నిన్నటికీ , ఈ రోజుకీ మధ్య - మీలో ఏదో జరిగింది. మీరు మారి పోయారు. చాలా రకాలుగా మారారు.
అసలేం జరిగింది?
మీలో సంతోషం పెరిగిందా ? తరిగిందా ?
మీ ఆరోగ్యం పెరిగిందా? తరిగిందా?
మీ భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిపడిందా ? సడలిందా ?
మీ పిల్లలకూ, మీకూ మధ్య - నిన్నటి కంటే - ఎక్కువ ప్రేమానుబంధాలు వచ్చాయా, లేదా?
మీలో శక్తి పెరిగిందా? తరిగిందా?
మీరేదైనా కొత్త విషయం, విద్య, నైపుణ్యత నేర్చుకున్నారా ? లేదా?
సంఘంలో - మీ ప్రాముఖ్యం పెరిగిందా? తరిగిందా?
యివన్నీ పెరిగిందంటే - మీరు నిన్నటి రోజు - సార్థకంగా గడిపారన్న మాట.
ఇవేవీ పెరగలేదంటే - నిన్నటి రోజు - మీరేమీ చేయలేధనేగా!
యివి తరిగింటే - మీరు చేయ వలసిన పనులు చేయక, చేయకూడని పనులు - చేసినట్టేగా!
మరి - ఈ రోజు ఏం చేయబోతున్నారు?
వొక్కటి మాత్రం తప్పక జరుగుతుంది.
మీ ఆయుర్దాయం వొక్క రోజు తరుగుతుంది. మీ వయసు వొక్క రోజు పెరుగుతుంది.
కానీ - మీ శక్తి పెరుగుతుందా లేదా? అది మీరు చేసే పనుల పై ఆధారపడి వుంటుంది.
మీలో - లక్షల కొద్దీ జీవ కణాలు చని పోతాయి.
మళ్ళీ పెరుగుతాయా లేదా? - అది మీరు చేసే పనులపై ఆధార పడి వుంది.
మీరు కొన్ని విషయాలు తప్పక మరిచిపోతారు. కొత్త విషయాలు నేర్చుకోవడం మీపై ఆధారపడి వుంది.
కొన్ని ప్రేమపూరితమైన మాటలు మాట్లాడితే - మీ సంబంధాలు - గట్టిపడతాయి. కొన్ని, ద్వేష పూరితమైన మాటలు మాట్లాడితే - వున్న సంబంధాలు సడలి పోతాయి.
మీ ఆదాయాలు, ఆస్తులు తరిగించేది మీరే. పెరిగించ గలిగేది మీరే.
మీ జీవితానికి - సృష్టి కర్త మీరే. విధ్వంస కర్త మీరే.
మీరేం కావాలనుకుంటున్నారు ? మీ...రు ... ఏమి... కా..వా..ల..ను..కుం..టు..న్నా..రు..???
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి