కాకినాడలో గిన్నెస్స్ రికార్డు నెలకొల్పాలని ప్రయత్నం జరుగుతోంది.
జూలై తొమ్మిదవ తేదీ నాడు - వొక గంట లో - 12 లక్షల చెట్లు నాటాలని - ఉద్దేశం.
కాకినాడ జవహర్ లాల్ టెక్నలాజికాల్ యూనివర్సిటీ వారు ఆ ప్రయత్నానికి దోహదముగా వొక మోటారు సైకిలు ర్యాలీ నిర్వహించారట.
రిలయన్సు సంస్థ అధికారులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారట.
కాకినాడప్రజలారా! తరలి రండి. ఈ ఆదర్శ వంతమైన ప్రయత్నాన్ని జయప్రదం చేయండి.
వొక్క రోజు, ఒక గంట లో కాకినాడ మారిపోగలదు. రండి మరి.
తరువాత - ఆ తరువులు పెరగడానికి కాస్త శ్రద్ధ తీసుకుంటే - మీ వూరు నందన వనం కాగలదు.
మీకు - మా శుభాభినందనలు.
విజయవాడ వారు వింటున్నారా.
చిత్తూరు వారు వింటున్నారా.
కర్నూలు వారు, మెదక్ వారు, వరంగ ల్ వారు, నెల్లూరు వారు - మరి ఆంధ్రులందరూ వింటున్నారా.
ప్రముఖులు విన్నారా. అధికారులు విన్నారా. నటులు, గాయకులూ విన్నారా.
అయ్యా! కాకినాడ వారికి దక్క బోతున్న ఆ గౌరవం - మీకూ రావాలి.
గౌరవం మాత్రమే కాదు. మన రాష్ట్రమంతా సస్యశ్యామలం గా ,కనులకు కమనీయం గా, అందముగా , హుందా గా,
ఆరోగ్యము గా కనిపించాలి.
యిది ఆరంభం. అంతం లేని ఆరంభం.
శుభారంభం.
జరిగే మంచి పనులకు పూర్తి చేయూత నిద్దాం
= మీ
వుప్పలధడియం విజయమోహన్
.
A wonderful and great event
రిప్లయితొలగించండి