స్వగతం (4) - టర్నింగ్ పాయింట్స్
కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి, లైఫ్ స్కిల్స్ వైపు నా ప్రయాణం
నేను చెన్నై టెలిఫోన్స్ లో - మొదట చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా అయిదేళ్ళు పని చేసిన తర్వాత, వొక సంవత్సరం పైగా అక్కడే డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పని చేశాను. ఆ తరువాత నన్ను, హైదరాబాద్ లోని, నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలికాం ఫైనాన్సు అండ్ మేనేజ్ మెంట్ కు బదిలీ చేశారు. అప్పటి వరకు నేను ఏదో చిన్న చిన్న క్లాసులు అక్కడక్కడా తీసుకునే వాడినే కాని ఇలాంటి నూటికి నూరు శాతం ఫైనాన్సు , మేనేజ్ మెంట్ లాంటి విషయాలపై - అందునా సీనియర్ ఆఫీసర్లు కు కూడా పాఠాలు చెప్పడం లాంటి పనులు చెయ్య లేదు. నిజానికి ఈ సబ్జెక్ట్స్ ఏవీ నాకు తెలీదు. కాకపొతే, ఆ అకాడెమీ చీఫ్ జనరల్ మేనేజర్ గారు నాకు వొకప్పుడు చెన్నై టెలిఫోన్స్ లో బాస్ గా వున్న వారే. అందుకని, మరో మాట చెప్పకుండా వెళ్లి 2003 డిసెంబర్ లో జాయిన్ అయిపోయాను.
ఇప్పుడు నా డ్యూటీ ఏమిటంటే - టెలికాం ఫైనాన్సు, మేనేజ్ మెంట్, హ్యూమన్ రిలేషన్స్ స్కిల్స్ - ఇలాంటి విషయాలపై - చాలా లోతుగా అన్ని విషయాలనూ చదివి, పరిశీలించి, అన్ని రాష్ట్రాల నుండీ ట్రైనింగ్ కు వచ్చే సీనియర్ ఆఫీసర్లకు లెక్చర్ యివ్వాలి. యిక్కడ, లెక్చర్ యిచ్చే వాడు వచ్చిన వారిని అంచనా వెయ్యడం కాదు; అందుకు రివర్సు. ట్రైనింగ్ కు వచ్చిన వారు, లెక్చర్లను యిచ్చే మమ్మల్ని అంచనా వేసి, మార్కులు వెయ్యాలి. వారి అంచనాలను, క్రోడీకరించి వొక్కొక్క లెక్చరర్ కు ఎన్ని మార్కులు వచ్చాయో - అది మా బాస్ గారికి పంపించాలి. వారు అది చూసి, తరువాత యివ్వాల్సిన లెక్చర్లకు - ఏం చెయ్యాలో చెబుతారు. అంటే - ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్కులు వెయ్యడం కాదు. విద్యార్థులు ఉపాధ్యాయుడికి మార్కులు వెయ్యాలి. అది హెడ్ మాస్టర్ గారు చూసి, ఉపాధ్యాయులు పాసో, ఫెయిలో నిర్ణయించాలి. యిది చాలా ట్రైనింగ్ అకాడెమీ లలో వున్నదే.
ఈ అకాడెమీ లో ట్రైనింగ్ వింగ్ వొకటి, అడ్మినిస్ట్రేషన్ వింగ్ వొకటి - ట్రైనింగ్ కు నేను హెడ్, అడ్మినిస్ట్రేషన్ కు మరొకరు, మాకిద్దరికీ పైన CGM గారు. మాక్రింద , కొంత మంది చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ లు, వారి క్రింద అకౌంట్స్ ఆఫీసర్ లు, యిలా ఎంతో మంది వుండే వారు. మేము అందరమూ లెక్చర్లు యివ్వాల్సిన వారమే.
వచ్చిన గొప్ప చిక్కు ఎక్కడంటే, ట్రైనింగ్ కు వచ్చిన వారు, మాకందరిలో వొక జూనియర్ మోస్ట్, అంటే, వొక జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గారి లెక్చర్ చాలా బాగుందని, మా, అంటే, DGM గారి లెక్చర్ బాగు లేదని రాసేయచ్చు. అంతెందుకు. చీఫ్ జనరల్ మేనేజర్ గారి లెక్చర్ కూడా బాగు లేదని రాసేయచ్చు. అంటే, యిది ఏదో, ఆఫీసుల్లో, పైళ్ళలో, మనం ఏదో రాసెయ్యడం, మన అభిప్రాయాలు, మన నిర్ణయాలు చెప్పడం లాంటి పని కానే కాదు. మేము చెప్పే విషయాలు - వినే వారికి నచ్చిందా లేదా అన్నది - వినే వారు మాకు చెప్పాలి. అందు లోనూ, లిఖిత పూర్వకంగా. మాకు మార్కులు కూడా వెయ్యాలి . మార్కులంటే మజాకా! ప్రతి వొక్కరికీ ఎక్కువ మార్కులు తీసుకోవాలని తాపత్రయం వుంటుంది కదా ! కనీసం క్రింద వారికంటే - మనకు ఎక్కువ రావాలని వుంటుంది కదా . మార్కులు వేసే వాడు , ఎందుకు, ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తాడో - చెప్పడం చాలా కష్టం .
డ్రెస్, మాట్లాడే తీరూ, జోకులు వెయ గలిగే నేర్పూ , ఎదుటి వారిని సంభాషణలో పెట్టడం, వారిలో ఇంటరెస్ట్ , ఉత్సాహం రేకెత్తించడం, మాట్లాడాల్సిన సబ్జెక్టు లో పూర్తి అవగాహన, మనకు యివ్వ బడిన సమయం లో ఏది చెప్పాలో, ఏది విడిచి పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో, ఎలా ముగించాలో - యిలా ఎన్నో విషయాలు మనకు తెలియాలి . అంటే - వొక లీడర్ కు వుండ వలసిన సర్వ లక్షణాలు, వొక లెక్చరర్ కు కూడా వుండాలి.
ఇంతే కాదు. ఏది మాట్లాడ కూడదో - అదీ బాగా తెలిసుండాలి . మీరు ఎంత బాగా మాట్లాడినా, మాట్లాడకూడని మాట వొకటి మాట్లాడితే చాలు - మిమ్మల్ని అంచనా వేసే వాళ్ళు , ఆ వొక్క మాటపై మాత్రమే మిమ్మల్ని అంచనా వేస్తారు. గిన్నెడు పాలలో వొక్క చుక్క విషం కలిస్తే , పాలంతా విషమైన మాదిరి. ఇవన్నీ నాకు పూర్తిగా అర్థం కావడానికి - దాదాపు వొక సంవత్సరం పట్టింది . ఇవేవీ అర్థం చేసుకోకుండా, ఎన్నో సంవత్సరాలు లెక్చర్లు యిచ్చే వాళ్ళు కూడా ఎంతో మంది వున్నారు. నిజానికి - యివన్నీ ప్రతి మనిషికీ తెలియాల్సిన విషయాలు . వీటిని గురించి ముందు ముందు ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం వుంది.
కానీ, నా సర్వీసులో యిన్నాళ్ళూ, మూడు దశాబ్దాలకు పైగా, నేను చేసిన పని పైళ్ళలో రాయడమే. మరి, యిప్పుడు మాట్లాడాలి . అందునా వొక ముప్ఫై మందైనా ఆఫీసర్లు ట్రైనీలు గా వున్న, వొక అధునాతన క్లాస్ రూము లో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల తో బాటు, ప్రపంచం లో వున్న సరి క్రొత్త విషయాలు, వాటిలో యిప్పుడు వస్తున్న మార్పులు - సభికులకు నచ్చే విధంగా, వారిని మెప్పించే విధంగా మాట్లాడాలి.
మా బాసు ఎలాంటి వారంటే - యిప్పుడు హార్వర్డ్ , ఆక్స్ ఫర్డ్ లో చెబుతున్న విషయాలు కూడా తెలుసుకుని చెప్పాలంటారు . అదీ, వారికిష్టం. వారి పేరు చివర, పెద్ద డిగ్రీల తోక వుంది. మా మరో DGM గారు కూడా యింజనీరు, MBA. నేనొక్కడే ఉత్త MA ఎకనామిక్స్. మరెలా? ఎలా ఏమిటి ? చెయ్యాలి. వారి కంటే బాగా చెయ్యాలి . కనీసం వారితో సమానం గా చెయ్యాలి. ఎలా?

యిదీ నాకు వచ్చిన ఛాలెంజ్ . నేను MBA చెయ్య లేదు కానీ వారికంటే బాగా, MBA లో రాని పాఠాలు కూడా, చెప్పి, వచ్చే వారిని మెప్పించాలి. నిజానికి , యిప్పుడు ట్రైనింగ్ వింగ్ కు నేను బాసు. ట్రైనింగ్ ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎవ్వరు, ఏ పాఠాలు చెప్పాలో, ఏ ట్రైనింగ్ లో వచ్చే వారిని ఎలా ఆకర్షించాలో, ఎలా ఎక్కువ మంది వచ్చే లాగా చెయ్యాలో -అన్నీ నేనే ప్లాన్ చెయ్యాలి . వాటిని జరిపించాలి. మరో DGM గారు, CGM గారు, నా ప్లాన్ ను చూసి , సూచనలిచ్చి , ఆమోదం తెలిపే వారు మాత్రమే.
యింతే కాదు . మిగతా అందరి కంటే, నేను బాగా చెప్పాలి. మిగతా అందరూ కూడా బాగా చెప్పేటట్టు, వారికీ సూచనలివ్వాలి . అంటే - వారి సబ్జెక్టు కూడా నాకు బాగా తెలిసుండాలి.
అప్పటికి మా కుటుంబ సభ్యులు యింకా హైదరాబాద్ రాలేదు. నేనూ, మా అకాడెమీ లోనే, వొక రూములో వున్నాను, యింకా క్వార్టర్స్ దొరక లేదని. అందుకని, వీలయినంత సమయం, మా లైబ్రరీ లో, పుస్తకాల వేట - చదువులతో గడప సాగాను . ఆఫీసు సమయంలో - కంప్యూటర్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లు ఎలా సిద్ధం చెయ్యాలో, వెయ్యాలో - బాగా నేర్చుకున్నా. PA పైన ఆధార పడకుండా చెయ్య గలిగితే , మన మనో భావాలకు అనుగుణంగా తయారు చెయ్య వచ్చు గదా; అందుకని. నా మొట్ట మొదటి లెక్చర్, "కమ్యూనికేషన్ స్కిల్స్" - గా నేనే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే - నాకు లేని స్కిల్ ముఖ్యంగా అదే కదా, అని. అందుకని, దాదాపు 40-50 గొప్ప పుస్తకాలు చదివాను. చదవగా, చదవగా, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత కష్టమైనదో; కానీ, మన జీవితం లోని ప్రతి రంగంలోనూ, ఎంత ముఖ్యమైనదో తెలిసి వచ్చింది . పుస్తకాలు చదివి, చదివి, నాకు నచ్చిన అన్ని విషయాలు రాసుకున్నాను . అది హనుమంతుడి తోక లాగా పోతోంది .
వొక ప్రెజెంటేషన్ 250 స్లైడ్స్ తో తయారు చేశాను. అంటే, గోడ మీద వున్న స్క్రీన్ లో పడేది వొక్క స్లయిడ్ అన్న మాట - అలా 250 స్క్రీన్లు తయారు చేశాను. పుస్తకాల్లో వున్నవి, నేను చదివినవి అన్నీ చెప్పేయాలన్నది - నా తాపత్రయం . అప్పుడు - ఈ క్లాసుకు వున్న సమయం, వొకటిన్నర ఘంటలు.
నేను చెప్పాల్సిన రోజు రానే వచ్చింది. కానీ నేను యింకా సంసిద్ధుడు కాలేదు. కాకపోతే - తరువాత ఎప్పుడో తెలిసి వచ్చింది - మనం ఎప్పుడూ, ఏ గొప్ప విషయం లోనూ, పూర్తిగా సంసిద్ధులు కాలేమని . దూకితే కాని యీత రాదు - ఎన్ని పుస్తకాలు చదివినా. దూకాలి. దూకాను.
ఆ రోజు గోడ మీది స్క్రీన్ పై స్లయిడ్ ఫోకస్ చేసి చెప్పడం ఆరంభం చేసాను. ఎప్పుడు, గోడ చూస్తున్నానో , ఎప్పుడు సభికులను చూస్తున్నానో, నాకు తెలీదు . వొక్కొక్క స్లయిడ్ కు ఎంత టైం తీసుకున్నానో కూడా తెలియడం లేదు. వొకటిన్నర ఘంట అయ్యే లోపు, 20 స్లయిడ్ లు కూడా పూర్తి కాలేదు. నేను ప్రిపేర్ చేసింది 250 స్లయిడ్లు. చిట్ట చివర - వొక 5 నిముషాలు, చెప్పినవి టూకీగా మరో సారి చెప్పి నా మనసులోని విషయాలు మరో రెండు చెప్పి ముగించాను. నాకు ఏ మాత్రము సంతృప్తి గా లేదు . మనసులో, అయ్యో, ఏమీ చెప్ప లేదే - అన్న గుబులు. వచ్చిన వారిని అడిగాను. మీకెలా వుందని. వారు చాలా బాగుందన్నారు . యిది వరకు ఇలాంటి లెక్చర్ వినలేదన్నారు . వారిచ్చే మార్కులు కూడా బాగానే యిచ్చారు . కానీ, నాకు ఏ మాత్రమూ సంతృప్తి గా లేదు. 250 స్లయిడ్ లలో, 20 చెప్పి ముగిస్తే , సంతృప్తి ఎలా వస్తుంది?
అప్పుడు - వొక్క విషయం అర్థమయ్యింది . వచ్చిన వారికి నేను చెప్పిన విషయాలే తెలుసు కానీ, నేను చెప్పని విషయాలు ఏవి అన్నది తెలియదు - అని. నా నెక్స్ట్ లెక్చర్ కు 3 గంటలు టైం తీసుకుంటే బాగుంటుందేమో - అనుకున్నా. అది మరో నెల తర్వాత వస్తుంది . మా మరో DGM గారిని సలహా అడిగాను . యిద్దరం వెళ్లి CGM గారినీ అడిగాము, ఆయన 3 ఘంటలు తీసుకోమన్నారు. కానీ కొన్ని సూచనలిచ్చారు. సభికులను, అప్పుడప్పుడూ, ఏదైనా ప్రశ్నలు అడగమన్నారు . ఇంటరాక్టివ్ గా - అంటే, మీరూ వాళ్ళతో మాట్లాడాలి; వారూ మీతో మాట్లాడుతూ వుండాలి - అని . యిలా కొన్ని సూచనలు . సరే . అన్నాను. మా మరో DGM గారు అన్నారు - నేను, ఇక్కడికి వచ్చిన ఆరు నెలల తర్వాతనే, నా మొదటి క్లాస్స్ తీసుకున్నా. మీరు, ఎందుకు తొందర పడుతున్నారు - అని. కానీ , నాకు మాత్రం - ఆలస్యం చెయ్యడం లో ఏ ప్రయోజనం కనిపించ లేదు.

మా అకాడమీ కు, మా BSNL కంపెనీ లోని - అంటే దేశం మొత్తం లోని, అన్ని ప్రాంతాల నుండీ , చిన్న అఫీసర్ల నుండి, చాలా పెద్ద, చాలా సీనియర్ ఆఫీసర్లు వరకు,అందరూ వస్తారు. చాలా సీనియర్ ఆఫీసర్లు వచ్చినప్పుడు,వారికి, DGM లు, CGM గారు ఎక్కువగా క్లాసులు తీసుకోవాలి. మిగతా వారు తక్కువ క్లాసులు, అవీ, అంత ముఖ్యం కానివి తీసుకోవాలి - యిలా వొక ఆనవాయితీ వుంది . నా కమ్యూనికేషన్ స్కిల్స్ - చాలా ముఖ్యమైన క్లాసు - అని నాకు తెలిసింది . అంతే . ఈ పెద్ద, పెద్ద ఆఫీసర్లు వచ్చే సమయంలో నేను ఎలా చెప్పాలి - అన్నది, నా మనసులో ప్రశ్న .
అప్పుడు అనుకున్నా - ఈ విషయంలో ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చెయ్యాల్సిందే - అని. వొక రోజు వార్తా పత్రికలు చదువుతూ వుంటే -అందులో - కొంత మంది రాజకీయ నాయకులు, మినిస్టర్లు తప్పులు తడకలు గా చెప్పిన కొన్ని విషయాలు కనిపించాయి. అలా వెదుకుతూ వెడితే , ప్రపంచ చరిత్రలో - ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనందు వల్ల - అంటే, మాట్లాడ కూడనివి మాట్లాడడం వల్ల వచ్చిన ఉపద్రవాలు, మాట్లాడ వలసినవి మాట్లాడక పోవడం వల్ల వచ్చిన పరిణామాలు ఎన్నో, ఎన్నో తెలిసాయి . అవి నాకు చాలా బాగా అనిపించాయి.
ఆ తరువాత, ప్రపంచ చరిత్రలో అతి గొప్ప భాషణలు (స్పీచ్ లు) - ఎందుకు గొప్పవయ్యాయో - బాగా పరీక్ష చేసి - అందులోని, కొన్ని ముఖ్యమైన వాక్యాలను ఎంచుకున్నాను .అందులో అమెరికా ప్రెసిడెంట్లు మాట్లాడినవే ఎక్కువ వున్నాయి. వారు చాలా గొప్ప వక్తలు, చాలా గొప్ప మేధావులు, చాలా గొప్ప లీడర్లు అని తెలుస్తుంది. మన దేశంలో, గాంధీ గారి మాటలే - చాలా బాగున్నాయి . గాంధీ గారి తరువాత , మనుషులను, మనసులను , హృదయాలను అలా కదల్చ గల నాయకులు రాలేదనే చెప్పవచ్చు . యిప్పుడిప్పుడు - నరేంద్ర మోడీ గారు మెల్ల మెల్లగా అలా తయారవుతున్నారని చెప్పవచ్చు . అమెరికా లో అలా కాదు . అక్కడ ఎంతో మంది వున్నారు, దేశానికి ప్రెసిడెంట్ కాగల పూర్తి అర్హత వున్న వారు. దేశాన్ని, అభ్యుదయ పథంలో, తీసుకెళ్ల గలిగిన వారు ; ప్రజలను , తమ మాటలతో , చేతలతో, వొక్క ఊపు వూపగలిగిన వారు; తమ వెనుక తీసుకెళ్ల గలిగిన వారు - ఎంతో మంది వున్నారు .
ఎవరో వొక శత్రువును చూపి, అదుగో, అతడే మన పతనానికి, దుస్థితికి కారణం , పదండి, అతన్ని ఎదుర్కొందాం - అని చెప్పి, వేల మందిని కదనానికి తయారు చెయ్య వచ్చు. కానీ - ఎవరినీ ద్వేషించ వద్దు, యిదీ, మనకు కావలసినది,యిలా సాధిద్దాం, రండి - అని పిలిస్తే, సాధారణంగా ఎవరూ రారు. పగ, ద్వేషంతో, కొట్టుకోవడానికి వొకటైనట్టు , మనుషులు మంచి పనులకు వొకటి కావడం చాలా కష్టం. ద్వాపర యుగం లో కూడా చూడండి. కోట్ల మంది వొక్క చోట కూడడం ఎలా సంభవించింది ? యుద్ధం చేద్దాం, అంటే - వచ్చారు, కానీ, దేశాన్ని బాగు చేద్దాం - అంటే వచ్చారా? రారు గాక రారు. రామాయణం లోనూ అంతే. ప్రపంచ యుద్ధాల్లోనూ అంతే. వొక మంచి పని కోసం, ప్రజలను వూప గలిగిన శక్తి, గాంధీ గారి లాంటి బహు కొద్ది మందికే వుంది. పని చెయ్యొద్దు - స్ట్రైక్ చెయ్యండి అని చెప్ప గలిగే కార్మిక నాయకులు , చేయించ గలిగే కార్మిక నాయకులు, మీరు బాగా పని చెయ్యండి - అని చెప్ప గలరా? చాలా కష్టం . నాకు తెలిసి, స్ట్రైక్ చెయ్యించ గలిగే వారే కానీ పని బాగా చెయ్యండి అని చెప్పే కార్మిక నాయకులు చాలా, చాలా తక్కువ మన దేశంలో. నేను, యిది చాలా మంది కార్మిక నాయకులను అడిగాను కూడా. వారి జవాబు, స్ట్రైక్ చేయించడం మా పని; హక్కుల కోసం పోరాడడం మా పని. పని చేయించడం యాజమాన్యం పని, అని . కొంత మంది కార్మిక నాయకులు తమ పనిని మాత్రం బాగా చేసేస్తారు. కొంత మంది అదీ లేదు. యిదంతా ఎందుకు చెబుతున్నానంటే - ఏదైనా వొక BSNL లాంటి సంస్థను, లేదా, వొక రాష్ట్రాన్ని , లేదా వొక దేశాన్ని బాగు చెయ్యాలంటే - నాయకుడికి , ఆ సంస్థ యొక్క బలమూ , బలహీనతా రెండూ తెలిసుండాలి. బలాన్ని పెంచడం ఎలాగో, బలహీనత తొలగించడం ఎలాగో తెలిసుండాలి. దీనికి, SWOT అనాలిసిస్ - అని వొక పధ్ధతి వుంది. నేను వొక సంవత్సరం తరువాత ఎప్పుడో యిదీ చేశాను. BSNL కు, నాకు, మా అకాడెమీ కి, మన దేశానికి - అన్నిటికీ చేశాను . ఆ పధ్ధతి నాకు చాలా బాగా నచ్చిన పధ్ధతి.
సరే . నా మొదటి లెక్చర్ నాకు ఏ మాత్రమూ సంతృప్తి యివ్వ లేదు. అసంతృప్తినే మిగిల్చింది. అయితే - అసంతృప్తి వున్న చోటే - అవకాశం వుంటుంది. ప్రయత్నం వుంటుంది. ఫలితమూ వుంటుంది. కొందరికి మాత్రం యివి లేకనూ పోవచ్చు . నరేంద్రుడికి వున్న అసంతృప్తి కారణంగానే , తరువాత కాలం లో వివేకానందుడయ్యాడు. గాంధీ గారి అసంతృప్తి కారణం గానే స్వరాజ్యం వచ్చింది . అయితే - అసంతృప్తి ప్రగతి పథం లో వుండాలి. నా పరిస్థితి కి మరెవ్వరో కారణం అనుకునే వారి అసంతృప్తి ప్రమాద కరమైనది.
యిప్పుడు - నా అసంతృప్తికి, కారణం నేనే, నా అసమర్థతే అని తెలుస్తూనే వుంది . యిప్పుడు నేనేం చెయ్యాలి ? అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ - అంటే ఏమిటి ? అసలా ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి? నాకు లేని స్కిల్స్ నేను మరొకరికి యివ్వగలనా? వారికి 3 గంటల లెక్చర్ యిస్తే - స్కిల్ వచ్చేస్తుందా ? మరి నేను చెయ్య వలసింది ఏమిటి ?
మా మరో DGM గారు ఏం చేస్తున్నారో , చూశాను . ఏదో పుస్తకాల్లో, ట్రైనీ ల కోసం యివ్వ బడిన - వొక 20 ప్రశ్నలు వుంటాయి; వాటికి ప్రతి దానికీ ఏదో నాలుగు సమాధానాలు వుంటాయి. వాటిలో - వారు తమకు సంబంధించినవి అనిపించేవి , టిక్ చెయ్యాలి . ఉదాహరణకు , క్రొత్త వారితో మాట్లాడాలంటే , మీరేం చేస్తారు ? భయ పడి పారిపోతారా; సిగ్గుతో తల వంచుకుని కూర్చుంటారా, మెల్ల మెల్లగా, భయం భయంగా మాట్లాడుతారా , హాయిగా, ఉత్సాహంగా మాట్లాడుతారా ? యిన్ని జవాబులు వున్నాయి . మీరు అందులో, ఏదో వొకటి , మీ స్వభావానికి అనుగుణంగా వున్నది టిక్ చెయ్యాలి.
20 ప్రశ్నలకు ట్రైనీలు రాసిన తరువాత లెక్చరరు గారు సరైన జవాబు చెబుతారు. మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో చెబుతారు. ఇది వారికి MBA లో, వారి లెక్చరర్లు చెప్పిన పధ్ధతి . పుస్తకాల్లో రెడీ మేడ్ గా వున్న పధ్ధతి. అది చెయ్యొచ్చు. బాగానే వుందనిపించింది. యిందులో లెక్చరర్ గారు కూడా హాయిగా అర గంట పైగా వూరికే కూర్చో వచ్చు. ట్రైనీ లు - ఆ అరగంటా ఏదో వొకటి యోచన చెయ్యాలి . ఏదో వొకటి టిక్ చెయ్యాలి. మళ్ళీ దాన్ని గురించి లెక్చరర్ గారు చెప్పేటప్పుడు సరి చూసుకోవాలి. వొకటిన్నర ఘంట లెక్చర్ సులభంగా గడిచి పోతుంది. అంతే కాక - యిందులో , లెక్చరర్ గారు, ట్రైనీ లను పరీక్ష చేసి, మీరు యింతే , అంతే , యిలా మారండి , అలా మారండి - అని ప్లేటు ఫిరాయించే వీలు కూడా వుంది.
అంతా మంచిదే, కానీ, నాకిది చాలదనిపించింది. దీన్లో, మరీ అంత పెద్ద ఉపయోగం కనిపించ లేదు. ట్రైనింగ్ వరకు బాగానే వుంటుంది . కానీ, నిజంగా వాళ్ల జీవితంలో ఏదైనా మార్పు తేవాలి. నా మూడు ఘంటల ట్రైనింగ్ ద్వారా , వారిలో ఏదో వొక ముఖ్యమైన మార్పు రావాలి. యిదీ నా ఆలోచన.
అప్పుడొక ముఖ్యమైన ఆలోచన తట్టింది. మొదటే వొకటిన్నర ఘంటలు , వారి నిజ జీవితం లో, వారి యింటిలో జరుగుతున్న, జరగవలసిన కమ్యూనికేషన్. రెండవ వొకటిన్నర ఘంటలు, వారి ఆఫీసుల్లో జరుగుతున్న , జరగవలసిన కమ్యూనికేషన్. ఇక, ఉత్త, పుస్తకాల్లో వున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ను పక్కన పెట్టి - మనకు, అంటే - ప్రతి మనిషికి , ముఖ్యంగా - మా ట్రైనింగ్ కు వచ్చే ట్రైనీ లకు , ఏది ముఖ్యంగా కావాలో - అది ఏమిటి? అన్న ఆలోచన ఆరంభం అయ్యింది.
యింట్లో - భార్యాభర్తల మధ్య, పిల్లలతో, తల్లిదండ్రులతో, యిరుగు పొరుగుతో - వచ్చే సమస్యలు, కమ్యూనికేషన్ స్కిల్స్ తో ఎలా తీర్చుకోవచ్చు? అలాగే - ఆఫీసుల్లో, క్రింది వారితో, పై వారితో సంబంధాలు , అంతకు మించి, వచ్చే కస్టమర్లతో, ఎలా మాట్లాడాలి? యిళ్లల్లో, ప్రతి వొక్కరికీ వున్న వొక సమస్య , ఆఫీసుల్లోని వొక సమస్య - కనీసం యివి ప్రతి వొక్కరికీ తీరితే - నా ట్రైనింగ్ సఫలమైనట్టే . యిప్పుడు - యిదీ నా ఆలోచన .
దీనిపై - నా బ్రహ్మాండమైన పరిశోధన ఆరంభమైంది. అయితే, దీనిపై యిప్పటి వరకు పుస్తకాలలో చదివిన కమ్యూనికేషన్ స్కిల్స్ లో - నాకు దొరికిన బలమైన అంశాలు తక్కువే. చాలా వరకు, ఆఫీసులకు, కస్టమర్లకు సంబంధించిన విషయాలే. అందునా, భారత దేశ పరిస్థితులకు, మన భాషలకు, మన వారి మనస్తత్వాలకు పూర్తిగా అనుగుణంగా లేవు . కాని, వాటిని పునాదిగా, నా లెక్చర్ మలుచుకోవాలి.
అప్పుడు మొదలైంది - నా ప్రయాణం - కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి, లైఫ్ స్కిల్స్ వైపు .
అది చాలా, చాలా ఎక్కువగా, నాకు నచ్చిన టర్నింగ్ పాయింట్ . నా నిజ జీవితంలో కూడా వొక పెద్ద మలుపు . మరో సారి , విశదంగా చూద్దాం .

యిప్పుడు సంస్కృతం లోని వొక శ్లోకం :
సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్;; న బ్రూయాత్ సత్యమప్రియం.
అర్థం : సత్యం
చెప్పాలి ; మనసుకు నచ్చే విధంగా చెప్పాలి ; మనసుకు నచ్చనిది సత్యమైనా
చెప్పవద్దు .... యిది మాత్రం చదివితే - మనం నిజంగా, చెప్ప వలసినవి కొన్ని
చెప్పక - తప్పు చేస్తాం . అప్రియమైన సత్యాలను, మీరే చెప్పాల్సిన సత్యాలను,
మీరు మార్చాల్సిన మనుషుల దగ్గర, చెప్పి తీరాలి . మిగతా వారి వద్ద వద్దు .
వున్మై ఏ పేసుగ (నిజమే చెప్పండి); నన్మై ఏ పేసుగ (మంచిదే చెప్పండి); అషగాగ పేసుగ (అందంగాచెప్పండి ); మనమరిందు పేసుగ (ఎదుటి వాడి మనస్స్థితి తెలుసుకుని దానికి అనుగుణంగా మాట్లాడండి ); అర్థం అరిందు పేసుగ ( మీరు మాట్లాడే మాటల అర్థం తెలుసుకుని మాట్లాడండి ); పలన్ అరిందు పేసుగ (చేస్తే తరువాత ఏమవుతుందో యోచించి మాట్లాడండి); సమయమరిందు పేసుగ (సరైన సమయం చూసి చెప్పండి); సబై అరిందు పేసుగ (చుట్టూ వున్న వారెవరో అర్థం చేసుకుని మాట్లాడండి); పేసాదిరుందుం పషగుగ (మాట్లాడకుండా వుండడం కూడా అలవాటు చేసుకోండి);
తెలుగులో :
ఎప్పటికెయ్యది ప్రస్తుత; మప్పటికా మాటలాడి అన్యుల మనముల్; నొప్పింపక తానొవ్వక ; తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ ;
యింతకు మించి కమ్యూనికేషన్ స్కిల్స్ వుందంటారా ?
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి