అన్ని రహదారులూ రోము నగరానికే వెళ్ళుతాయి.
యిది ఆ దేశపు సామెత. ఆ కాలపు సామెత.
ఈ రెండు, మూడు రోజులుగా -
మన దేశం లో -
అన్ని రహదారులూ ప్రశాంతి నిలయం వైపే.
కోట్ల ప్రజానీకం మనసులంతా - సత్య సాయి బాబా వైపే.
వొక మహనీయుడు మరి లేదంటే - గుండె లోతుల్లో - ఎక్కడో-
ప్రతి వొక్కరికీ , వొక వెలితి తెలియడం అతి సహజంగా కలుగుతుంది.
కంట తడి పెట్టడం తమకు తెలియకుండానే జరుగుతుంది.
రాజకీయ నాయకులను వొక పక్క పెట్టండి.
వొక గవాస్కరు, వొక టెన్డుల్కరు - కంట తడి పెట్టడం మీరు ముందు చూశారా.
వారు వోడినప్పుడు కూడా లేదు.
మరి ఈ రోజు!!
మరి ఈ రోజు!!
వారూ, మీరూ కంట తడి పెట్టారు కదా.
వచ్చిన లక్షలాది మంది కంట తడి మనం మరి చూడ గలమా.
వారి గుండె ఆరాటాన్ని మరి విన గలమా!
ఆ కంట తడే సత్య సాయికి మన మౌన, శ్రద్దాంజలి.
ఆ కంట తడే సత్య సాయికి మన మౌన, శ్రద్దాంజలి.
అందరి భాష్పాంజ లులతో -
ఆ మహనీయుడికి
మన నివాళులర్పిద్దాం
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి