లంచ గొండి తనం పూర్తిగా పోవాలి - అని మన ఉద్యమం.
మనదంటే - మన అన్నా హజారే గారి దన్న మాట.
ఆయనకు డెబ్భై ఏళ్ళు పైబడింది. ఎన్ని రోజులైనా అన్నము తినకుండా వుండగలరు.
గాంధేయ వాదులంతా అంతే.
ఆయనకు గుజరాతు ముఖ్య మంత్రి మోడీ గారి పాలన నచ్చింది.
కానీ, ఆయన చుట్టూ వున్నా వారిలో మోడీ గారు కొంత మందికి నచ్చ లేదు.
కాబట్టి - మోడీ గారు ఏమి చేసినా - ఏమి చేసినా సరే - వీరికి నచ్చదు.
గుజరాతు ప్రజలంద రికీ నచ్చినా - వీరికి నచ్చదు.
అయితే - అన్నా గారికి నచ్చినా - నచ్చినట్టు - చెప్పకూడదు.
సరే = వీరికి, నక్సలై ట్లు ఎందుకనో నచ్చారు. మోడీ గారు నచ్చ లేదు.
అన్నా గారికి మోడీ గారు నచ్చారు. నక్సలై ట్లు నచ్చారో, లేదో మనకు తెలీదు.
ఎవరికి, ఎవరైనా , ఏదైనా నచ్చొచ్చు. పక్కనున్న వాళ్లకు కూడా వారే నచ్చాలి, అవే నచ్చాలి - అంటే ఎలా?
అదే - నక్సలైట్ల వాదం. వారికి నచ్చింది - మనకూ నచ్చాల్సిందే. అంతే మరి.
మన చాలా మంది రాజకీయ నాయకుల మనసులోని, వారి వాదము కూడా ఇదే.
వీరూ, వారూ - పెద్ద తేడా లేదు - డబ్బు విషయం తప్పితే.
మన జయప్రకాశ్ నారాయణ గారు కూడా - దాదాపు వొంటరిగా - లంచ గొండి తనం ను - ఎదిరించి పోరాడుతున్నారు. వారు మనకు (నాకు) నచ్చారు. మంచి వాడని, మన లాంటి వాడని.
అయితే - మంచి వాళ్ళ వెనుక పోవాలంటే - మనలో, చాలా మందికి భయంగానే వుంటుంది.
మంచి తనమంటే మాటలా?
మీకు రేషన్ కార్డు కూడా రాధు. ఆసుపత్రి లో మందులివ్వరు. పాసు పోర్ట్ రాధు.
స్కూలు లో మీ వాడికి అడ్మిషన్ దొరకదు.
మీరు సగటు మనిషి.
సగటు మనిషులు లంచ గొండి కాదు; నక్సలై ట్లు కాదు. రాజకీయ నాయకులు కానే కాదు.
సాధారణంగా బ్రతికేస్తే చాలనుకునే వాడు.
సగటు మనిషికి ధైర్యాన్నివ్వ గల విద్య, నాయకులు, పరిస్థితులూ మనకు కావాలి.
అందుకు తత్క్షణ మందు వొక్కటే! సగటు మనుషులందరూ - వొకటి కావాలి.
వారానికి వొక సారి - ఎక్కడైనా కలిసి, కాస్సేపు మాట్లాడుకోండి.
అంతా కలిసి - వొక చిన్న మీటింగు పెట్టండి - మేమంతా (మనమంతా) వొక్కటే - అనండి - చూదాము.
వెయ్యి మంది వొక ఆఫీసరు ముందు నిలవండి - ఆయన లంచము అడుగుతారేమో చూద్దాం.
రామ్దేవ్జీ గారు చెప్పేదీ అదే. అన్నా హజారే గారు చెప్పేదీ అదే. గాంధీ గారు ఎప్పుడో చెప్పిందీ అదే.
సగటు మనుషులు కలిస్తే - పెద్ద మనుషులవుతారు.
అదండీ కథ,
= మీ వుప్పలధడియం విజయమోహన్
= మీ వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి