గోధుమ పైరు రసం
ఎన్ని రోగాలకు మందు?
కాన్సర్ ను అది తగ్గిస్తుందా ?
ఈ మధ్య గోధుమ పైరు రసం(వీట్ గ్రాస్ జూస్ ) గురించి చాలా వార్తలు వచ్చాయి; వస్తున్నాయి . దాదాపు 15 ఏళ్ళుగా దీన్ని ఎన్నో దేశాలలో, ఎన్నో రోగాలకు ఔషధం గా ప్రయోగించడం జరిగింది . దీనిపై కొంత మంది డాక్టర్లు , తాము చేసిన పరిశోధనలను గురించి వివరం గా పుస్తకాలు రాశారు. అందులో, ఎంతో మంది రోగుల అనుభవాలు , డాక్టర్ల అనుభవాలు పొందు పరిచారు . చాలా ఆసక్తి కరమైన అంశాలు అందులో వున్నాయి. అదే కాక, యింటర్ నెట్ లో దీన్ని గురించి చాలా , చాలా సమాచారం వుంది , ఎంతో మంది డాక్టర్లు , రోగులు - తమ అనుభవాలను చెబుతున్నారు. దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా వొక్క విషయం మాత్రం తెలుస్తూ వుంది . ఈ గోధుమ పైరు రసం - ఎన్నో రోగాలకు, మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది - అని .
ఒక 20 రోజులకు ముందు, మా బంధువర్గంలో వొకతను , 40 ఏళ్ళ వయస్సు వాడు , అతనికి కడుపునొప్పి రావడం, డాక్టర్లు ఆపరేషన్ చేసి, కడుపులోని పెద్ద గడ్డను తీసి వెయ్యడం జరిగింది . ఆ తరువాత జరిగిన వైద్య పరిశోధనలలో, అతనికి లివర్ దగ్గర అనుకుంటా - కాన్సర్ కూడా వున్నట్టు నిర్దారించడం జరిగింది. అది నా దృష్టికి రావడం, ఆయన నన్ను కూడా సలహా అడగడం జరిగింది.
అల్లోపతి వైద్యం ప్రకారం - కీమో థెరపీ యిస్తున్నారు. కానీ , ఈ కాలంలో, ఈ తెరపి యొక్క సైడ్ ఎఫెక్ట్స్; కాన్సర్ మళ్ళీ రావచ్చునేమో అన్న సందేహం - యివన్నీ వుండనే వున్నాయి. అందుకని, ఈ విషయంపై నేను - కాన్సర్ కు యిప్పుడు వున్న అనేక రకాలైన నిరోధకాలు, అనేక రకాలైన మందులను గురించి చదవడం, పరిశీలించడం జరిగింది . అందులో - మరెన్నో వున్నా - మనకు సులభంగా అందుబాటులో వున్న "గోధుమ పైరు రసం" వైద్యం - నన్ను బాగా ఆకర్షించింది . అల్లోపతీ వైద్య పరిశోధకులు, లేబరేటరీలు, వీటిని అస్సలు పరిశోధించరు. వారికి మిగతా వైద్య విధానాల పట్ల గౌరవం లేదు; చాలా, అశాస్త్రీయమైన, అపనమ్మకం.
మన దేశంలోని, ఆయుర్వేద కళా శాలలు, విశ్వ విద్యాలయాలు, వీటిపై విధిగా పరిశోధనలు చేసి, పరిశోధనా ఫలితాలను ప్రకటించ వలసిన అవసరం ఎంతైనా వుంది. వారూ, యిటువంటి పరిశోధనలను పెద్దగా చెయ్యడం లేదు. చరక సుశ్రుతుల తరువాత, మన ఆయుర్వేద వైద్య పరిశోధనలు అంటూ పెద్దగా ఏమీ జరుగ లేదు . తురుష్కుల, ఆంగ్లేయుల కాలం లో వున్నవంతా పోయాయి. తరువాత కూడా, మన ఆయుర్వేదానికి , మన ప్రభుత్వం వారు యిచ్చిన ప్రోత్సాహం ఏమీ లేదు. చరక సుశ్రుతుల లాంటి వారు కొద్ది మంది చెప్పినది తప్ప మరేమీ మనం పరిశోధించి ప్రకటించి తెలియ పరచడము లేదు. ఈ నేపథ్యం లో, గోధుమ పైరు రసం పై ఎంతో మంది పాశ్చాత్య దేశాల డాక్టర్లు చేసిన ప్రయోగాలు, వాటి ఫలితాలు, చాలా ఉపయోగ కరం గా వున్నాయని తప్పక చెప్ప వచ్చు . ఇంటర్ నెట్ లో దీనిపై చాలా, చాలా ఉపయోగ కర సమాచారం వుంది . దీనిని క్లుప్తంగా, పాఠకుల ఉపయోగం కొరకు యిక్కడ రాయడం జరిగింది .
క్లోరోఫిల్ : - గో.పై.ర. లో , వృక్షములలోని, ఆకు పచ్చటి పదార్ధం - అంటే క్లోరోఫిల్, చాలా గొప్పగా, అన్ని పోషక పదార్థాలతోను , అన్ని రోగ నిరోధక పదార్థాలతోను, క్రిమి సంహారకాలతోను, వుందని వారందరూ చెబుతున్నారు . వరి, జొన్న, రాగి లాంటి మిగతా పైర్ల తో పోల్చి చూస్తే, యిందు లోని క్లోరోఫిల్ లో - మన శరీరానికి ఉపయోగించే పదార్థాలు చాలా వున్నాయని చెబుతున్నారు. యిది మనం, పైరును, పచ్చగా, పూర్ణ జీవ శక్తితో వున్నప్పుడు, కోసి, రసం తీసి త్రాగడం వలన, మెడికల్ షాపులలో దొరికే ఏ మందు కంటే కూడా, మనం తయారు చేసే, మరే ఆహార పదార్థాల కంటే కూడా -అత్యంత శ్రేష్టమైన మందు, మరియు ఆహారం అని చెప్ప వచ్చు .
ద్రవ పదార్ధం : - ఇది మనం ద్రవ పదార్ధం గా తీసుకోవడమే శ్రేష్టమైన విధానం. అదీ, రసం తీసిన వెంటనే తీసుకుంటే - చాలా శ్రేష్టం. శరీరంలోకి అతి త్వరగా చేరడం వలన, అన్ని పోషక పదార్థాలు మనదేహంలో త్వరగా చేరుతాయి. రోగ నిరోధక శక్తి కూడా త్వరగా పని చేస్తుంది. అంటే - మార్కెట్ లో దొరికే మరే మందు కంటే కూడా - యిది ఎన్నో విషయాలలో, ఎన్నో రెట్లు త్వరగా పని చేస్తుంది -అని చెప్పుకోవచ్చు. కాకపోతే - ఫ్లాట్ సిస్టం ఇళ్ళు యిప్పుడు చాలా ఎక్కువ . ఖాళీ స్థలం తో బాటు వున్న ఇళ్ళు తక్కువ. అందువలన, గోధుమ పైరు పెంచడం , రసం తీసి త్రాగడం అందరికీ కుదరదు . కాబట్టి, పౌడర్ గానో, టాబ్లెట్ రూపం లోనో, మార్కెట్ లో కొని కూడా వాడ వచ్చు. దాని ఉపయోగం కొంత తక్కువ . అయితే ప్రయాణాలు చేసే వారికి, వొక చోట వుండని వారికి , యివి కూడా మంచివే కదా .
పోషక పదార్థాల సమ్రద్ధత ;- ఈ రసంలో - శరీరానికి కావలసిన, ఎన్నో రకాల పోషక పదార్థాలున్నాయి. మన ప్రాణ శక్తికి, జీవ పోషణకు యివి చాలా సులభంగా, త్వరితంగా లభిస్తుంది. అంటే, మరి, కాఫీ , టీ లాంటివి అవసరం అనిపించక పోవచ్చు. అంతే కాదు. యిది తీసుకునే వారికి, త్రాగుడు లాంటి అలవాట్లు క్రమక్రమంగా తగ్గిపోవచ్చు .
హిమోగ్లోబిన్ :- రక్త హీనత , అనీమియా లాంటి వాటితో బాధ పడుతున్న వారికి - వారి ఆరోగ్యాన్ని బాగుచేయడానికి యిది బాగా ఉపయోగ పడుతుంది. హిమోగ్లోబిన్ కణం ఎలా వుంటుందో , దీని కణాలు కూడా దాదాపు అలాగే వుంటుంది. అందువలన రక్త వృద్ధికి , హిమోగ్లోబిన్ వృద్ధికి, ఆరోగ్యానికి, యిది బాగా ఉపయోగ పడుతుంది.
టాక్సిన్లు లేనిది : చాలా ఆహారాలలో , యేవేవో, హాని కరమైన టాక్సిన్లు వుంటున్నాయి. వాటి వలన, శరీరానికి, రక రకాల కీడు ఏర్పడడం జరుగుతూ వుంది . గో.పై.ర. లో - ఎటువంటి హానికర పదార్థాలూ లేవని చెప్ప వచ్చు. కాబట్టి, దీన్ని, ఏ భయం లేకుండా, వొక గ్లాసు వరకూ, తీసుకోవచ్చు. చాలా మంది రోగులకు, 3-4 గ్లాసులు ప్రతి దినం యిచ్చారు . దీని వలన కొంత మందికి 2-3 రోజులు డయోరియా లాంటివి వచ్చినా - దీన్ని సగం నీళ్ళలో కలిపి యిస్తే - వెంటనే తగ్గి పోయింది . ఆ తరువాత, యీ రసం వలన శరీరం లోని ఎన్నో వ్యాధులు తొందరగా నయమయ్యాయి.
శరీరంలోని/పైని బాక్టీరియా : దీన్ని, తీసుకున్న వారికి, శరీరంలో, వ్యాధులు ఉత్పత్తి చేసే ఎన్నో రకాల బాక్టీరియా పూర్తిగా నాశనమవడం జరిగింది. అలాగే, యిదే రసం, చర్మం పై పూస్తే , అక్కడున్న, పుండ్లు మానడం, అలెర్జీలు తగ్గడం, ఎగ్జిమా లాంటివి క్రమంగా పోవడం జరిగాయి . అంటే - శరీరం లోపలా, బయటా, ఈ రసం శక్తి వంతమైన బాక్టీరియా సంహారిణి గా, ఆరోగ్య వర్దినిగా వుండటం గమనించారు.
చర్మ రోగ నివారిణి :- పైన చెప్పినట్టు, క్రమ బద్ధంగా, చర్మంపై పుండ్లు , అలెర్జీలు , ఎగ్జిమాలు , సోరియాసిస్ లాంటివి వున్న ప్రాంతాలలో, యిది పూస్తూ వస్తే , చాలా మెరుగైనట్టు చెబుతున్నారు .
శరీరంలోని విష పదార్థాలు / టాక్సిన్ లు : మన శరీరంలో రకరకాల, విష పదార్థాలు, ఎలాగో చేరి పోతూ వుంటాయి . వాటినన్నిటినీ మట్టు బెట్టి , శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్, శక్తి యిచ్చి వాటి ద్వారా, శరీరాన్ని కాపాడుతుంది .
డయాబెటీస్ : - చక్కెర వ్యాధి లో కూడా, యిది ఎంతో ఉపయోగ పడటం గమనార్హం . పాశ్చాత్య ఫార్మా కంపెనీలు , చాలా వరకు, ఏ వ్యాధికీ , పూర్తి విరుగుడు కనిపెడ్డటం లేదు . ఆ వ్యాధులు శరీరంలో, జీవితమంతా వుండాలి, వాటికి మనం ఎప్పుడూ మందులు తీసుకుంటూనే వుండాలి- అన్న చందం గానే వుంది ప్రతి పాశ్చాత్య మందూ. అదీ, ప్రకృతి వైద్యం అంటేనే దూరంగా వుంటున్నారు. అన్నీ రసాయనిక మందులే. యిది చాలా మూర్ఖత్వంగా వుంది. కానీ, కొంత మంది పాశ్చాత్య డాక్టర్లు కూడా, ఈ విధానాన్ని, గర్హిస్తూ - పూర్తి విరుగుడు కోసం వెదుకుతున్నారు . అందులో భాగమే - ఈ గోధుమ పైరు రసం వైద్యం .
వ్యాధి నిరోధకం : శరీరంలోని రక రకాల దుర్వాసనలను పోగొట్టడము , పుళ్ళను నయం చెయ్యడము, సైనసిటిస్ , చేవ్వి పోట్లు, చెవుల వ్యాధులు , గుదం లో వచ్చే, పుళ్ళు , వెజైనా లో వచ్చే సమస్యలు యిలా ఎన్నో సమస్యలకు ఈ రసం బాగా ఉపయోగ పడడం గమనించారు .
శరీరం లోని అతి ముఖ్య భాగాలు : గుండె, ఊపిరి తిత్తులు, మెదడు, లివరు లాంటి అతి ముఖ్య భాగాల పని కూడా, యిది తీసుకున్నప్పుడు బాగు పడటం గమనించారు.
పండ్లు - వాటి సమస్యలు :- నోటిలో, ఈ రసం కాస్సేపు వుంచుకుని , పుక్కులించి , మింగితే , పళ్ళ సమస్యలు , నోటి దుర్వాసన లాంటి సమస్యలు దూరం కావడం గమనించారు.
గుదం యొక్క ఆరోగ్యం : నోటిలో లాగే, గుదం ద్వారా, ఈ రసాన్ని లోపలి తీసుకుని , కొద్ది సేపు వుంచుకుని , మళ్ళీ బయటికి వదిలేస్తే , గుదం యొక్క సమస్యలు తీరి, ఆ భాగం ఆరోగ్యం బాగు పడటం గమనించారు .
కండరాలు,ఎముకలు :- కండరాల బలం, ఎముకల ధృఢత్వం పెరగడం కూడా దీని వొక వుపయోగమే .
యెర్ర కణాలు, రక్త పోటు :- ఈ రసం తీసుకున్న వారికి రక్త పోటు బాగుండడం, ఎర్ర కణాల సంఖ్య, వాటి ఆరోగ్యం పెరిగి, రక్త సమస్యలు పూర్తిగా తగ్గి పోవడం గమనించారు. బరువైన లోహ కణాలను తీసి వేసి, రక్తం లోని ఆమ్ల తత్వాన్ని తగ్గించి, క్షార తత్వాన్ని సమ తౌల్యానికి తేవడం కూడా గమనించారు.
పనికి రాని కణాలు, దుమ్ము : శరీరంలో , అన్ని భాగాలలోనూ , శరీరానికి పనికి రాని కణాలు, దుమ్ము లాంటివి , ఎలాగో చేరి పోతూ వుంటాయి. వీటిని, రక్తం ద్వారానే శుద్ధి చెయ్యడం , శరీరం అన్ని భాగాలకూ పంపడం - బాగా జరిగేది - ఈ రసం తీసుకున్న సమయంలో .
మెటబాలిజమ్ : శరీరం యొక్క మెటబాలిజమ్ ను సమ తౌల్య స్థితిలో వుంచడం, శరీరపు భాగాలకు, పటుత్వం, శక్తి దొరుకుతూ వుండడం కూడా జరిగింది. థైరాయిడ్ సమస్యలు, పెప్టిక్ అల్సర్లు, కాన్స్టిపేషన్, మరెన్నో యితర జీర్ణావయవ సమస్యలు దీని ద్వారా మెరుగు పడ్డాయని చెబుతున్నారు .
ట్యూమర్లు , కాన్సర్లు : దీని అతి గొప్ప ఉపయోగం ట్యూమర్లను, కాన్సర్ లను నయం చేయడం లో - అని డాక్టర్లు, పేషంట్లు చెప్పారు. దీన్లో వున్న ఉత్తమమైన ఆక్సిజన్ ఎదుట, ఈ ట్యూమర్లు గానీ, కాన్సర్ కణాలు కానీ బ్రతక లేక పోవడం, శరీరం లోని, ఏ అనారోగ్య కరమైన వాపూ, దీని ముందు నిలువ లేక పోవడం గమనార్హం. రేడియేషన్, కీమో థెరపీ లాంటి చికిత్సల సైడ్ ఎఫెక్ట్స్ ను బాగా తగ్గించి, ఆరోగ్యం పెంపొందించడం కూడా గమనార్హం. ఈ రసం బాగా జీవంతో ఉన్నప్పుడే కోసి, రసం తీసి తాగడం వలన - దీని ఉపయోగాలు చాలా, చాలా ఎక్కువ. ఇందులోని క్లోరోఫిల్ లోని జీవ పదార్థాలు, ఆక్సిజన్ , ఎన్ని రకాలుగా ఉపయోగ పడుతోందో - అని వారందరూ ఆశ్చర్య పోతున్నారు. యివే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగ పడిందట. మనలోని ఫెర్టిలిటీ, యౌవనము పెరగడము - యిలా, ఎన్నో, ఎన్నో ఉపయోగాలు - ఈ డాక్టర్లు వారి పేషంట్లు గమనించారు .
దీన్ని పెంచడం ఎలా : యిళ్ళలో , నేలపైగానీ, పెద్ద కుండీలలో గానీ, పెంచవచ్చు. మంచి గోధుమలను, సారవంతమైన మట్టి లో చల్లి, లేదా, నాటి, బాగా తడుపుతూ వుంటే , మొలకెత్తుతాయి. ఎక్కువ సూర్య రశ్మి అక్కర లేదు కానీ, కొద్ది పాటి రశ్మి అయినా కావాలి. అంటే - చెట్ల నీడలో కూడా పెంచ వచ్చు . వొక అడుగు పెరిగిన తర్వాత , అది యింకా బాగా పచ్చగా ఉన్నప్పుడే , రెండు మూడు ఆకులు వేసిన తర్వాత , కోసేసి, తడిపి, గుజ్జులాగా చేసి, మిక్సీ లో వేసి రసం తీసుకోవచ్చు . రసాన్ని నిలువ వుంచకండి. కానీ, కోసిన పైరును, అలాగే ప్రిజ్ లో కొన్నాళ్ళు ఉంచవచ్చు . ఎప్పుడు రసం తీసినా, వెంటనే త్రాగటం శ్రేష్టం .
పేషంట్లు ఏం చెయ్యాలి :యిన్ని విషయాలు, యింకా ఎన్నో విషయాలు, గోధుమ పైరు రసం గురించి , ఇంటర్ నెట్ లో వున్నాయి. మరి, అల్లోపతీ వైద్యులు వీటిని వొప్పుకుంటారా? ఊహూ. ఎందుకంటే, వారికి, ఏదైనా ఫార్మా కంపెనీ చెబితే కానీ నమ్మకం లేదు. కానీ, ఈ రోజు వరకూ, ఏ పాశ్చాత్య ఫార్మా కంపెనీ కూడా - యిప్పటి రోగాలకు దేనికీ పెర్మనెంట్ క్యూర్, అంటే, పూర్తి విరుగుడు కనిబెట్టడం లేదు. అవి జీవితాంతం వుండాలి. మీరు ఆ కంపెనీల మందులు జీవితాంతం వాడాలి. ఏదో, కొద్దో, గొప్పో, ఉపశమనం పొందాలి; మళ్ళీ, డాక్టరు దగ్గరకు వెళ్ళాలి; మళ్ళీ కొత్త మందులు; మళ్ళీ, మళ్ళీ, ఇదండీ జరుగుతున్న చక్రవ్యూహం .
సరే . వొక డాక్టరు కే ఈ రోగాలేవైనా వస్తే - కనీసం భయంతో నైనా - ఈ వ్యాసమో, నెట్ లోని మరే వ్యాసమో చదివితే, తప్పకుండా, గోధుమ పైరు రసం సేవిస్తారు. ప్రాణ భయం ఎవరిని విడిచింది? నిజానికి, యిది తీసుకుని కాన్సర్ నయం చేసుకున్న మొదటి పేషంట్లలో డాక్టర్లు వున్నారు. కానీ, మరెవరికైనా వస్తే, యిది కూడా చెయ్యమని చెబుతారా. మన డాక్టర్లు చెప్పరు.
యిప్పుడు మా బంధువులలో వొకాయనకు కాన్సర్ వచ్చిందన్నాను కదా. ఆయన యిప్పుడు - అల్లోపతీ తో బాటు యిది కూడా యింట్లో తయారు చేసి, తీసుకుంటున్నాడు. అలాగే, ఆయనకు, కొన్ని రకాల ధ్యానం, కొన్ని రకాల ప్రాణాయామాలు చెప్పించాము. అవీ చేస్తున్నాడు. నా ఉద్దేశంలో - ఆయన పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. అదీ చాలా త్వరగా .
యిప్పుడు మీ, నా కర్తవ్యం ఏమిటి? మన దరి దాపుల్లో , ఎంతో మంది , ఎన్నో రకాల రోగులు దీర్ఘ వ్యాధి పీడితులు వున్నారు. కొంత మంది బ్రదకడం గురించి ఎటువంటి నమ్మకమూ లేక , మృత్యువు కోసం ఎదురు చూస్తూ వుండేవారు కూడా వుంటారు.
అటువంటి వారి మనస్సులో, మీరూ, నేనూ - నిర్భయత్వం , నమ్మకం, భవిష్యత్తు పట్ల వుత్సాహము - చిగురించే లాగ చెయ్యాలి . అందుకే - ఈ ప్రయాస .
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
వుప్పలధడియం విజయమోహన్

1.
చాలా విలువైన సమాచారం అందించారు.
రిప్లయితొలగించండిహృదయపూర్వక ధన్యవాదములు.
-రామకృష్ణ
రామకృష్ణ గారు - మీ ప్రోత్సాహ పూరితమైన వ్యాఖ్య కు చాలా సంతోషం . గోధుమ పైరు రసం గురించి నేను రాసింది కొంచమే . నిజానికి - దాని ఉపయోగాలు యింకా ఎన్నో వున్నాయి . మన చుట్టూ వున్న అద్భుతమైన మందులలో యిది వొకటి . విచారకరమైన విషయం ఏమిటంటే - మనం అల్లోపతీ వైద్యాన్ని గుడ్డిగా నమ్ముతాం . అదీ మంచిదే . కాదనను . కానీ, ఎక్కడ రోగం వచ్చిందో - దానికి మందు కూడా అక్కడే వుంది - అని మన ప్రాచీనులు చెప్పిన గొప్ప సత్యం మనం మరిచి పోతున్నాము. మన చుట్టూ అద్భుతమైన మందులు వున్నాయి. వాటిపై - మన ఆయుర్వేద విశ్వ విద్యాలయాలు ఎంతో పరిశోధనలు చెయ్యాల్సి వుంది .
తొలగించండి