7, ఏప్రిల్ 2011, గురువారం

భయము = నిర్భయము = సంతోషం = = TELUGU BLOGమనిషి కున్న అతి పెద్ద జబ్బు ఏమిటి?
కాన్సరా? ఎయిడ్సా?  హృద్రోగామా?

ఇవేవీ కాదు.

మనిషిని పట్టి అతిగా బాధించే అతి పెద్ద జబ్బు పేరు "భయం".

భయం లేని వాణ్ణి ఏ జబ్బూ ఏమీ చేయ లేదు.

భయపడే వాడికి ఏ జబ్బైనా విపరీతంగా బాధ పెట్టేదే!

శరీరానికి జబ్బులు వస్తాయి. రాకుండా వుండవు.

భయం మాత్రం మీకు రాకుండా చూసుకుంటే  మీ జీవితం హాయిగా  గడిచి పోతుంది.

మనిషి కున్న మహా భయం చావును గురించి, అట. మనిషికే గాదు, ప్రతి ప్రాణికీ చావంటే - భయం. కానీ - చాలా ప్రయోగాల ద్వారా తెలిసింది ఏమిటంటే - భయం లేని వాడికి, చావు చాలా సులభం, కష్టం లేనిదీ అని.

పతంజలి మహర్షి యోగ సూత్రాల ద్వారా - తెలిసేది ఏమిటంటే - చావు అంటే భయమూ,  బ్రతుకు  పై తీపి - ఈ రెండింటిని     "అభినివేశం" అంటారు ఆయన - వీటికి కారణం - అజ్ఞానం లేదా అవిద్య  అని చెప్పారు.

ఎప్పుడో, రాబోయే దాన్ని గురించి యిప్పుడు భయపడడం, దుహ్ఖించడం - చాలా అవివేకం అంటారు ఆయన.  ఈ భయానికి విరుగుడు - ధ్యానం అంటారు ఆయన.

ధైర్యమున్న చోట భయముండదు. భయమున్న చోట ధైర్యముండదు. భయానికి కారణం అజ్ఞానమే.

మీకు ఏది కావాలో - మీరే నిర్ణయం చేసుకోవాలి. ధైర్యమా? భయమా?

హిమాలయాల్లో, వొంటరిగా వున్న వారికి  లేని భయం - మీ యింట్లో - మీకు  ఎందుకు ?

మనిషికున్న గొప్ప వరం - ఈ క్షణం.

ఈ క్షణం లో మనం వున్నాం. మరో క్షణంలో మనమే కాదు - ఎవరుంటారో ఎవరికీ తెలీదు.

ఈ క్షణంలో - మీరు సుఖంగా వుండ గలిగే, సంతోషంగా వుండ గలిగే అవకాశం పూర్తిగా వుంది.

మీ రోగాలను పక్కన పెట్టండి.మీ సమస్యల నన్నిటినీ  పక్కన పెట్టండి.

ముఖ్యంగా మీ అన్ని భయాలనూ మూట కట్టి పక్కన పెట్టండి - లేదా సముద్రంలో వేసెయ్యండి.

అవి ఏవీ మీకు అక్ఖర లేదు.

ఈ క్షణం మీది. దీన్ని మీ నుండి ఎవరూ తీసేయ్య లేరు.

ఈ క్షణం  లో ఆనందంగా వుండండి.

పాట పాడండి. డాన్సు చెయ్యండి. ఈల వెయ్యండి. నవ్వండి. ఆడండి. హాయిగా మాట్లాడండి.

సంతోషంగా వుండే మరే పని అయినా చెయ్యండి.

భయాన్ని మాత్రం దగ్గరికి రానివ్వకండి. అది పనికిరాని అలవాటు మాత్రమే.

ధైర్యం గా వుండే వాడే సంతోషంగా వుండగలడు.


సంతోషంగా వుండడం అలవాటుగా మార్చుకోండి.

రోగాలు మనల్ని ఏమీ చెయ్య లేవు.

ఒక్క జీవిత కాలం మనం సంతోషంగా ఉందాం.

= మీ

వుప్పలధడియం  విజయమోహన్
  

2 వ్యాఖ్యలు:

  1. దయ చేసి మీ బ్లాగ్ పేరుని తెలుగులో 'దీర్గారాశీ' అని పెడితే చూసేందుకు చాలా బాగుంటుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. బాగా చెప్పారు.. కీప్ ఇట్ అప్!

    మీ బ్లాగ్ పేరుని "Deerghadarshi" అని అదనముగా h కలపండి. ఇంకా బాగుంటుంది. అలాగే ఈ వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి.

    ప్రత్యుత్తరంతొలగించు