22, మార్చి 2012, గురువారం

నందన నామ సంవత్సర ఉగాది - మీరు ఏ రాశి వారైనా - మీకు నందనంగా వుంటుంది - ప్రకృతి మనకు దేవుడైతే ప్రకృతికి మనం దేవుడు కావాలి

నందన నామ సంవత్సర 

ఉగాది పండుగ నాడు 

( 23  . మార్చ్ -2012  )

చదువరులందరికీ 

మా శుభాకాంక్షలు

 

ఉగాది పండుగ జీవితం లోని షడ్రుచుల కలయికకు చిహ్నం.

అన్ని రుచులనూ, తెలుగు వారమైన మనం, సంతోషంతో, సహృదయంతో, స్వీకరించాలని మరొక్క సారి తెలియజెప్పే - పండుగ.

ఈ సంవత్సరం పేరు నందన నామ సంవత్సరం.

అందరం సంతోషం గా వుండ గల, వుండ వలసిన సంవత్సరం. 

సూర్యుడు, వరుణుడు, వాయువు, భూమి. ఆకాశము

ఈ పంచ భూతాల పట్ల మనం స్నేహ భావం వుంచితే

అవీ మన పట్ల స్నేహ భావంతో 

మనకు కావలసిన

ఆయురారోగ్య ఐశ్వర్యాలను 

సంతోషాన్ని 

ఇస్తాయని 

మన ఋషులు ఎప్పుడో చెప్పారు.

చెట్లను, నీటి ప్రవాహాలను,  భూమిని, గాలిని

మన పరిసరాలను

పరిశుద్ధంగా వుంచుకుంటే చాలు.

మనలోని సంతోషం మరింతగా

పెరుగుతుంది

ప్రకృతి మనకు దేవుడైతే  

ప్రకృతికి మనం దేవుడు కావాలి

మీరు ఏ రాశి వారైనా

నందన నామ సంవత్సరం 

మీకు నందనంగా వుంటుంది

అభినందనంగా వుంటుంది.

= హృదయపూర్వక

అభివాదములతో

మీ

వుప్పలధడియం విజయమోహన్   

        

 

 

 

 

 

  

1 కామెంట్‌: