సత్య సాయి బాబా 85 ఏళ్ళ వయసులో -
దివంగతులైనారు.
వారు, యిప్పుడున్నదీ "అనంత" పురమే.
వారు అప్పుడున్నదీ అనంతపురమే.
వారు, యిప్పుడున్నదీ "అనంత" పురమే.
వారి నివాసము అప్పుడూ ప్రశాంతి నిలయమే.
యిప్పుడూ - ప్రశాంతి నిలయమే.
వారు చేసిన -ప్రజోపయోగ కార్యాలు - అన్నీ, యిన్నీ కావు.
వారు చెప్పిన మంచి మాటలు అన్నీ, యిన్నీ కావు.
వారు భక్తుల మనసులలో -
మొలకెత్తించిన భక్తి భావనలు అన్నీ యిన్నీ కావు.
"సంభవామి యుగే, యుగే" - అన్నట్టు మళ్ళీ వారొస్తారు.
భక్తుల కోసం - అందరి కోసం - మళ్ళీ వారొస్తారు.
అంత వరకు - భక్తుల మనస్సులో - ఎప్పటి లాగే వుంటారు.
మనస్సు - ప్రశాంతి నిలయము గా ఉన్నంత వరకు - వారందులో - ఎప్పుడూ వుంటారు .
వారి లాగా ప్రశాంత మైన ముఖాలతో, వారి లాగా చిరునవ్వుతో - వున్న వారందరిలో - వారు - ఎప్పుడూ వుంటారు
= నమస్సుమామ్జలులతో
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి