మోడీ ప్రభంజనం
ఈ మధ్య కాలం లో మన దేశంలో - చాలా పరిణామాలు వచ్చాయి. మన రాష్ట్రంలో వరదలు - వరద బాధితులు , సమైక్యాంధ్ర నా , వేర్వేరు రాష్ట్రాలా - వీటికి పోరాటాలు - యిలా ఎన్నో సమస్యలు .
దేశంలో - మోడీ ప్రభంజనం వచ్చింది . యిది - కొన్ని నెలలు గానే వచ్చింది. అంతకు ముందు - భాజపా లోనే - ఎవరు, ఎవరు అన్న ప్రశ్నలు, మోడీ పట్ల కొందరి నాయకుల విముఖత - అన్నిటినీ దాటి - మోడీ గారిని భాజపా యొక్క ప్రధాన మంత్రి కాండిడేట్ గా అందరు అంగీకరించడం జరిగింది.
అంతకు ముందు - ప్రతి TV చానెల్ లోనూ, ఆయనను గురించిన విమర్శలే వచ్చేవి - అందులో వొక్కటీ సద్విమర్శలు వుండేవి కావు . ఇప్పుడది మారుతూ వుంది . ఆయనకు ముస్లిం ల పట్ల ఎప్పుడూ విముఖత లేదు . 2002 సంఘటనలు - ఆయన వలన జరిగినవి కావు. అందులోని పాత్ర దారులందరికీ శిక్ష కూడా పడేలా చేసింది - ఆయన ప్రభుత్వమే - అని చెప్పక తప్పదు .
అదే - సిక్ఖులకు ఎదురుగా కాంగ్రెసు పార్టీ వారు (అంతకు ముందే ఎప్పుడో ) జరిపిన ఘోరాలకు ఈ రోజు వరకూ శిక్ష లేదు. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వున్న కాంగ్రెసు పార్టీ నిర్వాకమే అని చెప్పక తప్పదు . యిన్ని తమ వొడి లో పెట్టుకుని - వారు మోడీ ని విమర్శించడం అసంగతం కాదా.
అంత కంటే ముఖ్యమైనది -దేశ ఆర్ధిక వ్యవస్థ ఎన్ని రకాలుగా చెడాలో - అన్ని రకాలుగా చెడి పోతూ వుంది. కేంద్ర ప్రభుత్వానికి వోట్ల గొడవ తప్ప మరేదీ పట్టనంటుంది. దేశం లోని పెట్టుబడి దారులే - దేశంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు . లంచగొండి తనం దీనికి అతి ముఖ్య కారణం. విదేశీ పెట్టుబడి వస్తే చాలు - దాన్ని ఎలా వెళ్ళ గొట్టాలో - అన్న తరహాగా వుంది, మన పన్నుల శాఖలూ, ప్రభుత్వాలూ, రాజకీయ పార్టీలు, కొన్ని స్వచ్చంద సంస్థలు .
వొక స్టీల్ ప్లాంట్ వస్తే - లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది . కొంత మందికి ( 4-5 వేల గిరి జనులకు) పునరావాసం కల్పించాల్సి వుంటుంది . వీరికి పునరావాసం కల్పించరు. స్టీల్ ప్లాంట్ రానివ్వరు . స్టీల్ ప్లాంట్ కు అడ్డం కాంగ్రెస్ వారే వస్తే ఎలా? ఎంతో సులభంగా రెండు పనులూ చెయ్యొచ్చు . కాకపొతే - స్టీల్ ప్లాంట్ వచ్చి . గిరిజనులకూ పునరావాసం కలిగితే - అందరూ సంతోష పడితే - వోట్లు - ఆ రాష్ట్రాన్ని ఏలే ఏదో పార్టీ కి వస్తుంది . అదీ బాధ.
యిలా అయితే - దేశం ఎప్పటికి బాగు పడేను ?
అందుకే - నా ఉద్దేశం లో , మోడీ రావాలి. 65 సంవత్సరాలలో , మీరు తీసుకు వచ్చిన (తీసుకు రాలేని) ప్రగతి నేను తీసుకు వస్తాను - అని ఆయన అంటున్నారు. అందుకని ఆయన రావాలి. గుజరాత్ లో వచ్చిన ప్రగతి - మద్య నిషేధం వుండి కూడా వచ్చిన ప్రగతి . ఆ శాఖ సుంకాలు లేకుండా సాధించిన ప్రగతి.
యిందులో, గొప్ప రహస్యం ఏమీ లేదు.
చేసే వాడిని చెయ్య మంటే చాలు. ప్రోత్సహిస్తే చాలు. చెయ్య కుండా ఆపకుంటే చాలు. అడిగే వాడికి ,ప్రభుత్వం యివ్వాల్సిన వొప్పుదలలు, వెంట వెంటనే యిస్తే చాలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అలా కాదు కదా. ఎన్నో రాష్ట్రాలకు యివ్వాల్సిన వొప్పుదలలు - ఎన్నో సంవత్సరాలుగా యివ్వడం లేదు. యిది మాత్రం కాక - కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన గవర్నర్లు కూడా ఎన్నో పథకాలకు వొప్పుదల యివ్వడం లేదని వార్తలు! అభివృద్ధి కి యిన్ని రకాల ఆటంకాలు మరే దేశంలోనూ వుండ వేమో ?
అందుకనే - మోడీ గారు రావాలి. నా ఉద్దేశంలో, మోడీ గారు - భాజపా లోని చాందస వాదాలను కూడా చాలా వరకు కడిగి వేస్తారు. అందరినీ సమానంగా చూస్తారు. అయితే - టెరరిస్టులను మాత్రం వదిలి పెట్టే ప్రసక్తి లేదు. యిప్పటి మెతక విధానాలు టెరరిస్టుల విషయంలో చాలా, చాలా మారాలి . పాకిస్తాన్ విషయంలో చాలా మారాలి. వారు, మన సైనికుల తలలు ఎత్తుకు పోతే కూడా - చూస్తూ కూర్చునే విధానం చాలా, చాలా మారాలి. అమెరికా చూడండి . దాక్కుని వుండే తాలిబానీయులను కూడా - వెదికి , వెదికి సంహరిస్తోంది. అదే - వారికి తగిన గుణ పాఠం.
వొక్క భారతీయుడి పై ఆక్రమణ / హత్య జరిగితే - మన దేశం కూడా, అమెరికా లాగా - అది చేసిన వాడిని / వారిని వొక్కరిని విడువ కుండా తరిమి సంహరించాలి. వొక్క అమెరికా నే కాదు - చిన్న దేశం ఇజ్రాయెల్ కూడా అలాగే చేస్తూ వుంది. శాంతి అనేది - శత్రువు మనసులో భయం, నీతి వుంటేనే వస్తుంది. నీతి లేని వాడికి భయమైనా వుండాలి. ఈ రోజు ఆ భయం లేదు వారికి .
మారణాయుధాల తయారీ - మన దేశంలోని, మన సంస్థలకే వొప్పగిస్తే; వారిని - అమెరికా లాంటి దేశాలతో, వొప్పందం కుదుర్చు కోవడానికి అనుమతిస్తే - చాలా సులభంగా జరిగి పోతుంది . కానీ - మన ప్రభుత్వం వారికి - అదేమీ పట్టడం లేదు . వాల్ మార్ట్ వొక్కటి వస్తే చాలు అన్నట్టు గా వున్నారు . యిప్పుడు వారూ రావడం లేదు.
చేస్తే, గీస్తే, చైనీస్ ప్రభుత్వం తో, వారి సంస్థలతో - టెలికాం లాంటి కీలక సెక్టార్లలో కూడా - పొత్తు పెట్టు కుంటున్నారు . యిది, ఎప్పుడు, ఎక్కడ, మనను దెబ్బ తీస్తుందో తెలీదు.
మనం, ప్రజలు కూడా అలాగే ఉన్నాము . మన యువతీ యువకులకు - ఎంతో మందికి ఉపాధి లేక పోయినా , మనం మాత్రం మన దేశంలోని సంస్థలు తయారు చేసినవేవీ కొనం . చైనా వాడు రెండు రూపాయలకు తక్కువగా అమ్మితే - అదే కొంటాం. మన యింటి లోనే, యిద్దరు నిరుద్యోగులున్నా - అది మనం కొనుగోలు చేస్తున్న విదేశీ వుస్తువుల వల్లే అనేది మనం ఎప్పుడూ అర్థం చేసుకోం. మన ప్రభుత్వం వారు కూడా - మన సంస్థల పైన ఎక్కువ పన్ను, విదేశీ సంస్థల పైన తక్కువ పన్ను లాంటి - గొప్ప విధానాలు పెట్టుకున్నారు. చైనా మన కన్న ముందుండడానికి - మనం వొక్కక్కరుగానో , సంస్థా గతం గానో, చైనా నుండి చేసే కొనుగోళ్ళు - చాలా పెద్ద కారణం - అని నా గట్టి నమ్మకం. యిది మనం నిలిపితే, వారికంటే - ఆర్థికం గా మనమే కాస్త ముందుండ వచ్చు .
కల్తీ చెయ్యడమంటే - మనకు చాలా యిష్టం. లంచం పుచ్చుకోవడం అంటే - మరీ యిష్టం .
యింట్లో ఆడ వాళ్ళు - పక్కింటి ఆయనను చూడండి; ఎన్నెన్ని చేసుకుంటున్నాడో, వాళ్లావిడకి ఏమేం చేసిస్తున్నాడో, మీరెందుకూ పనికి రారు - అని, తమ యింటి మగ వాళ్ళను పురి కొల్పి లంచ గొండులుగా మార్చడం వుందా? లేదా? అంటే మగ వాళ్ళేం తక్కువ తిన్నారని కాదు . కొంత మంది మగ వాళ్ళు లంచం కోసం ఏదైనా త్యాగం చేసేస్తున్నారు. దేశాన్ని కూడా . యివన్నీ మారాలి .
ఆమ్. ఆద్మీ. పార్టీ వారేమో - కాంగ్రెస్, భాజాపా పార్టీ ల వారు మాత్రమే లంచగొండులు -వారిద్దరినీ విడిచి మమ్మల్ని ఎన్నుకోండి; మీ సమస్యలన్నీ-యిట్టే మాయమవుతాయి, అంటున్నారు.
అయ్యా- చిట్ట చివరి గుమాస్తా, ప్యూను - ఆఖరికి, నిన్న చేరిన దిన కూలీ వాడి వరకు లంచ గొండి తనం నర నరాల్లో ఊరిపోయింది మంచి వాళ్ళూ వున్నారు - కానీ వారు అశక్తులు . దీనికి దండం దశ గుణం భవేత్ - అన్నదే విరుగుడు . వారిని మీరు మార్చ లేరు.
అయ్యా- చిట్ట చివరి గుమాస్తా, ప్యూను - ఆఖరికి, నిన్న చేరిన దిన కూలీ వాడి వరకు లంచ గొండి తనం నర నరాల్లో ఊరిపోయింది మంచి వాళ్ళూ వున్నారు - కానీ వారు అశక్తులు . దీనికి దండం దశ గుణం భవేత్ - అన్నదే విరుగుడు . వారిని మీరు మార్చ లేరు.
ఆమ్ ఆద్మీ పార్టీ వారు, మోడీ లాంటి నాయకుడితో చేరితేనే , అందరికీ మేలు - అన్నది నా అభిప్రాయం. అలాగే మన రాష్ట్రంలో - చంద్ర బాబు నాయుడు గారు, జయప్రకాశ్ నారాయణ్ గారు - మోడీ గారితో, పొత్తు కలిపితే - అందరికీ మేలు .
మన దేశం లంచ గొండుల దేశం అన్న అపఖ్యాతి పోవాలి. అందుకు ఈ పార్టీ లన్నీ నడుం కట్టాలి . వొక 60 నెలలు మోడీ కిచ్చి చూద్దాం .
60 నెలల తర్వాత - వోటు మన చేతిలోనే కదా వుంది . అప్పుడు చూద్దాం .
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
వుప్పలధడియం విజయమోహన్
AAM ADMI PART IS A COVERT OF CONGRESS, JUST LIKE CHIRANJIVI PRAJA RAJYAM PARTY DURING 2009 ELECTIONS.
రిప్లయితొలగించండిTHIS KIND OF COVERTS AND SPLINTER GROUPS IN THE GUISE OF SO CALLED THIRD FRONT IS THE REAL THREAT TO THE DEMOCRACY IN INDIA. I HOPE PEOPLE DO REALIZE THIS.
I FULLY AGREE WITH ABOVE COMMENT.IT IS ALREADY ANALYSED BY AN ANALYST RECENTLY.
రిప్లయితొలగించండి