దేవుడి అంగడి కి - మనం రోజూ వెడుతుంటాము.
దేవుడి అంగడి మొబైల్ షాప్ లాంటిది. మీరు అనుకోగానే - మీ ముందుకు వచ్చేస్తుంది.
దేవుడి అంగడిలో చాలా వున్నాయి.
చాలా వస్తువులు, యిప్పుడు తీసుకెళ్ళి తరువాత , తీరికగా, యివ్వాల్సిన మూల్యం చెల్లించవచ్చు.
జీవితంలో వొక సారి (సాధారణంగా వొక్క సారే) - వొక భార్యనో , భర్తనో కొనుక్కోవచ్చు. దీనికి - మూల్యం దేవుడికి చెల్లిం చక్కర్లేదు. కొనుక్కున్న భార్యకో, భర్తకో, మీరే తప్పక చెల్లిస్తారు.
ఈ వొక్క వస్తువు (భార్య లేదా భర్త) కు మాత్రం - మీరు వొకటి కొనుక్కుంటే - మరో వొకటో , రెండో అదనపు వస్తువులు (పిల్లల రూపంలో ) - దేవుడే మీకు ఇస్తాడు. వాటికీ - మీరు మూల్యం దేవుడికి చెల్లించవలసిన అవసరం లేదు. ఆ పిల్లలకే మీరు చెల్లిస్తారు.
దేవుడి షాపు లో సంతోషం వుంది. అది అడిగారనుకోండి. దేవుడు మీలో నుండే తీసి, మీకే యిస్తాడు.
దుహ్ఖం - మీకెంత కావాలంటే అంత మీరు కొనుకోవచ్చు. అది ఫ్రీ. దానికి మూల్యం అదే.
మీరు ఏది తీసుకున్నా - దానితో బాటు - ఫ్రీ గా వచ్చే వస్తువులు చాలా వున్నాయి - దేవుడి అంగడిలో.
సంతోషం తీసుకుం టే ఆరోగ్యం వస్తుంది.
దుహ్ఖం తీసుకుంటే రోగం వస్తుంది.
భార్య / భర్త సరిగ్గా ఎంపిక చెసుకుం టే - మీరూ వారికి సరిగ్గా వుం టే - మీకు - మహా సంతోషం , మహా ఆరోగ్యం వస్తుంది.
సరిగ్గా ఎంపిక చేయకుంటే - లేదా, మీరు వారికి సరిగ్గా లేకుంటే - మీకు సకల దుహ్ఖ , రోగ ప్రాప్తి రస్తు!!
పని - తీసుకుంటే - వృద్ధి వస్తుంది.
సోమరితనం తీసుకుంటే - కష్టాలు, దుహ్ఖాలు , రోగాలు, తిట్లు - అన్నీ వస్తాయి.
బుద్ధి తీసుకుం టే - ఆనందం వస్తుంది. ఆత్రం తీసుకుంటే - కష్టం వస్తుంది.
భయం తీసుకుంటే - శత్రువులు, రోగాలు ;
ధైర్యం తీసుకుంటే - మిత్రులు, సుఖాలు
కామం తీసుకుంటే - అపఖ్యాతి
క్రోధం తీసుకుంటే - శత్రువులు, అపఖ్యాతి, రోగాలు - లాంటివి చాలా, చాలా,
లోభం తీసుకుంటే - డబ్భున్నా - అనుభవించలేని - దురదృష్టం
మోహం తీసుకుంటే - బుద్ధి నాశనం
మదం తీసుకుంటే - వొంటరితనం, ఎప్పుడూ సంతోషం లేని తనం
మాత్సర్యం తీసుకుంటే - శత్రువులు
ప్రేమ తీసుకుంటే - దేవుడే అదనపు వస్తువు గా మనతో వచ్చేస్తాడు.
ఆదరణ , వాత్సల్యము తీసుకుంటే - మనుషులంతా- మన తోనే
చెట్లు తీసుకుంటే - ఆక్సిజను, పండ్లు, పూలు ఆరోగ్యము...
యిలా - ఎన్నో, ఎన్నెన్నో..
దేవుడి అంగడిలో -
ఆకాశపు అందం ఫ్రీ. ఇంద్ర ధనుస్సు రంగుల అద్భుతం ఫ్రీ. సముద్రము అలలు ఫ్రీ.
నదీ తీరాలు ఫ్రీ. చెట్లలో పూలు ఫ్రీ.
సంతోషం ఫ్రీ. ఆనందం ఫ్రీ. అవి చూడగలిగే మనస్సు ఫ్రీ.
మీరు ఫ్రీగా వుంటే. . . . . .
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి