జీవితం లో చాలా విషయాలలో మనకు ఎంపిక సామర్థ్యము యివ్వ బడ లేదు.
నిజమే.
మీ పుట్టుక విషయములో - మీ పాత్ర ఏమీ లేదు. ఏవేవో జరుగుతాయి. మీరు పుడతారు.
అంతే.
మీ అభిప్రాయాల్ని అడిగే వారెవరూ లేరప్పుడు.
మీకు పుట్టే వారి విషయం లోను - మీకు పెద్దగా ఎంపిక లేదు.
ఎంపికుంటే - మీ కొడుకో, కూతురో - ఎలా వుం డాలనుకుంటున్నారో - అలా మీరు పుట్టించే వారు కారా?
మీరనుకుంటున్నట్టు - వాళ్ళు పెరగడమూ లేదు. చదవడమూ లేదు.
మీ మనసులో - ఎన్నో రకాల అసంతృప్తి.
చాలా విషయాల్లో - మీకు ఎంపిక సామర్థ్యము లేదు. ఆ అధికారము మీకు యివ్వ బడ లేదు.
ఎన్నో ముఖ్య విషయాలలో మీకు ఎంపిక వుంధి.
ఈ క్షణంలో సంతోషంగా ఉండాలా? ఆ ఎంపిక మీదే!
ఈ క్షణంలో ప్రతి వొక్కరి తోనూ స్నేహంగా ఉండాలనుకోవడం - అధి మీరు ఎన్నుకోవాల్సిందే!
ఈ క్షణంలో - మీరేం మాట్లాడాలో - అధి కూడా మీరు ఎన్నుకోవాల్సిందే!
మీ భార్య తోనో, భర్త తోనో - ప్రేమ పూర్వకం గా రెండు మాటలు మాట్లాడాలని ఎవరు అనుకోవాలి?
మీరే! ఆ ఎంపిక మీదే!
అదే ఎంపిక - వారూ చేసుకుంటే - మీ యింట్లో - ఆనందం - వెల్లి విరియదా!

అదే విధంగా -వారు మీకేం చేస్తారో, ఏమేం చేస్తారో - అది వారి ఎంపిక - మీరు దానికెలా ప్రతి స్పందిస్తారో - అది మీ ఎన్నిక.
మీ ఇల్లు నందన వనం కావడమో, చప్పగా వుండడమో, నరకంగా మారడమో - మీ (యిద్దరి) ఎంపికే.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి