మనిషిలో రెండు రకాల శక్తులున్నాయి. (1 ) సృజనాత్మకత ; (2 ) విమర్శనాత్మకత;
సృజించే వాడు సృష్టికర్త.
మనిషిని సృష్టించేందుకు విశ్వ సృష్టికర్త కు ఎలాంటి మానసిక స్థితి , శక్తి కావాలో - మనిషి చేసే ప్రతిసృష్టి లోనూ అతనికి అదే మానసిక స్థితి, శక్తి కావాలి.
ఏకాగ్రత, తన సృష్టిపై గౌరవము, ప్రేమ, సృష్టింపబడే వస్తువు ఎలా వుండాలో -ముందుగానే పూర్తిగా తన ఊహలో సృస్టించడము - ఆటువంటివి ఎన్నో వుంటే గానీ మనిషి నిజమైన, గొప్పదైన సృష్టి ని సాధించ లేడు.
ఏదైనా సరే - మొదట మానసిక సృష్టి - దాని తరువాత భౌతిక సృష్టి జరుగు తుంది.
మామూలు మనిషి రాయిని చూస్తాడు. కానీ శిల్పి ఆ రాయిలో - తాను సృస్టించబోయే కళా ఖండాన్ని ముందుగానే మానసికంగా దర్శిస్తాడు. తరువాత అదే రూపాన్ని ఉలితో ఆ రాయిలో మలుస్తాడు.
శకుంతలా దుష్యంతుల ప్రణయాన్ని, పరిణయాన్ని, వియోగాన్ని,సంయోగాన్ని - తన మనో లోకంలో పూర్తిగా దర్శింగ గలవాడు మాత్రమే - కాళిదాసు కాగలిగాడు.
రవీంద్ర నాథ్ టాగూరు రాసిన ప్రతి వాక్యంలోనూ - మనం అటువంటి సృష్టిని చూడగలం.
రవివర్మ చిత్రాల్లో - మనం చూడగలిగే వైవిధ్యం, క్రొత్తదనం - ఆయనలో దాగున్న సృష్టికర్త గుణాలే.
ప్రతి మనిషిలోను - ఈ సృజనాత్మక శక్తి నిక్షిప్తమై వుంది. దీన్ని పైకి తీసుకు రావడమే మనం చేయవలసిన పని.
మీలో - వొక రచయిత వుండవచ్చు.శిల్పి వుండవచ్చు. గాయకుడు వుండ వచ్చు కవి వుండ.వచ్చుచిత్రకారుడు వుండ వచ్చు వొక అసాధారణ శాస్త్రీయ అన్వేషకుడు వుండ.వచ్చు.
మీలో - వొక గొప్ప సృష్టి కర్త ధాగి వున్నాడు. అతన్ని పైకి తీసుకురావలసిన బాధ్యత మీదే.
సృష్టి కర్త కాని వారిలో రెండు రకాల మనుషులున్నారు.
వొకడు విమర్శకుడు. మరొకడు దర్శకుడు. దర్శకుడంటే- సినీమా దర్శకుడి లాగా అనుకోకండి. ఈ దర్శకుడు , మామూలు ప్రేక్షకుడు మాత్రమే. చూస్తాడు.బాగుంది; లేదా బాగులేదు - అనుకోవడం మించి అతనేమీ చేయడు.
ప్రతి సృష్టినీ విమర్శనాత్మకం గా చూసేవాడు విమర్శకుడు. వీరిలోనూ - సకారాత్మకంగా , విమర్శిం చే వారు, నకారాత్మకంగా విమర్శిం చేవారు - రెండు రకాలు.
తప్పొప్పులు మాత్రమే చూసేవాడు, అందు లోనూ - తప్పులెక్కువగా చూసేవాడు, తప్పులే - ఎక్కువగా చూడాలనుకునేవాడు - నకారాత్మక విమర్శకుడు.
.సృష్టికర్త లోని - ఆర్ద్రతను, సృజనా నైపుణ్యాన్ని, చూసి, అనుభవించి మనకు చెప్ప గలవాడు సకారాత్మక విమర్శకుడు. యితడు తప్పులు చూడడని కాదు - తప్పులు చూడడంలోనూ - సృష్టికర్త ఆరాటాన్ని అర్థం చేసుకుం టూ చూస్తాడు.
.యితని వలన సృష్టికర్త నైపుణ్యం పెరుగుతుంది . మరో సృష్టి మరింత సమ్మోహనం గా జరుగుతుంది.
మరి - మీరు ఏ కోవకు చెందుతారు?
మీలో వొక సృష్టికర్త వున్నాడు. అతన్ని - బయటికి తీసుకు రండి.
మరో సృష్టిని ని చూసినపుడు -మీలోని - సకారాత్మక విమర్శకుడికి పని కల్పించండి.
నకారాత్మక విమర్శకుడిగా మాత్రం మిగిలిపోకండి. మీ చుట్టూ వున్న వారి జీవితం, మీ జీవితం రస హీనమై పోతుంది.
ప్రేక్షకుడిగా వున్నా పరవాలేదు.
= మీ
వుప్పల దడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి