లంచ గొండి తనం పై టీం అన్నా యుద్ధం
ఈ రోజు మన దేశాన్ని కదిలిస్తూ వున్న గొప్ప యుద్ధం - లంచ గొండి తనం పైన టీం అన్నా ప్రారంభించిన యుద్ధమే.
మన దేశ ప్రధాన మం త్రి మన్మోహన్ సింగు గారు మంచి వారే. కానీ - తన మంత్రి. వర్గం లోనే వున్న లంచగొండి తనాన్నే అరికట్ట లేక పోయారన్నది వాస్తవం.
.సుప్రీం కోర్టు వారు అడ్డుకోక పోతే - ఆ లంచగొండులను ఎవరూ ఏమీ చెయ్య లేక పోయే వారు.
టీం అన్నా మొదట అడిగిందల్లా - వొక మంచి లోక్ పాల్ చట్టము తెమ్మని మాత్రమే.
కానీ కాంగ్రెసు ప్రభుత్వము వారు చేసిందల్లా - టీం అన్నా లోని వారిపై రక రకాలుగా దుమ్మెత్తి పొయ్యటమే గాని మంచి లోక్ పాల్ బిల్లు తేవటానికి ఏ రకమైన ప్రయత్నమూ చెయ్య లేదు.
తరువాత - టీం అన్నా తో బాటు ప్రభుత్వం కూర్చోక తప్ప లేదు. అప్పుడు కూడా - ప్రభుత్వం - తన బుద్ధి పోనిచ్చు కో లేదు. తను వొక నామ మాత్రపు బిల్లు తయారు చెయ్యడమూ - టీం అన్నా తయారు చేసిన బిల్లును నామ మాత్రం గా కూడా వొప్పుకోక పోవడమూ - మళ్ళీ టీం అన్నా సభ్యులపై బురద చల్లడానికి సన్నాహం చేయడమూ ప్రజలు చూడనే చూసారు.
తరువాత - అన్నా హజారే గారు ఆమరణ నిరాహార దీక్ష కు కూర్చోవడమూ - దానికి విశేష ప్రజాదరణ లభించడమూ జరిగింది.
ఈ రోజు 8 వ రోజు. ప్రధాన మంత్రి గారు - ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా అన్నా టీం ను చర్చలకు పిలిచారు. యిదేదో - శుభారంభం మాదిరే కనిపిస్తూ వుంది.
యికనైనా ప్రభుత్వం వారు మనస్ఫూర్తి గా, హృదయ పూర్వకం గా మంచి లోక్ పాల్ బిల్లు తేవడానికి కృషి చేస్తారని ఆశిద్దాం.
=మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి