పతంజలి యోగ సూత్రాలు
3 వ వ్యాసం
పతంజలి
సూత్రాల పై రాస్తున్న ఈ వ్యాస మాలికకు - మీకందరికీ పునః స్వాగతం. మీరు - మొదటి వ్యాసంలో రాసిన నల్ల గొరిల్లాను 2 నిమిషాలు మరిచి పోయే ప్రయోగం ; రెండవ వ్యాసంలో రాసిన రిలాక్సేషన్ ప్రయోగం చేశారు కదా . చేసి వుంటే మీరు యోగ మార్గం లో అడుగు పెట్టారన్న మాటే . ఇక నుండి, మీరూ యోగ సాధకులే. యోగ మార్గం లో వున్న వారే. వొక్కొక్క వ్యాసంతో, వొక్కొక్క అధ్యయనం తో - ముందు వెళ్ళండి.
సమాధి పాదం - సూత్రం -2
యోగశ్చిత్త వృత్తి నిరోధః
యోగః - అంటే,
ఏమిటి ? అన్నది పతంజలి వివరిస్తున్నారు.
చిత్తవృత్తి నిరోధః - చిత్తం అంటే ఏమిటో మనకందరికీ తెలుసు. మనలో కదలాడే, ఊహలు , ఆలోచనలు, భావనలు , జ్ఞాపకాలు - మీ తలలో - ఏమేం ఆలోచనలు , భావనలు కదులుతాయో - అవన్నీ కలిపితే అదే మీ చిత్తం .
నిజానికి మనలోనే - రెండు రకాల ప్రపంచాలు వున్నాయి. మన శరీరంలో వున్నవన్నీ , జరిగేవన్నీ కలిపితే - భౌతిక జగత్తు అని చెప్పుకోవచ్చు. మనసులో - జరిగేవన్నీ కలిపితే మానసిక జగత్తు . అదెక్కడుందో మనకు తెలీదు . కానీ మన లోపలే, మన మెదడు లోపలే - ఎక్కడో - ఎక్కడెక్కడో వుంది. యింకా, శరీరం లో - మరెక్కడైనా కూడా వుందా? అంటే చెప్ప లేము . వుండొచ్చు. ఎక్కడున్నా, అక్కడేమైనా, అవన్నీ కలిపి మన మానసిక జగత్తు - అంటాము. యోగంలో - అదొక పెద్ద ఆకాశమంతటిదిగా వర్ణిస్తారు. నిజానికి, మన భౌతిక జగత్తుకు, మానసిక జగత్తుకు - అవినాభావ సంబంధం వుంది. అది లేక యిది కానీ, యిది లేక అది కానీ లేదు.
అలాగే - మన మానసిక జగత్తుకూ, చుట్టూ వున్న వారి మానసిక జగత్తుకూ కూడా అవినాభావ సంబంధం వుంది.అంటే, శరీరాలన్నీ వొకటి కాలేవు ; కానీ, మానసికంగా, మనమంతా చాలా, చాలా, దగ్గర కావచ్చు . వొక మనస్సు, మరొకటితో, చాలా దగ్గరగా రావచ్చు; కలిసి పోవచ్చు. ప్రపంచం లోని మానసిక శక్తి అంతా కలిపితే - చిదాకాశం - అంటారు. మన మానసిక జగత్తు - మొత్తం విశ్వమంతా వున్న చిదాకాశం లో వొక భాగమే - కానీ వేరు కాదు . అందుకే - అది విశ్వంలో వున్న మరి ఎవరితో నైనా ప్రేమైక సందేశాలు కానీ, మరే రకమైన సందేశాలు కానీ పంచుకో గల శక్తి గలిగినది. యిది యోగం ద్వారా సుసాధ్యమే - అంటారు .
మన చిత్తానికి ఎన్నో రకాల గుణాలు వున్నాయి. వాటి విభాగాలు, పతంజలి ప్రకారం ఏమున్నాయో, అవి తరువాత చూద్దాం. యిప్పటికి కొన్ని గుణాలు మాత్రం కొద్దిగా అర్థం చేసుకుందాం. నల్ల గొరిల్లా ప్రయోగం మీరు మొదటి వ్యాసంలో చేసారు కదా. అందులో మీకు తెలిసినదేమిటి?
మీరు వద్దు, వద్దన్న కొన్ని పనులను మీ మనసు - నేను వినను గాక వినను అని చేసేస్తూ వుంటుంది . అవునా. అలాగే, చాలా సార్లు, మీరు చెయ్యమన్న పనిని మీ మనను చెయ్య నివ్వదు. రక రకాలుగా ఆ పని నుండి మిమ్మల్ని దూరంగా లాక్కుని వెడుతుంది. యిలా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నప్పుడు మనకేమని తెలుస్తుందో తెలుసా ! మనమూ, మన మనసు వొకటి కానే కాదు . అది మనపై అజమాయిషీ చేయడానికే పుట్టింది; అది మనకు అప్పుడప్పుడూ కష్టాలనూ, అప్పుడప్పుడూ సుఖాలనూ యివ్వడానికి పుట్టింది - అని తప్పకుండా అనిపిస్తుంది .
మన యొక్క గొప్ప స్నేహితుడూ మనసే, మన యొక్క గొప్ప శత్రువూ మనసే - అంటాడు శ్రీకృష్ణుడు గీతలో .
ఎలా? మీకు దుఃఖం, క్రోధం, ఈర్ష్య, కామం, లోభం, గర్వం, శత్రుత్వం, భయం ఎలా, ఎక్కడ కలుగుతాయండీ ? మీ మనసుద్వారా, మీ మనసులో. అవునా ? అంటే - ఆ మనసు మీ అధీనం లో లేకుండా , యివన్నీ, పుట్టిస్తూ వుంటే - మీకు , ఈ లోకంలోనే నరకం చవి చూపిస్తూ వుంటే - మీ మనసే కదా, మీ శత్రువు .
అదే, మీ మనసు మీ అధీనం లో వుంటూ - శాంతంగా, సంతోషంగా, హాయిగా , పరులపై దయతో, ప్రేమతో , ఆర్ద్రతతో , వుంటే - మీ మనసే కదా, మీ మిత్రుడు . గీతలో సగమంతా - యిలా ఎలా వుండటం - అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడమే .
అయితే, ఇక్కడొక తిరకాసు వుంది. ఎంతటి సుఖమైనా, కాల క్రమంలో, మనను విడిచి పెట్టి వెళ్లి పోతుంది. ఏ సుఖమూ, నిరంతరం కాదు . మీతో ఎల్లప్పుడూ వుండదు గాక వుండదు.
అందుకనే, ఆది శంకరుల వారు - మీకు నిత్యానిత్య వివేక విచారము - ఎల్లప్పుడూ వుండాలి - అంటారు . ఏది నిత్యం? ఏది అనిత్యం? ప్రాపంచికంగా కూడా, కొన్నిటితో పోలిస్తే, వేరే కొన్ని సుఖాలు కానీ, దుఃఖాలు కానీ, మనతో ఎక్కువ రోజులు వుంటాయి. మరి కొన్ని చాలా తక్కువ రోజులు వుంటాయి.
ప్రేమలో దొరికే సుఖం అనిత్యం. పెళ్ళిలో దొరికే సుఖం దానితో పోలిస్తే , ఎక్కువ నిత్యం. దాన్ని కూడా మూర్ఖంగా, తమ అహంకారాలతో, నిత్య దుఃఖం గా మార్చుకునే భార్యలూ వున్నారు, భర్తలూ వున్నారు. స్వంత ఇల్లు కొంత నిత్యం. బాడుగ ఇల్లు అనిత్యం. సాత్వికాహారం నిత్య సుఖం యిస్తుంది. రాజసిక ఆహారం తక్కువ సుఖం, ఎక్కువ కష్టం యిస్తుంది. తామసిక ఆహారం చాలా తక్కువ సుఖం, చాలా ఎక్కువ దుఃఖం, కష్టం యిస్తుంది. యిలా మన జీవితంలో దొరికేవన్నీ ఏది, నిత్య సుఖం, ఏది అనిత్య సుఖం అంటూ బేరీజు వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు, బుద్ధిమంతుడు, నిత్య సుఖాలకే ప్రాధాన్యతను యిస్తూ వెడతాడు . అనిత్య సుఖాల జోలికి పోడు .
పతంజలి లాంటి మహానుభావులు , యిలా వెదికిన వాళ్ళే. యిలా వెదికి, వెదికి, చివరికి , నిజమైన, నిత్యమైన, నిరంతరమైన, సులభమైన, అన్ని సుఖాలకంటే చాలా, చాలా గొప్పది అయిన సుఖం మనలోనే, మన అంతరాంతరాల లోనే , ఎక్కడో దాగుందని తెలుసు కున్నారు. అక్కడికి వెళ్ళే సుగమమైన మార్గాన్ని కూడా కనిబెట్టారు . దాన్నే యోగం అన్నారు. యోగం - అంటే - నువ్వు, నిజంగా, ఎవరో తెలుసుకోవడం, ఆ నిజమైన, నీతో , నువ్వు ఐక్యం కావడం. అదే యోగం .
అదెలా తెలుసుకోవడం?
యిప్పుడు మనం మన మనసు వెంట, అదెక్కడికి తీసుకు వెడితే అక్కడికి, వెళ్లి పోతున్నాము. అది దుఃఖ పడమంటే పడి పోతాము . కోపం చేసుకోమంటే కోపం చేసుకుంటాము. అది పెట్టే కష్టాలన్నిటినీ అనుభవిస్తున్నాము. మనసు తెలివిని వుపయోగిస్తున్నామే కానీ, మన తెలివిని కాదు. మన తెలివి వేరే వుంది. యోగ పరిభాషలో దాన్ని బుద్ధి - అంటారు. ఆ బుద్దే మనం అని అనుకోకండి. దాన్నీ మనం దాటి మన లోపలికి వెళ్ళాలి. అంటే,మనసును దాటి, బుద్ధిని దాటి , మన లోపలి మనం వెళితే - అక్కడ ఏం వుంది ? ఏం లేదు! మనమే వున్నాము .
ఈ మార్గంలో మనం చేసే కృషినే - చిత్తవృత్తి నిరోధః అన్నారు పతంజలి మహర్షి . చిత్తంలో జరిగేవన్నీ చిత్త వృత్తులే . వాటిని నిరోధిస్తే - మనం వెలుపలి ప్రపంచం తో వేసుకునే బంధాలను విడగొడితే , మరొక క్రొత్త మార్గము మనలో ఏర్పడుతుంది. బహిర్ముఖమైన మన పంచేంద్రియాలన్నీ, అంతర్ముఖమవుతాయి. ఆ తరువాత, మెల్లగా, మెల మెల్లగా, మనసు కూడా అంతర్ముఖమవుతుంది. ఈ మార్గమే యోగ మార్గము . అందుకనే, పతంజలి యోగః చిత్త వృత్తి నిరోధః - అన్నారు. ముందు ముందు,యిది పూర్తిగా విశదీకరించ నున్నారు పతంజలి .

యిప్పుడొక చిన్న ప్రయోగం చెయ్యండి : మొదట యిది రెండు సార్లు చదవండి . తరువాత చెయ్యండి :
యోగ - ప్రయోగం - 3 ( ఆనందపు రెండవ మెట్టుకు - వొక చిన్న ప్రయోగం )
హాయిగా కూర్చోండి.
నేల పై నైనా సరే . కుర్చీ లో నైనా సరే. మంచం మీదైనా సరే . మీరు కాళ్లెలా
పెట్టుకుంటారో , మీ యిష్టమే.
కానీ ఈ సారి మీ చేతులు, మీ వొళ్ళో పెట్టుకోండి. ఎడమ చేతిలో కుడి చెయ్యి వేసి హాయిగా , శరీరం లో టెన్ షన్ లేకుండా, వీపు మాత్రం కాస్త నిటారుగా - హాయిగా , కూర్చోండి .
యిప్పుడు కళ్ళు మూసుకోండి.
2 నిమిషాలు -
ప్రపంచం గురించి పెద్దగా పట్టించుకోకండి. మిమ్మల్ని గురించి మాత్రమే, మీ
మనసులో యోచన చేయండి. మీరు ఎక్కడ కూర్చో వున్నారు ; ఎలా కూర్చో వున్నారు;
మీ చేతులు, కాళ్ళు, మీ క్రింద భాగం , నడుము, వీపు, పొట్ట, మెడ , తల
యివన్నీ వొత్తిడి లేకుండా, హాయిగా ఉన్నాయా ? వొత్తిడి - అంటే టెన్ షన్ -
వుంటే , బాగా రిలాక్స్ చేయండి. బాగా రిలాక్స్ గా, హాయిగా కూర్చోండి .
ఇప్పుడు ,మీ తల
లోపల, అంటే మెదడు లోపల, వొత్తిడి వుందా - గమనించండి ; అదీ రిలాక్స్
చెయ్యండి . మీరు గమనిస్తే చాలు - అది రిలాక్స్ అయిపోతుంది. అలాగే, రిలాక్స్ గా 2
నిమిషాలు కూర్చోండి .
యిప్పుడు మీ శ్వాస,నిశ్వాస లను - అంటే గాలిని లోపలికి పీల్చడము,బయటికి విడవడము - మానసికంగా గమనిస్తూ వుండండి. వీలైనంత వరకు, శ్వాస మామూలుగానే, తనంతట తానుగా జరిగే విధంగానే జరగ నివ్వండి . ఎక్కువ వేగం వద్దు. మీరు మీ శ్వాస ను గురించి పెద్దగా ఆలోచన చెయ్య వద్దు. వూరికే గమనించండి . మనసు మరెక్కడికైనా వెడితే, మళ్ళీ శ్వాస పైకి మరల్చండి. వీలైనంత హాయిగా, రిలాక్స్డ్ గా వుండండి . యిలా 2 నుండి 5 నిముషాల వరకు వుండండి. శ్వాస మీద ధ్యాస. అంతే. మరే ధ్యాసా వద్దు .

మీకు - యిక చాలు
అనిపిస్తే, మెల్లగా, మెల్లగా, కళ్ళు తెరవండి . మీ మొహం మీదకు వొక చిరునవ్వు
రావాలి యిప్పుడు . మీ పరిసరాలంతా , మీ చిరు నవ్వుతో బాటు - వొక్క సారి
చూడండి.
ఆ తరువాత మీరు మీ పనులు చేసుకోవచ్చు .
- 3 వ ప్రయోగం పూర్తయ్యింది
ఈ ప్రయోగం మీరు ఎప్పుడైనా , ఎక్కడైనా చెయ్య వచ్చు . బస్సులో, ట్రైన్లో , యింట్లో, ఎక్కడైనా సరే . ఎన్ని సార్లైనా సరే. ఈ ప్రయోగం చేసే వారి శారీరక ఆరోగ్యం ఎంతో బాగు పడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగు పడుతుంది. ఎంతో మంది యోగ సాధకుల ప్రకారం, ఈ ప్రయోగం చేసే వారి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.
ఆ తరువాత మీరు మీ పనులు చేసుకోవచ్చు .
- 3 వ ప్రయోగం పూర్తయ్యింది
2 సార్లు యీ ప్రయోగం పూర్తిగా చదివేయండి. అర్థం చేసుకోండి. ఇప్పుడు కూర్చుని - ఈ ప్రయోగం చెయ్యండి.
ఈ ప్రయోగం మీరు ఎప్పుడైనా , ఎక్కడైనా చెయ్య వచ్చు . బస్సులో, ట్రైన్లో , యింట్లో, ఎక్కడైనా సరే . ఎన్ని సార్లైనా సరే. ఈ ప్రయోగం చేసే వారి శారీరక ఆరోగ్యం ఎంతో బాగు పడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగు పడుతుంది. ఎంతో మంది యోగ సాధకుల ప్రకారం, ఈ ప్రయోగం చేసే వారి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.
మీరు ఈ ప్రయోగం -
సరిగ్గా, రిలాక్స్ గా, సులభంగా, చేసి వుంటే - యిప్పటికే మీరు , ప్రపంచం
లోని 99 శాతం మనుషుల కంటే , రెండు పెద్ద ఆనందపు మెట్లు ,
పైకి ఎక్కేశారు . మీకు నా అభినందనలు .
నాలుగో వ్యాసంలో , మళ్ళీ కలుద్దాం . అంత వరకు - ఈ మూడో ప్రయోగం అప్పుడప్పుడూ చేస్తూ వుండండి .
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి