పంచ మహా యజ్ఞాలు -4 వ వ్యాసం
మనుష్య యజ్ఞం
మానవ సేవే మాధవ సేవ - అన్న ధర్మం మనకు, మొదటినుండి వుంది.
కానీ ఈ కాలం లో - మానవ సేవకు మాత్రమే -ప్రాధాన్యత నిస్తున్నారు.
పంచ మహా యజ్ఞాలలో - ప్రతి యజ్ఞానికీ ప్రాధాన్యత వుంది.
మనం - ప్రకృతిని - బాగా చూసుకుంటే - మనలో, ఎవరికీ, దరిద్రమంటూ వుండదు. వుండాల్సిన అవసరమే లేదు.
ప్రకృతిని ఎండబెట్టిన - ఏ దేశమూ, ఏ ప్రాంతమూ బాగుపడలేదు.
అదే విధంగా - తమ తమ తల్లిదండ్రులను, తమ, తమ పిల్లలనూ - బాగా చూసుకునే సమాజంలో - మానవ సేవ చేయించుకోడానికి మనుషులెవరు? ఎక్కడుంటారు?
భారత సంస్కృతిలో - మనుష్య యజ్ఞానికొక విలక్షణమైన అర్థం వుంది.

"అతిథి దేవో భవ" అంటే - అతిథి అన్న వాడు, దేవుడితో సమానమని అర్థము.
మన సంస్కృతిలో - నువ్వు యిచ్చేది గొప్ప కాదు. అతిథి పుచ్చుకోవడమే గొప్ప.

యిచ్చేవాడు గొప్ప కాదు. పుచ్చుకునే వాడే గొప్ప.
యివ్వ గలగడం దానం కాదు. అతిథి పుచ్చుకోవడం ,అతను మనకిచ్చే ఆశీర్వాదం, వరం - అని అంటారు. అంటే - మీరు, ఎటువంటి వారిని , అతిథులుగా పిలవాలో - నిర్ణయించుకోండి.
అతిథి కాని వారికి - ఇచ్చేది దానం.
దానాల్లోనూ - "అపాత్ర దానము" చేయరాదని మనకొక గొప్ప సామెత వుంది. బాగా తిన్న వాడికి, క్రూరుడికి, బద్ధకస్తుడికి, దొంగకు, కామ శీలుడికి - యిటువం టి వారికి - దానం చేయడం వలన - పాపం వస్తుందే తప్ప మరేమీ రాదు అని కూడా చెబుతారు.
దేవ, ఋషి, పితృ యజ్ఞాలకు - మన భక్తి, గౌరవమూ ఎలా కారణాలౌతాయో, అలాగే, మనుష్య భూత యజ్ఞాలకు, ముఖ్యంగా మన ప్రేమ, గౌరవాలు , కొంతవరకు మన దయ, కారణాలుగా వుంటాయి.
ప్రతి మనిషి లోనూ - మిమ్మల్ని, మీరు చూడ గలగాలి.
మీలో - ప్రతి మనిషినీ మీరు చూడ గలగాలి.
అందుకే మనుష్య యజ్ఞం. అదే మనుష్య యజ్ఞం.
కాళ్ళూ చేతులూ లేని వారిని చూస్తే - మీలో దయ, ప్రేమ వస్తుందా, రాదా? వారికి ఏం కావాలో - మీరు చేస్తారా, లేదా?
అనేక రోగాలతో బాధ పడే వాళ్ళను చూస్తే - మీలో దయ కదలాడుతుందా, లేదా?
చదువుకునే బ్రహ్మ చారి - మీ యింటి ముందు నిలిచి, అహంకారాన్ని పూర్తిగా జయించి, "భవతి బిక్షం దేహి" అంటే, మీలో గౌరవమూ రావాలి, దయా రావాలి. వస్తుందా, లేదా?
వూరికే కూర్చుని తినాలనుకునే - బద్ధకస్తుడిని చూస్తే - వారికి సరైన దండన కూడా ఈవాలి. అటువంటి బద్ధకస్తులను పోషించడం - మనుష్య యజ్ఞం కాదు.

మనుష్య యజ్ఞంలో - మన "పాత్ర నిర్వహణ" అనే యజ్ఞం కూడా వుంది.
మీరు - మీరు మాత్రం కాదు. మీరు - (1 ) వొక కొడుకు / కూతురు (2 ) వొక తండ్రి / తల్లి (3 ) వొక భార్య / భర్త (4) వొక అన్న / తమ్ముడు / అక్క / చెల్లెలు (5 ) వొక స్నేహితుడు (6 ) రాజు / సేవకుడు - ఇలా, మీరు ఎన్నో పాత్రలను - సమర్థ వంతం గా పోషించడం కూడా - వొక రకంగా మనుష్య యజ్ఞమే .
ప్రతి చోట - మీరు పుచ్చుకునే జీతానికో, మరోకటికో - ముడి పెట్టకుండా, మీరు పంచగలిగే ప్రేమ, సుఖానుభూతి, శాంతి ఎంతో వుంది.
మీరు, మీ అన్ని పాత్రలకూ, సరైన న్యాయంగా, మీరు చేయగలిగేధంతా, మనస్ఫూర్తిగా, నిస్స్వార్థం గా - చేయ గలిగిన నాడు - మీరు చేసేదంతా - యజ్ఞం గానే వుంటుంది.
మంచి మాట, మనసుకు నచ్చే మాట చెప్పడం - కూడా వొక మహా యజ్ఞమే.
సత్యమైన మాట మాట్లాడండి ; ప్రియమైన మాట మాట్లాడండి. అప్రియమైన సత్యాన్ని - మాట్లాడ కండి.
"సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్, సత్యమప్రియం" అన్నారు.
మీ మొహం అందంగా లేదని వారితో చెప్పాలా? మీ డ్రెస్సు మీకు అస్సలు నప్ప లేదని చెప్పాలా? మీ యింటి రంగు అస్సలు బాగు లేదని చెప్పాలా? ఇటువంటి సత్యాల కంటే - అసత్యాలే - మేలు కాదా.
యిలా చెప్పడం యజ్ఞం కాదు కదా - నిజానికి, యివి పాపమని చెప్పచ్చు.
అప్రియమైన సత్యాన్ని, ప్రియం గా చెప్ప గలిగే నేర్పు వున్న వాడు - ఏదైనా చెప్పచ్చు.
"మీ అమ్మ, నాకు కూడా అమ్మ లాంటిదే; ఏడవకు" అనిచెప్ప గలిగే వాడికి, " నీ భార్య, నాకు కూడా భార్య లాటిదే" అనే తెలివి హీనుడికీ తేడా వుంది కదా.
మనుష్య యజ్ఞం ఈ రెండింటి మధ్య గల తేడాయే కదా.
అందుకనే అంటారు - మాటలతోనే - స్వర్గానికీ తీసుకెళ్ళచ్చు. మాటలతోనే - నరకానికీ తీసుకెళ్ళచ్చు - అని
ప్రియమైన మాటలకు, ప్రియమైన చేతలకూ - మనుష్య యజ్ఞం లో ప్రముఖ స్థానం వుంది.
మిమ్మల్ని - పది మందో, వంద మందో, వెయ్యి మందో మంచి వాడు - అని అనుకుంటే - మీరు మనుష్య యజ్ఞం చేస్తున్నట్టే - అనుకోవచ్చు.
గాంధీ గారు చేసింది ; థెరెసా గారు చేసింది, మరెంతో మంది - అనాథాశ్రమాల ద్వారా, వృద్ధాశ్రమాల ద్వారా, వికలాంగుల ఆశ్రమాల ద్వారా , మరెన్నో రకాలుగా - మనుష్య యజ్ఞం చేసారు, చేస్తున్నారు.
మీ వలన - ఏ వొక్కరో, ఇద్దరో ఈ రోజు సంతోష పడితే - మీరు, కొంత మనుష్య యజ్ఞం చేసినట్టే.
పుణ్యం ఎప్పుడో రాదు. యిప్పుడే వస్తుంది. పుణ్య ఫలం ఎప్పుడో రాదు. అదీ యిప్పుడే వస్తుంది.
"ఈ రోజు - మీరు కనీసం యిద్దరిని సంతోష పెట్టాలి".
నిస్స్వార్థంగా.
వారి సంతోషంలో - మీ సం తోషాన్ని చూడాలి.
చేస్తారా మరి. చేయండి. మీకేం నష్టం లేదు. కష్టం లేదు.
మీ జీవితమే - మరో మలుపు తిరుగుతుంది.
అందమైన మలుపు. ఆనందమైన మలుపు.
మీరు మనుష్య యజ్ఞం లోని రుచి - చూశారంటే - మళ్ళీ, మళ్ళీ చేస్తారు.
శుభం భూయాత్.
= మీ
వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి