ఆట కదరా శివా ; ఆట కద కేశవా - అన్నాడు వొక తెలుగు కవి.
ఆ ఆట ఉత్తరాఖండ్ లో కావచ్చు; ఒడిశా లో కావచ్చు ; అమెరికా లో కావచ్చు . ఆంధ్రా లో కావచ్చు . మరో చోట కావచ్చు . మన యిళ్ళలో కావచ్చు . మనలోనే కావచ్చు . ప్రతి చోట ఏదో వొక ఆట. ఆ.... .పై వాడి ఆట అన్ని చోట్లా జరుగుతూనే వుంది . ఎప్పుడు, ఎక్కడ - ఏం చేస్తాడో చెప్పలేం . ఎప్పుడు, ఎవరిది గెలుపో, ఎవరిది వోటమో చెప్పలేం.
ఎక్కడైనా, ఏదైనా , ఆ .... ఆట , అతని ఆటే కదా. యిది మనకు గుర్తుంటే , ఆ ఆటను ప్రేక్షకులుగా చూస్తూ, ఆనందిస్తూ వుంటాము. లేదా, ఆ ఆటలో, మనమూ మునిగి తేలుతూ వుంటాము .
టెండుల్కర్ అవుట్ అయిపోతే - అతని కంటే, మనమే ఎక్కువ బాధ పడి పోతాం. బంతి వేసిన వాడు ఎంత బాగా వేసాడో , అని అనుకోం. మన యింట్లోనో, మన వారి యింట్లోనో - ఎవరికైనా, ఆక్సిడెంట్ జరిగినా, రోగాలు వచ్చినా , వారికంటే, మనమే ఎక్కువ చింత లో పడిపోతాం .

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికి తెలుసు? ఆ...పై వాడికి తెలుసు . ఈ ఆట ఆడించే వాడికి తెలుసు .
కాకపోతే మన యిష్టానిష్టాలు మనకుంటాయి. మోడీ గారు గెలవాలని, ప్రధాన మంత్రి కావాలని నేను అనుకుంటాను . కాకపొతే , జేత్మలాని , సుబ్రమణ్యం స్వామి లాంటి వారు - ఎక్కువగా మాట్లాడకుంటే మేలు - అని అనుకుంటాను. 60 నెలల్లో, దేశంలోని ప్రతి వొక్కరూ , అభివృద్ధి పథం లోకి రావాలని - నా ఆకాంక్ష . యిది జరుగుతుందా ? 2014 లో తెలుస్తుంది .
సరే. ఇండియా క్రికెట్ లో గెలవాలా, వొద్దా ? యిదేం ప్రశ్న ? గెలవాలి కదా ? నాకు మాత్రం ఆ ప్రశ్న, ఆ అనుమానం ఎప్పుడూ వుంది. ఇండియా క్రికెట్ లో గెలిస్తే , ఇండియా లోని పిల్లలందరూ చదువు తగ్గిస్తారు. టీవీ కే అతుక్కుని పోతారు. త్రాగుడు కంటే, క్రికెట్ చూడడం-ఆడడం కాదు- చూడడం పిల్లలకు పెద్ద వ్యసనం . పరీక్ష రోజు కూడా, పది నిమిషాల ముందు కూడా - చదువు కంటే , క్రికెట్ ముఖ్యంగా - చూసే పిల్లలు ఎంత మంది ? మెజారిటీ వాళ్ళే కదా. ఎంత మంది చదువులు చెడుతోంది- ఇండియా క్రికెట్ లో గెలవడం వల్ల ? ఏది వ్యసనం గా మారుతుందో - దాని పట్ల మోజు పెంచుకో కూడదు. మితంగా వుంటే పరవాలేదు. కానీ క్రికెట్లో అది కుదరదు . రోజంతా చూడాల్సిందే . రోజంతా చూస్తే ? చదువులూ , పనులూ - అన్నీ - గోవిందా !
కొన్ని వ్యసనాలు మనం తయారు చేసుకునేవి. కొన్ని, మనతో బాటే పుట్టేవి. త్రాగుడు లాంటివి మనమే అలవాటు చేసుకునేవి . సెక్స్ చాలా వరకు మనతో బాటే పుట్టేది .
నాకు యిద్దరు సహోద్యోగులు వుండే వారు. వారికి, సిగరెట్ త్రాగడం పెద్ద వ్యసనం గా వుండేది. అదేదో గొప్ప అయినట్టు వారిలో వొక భావన. చీఫ్ జనరల్ మేనేజర్ గారితో - మా అందరి మీటింగ్ జరిగేటప్పుడు కూడా - వున్నట్టుండి, వీరిద్దరూ మాత్రం చెప్పా పెట్టకుండా, వెలుపలికి వెళ్లి పొయ్యే వారు. ఆ తరువాత, వరండా లోకి వెళ్లి చూస్తే - అక్కడంతా వొకటే సిగరెట్ పొగ . చెబితే వినే వారు కాదు. అది వ్యసనం అని వారికి తెలీదు. అది ప్రపంచం లోనే, గొప్ప అలవాటుగా వారి భావన. కాకపొతే, వొక సారి, దాదాపు యిద్దరికీ, వొకే సారి, కాస్త గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మరో సిగరెట్ త్రాగితే, మీ గుండె - అంతే, మళ్ళీ పని చెయ్యదు - అన్నారాయన. అప్పుడు నిలిపారు వారిద్దరూ, పొగ త్రాగడం. అంత వరకు అది వొక బలహీనత, వొక వ్యసనం అని ఎప్పుడూ అనుకోలేదు వారిద్దరూ.
మరి సెక్స్ - విషయానికి వస్తే, అది కొంత వరకు మనతో బాటే పుట్టింది . సృష్టి క్రమాని కోసం నిర్దేశింప బడింది. యిది - పై వాడి ఆట . మగ వాడి ఈ బలహీనత ను, బలంగా మార్చడానికే - వివాహము, వావి వరుసలు, వాటి గౌరవాలు - ఏర్పడ్డాయి . కానీ, యిప్పుడు, కొంత మంది ఆడవారే, అవన్నీ వొద్దు - అని బయలుదేరుతున్నారు . అది పెద్ద మూర్ఖత్వం. సినిమా, టీవీ లతో ప్రారంభం అయింది. నేను ఎలాంటి బట్టలయినా వేసుకొంటాను - లేదా, అసలు వేసుకోను, మీరెవరు అడగడానికి - అని ఆ కొద్ది మంది అంటున్నారు. యిదీ, పై వాడి ఆటే. ఆకర్షణ మొగుడు పెళ్ళాల మధ్య వుంటే సమాజం మొత్తం సురక్షితంగా వుంటుంది. మిగతా ఆడవారిపై, మగ వారిపై - గౌరవం వుంటుంది. ఆడది, నేను ప్రపంచం లోని - మగ వారినందరినీ ఆకర్షించాలి - అనుకుంటే , ప్రపంచమంతా చెడిపోతుంది. అది తన బలహీనత మాత్రమే కాదు. మగ వాళ్ళందరి బలహీనత. వారితో బాటే పుట్టిన బలహీనత . టీవీ లో, సినిమాల్లో, 24 గంటలూ , ఇలాంటి వాళ్ళను చూసి, చూసి , తమ బలహీనతకు లోనయిన మగ వాళ్ళు కొంత మంది వొంటరిగా దొరికిన ఆడవారిపై, చిన్న పిల్లలపై కూడా, అత్యాచారానికి పాల్పడుతున్నారు . అత్యాచారానికి లోనైన వారి తప్పు లేక పోవచ్చు. కానీ, ఈ సినిమాలు , టీవీ లలో వచ్చే అర్ధ నగ్న ఆడ వారి పాత్ర పూర్తిగా వుంది. వారి - వల్లే మగ వారిలో ఈ బలహీనత ప్రేరేపించ బడుతూ వుంది. ఆ ప్రేరేపణ వల్లనే - అత్యాచారాలు జరుగుతూ వున్నాయి. విశ్వామిత్రుడి లాంటి వాడి తపస్సు చెడచడానికి, ఇంద్రుడు డబ్బు ఎర చూపలా. అర్ధ నగ్నంగా వుండే ఆడదాన్నే పంపించాడు . అది యింద్రుడి స్టాండర్డ్ టెక్నిక్ . ఎక్కడా అంతే . యిది మగ వాడి బలహీనత -అన్నది అందరికీ తెలుసు. సాక్షాత్తు శివుడి ధ్యానం భగ్నం చెయ్యడానికి కూడా - అదే టెక్నిక్ ఉపయోగించ బడింది.
మగ వాడికి డబ్బు పెద్ద బలహీనత కాదు ; ఆడదానికి కావచ్చు . మరేదీ, మగ వాడికి - తీరని బలహీనత కాదు . ఆడదొక్కటే - తన బలహీనత . ఆదైనా - తనతో వావి వరుసలు లేని వారి పట్లనే చాలా యెక్కువ. అన్న- చెల్లెలు, అనుకుంటే , మళ్ళీ, ఆ బలహీనత లేదు. అమ్మ, కొడుకు, అక్క, తమ్ముడు - యిలా అనుకుంటే - ఆ బలహీనత లేదు. కానీ, ఈ కాలంలో, దుస్తుల విషయంలో కానీ, వావి వరుసల విషయంలో కానీ , పాత పరిజ్ఞానం మూల బడుతోంది . విశృంఖలత్వం చోటు చేసుకుంటూ వుంది. అదేదో గొప్ప, అధునాతనత్వం - అనుకుంటూ వున్నారు . కొన్ని విశ్వ విద్యాలయాల్లో , మీ దుస్తుల పైన, చిన్న దుపట్టా వేసుకోండి -అంటే, పెద్ద రభస చేస్తున్నారు - మా దుస్తులు, మా యిష్టం అంటూ . యిది పెద్ద మూర్ఖత్వం . యింత కంటే పెద్ద మూర్ఖత్వం ఆ ఆడవారిలో మరొకటి లేదు. యిది చాలదన్నట్టు - మగ వారితో బాటు, బార్లకు వెళ్లి మేమూ తాగుతాం - అంటూ బయలు దేరుతున్నారు . తాగిన ఆడదానికి, తనను, ఎవరు, ఏం చేస్తున్నారో ఏం తెలుస్తుంది. తాగిన మగ వాడికీ అంతే. వావి వరుసలు కూడా అప్పుడు పోతాయి. అమెరికాలో యిప్పుడు , చిన్న పిల్లల గర్భ ధారణ చాలా, చాలా, ఎక్కువగా మారింది . అయితే, తండ్రి ఎవడో తెలీదు. ఎలా తెలుస్తుంది? జరిగేది, యిద్దరూ ( యింకా ఎక్కువ మంది) తాగేసినప్పుడు కదా. అటువైపే వెడుతున్నాం మనం .
శంకరాచార్యుల వారు అన్నారు - నారీ స్తన భర నాభీ దేశం, దృష్ట్వా మాగా మోహావేశం - అని.
మగ వాళ్లకు అలాంటి మోహావేశం - కలిగించడం ఎప్పుడూ ప్రమాద కరమే. అది వారి బలహీనత . దాన్ని ఆడవారు రెచ్చ గొట్టడం మంచిది కాదు. రావణాసురుడిలో, శూర్ఫణక, కేవలం సీత అందాన్ని విధ విధాలుగా పొగిడి , అతనిలో , సీత పట్ల కామాన్ని రెచ్చగొట్ట గలిగింది . శూర్ఫణకకు తెలుసు, రావణుడి ఆ బలహీనత . రావణుడిలో ఆ బలహీనత లేకుంటే , రామాయణమే లేదు. శూర్ఫణక సీత అందాన్ని అలా పొగడ కుండా వుండి వుంటే కూడా - రామాయణం లేదు. అసలు మన సంస్కృతి లో మగ వాడు - తన లోని యిటువంటి బలహీనతలను గెలవడమే చాలాముఖ్యమైన ధ్యేయంగా చెప్ప బడింది . అలా గెలిచిన మగ వాడు - మహా యోగి అవుతాడు ; దేవుడే అయిపోతాడు . ఈ బలహీనత తో ఆడుకోవడమే - పై వాడి ఆట . ఆడది తెలిసో, తెలియకో, ఆకర్షించడం, మగవాడు ఆకర్షించ బడడం, వొకరిపై ప్రేమ, వొకరిపై ఆకర్షణ, మరొకరితో పెళ్లి, మరొకరితో మరొకటి - యివన్నీ ఆడ, మగ రెండు వైపులా నుండీ జరుగుతో వున్నాయి . ఆట కదరా శివా , ఆట కదా కేశవా .. ..
యివన్నీ - నేనో, మీరో చెబితే , అందరూ వెంటనే మారి పోతారని కాదు . ఈ ఆట యిలా సాగి పోతూనే వుంటుంది. అందరూ వినరు. ఎవరో కొంత మంది వినచ్చు . బాగు పడొచ్చు .
ఈ ఆటను - ఆటగా చూసే వాళ్లకు , లోపల, ఎక్కడో, కాస్త, జ్ఞానోదయం కావచ్చు
సర్వే జనాః సుఖినో భవంతు .
= మీ
వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి