మనుషుల్లో మూడు రకాలు - దీర్ఘ దర్శి; సమయోచిత ప్రజ్ఞుడు; మంద బుద్ధి ; దీర్ఘ దర్శి జీవితాన్ని మధిస్తాడు. జీవిత సత్యాలను దర్శిస్తాడు. జీవితంలో విజయం సాధిస్తాడు ; ఎలా? చదవండి మరి. (From the Author of "Comprehensive Treatise on Patanjali Yogasutras"
22, మార్చి 2012, గురువారం
నందన నామ సంవత్సర ఉగాది - మీరు ఏ రాశి వారైనా - మీకు నందనంగా వుంటుంది - ప్రకృతి మనకు దేవుడైతే ప్రకృతికి మనం దేవుడు కావాలి
లేబుళ్లు:
ఉగాది,
నందన,
శుభాకాంక్షలు
21, మార్చి 2012, బుధవారం
మీరు దేవుడుగా మారగలరు తెలుసా?= మారండి మరి.
దైవం మానుష రూపేణ - అంటారు. దేవుడు వస్తే - మనిషి రూపంలోనే వస్తాడు.
నెత్తి మీద కిరీటం, నెమలి పింఛం పెట్టుకుని రాడు. లేదా అర్ధనారీశ్వర రూపంలో, ఎద్దు వాహనం పైన కూర్చొని రాడు.
వస్తే, మీ లాగే వస్తాడు.
నిజానికి మీరు - దేవుడు కావచ్చు. చాలా సులభంగా. కావాలి - నిజంగా.
దేవుడు ఏం చేస్తాడు -సాధారణంగా?
మీరు విత్తనం నాటితే - దానికి నీళ్ళు పోస్తే, ఎరువు, మందులు వేస్తే - దేవుడు భూమిలోని ప్రాణశక్తిని, విత్తనంలోని ప్రాణ శక్తిని కలిపి - మొలకెత్తిస్తాడు. ఆ మొలక - నీళ్ళను, భూమి నుండి కావలసిన శక్తిని, సూర్యరశ్మి లోని శక్తిని తీసుకుంటూ పెరుగుతుంది. పెరిగేది మొలకే. ప్రతి విత్తనం లోనూ - సరైన భూమిలో నాటి నీళ్ళు పోస్తే - మొలకెత్తి చెట్టుగా మారగల అన్ని శక్తులూ వున్నాయి.
దానికి కావలసిన ప్రాణ శక్తిని - దేవుడు సూర్య రశ్మిలోను, భూమి లోనూ పెట్టనే పెట్టాడు.
మామిడి విత్తనం (మొట్టె ) నాటితే మామిడి మొలక వస్తుంది. పెరిగి, మామిడి చెట్టవుతుంది. యిందులో - మీరు చేసే పని వొక్క శాతం మాత్రమే. మిగతా పని 99 శాతం దేవుడు చేస్తున్నాడు. మీరు చెట్టు జీవితంలో - వొక్క శాతం సమయంలోనే - చెట్టుతో వుంటున్నారు. మిగతా 99 శాతం సమయం దేవుడే చెట్టుతో బాటు వుంటున్నాడు.
మీ చుట్టూ వున్న ప్రపంచంలో అంతర్లీనంగా - మీరు చేసే ప్రతి పనికీ - తోడు పడ గల సామర్థ్యం వుంది. మీరు వొక మంచి పని వైపు, వొక సృష్టి కార్యక్రమం వైపు - వొక్క అడుగు వేస్తే - మరో 99 అడుగులు - మీ చుట్టూ వున్న ప్రపంచంలో గల దైవ శక్తీ మిమ్మల్ని తన వెంట తీసుకు వెడుతుంది.
దీన్ని - యిప్పుడు - పాశ్చాత్య దేశాలలో - లా ఆఫ్ అట్రాక్షన్ - అని అంటున్నారు.
మీ నిస్స్వార్థ పనులకు - మీ చుట్టూ వున్న ప్రపంచం తోడుగా నిలుస్తుంది - అన్నదే దీనికి అర్థం.
మీ స్వార్థ పూరిత పనులకు అటువంటి తోడు వుండదు.
కానీ - మీ స్వార్థ పూరిత పనులలో కూడా వొక్కో సారి - ఎంతో పరోపకారం జరుగ గల విషయాలు వుంటాయి . వాటికీ - ప్రకృతి తోడు పడుతుంది - కొంత వరకు. ఉదాహరణకు - మీరు వొక ఫాక్టరీ పెట్టారనుకోండి. మీకు అందులో - కోట్ల లాభం రావచ్చు. కానీ - వెయ్యి మందికి ఉద్యోగాలు కూడా రావచ్చు కదా. యిది పరోపకారమే కదా. యిటువంటి వాటికీ - ప్రకృతి సహాయం వుంటుంది.
మితి మీరిన స్వార్థానికి, పర-అపకార పనులకు ప్రకృతి తోడు వుండదు.
యిదే లా ఆఫ్ అట్రాక్షన్. ప్రకృతిని - మీరు, మీ నిస్స్వార్థ, ప్రేమైక భావనలతో ఆకర్షిస్తారు. అంటే - మీలో వున్న దేవుడు, మీ చుట్టూ (ప్రకృతిలో) వున్న దేవుడితో - ఏకమై - సృష్టి కార్యాన్ని, సాగిస్తారు.
మీ నిజ జీవితంలో మీరూ దేవుడు కావచ్చు. తప్పకుండా కావాలి.
మనమంతా - వొకరికొకరు దేవుడు కావాలి. యిది శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఈ మధ్య అన్న మాటలు.
అయితే - ఈ సిద్ధాంతాన్ని - 8 ఏళ్ళ క్రితమే - హైదరాబాదులో - మరెన్నో స్థలాలలో - నేను నా వర్క్ షాపుల్లో - ప్రతి వొక్కరికి చెప్పే వాడిని. యిది ఎలా చెయ్యొచ్చో - అనేక రకాలుగా చర్చించే వాళ్ళం.
మీ భార్యకు (లేదా భర్తకు) - మీరు మొట్ట మొదటి దేవుడు కావాలి. యిది పాత సిద్ధాంతమే. యింట గెలిచి, రచ్చ గెలవాలి.
వారి ఆరోగ్యానికి, సంతోషానికి, మీరు సంపూర్ణ బాధ్యత తీసుకోవాలి.
వారు వొక్క అడుగు వేస్తే చాలు. మిగతా 99 అడుగులు మీరు నడిపించాలి. ప్రతి విషయం లోనూ.
మీ తండ్రికి, తల్లికి కూడా అలాగే - మీరు దేవుడు కావాలి.
ఆడవారయితే - మీ మెట్టినింట్లో వున్న వారికి మీరు దేవుడు కావాలి.
అలా కాదు. నేను కూడా మా పుట్టినింట్లో వారికి దేవుడు గా వుంటాను గానీ - మెట్టినింట్లో వారికి వుండను - అన్నారనుకోండి. మీరు అక్కడా వుండ లేరు. ఇక్కడా వుండలేరు. ముఖ్యంగా మీ భర్తకు దేవుడుగా వుండలేరు.
మనం వున్న చోట, వుండాల్సిన చోట - చుట్టూ వున్న వారికి దేవుడుగా వుండాలి.
చుట్టూ వున్న వారి బాధ్యత మీరు తీసుకోవాలి. అంటే - వారు చేయాల్సిన పనులన్నీ మీరు చేయాలని కాదు.
వారి జీవితంలో సంతోషానికి, వారి అభివృద్ధికి - మీరు తెర వెనుక కారణంగా వుండాలి.
ఉదాహరణకు - మీ కొడుకు చదువుతున్నాడనుకోండి. మీ పని ఏమి? మీరూ చదవాల్సిన పని లేదు కదా.
కనీసం - మీరు టీ.వీ. చూడడం ఆపాలి. అది కూడా మీరు ఆపలేక పోతే - మీరు మీ కొడుకు జీవితంలో - దేవుడి పాత్ర ఎలా పోషిస్తారు? తనకు కావాల్సిన లైట్ , ఫ్యాన్, టేబుల్ లాంటి సౌకర్యాలు - ఏం చేయ గలరో అవి చేయాలి. ప్రోత్సాహ కరమైన మాటలు మాట్లాడాలి.
మనిషికి, మనం మూడు రకాల సహాయం చెయ్యొచ్చు. మనసా, వాచా, కర్మణా. మొదట - మానసికంగా వారి మేలు కోరాలి. అది మాటలలో కూడా ప్రతిఫలించాలి. ఆ పైన, వారి మేలు కోసం, అభివృద్ధి కోసం - ఏమేం పనులు చేయ గలమో అవి చెయ్యాలి.
అయితే - వారే చెయ్యాల్సిన పనులు మీరు చెయ్య రాదు. అది దేవుడి పని కాదు. వారు చేసే ప్రతి పనికీ - తెర వెనుక సహాయం అందించాలి.
కొన్ని పనులు మాత్రం మీరే చెయ్యాలి. ఉదాహరణకు - మీ భార్యకు (లేదా భర్తకు ) - ఈ రోజు ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి. వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళాల్సింది మీరే. అదీ వెంటనే చెయ్యాలి. ఆమె (ఆయన) ఆరోగ్యం కుదుట బడే లాగు చెయ్యాల్సిన బాధ్యత మీదే.
భార్యకు భర్త, భర్తకు భార్య వొకరికొకరు సంతోష కారణం కావాలి. వొకరికొకరు దేవుడు కావాలి.
వొకరికొకరు దేవుడు కావడం కష్టమేమీ కాదు. మనసులో - "నేను" అనే అహంకారానికి బదులు - ప్రేమ, అభిమానం చోటు చేసుకోవాలి. అంతే.
వొకరికొకరు దేవుడు కావడం కష్టమేమీ కాదు. మనసులో - "నేను" అనే అహంకారానికి బదులు - ప్రేమ, అభిమానం చోటు చేసుకోవాలి. అంతే.
మాటలతో - ఎదుటి వారిని సంతోష పరచనూ వచ్చు. బాధ పెట్టనూ వచ్చు.
ఆడవారు, మగవారి కంటే - మూడు రెట్లు ఎక్కువగా మాట్లాడతారట. యిది - అమెరికా వాళ్ళ పరిశోధనల్లో తేలింది. మూడు రెట్లు హావ, భావ, అంగిక, వాచిక ప్రకటనల ద్వారా - తమ భావ ప్రకటన చేస్తారట.
ఆడవారితో పోలిస్తే - మగ వారు దాదాపు మూగ వారేనట. భారత దేశంలోనూ అంతే. ఎక్కడైనా అంతే.
యిది మంచా, కాదా. మంచి మాటలు మాట్లాడితే మంచే. చెడు మాట్లాడితే - చెడే.
ఆడవారు - ఎక్కువ మాట్లాడి - భర్తను, చుట్టూ వున్న వారిని సంతోష పెట్ట వచ్చు. అది వారికి పుట్టుకతో వచ్చిన విద్య. వొక చిన్న పాప - చాలా వరకి తల్లి మాటలను వినడానికే యిష్ట పడుతుంది. తల్లి - మాటలు తెలీని పాపతో దినమంతా మాట్లాడ గలదు. ఆ పాపకు తల్లి స్వరంలోని మధురిమ, ఆమె ముఖంలోని హావ భావ ప్రకటన ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆ పని ఏ మగవాడూ చెయ్యలేడు. అందుకే స్త్రీ స్వరాన్ని - కడవరకు - దేవుడు మధురంగానే వుంచాడు. ఆ స్వరాన్నుమ్ది - ఆమె తియ్యటి మాటలే మాట్లాడాలి.
అదిగాక, స్త్రీ - తన కరుకు మాటలతో, చుట్టూ వున్న వారిని చంపెయ్యనూ వచ్చు. పిచ్చి పట్టించనూ వచ్చు . ఆంగ్లంలో - "నాగ్గింగ్ " అనే మాట, దాదాపు, భార్యలు, భర్తలను తమ మాటలతో పెట్టే బాధలను ఉద్దేశించే చెప్పబడింది. స్త్రీల మనసులో - ప్రేమ లేకపోతే - ఈ నాగ్గింగ్ చోటు చేసుకుంటుంది.

అయితే - ఈ నాగ్గింగ్ చేసే భార్యలకు తాము అలా చేస్తున్నామన్న ఎరిక కూడా వుండదు. భర్తలను మాత్రమే కాదు. ఆడ వారికి - ఆడవారే శత్రువు - అని మొదటి నుండి వున్న మాటే. అత్త గారికి కోడలు, కోడలికి అత్తగారు, వారేగాక, యింటికి వచ్చే ఆడ బిడ్డలు కోడలికి, కోడలు వారికి శత్రువులు గా వుండటం - చాలా యిండ్లలో జరిగే విషయం. ఈ విషయాల్లో - ఎక్కడో కొన్ని ఇళ్ళలో తప్ప - మగవారికి ప్రమేయం వుండదు.
ఎక్కువ మాట్లాడటం వలన వచ్చే అనర్థం యిది అని దూరంనుండి చూసే వారికి అనిపిస్తుంది.
అయితే - "ప్రేమ లేని చోట మాట యీటెగా మారుతుంది" - అంటారు. మాట్లాడడం వలన కాదు - మనసులో - ప్రేమ, అభిమానం లేక పోవడం వలన వచ్చే అనర్థం యిది.
అత్త గారి పై అభిమానం వున్న కోడలు - అత్త గారిని దేవత గా చూసే కోడలు వున్న ఎన్నో యిళ్ళు వున్నాయి. అలాగే - కోడలిని కూతురి కంటే, కొడుకు కంటే - అభిమానంగా చూసే అత్త గార్లూ ఎంతో మంది వున్నారు. కాకపోతే వీరెవరూ - దురదృష్ట వశాత్తూ - యిప్పటి టీ.వీ. సీరియళ్ళకు పనికిరారు. చెడు చూడకు - అన్న స్థితి నుండి - చెడు మాత్రమే చూడు - అన్న స్థితికి జారిపోతున్నాము.
జీవితం అర్థమయితే - ప్రతి కోడలూ, ప్రతి అత్తా, వొకరికొకరు - దేవతగా వుంటారు. వుండాలి. ఎదుటి వారున్నారో లేదో ఎదురు చూడక - మీరు దేవుడుగా, దేవతగా వుండడం అలవాటు చేసుకోండి.
45 నుండి 90 రోజులలో - ఎదుటి వారూ - మీకు దేవుడుగా, దేవతగా తప్పక మారుతారు. యిది ప్రకృతి నియమం.
45 నుండి 90 రోజులలో - ఎదుటి వారూ - మీకు దేవుడుగా, దేవతగా తప్పక మారుతారు. యిది ప్రకృతి నియమం.
అప్పటికీ మారని జన్మాలు మనుషులే కాదు. రాక్షసులు గా వుంటారు.యిది చాలా, చాలా అరుదు.
మగ వారు తక్కువ మాట్లాడతారని అన్నాం. నిజమే. కాని, వారి వొక్కొక్క మాటా, ఆడవారి పది మాటలకు సమానంగా వుంటుంది. మంచైనా సరే. చెడైనా సరే.
వొక్క మాటతో, భార్యను మెప్పించ గల సమర్థత, పొంగిపోయేటట్లు చేయ గల శక్తీ - భర్త మాటలకు వుంది. కానీ - ఆ వొక్క మాట నోరు తెరిచి మాట్లాడాలి కదా. అలాకాక - వొక్క మాటతో - భార్యను నొప్పించడమే తన పని అనేటట్లు మాట్లాడే భర్తలు ఎందరో వున్నారు.
భర్తే దైవం - అనే పతివ్రతలు వున్న దేశం ఇది అని చెప్పుకుంటాము. అది సరి కాదు. భర్త, నిజంగా, భార్యకు దైవంగా వున్న దేశం యిది. భార్య మానప్రాణాలకోసం - తన్ను తాను త్యాగం చేసుకునే భర్తలున్న దేశం యిది. భార్యా పిల్లల సంతోషం కోసమే జీవించే భర్తలున్న దేశం యిది. ఈ రోజుకూ అంతే. తన యిళ్ళు, ప్రావిడెంట్ ఫన్డూ అన్నిటినీ పెట్టి పిల్లలని చదివించే వారు యిప్పుడూ వున్నారు కదా.

వొకరికొకరు దేవుడుగా మారేదేమీ ఈ దేశంలో క్రొత్త కాదు.
త్యాగం అక్కర లేదు. లోపల ప్రేమ, అభిమానం వుంటే - మీరు ఏమి చెయ్యాలో - ఏమేమి చెయ్య గలరో మీకే తెలుస్తుంది.
లోపలున్న ప్రేమ, అభిమానమే దేవుడు. అది లేక పోతే - లోపల దేవుడు లేదు. అంతే.
అది వుంటే - మీరూ మీ వారందరికీ దేవుడుగా మారగలరు. మారుతారు.
మారండి మరి.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
లేబుళ్లు:
మీరే దేవుడు తెలుసా?
20, మార్చి 2012, మంగళవారం
యోగా ఎందుకు? అది కష్టమా, కాదా? దాని వలన ఏం లాభం? దాని వలన లౌకిక లాభాలు పోతాయా?
మన మాట వినే మనసు మనకు పరమ మిత్రుడు. మన మాట వినని మనసు మనకు పరమ శత్రువు.
ఈ మాట అనింది శ్రీకృష్ణుడు. అర్జునుడితో - భగవద్ గీతలో.
గీతను మించిన మానసిక శాస్త్రము మరెక్కడా లేదు.
మన మనసు మన మాట వినదు. అది తానుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ వుంటుంది. ఏదేదో ఆలోచనలు చేస్తూ వుంటుంది. దానికి ఈ నిమిషం కోపం వస్తుంది. మరో నిమిషం సంతోషం. మరో నిమిషం ఎవరినో తలుచుకుని కుళ్ళుకోవడం. మరో నిమిషం, ఎవరినో తలుచుకుని పొంగి పోవడం - యిలా ఏదేదో చేస్తూ వుంటుంది.
యిదంతా మనమే చేస్తూ ఉన్నామని మనం భ్రమ పడుతూ వుంటాం. ఎందుకంటే - మనసు ఎక్కడికి వెళ్ళినా, మనల్ని కూడా లాక్కుని వెడుతూ వుంటుంది. మనసు చేసే ఆలోచనలు - మన శరీరాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తూ వుంటుంది. మనసుకు కోపమో, వైరమో ఎక్కువగా కలిగిందనుకోండి . మన శరీరంలో వొత్తిడి పెరిగిపోతుంది. మీకు రక్తపు పోటు ఎక్కువ కావచ్చు. మీ హృదయంపై వొత్తిడి పెరిగి మరేదో కావచ్చు. మీ శరీరంలోని చక్కెర శాతం పెరగొచ్చు. లివర్ పైనో, చర్మం పైనో, కిడ్నీ పైనో - ఈ వొత్తిడి - తన ప్రభావం చూపొచ్చు. వొక్కొక్కరికి హృదయపుపోటు - (హార్ట్ అటాక్) రావచ్చు. చాల రోగాలు మనసునుండే బయలు దేరుతాయనడంలో ఆశ్చర్యం లేదు. అవి మనల్నే కాదు. మనచుట్టూ వున్న వారిని కూడా ప్రభావితం చేస్తాయి.
మనసు గుణం - అది మన అధీనంలో వుండను - అని పట్టుదలగా వుండడం.
అర్జునుడు కృష్ణుడితో ఇదే మాట అంటాడు. నా మనసు నా అధీనంలో వుండనంటుందే - నేనేమి చేయ గలను, అని. శ్రీ కృష్ణుడు కూడా వొప్పు కుంటాడు. తరువాత మార్గాలు చెబుతాడు.
సరే. మీ మనసు మీ అధీనంలో వుందా, లేదా? కాస్త టెస్ట్ చేసుకోండి.
యిది కాస్త వినండి. ఆఫ్రికా లో వొక నల్లటి.....గొరిల్లా కోతి వుంది. దాని ఎత్తు ఆరు అడుగులు. అయితే - దాని తోక పొడవు కూడా ఆరు అడుగులే. తోక మాత్రం తెల్లగా వుంటుంది. కోతి మాత్రం చీకటి నలుపు. దాని కళ్ళు పెద్దవిగా..గోళాలు లాగా ... ఎప్పుడూ..ఎర్రగా వుంటాయి. దాని చెవులు చేట చెవులు...పెద్దవిగా..అవికూడా...తెల్లగా...తోక రంగులో వుంటాయి.. మరోసారి చదువుకోండి... నల్లటి ..గొరిల్లా..ఆరు అడుగుల ఎత్తు..ఆరు అడుగుల తెల్లటి తోక...అదే రంగు, పెద్ద (తెల్లటి) చేట చెవులు.. ఎర్రటి గోళాలు లాంటి కళ్ళు..
యిప్పుడు మీరు చేయాల్సింది చాలా సింపుల్. మీ కళ్ళు మూసుకోండి. అయిదు నిమిషాల పాటు... మీరు దేన్ని గురించైనా యోచన చేయ వచ్చు. ఆ వొక్క గొరిల్లా కోతిని గురించి తప్ప... మీ వూరి పెద్ద మనుషులు గురించి యోచన చేయండి. మీ భార్య / భర్త / పిల్లల గురించి యోచన చెయ్యండి. ఏదైనా సరే... మీరు ప్రేమలో పడి వుంటే..మీ ప్రియుడిని గురించో, ప్రియురాలిని గురించో.. ఎవరి గురించైనా సరే.. మీ ఇష్టదైవాన్ని గురించైనా సరే... మీరు యోచన చెయ్యండి వొక్క అయిదు నిమిషాలు... కాని - వొక్కటే మీరు యోచన చెయ్య కూడని విషయం.. ఆ వొక్క గొరిల్లా కోతిని గురించి తప్ప.
చేయండి మరి........అయిదు నిమిషాలు తప్పక చేయండి.
చేసారా... యిప్పుడు చెప్పండి..మీ మనసు మీ మాట వింటుందా... వినదు.
మీరు తెల్లారి లేచినప్పటి నుండి...తన రామాయణం మొదలు పెడుతుంది. మీ ప్రసక్తే లేదు...మీరు కావాలన్నా..వద్దన్నా.. ఎన్నో విషయాల గురించి ...యోచన చేస్తుంది..మీరు కావాలంటే.. మీకు నచ్చిన విషయాన్ని గురించి వొక్క నిమిషం లోపు..ఏదో కాస్త యోచనలు చేస్తుంది..కాని.. మధ్యలో..అది విడిచేసి..మరో విషయాన్ని పట్టుకుంటుంది... కోతి లాగా..వొక విషయం నుండి..మరో విషయానికి గెంతుతూ పోతూ వుంటుంది.. దానిపై..మీ కంట్రోలు ఏ మాత్రమూ లేదు. మీరు దాని కంట్రోలులో వున్నారనే విషయం మీకు అర్థమై పోతుంది.
కృష్ణుడి భగవద్ గీతా శాస్త్రమంతా - దీన్ని గురించే. పతంజలి యోగ సూత్రాలన్నీ - దీన్ని గురించే. మన మనసునెలా - మన అధీనం లోకి తెచ్చుకోవడం. సరే. మనసును, మన అధీనంలోకి తెచ్చుకుంటే - ఏమవుతుంది?
పిచ్చివాడా - అప్పుడే - నువ్వు నిజంగా ఎవరో, నీకు తెలుస్తుంది. అంత వరకు, నువ్వు, మనసు నిన్ను ఆడించే కోతి ఆటలు ఆడుతూ పిచ్చివాడిగా వుంటావు. మనసు నీ అధీనంలోకి వచ్చేస్తే - నువ్వు - నిరంతరం వుండే అమృత మూర్తి వనీ, ప్రపంచమంతా నిండి వుండే జ్ఞాన రూపుడివనీ.. నువ్వే..మహదానంద మూర్తివనీ తెలుస్తుంది.
ఆనందం మరెక్కడో వెదక నక్కర లేదు. అది నీలోనే వుంది. అది నువ్వే.
నీకు మృతి లేదు. నీకు లేని జ్ఞానము లేదు. నీకు లేని ఆనందం లేదు. నీనుండే - అందరికీ ఆనందం ఇవ్వొచ్చు.
ఆంగ్లంలో -సర్వ సమర్థత, సర్వజ్ఞత, సర్వత్వత - ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిషెంట్ - అంటారు - అది మీకు మెల్ల, మెల్లగా వచ్చేస్తుంది.
సంస్కృతంలో - సత్,చిత్, ఆనంద మూర్తి మీరే - అని అంటారు - యోగ శాస్త్ర వేత్తలు.
మరి యోగా గురువులందరూ చని పోయారు కదా? అని సందేహం వస్తుంది కదా. లేదు. వారికి మరణం లేదు. వారు వున్నారు. ఏ దేహాన్నయినా విడిచి పెట్టాల్సిందే. ఎవరైనా సరే. మరో దేహాన్ని తీసుకోవాలనుకుంటే - తీసుకోవచ్చు - యిది యోగులకు.
మనం - మరో దేహాన్ని తీసుకుని తీరాలి. ఎలాంటిది అనేది - మనం చేసే కర్మ ఫలాల పైన ఆధార పడి వుంటుంది. మనకు స్వతంత్రం లేదు. యోగులకు వుంది.
వారు సునాయాసంగా దేహం విడిచి పెట్టేస్తారు. సునాయాసంగా క్రొత్తది తీసేసుకుంటారు. లేదా - దేహం లేకుండా వుండి పోగలరు.
యోగా దేనితో ప్రారంభించాలి? ఆసనాలతోనా? ప్రాణాయామాలతోనా? రెండూ కాదు.
మహాత్మా గాంధీ గారు చెప్పిన అహింస, సత్యములతో ! గౌతమ బుద్ధుడు చెప్పినదీ అదే.
పతంజలి మహర్షి చెప్పింది అదే. ప్రతి వొక్కరి మనసుకు - ఈ అహింస, సత్యముల సాధన తో - వొక మహా గొప్ప శక్తి, పరివర్తన, శుద్ధత వస్తుంది.అక్కడి నుండి - యోగ సాధన - చాలా సులభంగా జరిగిపోతుంది.
మరి ఈ కాలంలో - నిజం చెప్పి బ్రదుకగలమా? కాస్త కష్టమైనా - ప్రయత్నం చేయాలి.
యిలా మరి కొన్ని నియమాలున్నాయి. తరువాత వస్తుంది - ఆసనాలు, ప్రాణాయామాలు. మొదటివి లేకున్నా - యివి కూడా , శారీరక, మానసిక ఆరోగ్యానికి - చాలా మంచివే. యివి - కాస్త సులభంగా చేయ గలిగేవి అవడం వలన - మాడెర్న్ గురువులు మొదట యివి చెబుతున్నారు. యిలా, యివి మొదట చేయడం తప్పని నేను చెప్పను. యివి చేస్తూ సత్య సాధన , అహింసా సాధన చెయ్య వచ్చు.
సరే. కొంత మంది - ధ్యాన సాధనకు ముందు - కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవీ మంచిదే.
ఉదాహరణకు - శ్వాస మీద ధ్యాస. మీరు సాధారణంగా, ఊపిరి పీల్చి, విడుస్తూ వుండండి. ఈ ప్రక్రియ మీ ప్రమేయం లేకుండానే మామూలుగా జరిగి పోతూ వుంటుంది. మీరు మరిచి పోవడం ఊపిరి పీల్చడం నిలిచిపోవడం జరుగదు. యోగ సాధనలో - ఈ ప్రక్రియ మీ శరీరంలో ఎలా జరుగుతూ వుందో కాస్త గమనిస్తూ వుండండి.
మీరు ఈ శ్వాస ప్రక్రియను చేయాలని చెప్పడం లేదు. సహజంగా జరిగే ఈ ప్రక్రియను మీరు గమనిస్తూ వుండండి కాస్సేపు. అది చాలు. అదే శ్వాస మీద ధ్యాస.
ఇదేమీ సులభం కాదు. మీ మనసు 10 సెకన్ల పాటు శ్వాస మీద వుంటే గొప్ప. తరువాత , అది ఎక్కడికో వెళ్లి పోతూ వుంటుంది. శ్వాస మీద ధ్యాస వదిలేసి - అది తనే చేయాలని మనసు చెబుతుంది. తరువాత మీరు కాస్త గట్టిగా ఊపిరి పీలుస్తారు.యిప్పుడు మీ మనసు శ్వాసను గమనించడం లేదు. శ్వాసను తను చేస్తూ వుంది. చేస్తూ, చేస్తూ, పక్క వాళ్ళేం చేస్తున్నారో అని చూస్తుంది. వారూ చేస్తుంటే - వాళ్ళు బాగా చేస్తున్నారా, మీరు బాగా చేస్తున్నారా - అనే విషయం పైన రిసెర్చ్ చేస్తూ కూర్చుంటుంది. వాళ్ళ కంటే మీరు బాగా చేయాలి. యిదీ యిప్పుడు ధ్యాస.
యిలా మనసు ఎక్కడికో వెళ్లి పోతూ వుంటుంది. సరే. కాస్సేపటికి, శ్వాస సంగతి వదిలేసి - వారి గుణగణాలను మీ గుణగణాలను రిసెర్చ్ చేస్తూ వుంటుంది. యింకా ఎక్కడెక్కడికి వెళ్లి పోతూ వుంటుందో - చెప్పలేం. కానీ అనూహ్యమైన చోట్లకు వెళ్లి వస్తూ వుంటుంది. అయినా, ఈ ప్రక్రియ చాలా మంచిదనే చెపాలి. మళ్ళీ, మళ్ళీ మనస్సును శ్వాస మీద పెట్టాలి. అది మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ వుంటుంది. మళ్ళీ, మళ్ళీ, దాన్ని వెనక్కు తీసుకు వచ్చి శ్వాస మీద పెట్టాలి.
అయ్యో, వెళ్లి పోయిందే - అని బాధ పడనవసరం లేదు. మళ్ళీ శ్వాస మీద ధ్యాస. మళ్ళీ, మళ్ళీ శ్వాస మీద ధ్యాస. అంతే.
పతంజలి చెప్పడం - శ్వాసను కాదు - డైరెక్టుగా - మీ మనస్సునే గమనించండి. దీన్ని ద్రష్టగా వుండడం, లేదా సాక్షిగా వుండడం అంటారు.
మీరు ఆలోచించరు.మీ మనస్సులో వచ్చే ఆలోచనలను అడ్డుకోరు. వద్దని చెప్పరు. వాటిని గమనిస్తూ వుంటారు. వాటి వెనుక మీరు పరుగెత్తరు . మీరే క్రొత్త ఆలోచనలను సృష్టించరు. ఆలోచనలలో - మీ ప్రమేయం వీలైనంత వరకు లేకుండా చూసుకుంటారు. గమనించడం, సాక్షిగా వుండడం - ద్రష్టగా వుండడం -యిదే మీరు ప్రాక్టీసు చేయాల్సింది.
ఈ - శ్వాస మీద ధ్యాస, మనసు పట్ల సాక్షీ భావం - మీరు ప్రయత్నించి చూడండి. రోజూ - కాస్సేపు, తెల్లవారి ఝామున, రాత్రి నిద్ర పోయే ముందు - వొక పది నిముషాల పాటు చేయండి. రాలేదనో, కాలేదనో నిరుత్సాహం వద్దు. దీన్లో ప్రయత్నమే ముఖ్యం. ఏదో వొక రోజు - మీకు తెలియకుండానే - మీకు వచ్చేస్తుంది. అంతే.
దీని వలన లాభమేమిటి? మీరు గమనించనంత వరకు - మనసు మిమ్మల్ని రక రకాలుగా ఆడిస్తూ వుంటుంది.
మీరు గమనించడం ప్రారంభిస్తే - అది మెల్ల మెల్లగా -నిజానికి చాలా మెల్లగా - తన తోక ముడుచుకుంటుంది. అనుకున్నంత సులభం కాదు. మీ మనసు వొక్కొక్క నిముషం మిమ్మల్ని తన వెంట లాగేస్తుంది. దానికి మీరు బాధ పడ నవసరం లేదు. అయ్యో అనుకోనవసరం లేదు. అది అలాగే జరుగుతుంది. మళ్ళీ, మళ్ళీ, ద్రష్టగా, సాక్షిగా మీ పని ప్రారంభించండి.
మీరు విక్రమార్కుడు, భేతాళుడి కథలు విన్నారు కదా. యివి మరేం కాదు. మీ, మీ మనస్సుల కథే.
విక్రమార్కుడు మీరు. భేతాళుడు మీ మనస్సు. పట్టు వదలని విక్రమార్కుడు మళ్ళీ, మళ్ళీ, చెట్టెక్కి, భేతాళుడిని తన భుజం పైన వేసుకుని స్మశానం వైపు తీసుకెళ్ళుతుంటాడు . విక్రమార్కుడు మాట్లాడరాదు. సమాధానం యివ్వ రాదు. అదీ నియమం. కానీ భేతాళుడు వదలదు. ఏదో కథ చెబుతాడు. కడపట ఏదో ప్రశ్న వేస్తాడు. సమాధానం తెలిసీ చెప్పక పోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది - అంటాడు. మరో మార్గం లేని విక్రమార్కుడు సమాధానం చెబుతాడు. అంతే. భేతాళుడు మళ్ళీ చెట్టెక్కి వెళ్లి పోతాడు. మళ్ళీ కథ మొదటికి.
అంతిమ విజయం విక్రమార్కుడిదే. అప్పుడు, భేతాళుడు తన మిత్రుడవుతాడు. ఎన్నో రకాలుగా సహాయం చేస్తాడు.
నిజానికి - యిది - మన, మన మనస్సుల కథే.పట్టు వదలని వారికి, మనస్సు వశమవుతుంది. మిత్రుడవుతుంది. ఎన్నో రకాలుగా సహాయమూ చేస్తుంది.
అప్పుడు - మీ నిజ స్వరూపం మీకు అర్థమవడం ఆరంభమవుతుంది.
యిందులో - అంటే - మీ ప్రాక్టీసు జరుగుతున్నప్పుడు కూడా - మీకు ఎన్నో రకాల లాభాలున్నాయి.
మనకు అర్థం కాకుండా - మనకు ఎన్నో రకాల మంచి జరగడం మనం గమనించొచ్చు.
యోగా చేసే వారి పట్ల ప్రకృతికి ఎంతో యిష్టం ఏర్పడుతుంది. వారికి ప్రకృతి ఎన్ని రకాలుగానో తోడ్పడడానికి ప్రయత్నిస్తుంది. యిది, యోగులకు కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది చాలా సార్లు.
మనుషుల్లో కూడా - చాలా మందికి - అంటే - యోగులకు దగ్గరైన వారికి - వారంటే - యిష్టం, పూజనీయ భావన ఏర్పడుతుంది. కానీ - దూరంగా వున్న మనుషులలో మార్పు అంత త్వరగా రాదు. రాకపోవచ్చు కూడా.
యోగా చేసే కొద్దీ - మీలో వున్న భయాలు పోతుంది. ఆనందం పెరుగుతుంది. ఆప్యాయత పెరుగుతుంది. ప్రేమ పెరుగుతుంది. అందరూ మీ వాళ్ళ లాగే కనిపిస్తారు. చాలా విషయాలు - మీరు అనుకునే లోగా జరిగి పోతూ వుండడం మీరు చూస్తారు.
యిదెవరో చాలా గొప్ప యోగులకు మాత్రమే జరుగుతుందనుకోకండి.

ప్రాక్టీసు మొదలు పెట్టిన కొన్ని వారాలు, నెలలలోనే - మీరు - ఈ పరిణామం మీ జీవితం లోనే చూడొచ్చు. అనుభవించొచ్చు.
మీ మనసు మీ మిత్రుడుగా మారడం మీకే తెలుస్తుంది. ప్రకృతంతా - మీ మిత్రుడుగా మారడం మీరు చూడొచ్చు. క్రమ క్రమంగా - మీ దగ్గర వున్న వారిలో - మీ పట్ల ఎంతో సదభిప్రాయం కలగడం మీరు చూడొచ్చు.
మీ మనస్సులో - ఎంతో ఆనందం, శాంతి కలుగుతూ వుండడం మీరు అనుభవిస్తారు. ఈ ఆనందానికి - ఏ డబ్బు గానీ, అధికారం గానీ, సెక్సు గానీ సమం కాదనేది - మీరు గ్రహిస్తారు. సరే. ప్రాపంచిక సుఖాలకు మీరు దూరమై పోతారా? అదేం లేదు. అవన్నీ మరింత ఆనందంగా అనుభవించ గల సామర్థ్యం మీకు వస్తుంది.
యిటువంటి ఆనందకరమైన మార్పులు మీ జీవితంలో రావాలని ఆశిస్తూ
= మీ
వుప్పలధడియం విజయమోహన్
లేబుళ్లు:
దాని వలన ఏం లాభం,
యోగా
13, మార్చి 2012, మంగళవారం
శ్రీ శ్రీ రవిశంకర్ - ఆర్ట్ ఆఫ్ లివింగ్ - ఏమన్నారు? - ఏం చేస్తున్నారు?
శ్రీ శ్రీ రవిశంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్
నాకు ఎంతో మంది గురువులంటే - చాలా యిష్టం.
ఇప్పుడున్న వారిలో - శ్రీ శ్రీ రవిశంకర్ ( ఆర్ట్ ఆఫ్ లివింగ్), శ్రీ జగ్గి వాసుదేవ్ (ఈశా ఫౌండేషన్ ), బాబా రాందేవ్, శ్రీ స్వామీ సుఖ బోధానంద , శ్రీ స్వామీ పరమార్థానంద - వీరు నాకు ముఖ్యులు. ఎందుకంటే - వీరి కోర్సులకు నేనూ వెళ్లాను గనుక. అంటే - వీరు నాకు ప్రత్యక్ష గురువులు. సరే. వీరు గాక, యిప్పుడు లేని వారిలో - చాలా మంది నాకు పరోక్ష గురువులుగా చెప్పుకోవచ్చు. ఆది శంకరాచార్యులు, స్వామీ వివేకానంద, ఓషో, రమణ మహర్షి, భగవాన్ బుద్ధ లాంటి మహానుభావులు - ఎందరో.
వీరందరూ -మహానుభావులే. వీరి ప్రసంగాలన్నిటినీ - నేను చదువుతూ వుంటాను. లేదా వింటూ వుంటాను. యివి గాక, కృష్ణ భగవానుడి గీత చదవి అర్థం చేసుకోవడం వొక గొప్ప అనుభవం.
యివి విన్న / చదివిన తరువాత - మనలో జరిగే పెద్ద మార్పు వొకటుంది.
జీవితంలో పరుగు కొద్దిగా నిలిపితేనే; దాని వేగం తగ్గిస్తేనే - జీవితానికి అర్థం తెలుస్తుందని - మనకు తెలిసిపోతుంది.
లేదంటే - తుది శ్వాస వరకు - అసలు జీవితమంటే ఏమిటో - అర్థం కాకుండానే గడిచి పోతుంది.
యిదేదో - హిందూ మతానికి సంబంధించింది - మతాలు మనకెందుకులే - అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే.
ఇవేవీ స్వర్గాన్ని గురించి పెద్దగా మాట్లాడవు. దేవుడిని గురించి కూడా మాట్లాడవు. అంతా మనల్ని గురించే; మన సాధారణ జీవితాన్ని గురించే మాట్లాడుతాయి. యిందులో - మనం అనుకునే లాగా - నమ్మకాలు లేవు. లేదా చాలా తక్కువ. అన్నీ - అనుభవైక వేద్యంగా - వొక నిర్దిష్టమైన సైన్సు లాగా మనం తెలుసుకునేవే.
చాలా మందికి - భారతదేశంలో - విగ్రహారాధన ఎక్కువ;మూఢ నమ్మకాలు ఎక్కువ - అనే అభిప్రాయం బలంగా వుంది. విగ్రహారాధన లేదని నేను చెప్పను. కానీ - ఆరాధించేది విగ్రహాన్ని కాదు. విగ్రహ స్వరూపాన్ని కూడా కాదు. అందులో వున్న భగవద్ తత్వాన్ని. మనకు దేవుడు కానిదేమీ లేదు. ప్రహ్లాదుడు చాలా స్పష్టంగా అన్నాడు - యిందు గలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు - అని.
భగవంతుడు, భూమిలో వున్నాడు. ఆకాశంలో వున్నాడు. నీళ్ళలో వున్నాడు. గాలిలో వున్నాడు. అగ్ని, సూర్య, చంద్ర,వరుణ, నక్షత్ర,గ్రహాలన్నిటిలో వున్నాడు. లేని చోటు లేదు.
సింహంలో, పాముల్లో, పందుల్లో, కూర్మంలో, నెమలిలో, పక్షులలో, కోతుల్లో, భల్లూకాలలో, అన్నిటిలో మనం భగవంతుడిని చూడటానికి ప్రయత్నిస్తాము. అణోరణీయాం, మహతో మహీయాం - అన్నట్టు - అణువు నుండి, మహదాకాశం వరకు కనిపించేవన్నీ, వినిపించేవన్నీ, అన్నీ భగవద్ స్వరూపమే. వీటన్నిటినీ మనం పూజిస్తాము. మనం కోతిలో చూసే హనుమంతుడు, పందిలో చూసే వరాహావతార విష్ణుమూర్తి, పాముల్లో చూసే ఆదిశేషుడు - అన్నీ వొకటే. భిన్నత్వంలో - ఏకత్వము - అనే మాట - మన సంస్కృతి నుండి పుట్టింది.
భిన్నంగా కనిపించే ప్రపంచంలో ఏకత్వాన్ని చూడగలగాలి.అదే జ్ఞానోదయం.
అర్జునుడికి, కృష్ణుడు, విశ్వరూప సందర్శనం ప్రసాదించాడని మనం చదువుతాము. అంటే ఏమిటి?
ప్రపంచమంతటా తనే ఉన్నాడని చూడటం, అర్థం చేసుకోవడం. అదేదో కొత్త, పెద్ద రూపాన్ని చూపడం కాదు.
అలాగే - శివ తత్వము, విష్ణుతత్వము, బ్రహ్మ తత్వము వేరు కాదని తెలపడం. శంకరాచార్యులు అననే అన్నారు - శివాయ విష్ణురూపాయ - అని. అప్పటికి అల్లా, యెహోవా లాంటి దేవుళ్ళు భారత దేశానికి యింకా రాలేదు గానీ - వచ్చుంటే - వారి పేర్లూ చేర్చి అందరూ వొకటే - అని శంకరాచార్యుల వారు చెప్పేవారే.
అసలు శంకరాచార్యుల వంటి - అభ్యుదయ వాది - మరొకరు లేదు. వారి నిర్వాణ షట్కం చదివి అర్థం చేసుకున్న వారికి యిది తెలుస్తుంది. వొక సారి శంకరాచార్యుల వారు శిష్యులతో బాటు గంగా నది నుండి శివాలయానికి వెడుతూ వుంటే - వొక అసహ్యకర దుస్తులతో వున్న వాడు ఎదురొస్తాడు. శంకరాచార్యులు కొద్ది చిరాకుతో - దూరంగా పో - అంటాడు. మరి అతనంటాడు - జడమైన ఈ శరీరాన్ని దూరంగా పొమ్మంటున్నావా? ఈ జడం ఎలా వెళ్ళగలదు? అయినా - నీ శరీరమూ జడమే గదా. దానికీ, దీనికీ పెద్ద భేదమేమిటి? అదిగాక, అత్మరూపుడైన నన్ను దూరంగా వెళ్ళమంటున్నావా? ఎక్కడికి వెళ్ళగలను? అత్మస్వరూపుడిగా నేను గాని,నువ్వు గాని లేని చోటు వుందా?వెళ్ళేది ఎక్కడికి మరి? అని అడుగుతాడు.
అంటే. శంకరాచార్యులు వెంటనే తన తప్పు వొప్పుకుని - మీరే నా గురువులు - అంటాడు. అంటరాని తనానికి శంకరాచార్యులు వేసిన పెద్ద వేటు అది. అడిగింది సాక్షాత్ శివుడు. ఆయన అడిగింది సాక్షాత్ ఆది శంకరుల వారిని. అది మనకు చెప్పింది ఆది శంకరులే. దానికి సాక్షులు వారి శిష్యులే. ఆ కాలంలో - శంకరాచార్యుల వారే - మూఢ నమ్మకాలను ఎంతగానో - ఎదిరించి, నచ్చ చెప్పాల్సిన పరిస్ద్తితి. తన తల్లి శరీర దహన కాండలో కూడా ఆయన సమాజాన్ని ఎదిరించ వలసిన పరిస్థితి. శంకరులు చెప్పినా మనం యిప్పటికీ పూర్తిగా మారలేదు. అది వేరే సంగతి. మారాలి అన్నది - వున్న పరిస్థితి.
ఈ కాలంలో కూడా - మన గురువులు చెప్పేది అదే. అయితే - మనం మారడం లేదు.
యిప్పుడు, శ్రీ శ్రీ రవిశంకర్ గారు - పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారత దేశానికి, పాకిస్తాన్ కూ మధ్య వున్న అపోహలను కొంతైనా తగ్గించి, సుహృద్ భావాన్ని పెంపొందిం చాలన్నది ఆయన ప్రయత్నం.
యోగా, మెడిటేషన్ ద్వారా - మన మనసుల మధ్య వున్న దూరాన్ని తగ్గించవచ్చన్నది ఆయన దృఢ నమ్మకం. ఎంతో మంది పాకిస్తానీయులు ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులు చేసారు. చేస్తున్నారు.
అక్కడ ఆయనను విగ్రహారాధనను గురించి, మీకు ఎంతో మంది దేవుళ్లున్నారు కదా అని వొకరడిగారు. ఆయన - దేవుడు వొక్కడే. మీకు అల్లాః కు వంద పెర్లున్నట్టు గానే - మాకు వందల దేవుళ్ళ రూపాలు, పేర్లు అంతే గాని దేవుడు వొక్కడే అని చెప్పారు.
రవిశంకర్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం - రెండు దేశాల ప్రజల మధ్య ఎంతో కొంత స్నేహ భావం కలిగిస్తుందనడం లో - సందేహం లేదు. సరే. అల్ కైదా లాంటి మతోన్మాదులలో మార్పు రాదు. వారికి కోపం కూడా రావచ్చు. కానీ - సాధారణ ప్రజలంతా - శాంతినే కోరుకుంటారని చెప్ప వచ్చు.
యిక వారి వాక్యాలు చూద్దాం :
1 . ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏమిటి? జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవడమే. వొక రోజు మనం సంతోషం గా వున్నాం. మరి కొన్ని రోజుల్లో, కష్టాల్లో వున్నాం. అన్ని రోజుల్లోనూ, వొకే లాగా వుండగలగడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్. కష్ట సమయాల్లో, సమర్పణ భావం చాలా ముఖ్యం. సంతోష సమయాల్లో సేవా భావం ముఖ్యం. మీ ప్రార్థన ఎలా వుండాలంటే - నా వలన అందరికీ మేలు జరగాలి. నేను సేవ చేయ గలగాలి. సేవ చేసే నా ఈ చేతుల ద్వారా - నాకు జ్ఞానోదయం కలగాలి. నా ఈ చేతుల ద్వారా మేలు జరగాలి. మీరిలా - హృదయపూర్వకం గా ప్రార్థిస్తే - అది తప్పక జరుగుతుంది.
2 . ప్రవాహంతో బాటుగా, తన దిశలో, మనం తేలుతూ వెళ్ల గలగాలి. అలాగే - ప్రవాహాన్ని మనం ఆదుపులోనూ, కట్టుబాటులోనూ వుంచగలగాలి. అదే విజయ సాధనం. ( యిది చెప్పింది ఐ.ఐ.యం, కలకత్తాలో)
3 . మీరు వొకరికొకరు దేవుడిగా మారాలి. ఎక్కడో - ఆకాశంలో, దేవుడి కోసం వెదక్కండి. మీరు చూసే ప్రతి రెండు కళ్ళల్లోనూ దేవుడిని చూడండి. కొండల్లోనూ, నీటిలోనూ, చెట్లలోనూ, జంతువులలోనూ కూడా దేవుడిని చూడాలి. అయితే, మీలో మీరు మొదట దేవుడిని చూడగలగాలి. దేవుళ్ళే, దేవుళ్ళను ఆరాధించగలరు.
4 . మనం (ఇతరులపై) చేసే పితూరీలు మనలో వున్న అందాన్ని పూర్తిగా తీసేస్తాయి. బాహ్య సౌందర్యానికి - మీరు ఎన్నో ధరిస్తారు. కానీ, నిజమైన సౌందర్యానికి - మీరు (ధరించ వలసింది కాదు) తీసేయవలసినవి మాత్రమే వున్నాయి. వాటిలో - మీరు నిత్యం చేసే పితూరీలు కూడా వున్నాయి. బాహ్య సౌందర్యానికి - మీకు "మేకప్" వుంది. కానీ నిజమైన సౌందర్యం - మీలోనే వుంది. దానికి కావలసిన మేకప్ తో బాటే - మీరు ఈ ప్రపంచానికి వచ్చారు.
5 . దొరికే ప్రతి అవకాశాన్ని, ప్రతి క్షణాన్ని - ఆనందంగా, ఉత్సవం లాగా గడపండి. అప్పుడే మీరు, గొప్పగానూ, నిండు గానూ - జీవితాన్ని చూడ గలరు;అనుభవించగలరు.
6 . జీవితం మనం ఆడవలసిన ఆట. అదేదో (కష్టమైన) పోరాటం కాదు.
7 . ఈ ప్రపంచం మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ వుంది. ఈ గాలి మిమ్మల్ని ప్రేమిస్తూ వుంది. ఈ ఆకాశం, ఈ సూర్యుడూ, ఈ చం ద్రుడూ అన్నీ మీపై చాలా అభిమానం వున్నవే. మీ చుట్టూ - ఈ ప్రేమ శక్తి ఎల్లప్పుడూ వుంది. మీరు ధ్యానంలో పూర్తిగా దీనిలో కరిగిపోగలరు. అది మీకు ఎంతో అంతః శక్తిని యిస్తుంది.
8 . మీరున్న నిద్ర నుండి మీరు లేయాలి. లేచి - మీరెంత సౌందర్యంతో వున్నారో చూడండి. మీలోని, ఆ ముగ్ధత, మీలోని ఆ నాట్యం - ఎంత సుందరంగా వుందో చూడండి.
9 . ఈ ప్రపంచమంతా వొకే కుటుంబం.... మీరు మీ చుట్టూ, కట్టుకున్న గోడలను కూలద్రోయాలి..మీ వైపు నుండి మీరు చేయాల్సింది - మీకు, మిగతా వారికి మధ్య నున్న అనుమానాలను, జంకును పూర్తిగా విడిచి పెట్టడమే . అందరితో సఖ్యానికి మీ చేయి అందించండి.
10 . వున్న చట్టాలన్నే మెదడుకే గాని హృదయానికి కాదు.
11 . మీ చుట్టూ వున్న వారిని - మీ వారిగా చేసుకోవడం నేర్చుకోండి. వారు, యిప్పుడు కూడా మీ వారే. వారు వచ్చిందీ యిదే భూమి నుండే. వారు పీల్చేది - మీరు విడుస్తున్న గాలే. మీరు (వారితో) ఎంతో, సంబంధమున్న వారే. ఎంతో!
12 . మీరు నిజంగా కళ్ళు తెరవాలంటే - కొన్ని సార్లు (లేదా కొంత సేపు) మీ కళ్ళు మూసుకోవాలి.
13 . సంతోషం (లేదా ఆనందం) అనేది మీకు తెలియనంత వరకు (మీకు అనుభవం లోకి రానంత వరకు) - వొక వూహ మాత్రమే. తెలిసిన తర్వాత - అదే మీరు (గా మారిపోతారు).
14 . చూడగలిగే కళ్లుంటే - మీరు ప్రపంచమంతటా - ప్రేమను చూడగలరు.
15 . అనూహ్యమైన (చేయలేనటువంటి) విషయాన్ని గురించి - మీరు (మీ ధ్యేయంగా) కల గనాలి. మీరు ఈ ప్రపంచంలో - ఏదో వొక అద్భుత మైన, మీరే చేయ గల కార్యం చేయడం కోసమే - పుట్టారని తెలుసుకోండి. ఈ అవకాశాన్ని విడిచిపెట్ట కండి. అంత గొప్ప ధ్యేయాన్ని గురించి, గొప్పగా కల గనడానికి మీరు, మీకు పూర్తి స్వాతంత్ర్యం యిచ్చుకోవాలి.
16 . పుట్టిన ప్రతి మొగ్గలోనూ, పూవుగా మారగల పూర్తి సామర్థ్యం వుంది.
17 . ప్రత్రి వొక్కరూ (మరొకరికి) యిది చెప్ప గలగాలి - " నీకు అవసరం అయినప్పుడు, నేను నీతోనే వున్నాను / వుంటాను". చాలా మందిలో - ఇప్పుడున్న భయం, తమకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎవరూ రారని. ప్రపంచంలో వున్న లంచగొండి తనానికీ, హింసా ప్రవృత్తికీ - యిదే ముఖ్య కారణం.
18 . ప్రేమించడం హృదయం పని. సందేహించడం మెదడు పని. రెండింటి పనీ మీకు అవసరం వుంది.
19 . మీరు గురువు దగ్గరికి వస్తే - ఏదో వొకటి యివ్వాలి. మీరు నాకు, పూలు, మాలలు, షాల్- లు యివ్వాల్సిన పని లేదు. మీ మనసులోని కష్టాలను (వర్రీస్) నాకు యిచ్చేయండి. మీరు సంతోషంగా తిరిగి వెడితే - అదే నాకు గురుదక్షిణ.
20 . మీరు ఎప్పుడైనా శోకంతోనో, కష్టం తోనో వుంటే - వొక్కటి మాత్రం తప్పక తెలుసుకోండి. మీ అంతరాత్మకు యిప్పుడు వెంటనే - మంచి ఆహారం కావాలి. ఆ ఆహారం ధ్యానం మాత్రమే.
= మీ
ఉప్పలదడియం విజయమోహన్
లేబుళ్లు:
ఆర్ట్ ఆఫ్ లివింగ్,
శ్రీ శ్రీ రవిశంకర్
3, మార్చి 2012, శనివారం
మారేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ - కలియుగం కాదిది - రేపుల యుగం - దేవుడు కొత్త రూల్స్ పెడుతున్నాడు. అవి యేవో తెలుసా?
యిప్పుడు - యిండియా లో - రేపుల యుగం నడుస్తూ వుంది. యింతకు ముందు లేదని కాదు.
త్రేతాయుగం లో కూడా - రావణాసురుడు వున్నాడు. ఆయనకు రేపులంటే మహా యిష్టం. అలాంటి వారు అప్పుడూ వున్నారు. యిప్పుడూ వున్నారు.
రావణాసురుడు వూరికే వుండలేడు కదా. ఎవరి భార్యను ఎత్తుకుపోదామా అని - యోచన చేస్తూనే వుంటాడు.
ఏదో శాపం అడ్డు వలన, రావణుడు సీతను బలాత్కారం చెయ్యలేక పొయ్యాడు. లేదంటే - చేసే వాడే. అన్న కొడుకు (నలకూబరుడు) భార్య అయిన రంభను కూడా రావణుడు వదలలేదు.యిలా ఎంతో మందిని బలాత్కారం చేసిన వాడే. పాపం పూర్తిగా పండిన తరవాతనే పొయ్యాడు. త్రేతాయుగంలో - రేపులకు, వొక్క రావణుడు వుండే వాడు. మిగతా వారి గురించి మనకు తెలీదు.
రామాయణం ప్రప్రథమ కావ్యం. అందులో అతి ముఖ్యంగా చెప్ప బడిన నీతి - మగవాడికి, అంత స్త్రీ లోలత్వం పనికి రాదని, అది నాశనానికే దారి తెస్తుందని.
యిది చెప్పబడింది - త్రేతా యుగంలో. అప్పటి నుండి, యిప్పటి వరకు, మగవాడి ఈ బలహీనతలో మార్పులేదు.
అందుకే - మగవాడి ఈ బలహీనతను కట్టు చేయడానికి మన సమాజం ఎన్నో సామాజిక నిబంధనలు, ఆంక్షలు పెట్టింది.
యిది చెప్పబడింది - త్రేతా యుగంలో. అప్పటి నుండి, యిప్పటి వరకు, మగవాడి ఈ బలహీనతలో మార్పులేదు.
అందుకే - మగవాడి ఈ బలహీనతను కట్టు చేయడానికి మన సమాజం ఎన్నో సామాజిక నిబంధనలు, ఆంక్షలు పెట్టింది.
మగవాడు మొట్టమొదట - అంటే, తాను చదువుకునే రోజుల్లో - బ్రహ్మచర్య వ్రతం అవలంబించాలని పెట్టారు. అది వూరికే కాదు. మగ వాడికి మొదట తనపై తనకు కొంత కంట్రోల్ రావాలి. తనను గురించి తనకు తెలియాలి. తప్పటడుగులు వేసే ముందు సర్డుకోగలిగే జ్ఞానం రావాలి.
యిది మగవాడికి -చాలా, చాలా, ఉపయోగ పడే ప్రక్రియ, ఉపయోగ పడే విద్య.
ఇప్పుడది వదిలేసి - ఆడా, మగా సెక్సు జ్ఞానం పుట్టగానే నేర్చుకోనీ. అదీ క్లాసులో నేర్పుతామని అంటున్నారు.
మరి తనపై తనకు కంట్రోల్ ఎలా నేర్పుతారు? ఎవరు నేర్పుతారు? ఎప్పుడు నేర్పుతారు?
నేర్పే వారికి , తమపై తమకే కంట్రోల్ లేదు కాబట్టి - కంట్రోల్ లేకపోవడం ఎలాగో - అది మాత్రమే, నేర్పుతారు. నేర్పగలరు. అదే సెక్సు పరిజ్ఞానం. అది నేర్పుతారు.
నిజానికి - తనను తాను కంట్రోల్ చేసుకోవడం ఎలాగో - ఆ సైన్సు నేర్పే వాడికీ తెలీదు. నేర్చుకునే వాడికీ తెలీదు, ఈ కాలంలో. యిది, యిప్పటి సామాజిక మూర్ఖత్వానికి, వొక పారాకాష్టగా తయారవుతోంది.

జీవితానికి సెక్సు ముఖ్యం కాదని మన వారు చెప్ప లేదు. దాన్ని వొక గొప్ప సైన్సు గా కూడా తీర్చి దిద్దారు.
కానీ, అది ధర్మ మార్గంలో, చట్ట బద్ధమైన మార్గం లో లభిస్తే - జీవితాంతం వుంటుంది. లేదంటే - మగవాడి కైనా, ఆడదానికైనా - ముప్ఫై ఏళ్ళ లోపే, అందులో ఉత్సుకత ఏ మాత్రమూ మిగలదు; పూర్తిగా యిగిరిపోతుంది.
ఆ తరువాత మిగిలేది, వివాహేతర సంబంధాలూ, ఆ తరువాత, అందులోనూ, ఉత్సుకత లేకపోవడం. యిలా - వివాహ సంబంధాన్ని పూర్తిగా పాడు చేసుకోవడం. యిదీ జరిగేది.
మగవాడికి నేర్పాల్సింది - మొదట తనపై తనకు కంట్రోల్. యిది నేర్పిన తరువాత- మరేదైనా నేర్పొచ్చు. సెక్సు పరిజ్ఞానం చాలా సులభంగా వస్తుంది. ప్రకృతిలో దేన్నీ చూసినా తెలిసిపోతుంది. అదేమీ బ్రహ్మ విద్య కాదు. అయినా - పెళ్ళైన తరువాత భార్యాభర్తలు అందులో తమకు కావాల్సిన విధంగా ఎన్నో రకాల ఎక్స్ పెరిమెంట్లు చేసుకోవచ్చు. అవన్నీ మన దేశంలో ఎవరూ వద్దన లేదు.
అసలు నేర్పాల్సింది తనపై తనకు కంట్రోల్. ఈ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది? యిది కూడా మన వారు స్పష్టంగా చెప్పనే చెప్పారు. కామ, క్రోధ, లోభ,మోహ, మద, మాత్సర్యాలు మనలోని ముఖ్యమైన బలహీనతలుగా చెప్పారు. అదేదీ - మతపరమైనది కాదు. అంతా సైన్సు.
అందులో మొట్టమొదటిది, మిగతా అన్నిటికీ మూలమైనది - కామము. కామము అంటే కోరిక. ఏ కోరికైనా , మనసును తొలిచే పురుగు లాంటిది. తీరే వరకు తొలుస్తూ వుంటుంది. ధర్మమూ, అధర్మము చూడ నివ్వదు . చట్ట బద్ధమా, కాదా - అదీ చూడ నివ్వదు. సమాజంలోని వారు ఏమనుకుంటారో - అదీ చూడ నివ్వదు. స్నేహితులను కూడా విరోధులుగా చూస్తుంది. మేలు కోరే వారిని దూరంగా పెట్ట మంటుంది. తల్లిదండ్రులు మొట్టమొదటి శత్రువులుగా కనిపిస్తారు. గురువులు దుర్మార్గులుగా కనిపిస్తారు. కామము అంత బలవత్తరమైనది.
కోరికలలో కూడా - సెక్సు వాంఛ చాలా బలవత్తరమైనది. "కామాతురాణాం న భయం న లజ్జ" - అని చెప్పారు. ఈ సెక్సు వాంఛ మనసులో పడిపోతే - యింతింతై, వటుడింతై -అన్నట్టు, క్షణ క్షణానికీ పెరిగి పోతుంది. మనసులో అదొక్కటే. మరి చదువుకూ తావు లేదు. దేనికీ తావు లేదు. భయం లేదు. సిగ్గు,లజ్జ లేదు. పగలా, రాత్రా అన్న వ్యవస్థ లేదు. ఇల్లా, దారా, సినిమా హాలా, దేవుడి గుడా - అన్న జ్ఞానం వుండదు.
"నవ్వి పోదురు గాక, నాకేటి సిగ్గు" అన్న చందం అయిపోతుంది. అందులోనూ - మగవాడికి - ఈ బలహీనత ఎక్కువ. అందుకే, మగవాడికి - తనపై తనకు కంట్రోల్ మొదట నేర్పాలి.
"నవ్వి పోదురు గాక, నాకేటి సిగ్గు" అన్న చందం అయిపోతుంది. అందులోనూ - మగవాడికి - ఈ బలహీనత ఎక్కువ. అందుకే, మగవాడికి - తనపై తనకు కంట్రోల్ మొదట నేర్పాలి.
ఈ కంట్రోల్ వున్న మగ వాడికి సెక్సు సామర్థ్యం - దాదాపు జీవితాంతం వుంటుంది. కంట్రోల్ లేని వాడికి - చాలా త్వరగా పోతుంది.
యిప్పుడు, ఆర్థికంగా అభివృద్ధి సాధించిన దేశాలలో - ఈ కంట్రోల్ చాల వరకూ పోయింది. సామర్థ్యమూ పోయింది. నా నాలుగో భార్యకు, నేను మూడో మొగుడిని - అన్న వావి వరుసలు ఎప్పుడో వచ్చాయి. పిల్లలు పుట్టడం చాలా తగ్గిపోయింది.
యిప్పుడు -ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, ఆడదంటే - మగవాడికి, మగ వాడంటే -ఆడదానికి - విముఖత పెరిగిపోతోంది. దీని ఫలితంగా, యిప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏమిటంటే - ఆడదాన్ని, ఆడదే పెళ్లి చేసుకుంటుంది. మగవాడిని, మగవాడే పెళ్లి చేసుకుంటాడు. దీన్ని చట్ట బద్ధం చేసేసారు, చాలా ప్రదేశాలలో.
యిది ఎందుకు జరుగుతోంది - అన్న సందేహం లేక పోలేదు.యిదొక మానసిక జాడ్యమేమో అన్న వివాదం యింకా పూర్తిగా తీర లేదు. దీనిపై పూర్తిగా పరిశోధనలూ చెయ్య లేదు. అయినా - మేం పెళ్లి చేసుకుంటాం, మేం చేసుకుంటాం - అనే వారి గోల మరీ ఎక్కువ అవుతుండటంతో - వారి వివాహాన్ని చట్ట బద్ధం చేసేసారు.
దాన్ని వివాహం - అని ఎందుకనాలి? మరేదైనా అనొచ్చుగా.మగ వారు ఆడవారిని చేసుకోవడం పెళ్లి అనబడింది, వేల ఏళ్ళుగా. మరి మగ వారు, మగ వారినే చేసుకొనడం, ఆడవారు ఆడవారినే చేసుకోవడం, దీని పేరు మరేదైనా పెట్టుకోవచ్చుగా. అదీ పెళ్ళంటే - ఎలా? భారత ప్రభుత్వం వారికి ఈ విషయంలో సరైన అవగాహన కుదరడం లేదు. దాదాపు ఈ మాటే - సుప్రీం కోర్ట్ వారే అన్నారు. ప్రభుత్వం వారికి వోటు ముఖ్యం. అందుకని - వారు వస్తే మేము మీ వైపే అనడం. మరొకరు వస్తే - మేము మీ వైపే అనడం - అసలు ఎవరి వైపో తెలియక పోవడం జరుగుతోంది.

యిది వొక ప్రక్క ప్రపంచమంతటా జరుగుతుంటే - మరో ప్రక్క - మగవారిలో నున్న - మగ క్రోమోజోం "వై" చాలా, చాలా తగ్గిపోతూ వుందని చాలామంది సైంటిస్టులు అంటున్నారు. దానిపై రీసెర్చ్ జరుగుతూ వుంది. దేవుడు మనిషి పోకడలు గమనించి ఏవేవో, క్రొత్త రూల్స్ పెడుతున్నాడు. ముందు, ముందు మరేం జరుగుతుందో తెలియడం లేదు.
యివన్నీ ఎందుకు జరుగుతూ వున్నట్టు?
అనాదిగా వేసిన పునాదులు పీకి, పందిరేస్తే - ఎదురుగాలి ఈదురు గాలిగా మారి ఎత్తుకు పోతూ వుంది. అంతే.
అనాదిగా వేసిన పునాదులు పీకి, పందిరేస్తే - ఎదురుగాలి ఈదురు గాలిగా మారి ఎత్తుకు పోతూ వుంది. అంతే.
మన మనస్సులో జరిగే ప్రకోపాలు - క్రోమోజోమ్స్ లో కూడా జరుగుతాయి. మన వొక్కొక్క కణం లో కూడా జరుగుతాయి. మన చుట్టూ వున్న పరిసరాల్లో కూడా జరుగుతాయి. యిది యిప్పుడు కాదు. వేల సంవత్సరాల క్రిందటే మన వారికి తెలుసు.
మనసును కంట్రోల్ లో పెట్టుకుంటే - జీవితం సుఖమయంగా, విజ్ఞాన మయంగా, పదిమందికీ ఉపయోగ కరంగా జరిగిపోతుందని - అందుకే చెప్పారు. అన్ని చదువులకంటే - అతి ముఖ్యమైన చదువు - మనసును అదుపు చేయడమే నని నొక్కి చెప్పారు.
యోగ శాస్త్రం పైన పతంజలి రాసిన సూత్రాలలో రెండవ సూత్రం అదే. యోగమంటే - మనసును కంట్రోల్ చెయ్యడమే నని. యోగ శాస్త్రం మొత్తమూ - ఈ వొక్క విజ్ఞానం సాధించడానికే.
శ్రీ కృష్ణుడు భగవద్గీతను కూడా యోగ శాస్త్రమనే అన్నాడు. యివేవో మత గ్రంధాలని అనుకుంటే చాలా పొరపాటు పడ్డామన్న మాటే. యివి రెండూ - మన ఆధునిక విజ్ఞాన శాస్త్రాలకంటే - అతి గొప్ప విజ్ఞాన శాస్త్రాలు.
శ్రీకృష్ణుడంటాడు -
మీ కంట్రోల్ లో వుండే మనసంత గొప్ప మిత్రుడు మీకు మరొకరు లేదు. మీ కంట్రోల్ లో లేని మనసంత శత్రువు మరొకరు లేదు.
జీవితానికి మూల సూత్రం యిది. యిది అర్థం కాకుండా - ప్రస్తుత సమాజం ఎక్కడికో వెళ్లి పోతూ వుంది. తన నాశనం వైపు పరుగులు తీస్తూ వుంది.

మీరు యోగ సూత్రాల గురించి - పూర్తిగా తెలుసుకోవాలంటే - నా ఆంగ్ల బ్లాగు - " వైజ్ స్పిరిచ్యువల్ ఐడియాస్. బ్లాగ్స్పాట్.కాం" చూడొచ్చు.
సరే. మనసును కంట్రోల్ లో పెట్టుకోక పోవడం వలన - ఏం జరుగుతోంది? వొక చిన్న విషయం చూద్దాం. భారతదేశంలో - ప్రతి రాష్ట్రంలోనూ - యిప్పుడు, రేపు భాగవతం జరుగుతోంది. ప్రతి రోజూ రేపు వార్తలతో నిద్ర లేస్తున్నాం. పడుకుంటున్నాము.
"రేపెన్నిరేపులో" తెలియడం లేదు. ధైర్యం చాలకపోతే - కొంత మందిని పక్కబలంగా పెట్టుకుని మరీ రేపు చేస్తున్నారు మగ వారు. సామూహిక రేపులు, సామాజిక రేపులు, వృద్ధమహిళల రేపులు, చిన్న పిల్లల రేపులు, -కాదెవరూ, రేపుకనర్హం అన్నట్టుగా జరిగిపోతూ వుంది.

ప్రతి రోజూ సుప్రభాతం లాగా, వార్తలలో - రేపుల పర్వం వుండనే వుంది. బయట రౌడీ రేపు చేసాడని పోలీసుకు చెబితే, ఎలాగో నేనూ చూస్తానని, పోలీసు వాడు రేపు చేసాడట. సరే. యిన్ స్పెక్టరు గారు న్యాయం చేస్తారనుకుంటే - ఆయన తన వంతు తాను చేసారు. నా కంట్రోలు లో నేను లేను గానీ - నీవు నా కంట్రోలులో వున్నావని - ఆయన నిరూపించారు. యిదేదో జోకు కాదని, ఇలాంటివెన్నో - జరిగాయని మనకు తెలుసు. అయినా, మనకు జరగలేదని - అప్పుడు చూసుకుందాం - అని వొక నిబ్బరం. మన అందరికీ.
ఢిల్లీ లోనూ - కలకత్తా లోనూ - మహిళలే ముఖ్యమంత్రులు గా వున్నారు. అక్కడైతే - మరీ ఎక్కువగా రేపులు జరిగిపోతున్నాయి. చాలా వరకు, సామూహిక రేపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వొకరికొకరుగా చేయడానికి , మగవారికి - ధైర్యం చాలడం లేదు. అందులోనూ - ఈ మధ్య ఆడవారు, కరాటే లాంటివి నేర్చుకుని వుంటే? ఇలాంటి భయాల వలన - సింగుల్ రేపు కంటే, సామూహిక రేపు భయం లేని విషయం - అనుకుంటూ వుండొచ్చు.
మిగతా చోట్ల జరగలేదని కాదు. ఆంధ్ర దేశంలో అయితే - నా ప్రేమ వొప్పుకుంటే సరి - లేదంటే - యాసిడ్ పోసేస్తా - అనే పిచ్చి వాళ్ళ సంఖ్య ఎక్కువ. సరే. నలుగురు ప్రేమించారనుకోండి. అప్పుడు ఎవడో వొకడు , వొకరో, ఇద్దరో, ఆత్మా హత్యో, యాసిడ్ ఆటాకో చేసే చాన్సు ఎక్కువగా వుంది.
భారతదేశంలో - చట్టం ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే - మగవారికి 21, ఆడవారికి 18 సంవత్సరాల వయసు అయివుండాలి. లేదంటే, పెళ్లి చెల్లదు.
అయితే, ప్రేమించడానికి, అటువంటి చట్ట బద్ధమయిన వయసు నిర్ణయించ లేదు. అందువలన, 14 ఏళ్ళ వయసు నుండీ, ప్రేమలు జరిగిపోతూ వుంది. ఏ స్కూల్ చూసినా, ఏమున్నది వేరే పని - అన్నట్టుగా వుంది. ఆడ,మగా, చెట్టా పట్టాలేసుకుని తిరగడం - అది ప్రేమ అని పేరు పెట్టడం జరుగుతూ వుంది. పెద్ద నగరాల్లో - యిది మరీ విపరీతంగా వుంది. అలాగే, గర్భ ధారణకు కూడా, చట్టం వయసు నిర్ణయించలేదు. అందు వలన, అదీ జరిగిపోతూ వుంది. ఎప్పుడో బాల్య వివాహాలు వుండేవట. యిప్పుడు వారే ఎవరికీ తెలియకుండా చేసేసుకుంటూ వున్నారు. పెద్దలు చేస్తే తప్పు. వారే చేసేసుకుంటే?
మేం ప్రేమించు కున్నాం - అని చెప్పుకోవడం స్కూలు విద్యార్థులకు వొక స్టేటస్ సింబల్ లాగా తయారయ్యింది. సరే. ప్రేమించుకుంటే - తప్పేమిటి? ఏం లేదు. ఆరోజు నుండీ, యింట్లో అన్ని రకాల అబద్ధాలు చెప్పడం ఆరంభం. యింట్లో దొంగతనం చేసి, ప్రియురాలికి సమర్పించడం, స్కూల్లో క్లాసులు కట్టు చేయడం - ఏవేవి చేయకూడదో - అన్నీ ఆరంభవుతాయి.
ఆ వయసులో, ప్రేమ అంటే - ముఖ్యంగా శారీరక ఆకర్షణే. 14 ఏళ్ళు దాటితే - లోపల కొత్త హార్మోనులు బయలు దేరుతాయి. అంతా వాటి ప్రభావమే. మాదేదో, దైవీక ప్రేమ - అనుకుంటే తప్పు. అదంతా- మనసు చేసే గారడీ. జంతువులకూ, మనకూ, ఆ వయసులో వొకే తేడా. వాటికి ఏదో వొక నియమిత కాలం వుంది. ఆ కాలంలో ఆ ఆకర్షణకు లోనవుతాయి. మనుషులలో - అలా కాదు. కాలం, దేశం, చోటు, యిటువంటి ఏ నియమాలూ లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ - ఈ హార్మోనులు ఎగిసి పడతాయి. మనసా కవ్వించకే నన్నిలా - అని వాపోయినా అవి వొక పట్టాన వదలవు.
ఆడ హార్మోనుల్లో - ఆకర్షించడం వరకు వాటి పని. మగ హార్మోనుల పనే మిగతా అంతా. మగ వాడిని, వాడి మనసును, ఆ ఆకర్షణలో - చిత్ర హింసలు పెడుతుంది. వాడు ఏదో చెయ్యాలి. ఏది చేస్తే - ఆ హార్మోనులు శాంతిస్తాయో తెలీదు. అందుకని ఏదేదో చేస్తుంటాడు. దేవదాసు కావొచ్చు. ప్రేమ మందిరం కట్టొచ్చు. వీధిన పడొచ్చు. చదువు మూల పెట్టి తన కలల కన్య వెనుక తిరుగుతూ వుండొచ్చు. వొక్కొక్కడు, తన ప్రేమ కోసం సర్వం త్యాగం చెయ్యొచ్చు - తల్లిదండ్రులతో సహా. మంచి మాత్రం ఏమీ చెయ్య లేడు.

వొక ఆడ పిల్ల కోసం, యిద్దరు, ముగ్గురు మగ పిల్లలు కొట్టుకోవడం చాలా సహజమైన విషయంగా మారిపోయింది. కొందరు ఆడ పిల్లల పాకెట్ మనీ కి, సరదాలకు, వొక మగ పిల్ల వాడు చాలడం లేదు. అందుకని, ఇద్దరో, ముగ్గురో వుంటే - మరి కాస్త హాయిగా వుంటుందనుకోవడం కూడా పరిపాటి అయిపోయింది.
ఆడా,మగా మధ్య దుస్తుల విషయంలో భేదం పూర్తిగా పోతోంది.
వీరెవరూ - మీ మాట వినరు. నా మాట వినరు. వారనుకుంటున్నారు - వారికన్నీ తెలుసునని. వారికి ఏం తెలీదో - అది వారికి తెలీదు. అది తెలిసే సరికి - పుణ్యకాలం గడిచి పోతుంది.
అమెరికాలో - ప్రేమ వివాహాలు, దాదాపు 53 శాతం చాలా త్వరగా (18 నెలలలో) విడాకులలో ముగుస్తోందట. యిండియా లో కూడా - అటువంటి పరిస్థితే వస్తూ వుంది. ఈ ప్రేమలన్నీ ఎంత అసహజమైనవో తెలిసే సరికి - జీవితం లో ని ముఖ్య భాగం గడిచి పోతోంది.
ముందెప్పుడో అనే వారు - "మారేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అని. యిప్పుడు, దేవుడు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు - పిల్లల నొసట రాసి మరీ పంపిస్తున్నాడు. యివన్నీ కూడా- దేవుడు సిద్ధం చేసినవే. అలాగే - విడాకులు కూడా ఎన్ని ఉండాలో, ఎప్పుడు ఉండాలో కూడా రాసి మరీ పంపించేస్తున్నాడు. అంతేనా, మగవారితో మగవారికి, ఆడవారితో, ఆడవారికీ పెళ్ళిళ్ళు రాసి పంపిస్తున్నాడు. వై క్రోమోజోములు పెట్టడం మర్చి పోతున్నాడు.
పెళ్ళిళ్ళతో బాటు, ఎన్ని రేపులు జరగాలో, ఎప్పుడు ఎవరితో జరగాలో రాసి పంపించేస్తున్నాడు.
దేవుడికి ఏదో అయ్యింది. జగన్నాటకం లో పాత్రలు మారి పోతున్నాయి. కృత యుగానికి వొక రావణుడైతే - కలియుగానికి, వీధికొకడు, వూరికి నలుగురు పుడుతున్నారు.
అయితే - యిదంతా కేవలం మగ వారి తప్పే అంటే - పూర్తిగా పప్పులో కాలు వేసినట్టే.
బైబిల్ లో ఈవ్ గారు - "ఆ...,దేవుడు చెబితే చెప్పాడులే - ఆ పండు కోసుకు రావోయ్" - అన్నదట. అంతే. ఆడం గారి బుద్ధి పారిపోయింది. ఆయన వెళ్లి కోసాడు. అప్పటి నుండి, యిప్పటి వరకు, ప్రతి ఈవూ (పోనీ, చాలా మంది) అలా ఏదో చెబుతూనే వుంది. ప్రతి ఆడం, అలా ఏదో చేసేస్తూ వున్నాడు.అది పద్దతిగా మారిపోయింది.
సరే. రామాయణం లో సీతమ్మ వారు ఏం చేసారు. మొదట, బంగారు జింక కావాలని - రాముడిని పంపింది. తరువాత, వొద్దు మొర్రో, నేను పోను, అనే వాడిని, లక్ష్మణునీ, నానా తిట్లు తిట్టి మరీ పంపింది. ఆ పాపానికి , అశోక వనంలో, శోకిస్తూ, కూర్చోవాల్సి వచ్చింది, చాలా సంవత్సరాలు.
మరి యిప్పుడు ఈ తరంలో, మనం చేస్తున్న తప్పులేమిటి? అర్ధ నగ్న దుస్తులు - మన సినిమాల్లోనూ, టీ.వీ. లలోనూ - సర్వ సాధారణం అయి పోయింది. కొంత మంది ఆడవారు - నా శరీరం - నా యిష్టం - అంటున్నారు.
యిది కాకుండా - వివాహేతర సంబంధాలు ఈ మధ్య ప్రసార మాధ్యమాలలో చాలా ఎక్కువగా చూపుతున్నారు. పెళ్లి కాని ఆడ వారు - పెళ్ళైన మగ వాళ్ళ పైన ఎక్కువగా మోజు పడడం చూపుతున్నారు. సరే. స్కూళ్ళ లోను, కాలేజీల్లోనూ, ప్రతి ఆడ పిల్లకు బాయ్ ఫ్రెండ్సు వుండాల్సిందే . వొకరు కాదు. ఇద్దరో, ముగ్గురో. లేదంటే, సరదాలు తీరవు.
యివన్నీ - పిల్లలే తప్పు చేస్తున్నారంటే - న్యాయం కాదు. సినిమాలు తీస్తున్నదో, సీరియల్సు తీస్తున్నదో - వారు కాదు కదా. యివి తీసే వారు - "ఆ..., నా వొక్క సీరియల్ వలన పిల్లలు, సమాజం చెడిపోయే ప్రమాదం లేదు గాక లేదు" - అని వాదిస్తున్నారు. కానీ- 24 గంటలూ, ప్రతి చానల్ లోనూ, వచ్చే సీరియల్సు అన్నీ - అటువంటివే అయితే - పిల్లల మనసే కాదు; పెద్దల మనసు కూడా పాడయి పోతుంది. పోతూ వుంది.
యిప్పుడదే జరుగుతోంది. మన యింట్లో, మన టీ.వీ. ముందు కూర్చునే - మనమందరం చెడిపోతున్నాము.పాడయి పోతున్నాము.
యింట్లో నే ఇలాంటి సినిమాలు, సీరియల్సు చూసి చూసి - మనసు పాడుచేసుకునే వారిలో - ఎంతో కొంత శాతం మగ వారిలో; వారు వీధిలోకి వెళ్ళినా- ఈ సెక్సు హార్మోనులు పని చేస్తూనే వుంటాయి.
అందు వలన, కొంత మంది మగ వారు - యింట్లో రామయ్య, వీధిలో క్రిష్ణయ్య లు గా మారి పోతారు. అది పూర్తిగా వారి తప్పు కాదు. 24 గంటలూ - సెక్సూ, వయొలెన్సూ - కామమూ, క్రోధమూ - చేర్చిప్రకోపించేట్టు చేసే వాటినే - చూస్తూ, వింటూ వుంటే - అలా జరుగుతుంది. వారిలో వొక శాతం మందిలో, అది మరీ ఎక్కువగా తయారై - రేపులు చేయాలనిపిస్తుంది.
కొంత మంది, నైట్ క్లబ్బులకు పోవడం, తాగడమూ ఆడ,మగా కలిసి డాన్సులు లాంటివి చేయడమూ జరుగుతుంది. వారి, వారి యిష్టానుసారము, ఏది చేసినా - మిగతా వారికి సమస్య లేదు. ఆ పైన, రేపులు లాంటివీ జరిగిపోతున్నాయి. తరువాత - చట్టమూ, పోలీసులూ, కోర్టులూ - యివన్నీ.
యివి వొక రకమైతే - యిళ్ళల్లోనో, స్కూళ్ళలోనో, రైళ్ళలోనో - కనిపించే లైంగిక సమస్యలూ వున్నాయి. చిన్న పిల్లపై వేధింపులు, ముసలి వారిపై కూడా వేధింపులు - అన్నీ సామాన్యమై పోతున్నాయి.
మన సామాజిక జీవితంలో - ఎన్నో మార్పులు - అనుకోనివి, అనూహ్యమైనవి కూడా వచ్చేస్తున్నాయి.
యివన్నీ మారాలంటే - మగ - ఆడ మధ్య గౌరవ ప్రదమైన సంబందాలే - సినిమాల్లోనూ, టీ.వీ. లలోనూ - ఎక్కువగా రావాలి.
చెడు చూపకు, చెడు వినిపించొద్దు. చెడు ప్రచారమూ చెయ్యొద్దు. యిది ప్రసార మాధ్యమాలలో ముఖ్యంగా రావాలి.
జరిగేదే కదా చూపుతున్నాము - అనే చెత్త వాదనలు చెయ్యొద్దు. మీరు చూపే కొద్దీ, ఎక్కువవుతున్నాయి - అవి. వొక తల రావణాసురుడు, పది తలల వాడవుతున్నాడు. వొక్కొక్క తలలోనూ - వొక్క రావణాసురుడు తన పది తలలతోనూ వచ్చి కూర్చుంటున్నాడు. యిది అన్ని ప్రసార మాధ్యమాలలో పూర్తిగా మారాలి.
విద్యావిధానంలో, తనపై తనకు కంట్రోల్ మొదట నేర్పాలి - ముఖ్యంగా మగ పిల్లలకు. అంటే - మన దేశంలోనే పుట్టిన సైన్సు - యోగ విద్య లాంటివి ముఖ్యంగా నేర్పాలి.
యివి రెండూ చేస్తే చాలు - యిప్పుడు జరుగుతున్న - రేపు యుగం అంతమవుతుంది.
సమాజంలో - గాంధీజీ గారన్నట్టు - ఏ స్త్రీ అయినా, అర్ధ రాత్రయినా, నిర్భయంగా తిరుగ గలుగుతుంది.
అలా అని, అర్దరాత్రి ఆడది, వీధులలో, తిరుగుతుండాలని కాదు. వొక్కో సారి, తన కర్తవ్య నిర్వహణలో, అది భాగం కావచ్చు.

అప్పుడు వెళ్ళాల్సిందే. అప్పుడు ఆమెకు - ప్రతి మగ వాడి సహకారం వుండాలి. ఆమెలో, భయము అన్నది వుండ కూడదు. అటువంటి సమాజం రావాలి.
అదండీ కథ.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
లేబుళ్లు:
మారేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)