శ్రీకృష్ణ దేవ రాయల వారి కాలం లో -
ఒక సారి -
పెద్ద గిన్నె లోకి ప్రజలనంతా పాలు పోయ్యమంటే -
వొకరికి తెలియకుండా వొకరు - యిలా ప్రతి వొక్కరు -
గిన్నె లోకి - నీళ్ళు మాత్రమే పోసారట.
ఆంగ్లము లో కరప్షన్ అన్న పదానికి కల్మషము అని ముఖ్యమైన అర్థము చెప్పు కో వచ్చు.
పాలు పొయ్య వలసిన చోట నీళ్ళు పొయ్యడము - మనస్సులో వున్న కరప్షనా కాదా?
కానీ - అది ఆ కాలము.నీళ్ళు పోసారు. వొట్టి చెంబు పొయ్య లేదు. బురద పొయ్య లేదు. విషం కలప లేదు.
అయినా - ఈ కల్మషము చాల (లేదా కొద్ది ) మంది మనుషుల్లో - కొద్ది, కొద్ది గా అప్పటినుండే వుందని మనకు తెలుస్తూ వుంది.
ఈ కాలములో - ఈ కల్మషము - లంచగొండి తనము గా మారి - మూడు పువ్వులు, ఆరు కాయలుగా దిన దిన ప్రవర్ధమానమవుతున్న సంగతి మన కందరికీ తెలుసు.
వందల నుండి, వేలు, వేల నుండి లక్షలు, లక్షల నుండి కోట్లు, కోట్ల నుండి వేల కోట్లు, మరి యిప్పుడు లక్షల కోట్లకు - ఈ లంచగొండి తనము ఎదుగుతున్న విషయము - మన కందరికీ తెలుసు.
లంచము తీసుకునే వారికి సిగ్గు, భయమూ రెండూ లేకుండా పోతున్న దన్న సంగతి కూడా మనకు తెలుస్తూ వుంది.
ఈ ముళ్ళ చెట్టు పెరుగుదలను ఆపాలి - ఆపక పోతే ప్రమాదము చాలా, చాలా ధగ్గరికొచ్చేసిన్దన్న - మాట కూడా మనకందరికీ తెలుస్తూనే వుంది.
అన్నా హజారే గారి ఉద్యమము అందుకే.
ఈ సమయములో అన్నా హజారే గారి ఉద్యమానికి - చేయూత నివ్వ కుండా -
సభ్యులందరిపైన- దుమ్ము , బురద చల్లడము - పాలు పొయ్య వలసిన చోట నీళ్ళు పొయ్యడము కాదా?
పోసే వారి ఉద్దేశము ఏమిటి?
భారత దేశములో- కరప్షన్ మూడు పువ్వులూ, ఆరు కాయలు గా వుండాలనేనా?
ఆ చట్టము 42 ఏళ్ళు గా, మన పార్లమెంటు లో మగ్గుతూ వుంది. బయట లంచగొండి తనము పెరుగుతూ వుంది.
అయినా - ఆ కమిటీ వారిపై - అదీ యిప్పుడే - ఎప్పటి విషయాలనో లేవ దీసి బురదచల్లే వారి అసలు ఉద్దేశము - తేట తెల్లమే గదా!
మరి - వీరినెలా ఆపడము?
వొక్కటి.
గౌరవనీయులైన మన ప్రధాన మం త్రి గారు - ఈ సభ్యులందరికీ కాబినెట్ మంత్రి ప్రతి పత్తి ని, హోదాని కలిగించి, ఈ సమయంలో, వారికి, మంత్రులకున్న - ఇమ్మ్యునిటీ కలిగించాలి. వారిపై - చిల్లర కేసులు పెట్ట గలిగే పరిస్థితి తీసేయ్యాలి.
అంతే కాదు. రెండవది ఏమిటంటే -
ఈ బురద చాల్లే వారు ఎప్పుడు ఆపుతారు?
వారిపై కూడా - దేశము లోని ప్రతి వొక్కరు బురద చల్లాలి. అప్పుడే ఆపుతారు.
ఈ చట్టం వచ్చే వరకూ - సభ్యుల పై ఏ వొక్కరూ బురద చల్ల కుండా ఆపాల్సిన బాధ్యత అందరిపైనా వుంది.
తిట్ట వలసిన వాడిని, తిట్ట వలసిన సమయము లో తిట్టక పోతే - కొట్టడానికి వస్తాడు.
అర్జునా, గాండీవం ధరించు. అమ్ములను సంధించు.
మిగతా పని నేనే చేసేస్తాను . నువ్వు నిమిత్త మాత్రుడివే. అన్నాడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు యిప్పుడూ ఎక్కడో, సిద్ధం గానే వుంటాడు. ప్రతి అర్జునుడూ తన గాండీవాన్ని ధరించాలి మరి.
అహింసా పోరాటమయినా - అహింస గానే అయినా - పోరాటము జరగాలి కదా?
లంచగొండి తనము పైన పోరాడే వాళ్ళను కాపాడక పోతే -
లంచగొండి తనము పై పోరాటము వుండదు.
యిందులో - మీ వంతు మీరు చేస్తున్నారా? .... చేస్తున్నారా? ... చేయండి సార్.
అదండీకథ .
= మీ
వుప్పలధడియం విజయమోహన్
We all should support these event.
రిప్లయితొలగించండి