన్నో మార్పులు గమనిస్తారు.
మీ వారందరిలో - గణనీయమైన మార్పు వస్తుంది. మీ యింటి వాతావరణం చాలా మారుతుంది. యిలా బ్రదకడం సులభం. ఈ ప్రయోగానికి ముందు మీరున్నట్టుగా బ్రదకడమే కష్టం,
సరే. మీ వారెవరూ మారనే లేదనుకోండి. యిలా జరుగదు. కాస్తయినా మార్పు తప్పదు. కాని వొక వేళ మారక పొతే!
అప్పటికి - అతి ముఖ్యమైన మార్పు - జరగనే జరిగింది. అది మీలో జరిగింది.
మీరు మారారు. మీ సంతోషానికి మూలం, మీ ఆనందానికి కారణం మీకు తెలిసి పోయింది. అది - మీ బయట లేదు. మీ లోపలే వుంది.
అది - మీ సంతోషానికి మూలం - మీ తృప్తి.
తృప్తికి మరో పేరే సంతోషం.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
చిన్న వివరణ : నిస్స్వార్థంగా చేసే దేన్నైనా కోరిక అనరు; యజ్ఞము అంటారు. వాటి ఫలితం మీరు - మీకోసం కోరలేదు. మిగతా అందరి కోసం కోరారు; చేసారు. అయినా - ప్రకృతి సంతోషంతో - మీకు వెల కట్ట లేనిది మరేదో యిస్తుంది. అదే సంతోషం. అదే తృప్తి. అది మాత్రమే కాదు. మీరు మిగతా వారికి భవిష్యత్తులో - యివ్వడానికి, చెయ్యడానికి, మీకు కావలసినంత శక్తి సామర్థ్యాలు కూడా యిస్తుంది.
స్వార్థంతో చేసే ఏ పనిలో నైనా - మీకు నిజమైన సంతోషం దొరకదు. దొరికేది - కొంత సేపు కూడా వుండదు. జాగ్రత్తగా గమనించి చూడండి. మీ ప్రయత్నాల ఫలితం - మీకు వచ్చినా - ఎంతో కొంత అతృప్తిని మిగిల్చేసి త్వరగా వెళ్లి పోతుంది. యిది ప్రకృతి నియమం.
కాబట్టి - నిజమైన సంతోషం కావాలంటే - ప్రతి రోజూ, నిస్స్వార్థంగా, ఏ చిన్న పనైనా చేయండి. యిది - జీవితంలో సక్సస్ కు అతి ముఖ్యమైన మూల మంత్రం. దీన్నే మనం యజ్ఞం - అన్నాం.
baavumdi .
రిప్లయితొలగించండిchala baga chepparu sir ide sutranni adhyatmikamga mamatma sarva bhutatma annaru nalo unna atme anthata undi.ninnu ela premistavo anni jivulni alage preminchu niswardhamga preminchu phalitam bhagavanhudikiyu endukante neku emichina bhagavanthude.evarni koncham kuda dveshinchakunda andarni premistu unte e prapanchame shanthi nilayam avutundi.
రిప్లయితొలగించండిokka mata chettu pandlanu itarulaku ivvadanike puttindi aavu paalu itarula sevake puttindi krovvotti tanu karagadanike puttindi "alage manavudu tana chuttu unna samajaniki seva cheyadanike puttadu"
me post ki caption telusa sir "aasa pote anni pondinatle".
thank you
చలా బగా వ్రాసారు విజయమొహన్ గారు.
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు , ప్రోత్సాహానికి చాలా సంతోషం. యిప్పుడు రాస్తున్న స్వగతం సీరీస్ కూడా చదవండి . యిప్పటికి మూడు వ్యాసాలు అయ్యాయి . మీ అభిప్రాయాలు తెలుపుతూ వుండండి
తొలగించండిథియరీలు చెప్పడానికి బాగుంటాయి సార్.. వాస్తవం వచ్చేసరికే తేలిపోతాయి.. ముందుగా దేవుడిని నాకో వంద కోట్లు ఇవ్వమని ఒకటికి వందసార్లు అడుగుతున్నా.దాని ద్వారా వచ్చే సంతోషం ఎలా ఉంటుందో నాకు క్రిష్టల్ క్లియర్ గా తెలుసు.. మీరన్నట్లు ’’మీరేం అడిగితే - అది మీకివ్వబడుతుంది.‘‘ మరి ,
రిప్లయితొలగించండిగమ్యం సినిమాలో అల్లరి నరేష్ క్లైమాక్స్ లో నక్సలైట్ల ముందు నిలబడి అన్నా మీరొస్తారని జీవితాంతం ఎదురుచూసానన్నా...మీరు రానేలేదు అంటాడు..అలాగే ఆసియా , ఆఫ్రీకా ఖండాల్లోని నూటికి అత్యధిక శాతం మంది జీవితాలు నరకప్రాయం..కోట్ల మంది రైతులు పంటలకు గిట్టుబాటు లేక, చేతికొచ్చిన పంటలు పోతూ, పండించడానికి చేసిన అప్పలు కాలసర్పాలై బుసలు కొడుతుంటే గత్యంతరంలేక అత్మహత్యలు చేసుకునే వారు కోకొల్లలు,,అలాంటి రైతులు,నేతవస్ర్తాలు వేసే వారు, కూలీలు ఎందరెందరో రెక్కాడితే గాని డొక్కాడని కోట్లాదిమంది అందరు దేవుడిని అడుగుతున్నారు. కనీసం బ్రతుక డానికి కూడు,గూడు,నీడ ఇవ్వమని అడుగుతున్నారు. మీరు అంటున్నారు.’’ ఏదడిగినా - ఎందుకో మీరు చెప్పాలి. అంతే.‘‘
ఏదడిగినా ఎందుకో వీరంతా నెత్తినోరు కొట్టుకుని దేవుడిగుళ్ళో,అప్పలవాళ్ళ దగ్గర చెపుతూనే ఉన్నారు...
వారి మొర ఏదేవుడు అలకించడంలేదే...వారు అడిగిందేమి ఇవ్వబడడంలేదే.? అల్లరి నరేష్ మాదిరి ఏళ్ళ తరబడి చూసి చూసి జీవితాలు చాలిస్తున్నారే..
నాదగ్గరో వందకోట్టుంటే దాని మీద వడ్డీతో,కనీసం తెలుగు వారి వరకు నిస్పహాయ పరిస్థితుల్లో అప్పుల ఊబిలో దిగబడకుండా , జీవించడం కన్నా చావడం మేలనే పరిస్థితులను ఎదురొడ్డి వారికి ఆసరానవుతా..కనీసం ఇల్లులేని నేను, 30 లక్షలతో నాకంటూ ఓ ఇంటిని కొనుక్కుంటా..70 లక్షలతో నా బ్యాంక్ బ్యాలెన్స్ దిట్రంగా ఉంచుకుని , నాకు ద్రుడమైన ఆసరా , పునాది ఏర్పడ్డాక సమాజాన్ని బాగుపరుచడానికి వెంటనే నడుం బిగుంచుతా..
ఇంత క్లియర్ గా ఎందుకో దేవుడిని అడుగుతున్నాను.. మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి , ఎప్పడు దేవుడు నాకు వంద కోట్టు ఇస్తాడు?
ఇవన్ని ఆచరణలో సాధ్యం కాని సిద్ధాంత పరమైన ఉబుసుపోకుండా చేసే తాత్విక చర్చలు.
కాదని చెప్పదలిస్తే..నా ఫోన్ నెంబర్ 9949818748, మేయిల్ aravindernet@gmail.com, చేయండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరవీందర్ చెప్పింది వాస్తవం
రిప్లయితొలగించండి