22, ఏప్రిల్ 2011, శుక్రవారం

భూమి దినం - Earth day 2011 = 22nd, ఏప్రిల్, 2011 = (Telugu) : భూమి కేమీ ప్రమాదము లేదు= ప్రమాదం మనిషికే= Munchukosthonna Paramaadham Manake = yemi cheyyaali?

22 , ఏప్రిల్ నెల, 2011
 =రెండు రకాలుగా ప్రాముఖ్యం కలిగింది.
జీసస్ క్రీస్తు   గారు శిలువ వేయబడిన రోజు - 

వారిని - ప్రపంచమంతటా తలుచుకొనే రోజు.

జీసస్ క్రీస్తుచెప్పిన మంచి మాటలు మరో సారి మననం చేసుకునే రోజు.

రెండవది - 22 , ఏప్రిల్ ఎర్త్ దినము గా (భూమి దినం - అందాము) ప్రపంచమంతటా పిలువ బడుతూ వుంది.

భూమికి రక రకాలయిన ప్రమాదాలు ముంచుకొస్తున్నట్టు - వాటినుండి, భూమిని మనం కాపాడవలసిన బాధ్యత మనపై వున్నట్టు, మనం అనుకుంటున్నాము.

అందుకే ఈ భూమి దినాన్ని గురించి అనుకుంటున్నాము.

నిజానికి - భూమి కేమీ ప్రమాదము లేదు. నమ్మండి.

భూమి - సూర్యుని చుట్టూ , తన చుట్టూ తిరుగుతున్నంత కాలం; తన భాద్యత తను చేస్తున్నంత కాలం, భూమి కేమీ ప్రమాదం లేదు.

ప్రమాదం మనిషికే. 

బుద్ధి వున్నా ఉపయోగించకుండా వున్న చెట్ల నన్నిటినీ నరికేయడము,   కొత్త చెట్లు నాటక పోవడము లాంటి పనులు చేస్తూ, తన పై, తానే, మన్ను పోసుకుంటున్న మనిషికే ప్రమాదం ముంచుకొస్తున్నది.

మనం విడిచే గాలిని చెట్లు పీల్చుకుంటాయి. దాన్ని, మళ్ళీ , మనకోసం, ఆక్సిజన్ తో నింపి, మనకందిస్తుంది. అంటే

-  మన వొక ఊపిరి తిత్తి ఆ చెట్టన్న మాట. నిజానికి, సగం ఊపిరి తిత్తే మనలో వుంది.

అంతేనా. చెట్లు మనకు, ఆహారాన్నిస్తుంది. మనకోసం వర్షాన్ని తెప్పిస్తుంది.

వర్షాన్నిస్తుంది. నీళ్ళు తెప్పిస్తుంది.

యింతెందుకు. చెట్లు లేకుండా - మనిషి లేడు. 

మనిషి లేకున్నా - చెట్ల కేమీ ప్రమాదం లేదు.

మన వొక ఊపిరి తిత్తి, మన వొక (అర్ధ  భాగం) గుండె, మన మెదడులో అర్ధ భాగం - ఆ చెట్టు - అన్న విషయం మనకు అర్థమవుతున్నదా.

అర్థమయితే చెట్లు వివక్షత లేకుండా నరికేస్తామా?


మీ వొక ఊపిరి తిత్తి, వొక (అర్ధ  భాగం)  గుండె, మెదడులో అర్ధ భాగం - మీరే నరికేస్తారా?

2012 వ సంవత్సరం, భూమి దినం వచ్చే లోగా, వొక పది చెట్లైనా, మనం ప్రతి వొక్కరూ -  నాటుదామా!

మన కోసం - 

భూమాత సంతృప్తి పడితే - మనం బాగుంటాము.

లేదంటే - భూమి బాగానే వుంటుంది - మనమే భాగుండము.

అదండీ విషయము.

= మీ
వుప్పలధడియం విజయమోహన్
 


2 కామెంట్‌లు:

  1. నిజానికి, సగం ఊపిరి తిత్తే మనలో వుంది యెంత కర్కశమైన నిజం చాలా బాగా చెప్పారు.
    అవును మీరు టపాకి శీర్షిక అంతపొడుగున,అందులో ఇంగ్లీషులో ఎందుకు పెడుతున్నారు విజయమోహన్ గారు???
    వుప్పలదడియం అంటున్నారు మన నాగయ్య గారి వారసులా?

    రిప్లయితొలగించండి
  2. వారసులు కాదు కాని- నాగయ్య గారు మాకు దూరపు చుట్టాలని మా నాన్న గారు చెప్పే వారు.

    మీ వ్యాఖ్యలకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి