మీకు ఎన్నాళ్ళు బ్రతకాలని వుంది?
ఈ ప్రశ్న నేను నేషనల్ అకాడెమి ఆఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మేనేజ్ మెంటు లో వున్నప్పుడు నా వర్కుషాపులకు వచ్చే వారినందరినీ అడిగే వాడిని.
చాలామంది అరవై ఏళ్ళు, డెబ్భై ఏళ్ళు యిలా ఏదో వొకటి చెప్పే వారు. ఏ ఒక్కరూ వందేళ్ళు వుండాలని కోరుకోలేదు.
యిది చాలా చిత్రం అనిపించింది.
నా పనే యిటువంటి విషయాలను పరిశీలించడమూ, రీసెర్చ్ చేయడమే గనుక దీనిపై అధ్యయనం చేయడం జరిగింది.
ప్రపంచంలో - ముఖ్యంగా - రష్యా, దానికి సమీపంగా వున్న కొన్ని దేశాలలో వున్న- కొన్ని ప్రదేశాలలో మనుషులు - దాదాపు అందరూ , వందా, అంతకు మించి బ్రదికేస్తున్నారు. అది వారికేమీ గొప్పగానో, క్రొత్త గానో అనిపించడం లేదు.
అదే విధంగా - 113 ఏళ్ళకు పైగా జీవించిన వంద మంది లిస్టు -గిన్నెస్స్ వరల్డ్ రికార్డు వారిచే తయారు చేయ బడింది. అందులో చాలా మంది ఆడవాళ్ళు గా వుండడం, అమెరికా వారిగా వుండడం విశేషం.
అందులో భారత దేశం వారు కానీ చైనా వారు కానీ వొక్కరు కూడా లేక పోవడం మరో విశేషం.
దీనికి వొక ముఖ్య కారణం - ఈ రెండు దేశాల్లోనూ - సరైన బర్త్ సర్టిఫికేట్ - ఆధారం లేకపోవడం కూడా. అయితే - మన దేశంలో వందేళ్ళు పైగా జీవించే వారు లేక పోలేదు. గిన్నెస్స్ వారు నమ్మ గలిగిన ఆధారం (ప్రమాణం) లేదు. అంతే. అయితే, మన దేశంలో, వీరి సంఖ్య చాలా తక్కువ.
ప్రపంచమంతటా - వంద ఏళ్ళు అయి బ్రతికున్న వాళ్ళు ఆరోగ్యం గానూ వున్నారు. సంతోషంగానూ వున్నారు. ఏదో, మంచంపై నుండి - లేయలేక మరొకరిపై ఆధార పడి వుండడం లేదు. వారికి - వారికంటే, చిన్న వారు- బాగా గౌరవమూ, మర్యాదా యిస్తున్నారు.

ఎందుకలా అక్కడ? ఎందుకు మరోలా యిక్కడ?
యిక్కడ, చాలా మంది, వంద ఏళ్ళు బ్రతకాలనే అనుకోవడం లేదు. కోరుకోవడం లేదు
మనం దీవించడం మాత్రం - శతాయుష్మాన్ భవ - అనే దీవిస్తున్నాము.
కానీ - మన సమాజంలో వంద ఏళ్ళు సుఖంగా వుండ గలిగే పరిస్థితులు - మాత్రం తగ్గిపోతున్నాయి.
ఒకప్పుడు రోగాలతో పొయ్యే వాళ్ళు - యిప్పుడు వొంటరితనం తో పోవలసిన పరిస్థితులు వస్తున్నాయి. మానసికంగా వందేళ్ళు సుఖంగా వుండగలం - అన్న నమ్మకం వున్న వారు తగ్గిపోతున్నారు. చిన్నవాళ్లకు, పెద్ద వాళ్ళపై గౌరవమూ - తగ్గుతూ వుంది.
అందువలన -వంద దాటి - సంతోషంగా, ఆరోగ్యంగా వుండే వారు, మన దేశంలో, యిప్పుడు, చాలా, చాలా తక్కువగా వున్నారు. "మన వారు" అని అనుకోగలిగిన వారు లేక పోతే - బ్రతుకు పై ఆశ సన్నగిల్లి పోతూ వుంది. ఈ పరిస్థితిని సులభం గానే మార్చ వచ్చు. మార్చాలి కూడా.
రష్యా, అమెరికా లాంటి కొన్ని దేశాలలో - కొన్ని ప్రాంతాలలో - ఎంతో మంది, వందకు పైగా బ్రతుకుతూ వుండటం వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ యిది నిజం. యిప్పటికీ జరుగుతూనే వుంది.
కొన్నేళ్ళు ముందట - అమెరికాలో చిన్న ప్రయోగం చేసారు.
ఈ ప్రయోగం ప్రకారం - కాస్త వయసు మళ్ళిన వాళ్ళు - కొన్ని నెలల పాటు - తమ వయస్సును మరిచి పోయి, 25 - 30 ఏళ్ళ వాళ్ళ లాగా, పూర్తిగా - అన్ని విషయాల్లోనూ -వ్యవహరించాలి. ఈ ప్రయోగానికి ఎంతో మంది ఉత్సాహం గా ముందు కొచ్చారు. యిలా కొన్ని నెలల పాటు చేసిన వారిలో - చాలా మార్పులు భౌతికంగానూ, మానసికం గానూ కనిపించాయి.

వారి భౌతిక వయస్సు - చాలా, చాలా తగ్గినట్టు తెలిసొచ్చింది. అంటే - మీ శరీరం, కొంత వరకూ - మీ మనస్సుకు అనుగుణంగా ప్రయాణం చేస్తుందన్న మాట. మీ మనస్సును మీ ఆశయాలకు అనుగుణంగా పెట్టుకోవాలి. అంతే.
మీరు అరవై వరకు చాలనుకుంటే - మీ మనసు ప్రకారం - మీ శరీరం కూడా అలా అనుకునే ప్రమాదం వుంది. అదే - మీరు 101 వరకు వుండాలనుకుంటే -మీ మనసు , మీ శరీరం రెండూ - దానికి అనుగుణంగా పోవచ్చు.
జీవితంలో మనం చేయ వలసిన 101 పనులు - అన్న శీర్షికతో - నామరో అంగ్ల భాషా బ్లాగులో నేను రాసిన మొట్ట మొదటి పని - దీన్ని గురించే :
మీరు - 101 సంవత్సరాలు - ఆరోగ్యంగా, సంతోషంగా బ్రతకాలి - అన్న గట్టి నిర్ణయం తీసుకోవడమే - మీరు చేయ వలసిన మొట్ట మొదటి పని.
మనమెక్కడ 101 సంవత్సరాలు బ్రతుకుతాం - అరవయ్యో , డెభైయో చాలులే - అనుకునే వారే మనలో, ఎక్కువగా వున్నారు. అందుకే, ఆ వయస్సు వచ్చే సరికి - మన వారంతా - తిరుగు లేని ఆ ప్రయాణానికి రెడీ అయిపోతున్నారు.
మన ఆరోగ్యం వుండేంత వరకు చాలు - అనుకునే వారు - ఏ కాస్త అనారోగ్యం వచ్చినా - యిక మన పని అయిపోయింది అని అధైర్య పడడమూ మనం చూడొచ్చు.
అరవై, లేదా, డెబ్భై చాలు - అనుకునే వారు - ధైర్యం విడిచేసి - ఏ చిన్న అనారోగ్యం వచ్చినా చావుకు రెడీ అవుతారు. వందేళ్ళు ఖచ్చితం అనుకునే వారిలో - ఆ భావన తొందరగా రాధు. రోగాలు వస్తే - ఆ.., చిన్న,చిన్న రోగాలు, యివి తొందరగా పోతాయిలే - అని ధైర్యంగా వుంటారు. వారి మనస్సు ప్రకారం రోగాలు కూడా తొందరగా పోతాయి. ముప్ఫై ఏళ్ళలో , యిరవై ఏళ్ళలో వుండే ధైర్యం డెబ్భై ఏళ్ళ లోనూ వుంటుంది.తొంభై ఏళ్ళ లోనూ వుంటుంది.
ఆరోగ్యంతో, సంతోషంతో 101 సంవత్సరాలు నేను వుండాలి - అని మొదట గట్టి నిర్ణయం తీసేసుకోండి.
రష్యా లోని - కొన్ని గ్రామాల్లోని - శతాయుష్కులైన ఆ యువకుల్లాగా - తెలుగువారంతా కనీసం 101 సంవత్సరాలు - ఆరోగ్యంతో, సంతోషంతో బ్రతుకుదాం.
యిలా అనుకుంటే - తప్పకుండా 101 సంవత్సరాలు - ఆరోగ్యంతో, సంతోషంతో బ్రతుకుతామా? ఈ ప్రశ్న అనవసరం. మన శరీరం, మన మనస్సూ ఆ దిశగా ప్రయాణిస్తాయి. అంతే.
మరి ప్రకృతి శక్తులూ, దేవుడి లీలలూ వుంటాయి. వాటి ప్రభావమూ వుంటుంది. వాటి వలన ముందుగా పోవచ్చు. లేదా మరి కొన్ని ఏళ్ళు. ఎక్కువా బ్రతకొచ్చు. వాటిని ప్రక్కన పెట్టి - మీరు మీ చేతిలో వున్న - మీ నిర్ణయం గట్టిగా తీసుకోండి.
.మీ బ్రతుకు - ఎవరికోసమో కాదు - మీ కోసమే. మీ సంతోషం ఎవరి కోసం? అదీ మీకోసమే?
బ్రతుకుపై ఆశ ముఖ్యం కాదు. దాని కంటే - బ్రతుకులో ఉత్సాహం, ఏదో వొకటి సాధించాలనే ధ్యేయము పెట్టుకోండి.
ఎప్పుడూ భూత కాలం గురించి మాత్రమే యోచించేవాడికి భవిష్యత్తు తగ్గిపోతుంది. శీఘ్రంగా ముసలితనమూ, దాని వెనుక మృత్యువు వచ్చేస్తాయి.
ఎప్పుడూ భవిష్యత్ కాలం గురించి, తన ధ్యేయం గురించి యోచించేవాడికి దాని సాధనకై కృషిలో మునిగి వుండే వాడికి శీఘ్రంగా ముసలితనమురాదు. కాస్త దూరంగానే వుంటుంది.
బ్రతికున్నంత కాలం -ఏదో వొక విధంగా , మీకు వీలైనంతగా - పది మందికీ ఉపయోగంగా వుండండి. ఏదో , మీకు నచ్చిన, వొక ధ్యేయము పెట్టుకోండి. జీవితం ఉత్సాహం గా సాగిపోతుంది.

101 సంవత్సరాలు చాలా? అబ్బే - అది అప్పుడు చూసుకుందాం.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి