ప్రపంచంలో ఎవ్వరు మీ మాట విన్నా - మీరు పూర్తి 'శాంతి' తో వుండలేరు.
మీ చుట్టూ వున్న వారు - మీకు ఏమి చేసినా - మీ 'సంతోషం' పరిపూర్ణంగా వుండదు.
ఎందుకంటే -
మీ మాట ముఖ్యముగా వినవలసిన వొకే వొక ముఖ్య వ్యక్తి - మీ మాట వినడం లేదు గనుక.
యింతకీ - ఎవరా ముఖ్య వ్యక్తి?
మీరే! మీరే, ముఖ్యంగా మీ మాట వినడం లేదు.
అందు వల్లనే - మీలో పరిపూర్ణత లేక పోవడం, అశాంతి నిండి వుండడం.
నా మాట నేను వింటున్నా కదా. వినడం లేదని మీరెలా చెబుతారు?
మీ యీ ప్రశ్నకు మీరే సమాధానం వెతుక్కోవచ్చు. చాలా సులభం.
మీరు రేపు - ఏమేం చేయాలో వొక డయరీ లో రాయండి.
ఎప్పుడు లేయాలో, ఎప్పుడు పడుకోవాలో, ఏమేం తినాలో, ఎవరితో మాట్లాడాలో, ఏమేం చేయాలో - అన్నీ వివరంగా , సమయంతో బాటు రాసుకోండి.
ఈ రోజు రాత్రి 9 గంటలకు - యివన్నీ రాసి, మీ దగ్గిరే పెట్టుకుని, పడుకోండి.
తరువాత - తెల్ల వారి లేయడం నుండీ - పడుకునే వరకు - మీరుగా రాసుకున్న లిస్టు లో - ఏమేమి సరిగ్గా, సమయం ప్రకారం చేస్తారో చూసుకోండి.
మీరు 25 నుండి 50 శాతం వరకు చేయ గలిగితే - చాలా ఎక్కువ, చాలా బాగా చేసారన్న మాట.
మీరు అనుకున్న సమయానికి లేయను కూడా లేయరు. అనుకున్న సమయానికి పడుకోరు. నిద్ర పోరు. తినరు. యివి కాక, ముఖ్యమైన పనులు రాసుకుని వుంటే - ఆ అనుకున్న పనులలో సగం చేస్తే చాలా, చాలా ఎక్కువ. సగం చదివితే చాలా ఎక్కువ. 25 % రాస్తే చాలా, చాలా ఎక్కువ.వ్యూహాత్మకంగా, రచనాత్మకంగా చేయాలనుకున్న పనులు ఆరంభం చేస్తేనే ఎక్కువ. యిలా వుంటుంది సగటు మనిషి జీవితమంతా.
విద్యార్థులు తాము అనుకున్న వాటిలో - సగం అయినా చదువ గలుగుతున్నారా? ఎక్కువైతే - పది శాతం మంది చేస్తుండొచ్చు.
ఆ పది శాతం మంది మంచి మార్కులతో పాసవుతూ వుండొచ్చు. అరవై లోపు మార్కులతో - పాసయే వారే ఎక్కువ కదా. వారంతా - సగటు మనుషులలోకే వస్తారు.
.
జీవితం లోనూ అంతే. అరవై మార్కుల కంటే తక్కువతోనే - ప్రతి విషయం లోనూ - మనం పాసవుతున్నాము.
ఎందుకు?
మన మాట మనమే వినడం లేదు గనుక.
సరే. మన ముఖ్యమైన ఆశ, ఆకాంక్ష ఏమిటి? మనం సంతోషంగా వుండాలని.
అంతేనా.
వొక పని చేద్దాం.
ఈ వొక్క రోజు - యీ వొక్క 24 గంటల కాలం - ఏం జరిగినా - అంటే : అత్త గారు ఏమన్నా - బాసు తిట్టినా , డబ్బు పోయినా - కోడలు ఏ పనీ చేయకున్నా, భార్య ఎన్ని రకాలుగా మీ మూడు పాడు చేయాలని ప్రయత్నించినా, భర్త తాగొచ్చినా - మిగతా ప్రపంచం ఏమైనా, ...
నేను మాత్రం సంతోషం గానే వుంటానని భీష్మ ప్రతిజ్ఞ చేయండి.
ఈ క్షణం నుంచి - యిది జరగాలి.
మళ్ళీ వాయిదా వేసుకోకండి - రేపటి నుండి, వచ్చే వారం నుండి అని.
ఈ క్షణం నుంచి. వొక్క 24 గంటల కాలం- మీరు సంతోషంగా వుండాలి.
ఏ కారణానికీ - మీ సంతోషాన్ని మాత్రం పాడు చేసుకోకండి. డబ్బు పోతే పోనీయండి. సంతోషాని విడవకండి.
ఎవరు తిట్టిన్నా - తిట్టుకోనీయండి. మీ సంతోషాన్ని మాత్రం విడవకండి.
వొంట్లో - ఏవైనా రోగాలున్నా - మందులేసుకోండి. అంతకు మించి, అవి రేపెమవుతుంధో - మాపెమవుతుం ధో నాన్న దిగుల్లంతా విడిచెయ్యండి. యీ 24 గంటల పాటు. అంతే. చాలా సింపుల్.
వొంట్లో - ఏవైనా రోగాలున్నా - మందులేసుకోండి. అంతకు మించి, అవి రేపెమవుతుంధో - మాపెమవుతుం ధో నాన్న దిగుల్లంతా విడిచెయ్యండి. యీ 24 గంటల పాటు. అంతే. చాలా సింపుల్.
వొక్క 24 గంటల కాలం - అంతే.
జీవితంలో ఈ వొక్క రోజు సంతోషం గా గడపండి. ( రేపేం చేయాలో రేపు చూద్దాం.)
యిదే వేదాంతం. మరేం లేదు. అసలేం లేదు!!
చిదానంద రూపః ; శివోహం; శివో హం.
చిదానంద రూపః ; శివోహం; శివో హం.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
nenu tappakunda prayatnisthanu... ee kshanam nunde..
రిప్లయితొలగించండి