21, ఏప్రిల్ 2011, గురువారం

ఆవు పేడ vs బిరియాని = ఏది మంచిది? = COW DUNG vs BIRIYAANI = = (TELUGU)ఆవు పేడ  మంచిదా, బిరియాని మంచిదా - అంటే, ఎ వైధ్యుడైనా ఆవు పేడే మంఛిది  - అని సమాధానము చెబుతారు.

మీరు ఇంటర్నెట్ గూగుల్ లో  కౌడంగ్ ప్రాపర్టీస్ అని అడిగి చూడండి -మీ జన్మ ధన్యమయి పోతుంది.

ఈ భూ ప్రపంచము లో ఆవు పేడంత  మంచి వస్తువు మరేదీ లేదని తెలిసి పోతుంది.

కానీ కొన్నికొన్ని బిరియానీలు  ఆవు పేడ లాగా వున్నాయని - ఆ మధ్య వొకాయన సెలవిచ్చారట 

అంత గొప్ప మాట అనాలంటే - మాటా?

అనుభవ శాలి కాక పోతే - . అన గలరా?

అయినా - ప్రపంచం లో ఎవరి అభిప్రాయాలు  వాళ్ళవి.
మీరు గద్వాల్ చీరలు , పంచలు ధరించి అలంకార ప్రియులు గానూ ఉండొచ్చు . వేంకటగిరి చీరలు, పంచలు  ధరించి  సీదా సాదా గానూ ఉండొచ్చు..
.
మీ ఇష్టాలు మీవి. నా ఇష్టాలు నావి. ఎక్కడి వారైనా ఎలాగైనా ఉండొచ్చు.

ఎవరో చెప్పారని - మీ ఇష్టాలు, మీ పద్ధతులు మీరు మార్చుకోవాలని లేదు.

అయినా - కొన్ని ఇష్టాలు - మన చేతిలో లేవు.  మనం చెయ్యాలనుకున్నా చెయ్య లేము.

విశ్వామిత్రుడు త్రిశంకుడిని దేహముతో బాటుగా  స్వర్గానికి పంపించాలని చూసాడట. కుదరలేదు.  అయినా -

విశ్వామిత్రుడు త్రిశంకుడిని దేహముతో బాటు "శాశ్వత బ్రహ్మ లోక నివాస సిద్ధి రస్తు"  అని అనలేదు.

 అందుకు కావలసిన "తతంగమూ" చెయ్య లేదు.

ఎందుకంటే - ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో, నిర్ణయించే వాడు వేరే వున్నాడు. మనం కాదు.

మనము చేయ గలిగింది వొక్కటే. 

సర్వే జనాః సుఖినో భవంతు - అనగలం. అంతే! 


= మీ

వుప్పలధడియం  విజయమోహన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి