మీరు క్రొత్త స్కూటరు కొన్నారు. ఎలాగోలా డ్రైవు చెసుకుంటూ యింటికొచ్చారు. మీరు, మీ ఆవిడ (మీ వారు), మీ పిల్లలు సంతోషం లో మునిగి, తేలుతున్నారు.
మీరు స్వీట్లు కొన్నారు. మీరందరూ తిన్నారు. ఆ స్కూటరులో, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్నీ, నిర్ణయించుకున్నారు. ఆ రోజు మంచి రోజు. భలే మంచి రోజు. మరిచిపోలేని రోజు. కుటుంబమంతా , చాలా, చాలా సంతోషములో మునిగి ఉన్న రోజు.
మీరు - పక్కింటాయనతో కూడా ఈ శుభ వార్త చెప్పాలనుకున్నారు. మీరు, మీ ఆవిడ - పక్కిం టికి బయలు దేరారు.
వీధిలో, వో కొత్త కారు నిలబడి వుంది. కారు ప్రక్కన పక్కింటాయన నిలబడి వున్నారు. లోపల ఎవరో, కూర్చొని వున్నారు.
మీరు, మీ శుభ వార్త చెప్పారాయనకు.
చాలా సం తోషమండి -అన్నారాయన.
"ఈ కారు చూసారా? ఈ రోజే కొన్నానండి. దాదాపు నాలుగు లక్షలు అయ్యింది. ఏదో లెండి. ఈ స్కూటర్లలో పోవడం ఈ మధ్య చాలా రిస్కుతో కూడిన వ్యవహారం గా మారిపోయింది, నా లాంటి వాళ్ళకి....
నా వల్ల అస్సలు కావడం లేదండి. అందుకనే - కారు కొన్నానండి. మీరు నాకంటే, నాలుగేళ్ళు చిన్న వాళ్ళు గనుక స్కూటర్లలో -పోగలరు. ...మీ స్కూటరు - బాగుందండి.కంగ్రాచులేషన్స్! " - అన్నారాయన మామూలుగానే.
మీ - పెద్ద గీత - చిన్న గీత అయిపోయింది.
మీ సంతోషం - ఆవిరై పోయింది.
మీలో - మీ ఆవిడలో - అశాంతి, ఆ వేదన, వెలితి, మరేవేవో - భావనలు వున్నాయి, యిప్పుడు.
కాని - క్రొత్త స్కూటరు తాలూకు సంతోషం మాత్రం లేదు.
మీ - పెద్ద గీత - చిన్న గీత ఎలా అయిపోయింది?
పోల్చి చూసుకుంటే - పిచ్చి పట్టిందట.
మీ పెద్ద గీతలు, చిన్న గీతలవడం - చిన్న గీతలు పెద్ద గీతలవడం - మీ భాగ్య రేఖ పైన 25 శాతం, పక్క వారి, భాగ్య రేఖ పైన 75 శాతం ఆధార పడి వుం టుంది - మీ పోల్చి చూసుకునే మనస్తత్వము మారనంత వరకూ..
మీ స్కూటరు ఎక్కడికీ పోలేదు. మీ దగ్గిరే వుంది. ప్రక్కనింటి వారి కారు వారి దగ్గిరే వుంది.
మీ ఆనందం ఎక్కడికీ పోవాల్సిన పని లేదు.
అయినా - నూటికి ఎనభై శాతం మనుషుల విషయంలో - వారి ఆనందం బాగా తగ్గి పోవడము గానీ, పూర్తిగా యిగిరి పోవడము గానీ, దేవుడు తమకు చాలా అన్యాయం చేసినట్టు క్రుంగిపోవడము గాని - జరగడము మనము చూస్తూనే ఉన్నాము.
మీ కొడుక్కో, కూతురికో, 92 శాతము మార్కులు వస్తే మీకు సంతోషం.
కాని పక్క వారి కొడుక్కో, కూతురికో, 96 శాతం వస్తే - మీ సంతోషం కనిపించ కుండా పొతోంది.
జీవితం లో ప్రతి చిన్న, పెద్ద విషయాల్లో , ప్రక్క వాళ్ళతో పోల్చుకునే వారు చాలా మంది వున్నారు. వారిని జాగ్రత్త గా గమనించండి.
కొద్దో, గొప్పో నిరాశా భావం కలగడం నుండీ, మనిషి డిప్రెషన్లోకి జారిపోవడం వరకు - రక రకాలుగా మనుషులు - స్పందించడం మనం చూడొచ్చు.
అందుకనే అంటారు - పోల్చి చూసుకుంటే - పిచ్చి పట్టిందని.
మన గీతల్ని, అనవసరంగా- చిన్న గీతలు చేసుకుని బాధ పడటం మనలో చాలామందికి, బాగా అలవాటై పొయింది.
చిన్న వాడితో పోల్చుకుని - సంతోష పడటమూ తప్పు. పెద్ద వాడితో పోల్చుకుని అసూయ పడటమూ తప్పు.
ఏ స్థాయి వారికైనా - దేవుడు - యివ్వడమూ, తీసుకోవడమూ చేస్తూనే వుంటాడు.
మీకూ అంతే.
కానీ మీ సంతోషము - మనసులో ఎల్లప్పుడూ వుండాలి.
పెద్ద గీతలు చిన్నవి గానో, చిన్న గీతలు పెద్దవి గానో - చేయకండి
మీ గీతలు, ఎలా వున్నా మీరు సంతోషము గా వుండవచ్చు.
మీకు తెలుసా - సంతోషంగా వుండటానికి - కారణమే అక్కర్లేదు.
సంతోషంగా వుండటము - మీ నైజం - మీ జన్మ హక్కు.
పోల్చి చూస్తేనే -పిచ్చి పడుతుంది.
కాబట్టి - ఈ గుణానికి దూరంగా - సంతోషంగా -వుండండి.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
(తెనాలి రామకృష్ణుడు - వొక గీతను - దాన్ని తాకకుండా - ఎలా చిన్నది చేసాడో - (దాని ప్రక్క మరో పెద్ద గీత గీచి) - ఆ కథ మీకు తెలిసే వుంటుంది.)
baaga chepparu
రిప్లయితొలగించండిbeautiful... good saying
రిప్లయితొలగించండి