ఆరోగ్యమే మహా భాగ్యం.
యిది మనం తాతల కాలం నుండీ వింటున్న మాటే. దీనితో బాటు మన వారు, మరో మాట కూడా అన్నారు : సం తోషము సగము బలము అని.
మీరు ఎవరినైనా చూసారనుకోండి . ఎలా పలకరిస్తారు ? "బాగున్నారా" - అని.
అమెరికా కెళ్ళినా అంతే - హౌ ఆర్ యు - అంటారు. ఎవరైనా అంతే. ఎక్కడైనా అంతే. మీరు బాగున్నారా, మీరు కులాసానా.మీ భార్య / భర్త, పిల్లలు, తల్లిదండ్రులు బాగున్నారా? యివే మన కుశల ప్రశ్నలు.
అమెరికా కెళ్ళినా అంతే - హౌ ఆర్ యు - అంటారు. ఎవరైనా అంతే. ఎక్కడైనా అంతే. మీరు బాగున్నారా, మీరు కులాసానా.మీ భార్య / భర్త, పిల్లలు, తల్లిదండ్రులు బాగున్నారా? యివే మన కుశల ప్రశ్నలు.
మీ డబ్బు బాగుందా, మీ ఇల్లు బాగుందా - అని ఎవరూ అడగరు. మీకు క్రొత్తగా వచ్చిన రోగాలేమైనా ఉన్నాయా - అని ఎవరూ అడగరు.
మీరు బాగుండడం - అంటే, మీ ఆరోగ్యమూ, మీ సంతోషమూ - యివే ముఖ్యము. యివి రెండూ వుంటే - అన్నీ ఉన్నట్టే.
యివి లేదనుకోండి. నా ఆరోగ్యం ఏమీ బాగా లేదు. నా సంతోషం ఏమీ బాగా లేదు. కానీ, నాకు ప్రమోషన్ వచ్చింది. అని తృప్తి గా అనుకోగలరా. మొదటి రెండూ సరిగా లేదంటే - మరేదున్నా, ఏది వచ్చినా - ఏ ప్రయోజనమూ లేదు కదా.
"మా నాన్నకు లాటరీలో కోటి రూపాయలు వచ్చింది. కానీ, ఆయన మెదడు చెడిపోయింది." - అని తృప్తి పద గలరా? సరే. యివి రెండూ మీకే జరిగిందనుకోండి. మంచిదేనా? కాదుగదా!
కాబట్టి, మళ్ళీ చెబుతున్నాను. మీరు బాగుండడం - అంటే- మీ ఆరోగ్యమూ, మీ సంతోషమూ బాగున్నాయి అని అర్థము కదా.- ఎవరికైనా యివే ముఖ్యము. యివి రెండూ వుంటే - అన్నీ ఉన్నట్టే. యివి లేదంటే - ఏదున్నా, లేనట్టే.
మరి - ఈ ఆరోగ్యము, సంతోషము - మనం జీవితాంతమూ ఎలా కాపాడుకోవాలి?
ఆరోగ్యమూ, సంతోషమూ వుండాలంటే , ప్రతి మనిషికీ కావాల్సింది - జీవితం పైన, తన పైన గట్టి నమ్మకము, గట్టి సంకల్పము (పట్టుదల).
వైద్యుడూ, మందులూ కూడా "కొంత" సహాయం చేస్తాయి. అవీ కావాలి. నిజమే. కానీ, నిజంగా రోగాలు రాకుండా కాపాడేవి, ఆరోగ్యాన్ని నిలిపేవి మొదట చెప్పిన మూడే !
అంటే - మన ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. అందుకు కావాల్సిన ముఖ్యమైన ఆయుధాలూ - మన దగ్గరే వున్నాయి.
అంటే - మన ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. అందుకు కావాల్సిన ముఖ్యమైన ఆయుధాలూ - మన దగ్గరే వున్నాయి.
మీ దరిదాపుల్లో, ఎవరైనా - ఏదైనా రోగాలతో బాధ పడుతూ వుంటే, మీకూ వొక బాధ్యత వుంది. బాధ పడుతున్న వారికి, తమ జీవితం పైన తమకు గట్టి నమ్మకము, రోగాలు తగ్గుతుందనే నమ్మకము, తగ్గించుకుంటామనే పట్టుదల - మనం కలిగించాలి. యిది - మనం అందరమూ చెయ్య గలిగిన, చెయ్య వలసిన ముఖ్యమైన బాధ్యత. రోగికి - ముఖ్యంగా కావలసినది యిదే. మిగతాది వైద్యుడు చేస్తాడు.
సరే. ఆరోగ్యాన్ని గురించి, రోగాలు రాకుండా వుండడానికి, వచ్చిన రోగాలు తగ్గడానికి - కొన్ని ముఖ్యమైన పద్ధతులు, చిట్కాలు, ప్రముఖుల అభిప్రాయాలు చదవండి.
- థామస్ ఫుల్లర్ అంటారు :- ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుంది? రోగాలు వచ్చినప్పుడే తెలుస్తుంది.
- వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమానం 1937 లో తీసుకున్న ఆల్బర్ట్ జెంట్ గ్యోర్గ్యీ అంటారు : మంచి నీరు - మనిషి జీవితానికి కావలసిన ముఖ్య పదార్థమే కాదు; మన జీవితం చుట్టూ విస్తరించి వుండే గొప్ప వల (మేట్రిక్స్) లాంటిది. నీరు లేకుండా ఏ ప్రాణీ, ప్రాణమూ లేదు. (అంటే - మంచి నీరు, జీవితానికి అంత ముఖ్యమన్న మాట)
- క్రయిగ్ టౌన్సెండ్ అంటారు :- 15 సంవత్సరాలుగా నన్ను బాధ పెట్టిన ఆస్తమా వ్యాధి నుండి, నన్ను నేను పూర్తిగా బాగు చేసుకో గలగడానికి - రెండే మందులు తోడ్పడ్డాయి - (1 ) బాగవుతో వుందన్న నమ్మకము (విజువలైజేషన్), (2 )ఏ భయాలూ లేకుండా హాయిగా వుండగల గట్టి మనస్స్థితి (రిలాక్సేషన్). నా మనస్సు యొక్క శక్తి ఎంత గొప్పదో నాకు తెలిసి వచ్చింది. (చూడండి. ఆయన చెప్పే మందులు ప్రతి వొక్కరు వాడాల్సినవి. అవి లేకుండా - వైద్యుడి మందులు అంతగా పనిచేయవు.)
- డాక్టర్ దీపక్ చోప్రా అంటారు :- మీ ఆలోచనలు ఎలా వుంటుందో, మీ ప్రవర్తన ఎలా వుంటుందో, మీ ఆహారపు అలవాట్లు ఎలా వుంటాయో - దాన్ని బట్టి , మీ జీవితపు కొలత ముప్ఫై నుండి యాభై సంవత్సరాల వరకు - ప్రభావితం కావచ్చు. (అంటే ఎక్కొచ్చు, తగ్గొచ్చు అని మనం చెప్ప వచ్చు ).
- లూయిసీ హే అనే కాన్సర్ బాధితురాలు గా ఉండి బ్రతికిన మహిళ అంటారు : - ప్రేమానురాగాలు నిజంగా చాలా,చాలా, గొప్ప అద్భుతమైన మందు. అందులోనూ, మనపై మనకే వుండే ప్రేమ - మరింత గొప్ప అద్భుతంగా పని చేస్తుంది.
- డాక్టర్ దీపక్ చోప్రా అంటారు :- మీ హృదయంలో మిగతా వారికి ఎంత తక్కువ స్థానం యిస్తారో - మీ హృదయం అంత ఎక్కువ కష్టపడుతుంది. (అంటే - స్వార్థం రోగాలను తెచ్చి పెడుతుంది. స్వార్థ రహితంగా వుంటే - ఆరోగ్యము పెరుగుతుంది.)
- వొక పారిశ్రామిక వేత్త అంటారు : - మన జీవితంలో - అయిదు ముఖ్య భాగాలు - మన వుద్యోగం, కుటుంబము, ఆరోగ్యము, స్నేహితులు, ఆధ్యాత్మికత - ఉద్యోగంలో పొర పొచ్చాలొస్తే కొంత కష్టంతో సర్దుకోవచ్చు.ముందుకంటే మంచి స్థితికీ రావచ్చు. మిగతా నాలుగిట్లో సమస్యలొస్తే - అవి దెబ్బ తింటాయి.మళ్ళీ మామూలు స్థితికి రావడం చాలా కష్టం. (అంటే - ఆరోగ్యం పోతే - పూర్తి ఆరోగ్యం రావడం రావడం కష్టం -అన్న మాట)
- డాక్టర్ కార్ల్ మేన్నింగర్ అంటారు :- ప్రేమాభిమానాలు - యిచ్చేవారికీ, యివ్వబదేవారికీ - ఆరోగ్యం పెరుగుతుంది, రోగాలు తరుగుతుంది.
- జాన్ ఏ. లోగన్ అంటారు :- సంగీతం మన మనస్సు కొక గొప్ప మందు.
- నిజమైన రోగం కంటే, మనం ఊహించుకున్న రోగమే చాలా ప్రమాదమైనది.- సామెత
- రోగాలు రావడానికి కారణం వెలుపల వుండే రోగ క్రిముల కంటే - శరీరంలో తగ్గిన రోగ నిరోధక శక్తి అని చెప్ప వచ్చు - డాక్టర్ హాన్స్ సెల్యే
- హాయిగా నవ్వ గలిగే శక్తి, నిద్ర పోయే శక్తి - అన్ని రోగాలకూ, అద్భుతమైన మందులు. - సామెత
- చుట్టూ వుండే చెట్లు, సూర్య రశ్మి చాలా గొప్ప ఆరోగ్య కారులు - సామెత
- దయాగుణం గొప్ప రోగ వినాశిని. - డాక్టర్ వెయిన్ డైయ్యర్
- క్షమించే గుణం - గొప్ప రోగ వినాశిని. - డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్
- రోగాలను తగ్గించే వాటిల్లో - అతి ముఖ్యమైనది మన పై మనలో వున్ననమ్మకమే - నికోలాయ్ లెనిన్
- రోగ క్రిములు ప్రపంచ మంతటా వున్నాయి. రోగాలు మాత్రం కొందరికే వస్తున్నాయి. కారణం, మన మనస్సులోను, శరీరంలోను వున్న నిరోధక శక్తే. - యిది చాలా మంది అన్న మాట
- ప్రేమ, మానసిక శక్తి ఈ రెండింటి తో ఏ రోగాన్నయినా తగ్గించవచ్చు - మార్టిన్ బ్రాఫ్ మాన్,పీ.హెచ్.డీ (కాన్సర్ నుండి బ్రతికిన వారు)
- మీరు దేన్ని చూసి, ఎంతగా భయ పడతారో, - దానికి, మీరే మీపైన అంత శక్తి నిస్తూ ఉన్నారన్న మాట. రోగాల విషయం లోనూ అంతే -సామెత (అంటే - రోగాన్ని చూసి భయడితే రోగానికి మరింత శక్తినిచ్చిన వారిమౌతామన్న మాట)
- ఆరోగ్యమే మనకున్న ఆస్తులలో - గొప్ప ఆస్తి అంటారు - లావో ట్సూ; బుద్ధ ;వర్గిల్;
- రోగాన్ని తెచ్చుకునేదీ మీరే. ఆరోగ్యాన్ని తెచ్చుకునేదీ మీరే - బుద్ధుడు.
- చదువుకంటే - ఎక్కువ సమయాన్ని వ్యాయామానికీ, ఆనందంగా వుండడానికీ కేటాయించమంటారు - వొకప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫెర్సన్
- మంచి గాలి - రోగాల్ని దూరంగా వుంచుతుంది. - సామెత
- మంచి నీరు, గాలి, శుభ్రత - మాత్రమే నా వైద్య శాస్త్రము ప్రకారం నాకు కావాల్సిన మందులు - నెపోలియన్ 1
- వ్యాయామాన్ని రేపు, రేపు అని వాయిదా వేయకండి - రేపు వ్యాయామానికి బదులు రోగం వచ్చి కూర్చో వచ్చు.-సామెత
- ఆరోగ్యం అంటే - శరీరాన్ని, మనస్సును, ఆత్మను, వొకే త్రాటిపై నడిపించడమే. - సామెత
- రోగం అనేది - ప్రకృతి, తన చట్టాలను మనం అతిక్రమిస్తే మనకు వేసే శిక్ష. ఆరోగ్యం అనేది - ప్రకృతి చట్టాల ప్రకారం మనం నడిస్తే - ప్రకృతి యిచ్చే బహుమతి, ఆశీర్వాదం. - సామెత
- అతి సర్వత్ర వర్జయేత్. ఆహార, విహారాల్లోనూ, నిద్ర, మెలకువల్లోనూ, పని,విశ్రాంతులలోనూ - మరీ ఎక్కువ తక్కువలు లేకుండా -మధ్యే మార్గము లో వెళ్ళే వాళ్లకు మాత్రమే యోగము సిద్ధిస్తుంది - శ్రీకృష్ణుడు.
- రోగం వచ్చింతరువాత పోగొట్టుకోవడం కంటే - రాకుండా చూసుకోవడం - చాలా సులభం.- సామెత
- మానసిక ఆరోగ్యము - శారీరక ఆరోగ్యాన్ని కూడా రక్షించ గలదు.- సామెత (అంటే - మీ మనస్సును ఆరోగ్యం గా వుంచుకోండి )
- మీ శరీరము, మీ మనస్సు - దేవుడి గుడి లాంటివి. అవి పరిశుభ్రంగా వుంచుకోండి.-సంస్కృత వాక్యము
- ఈ రోజు మీరేమి తింటారో - రేపు మీరు అదే అవుతారు. -సామెత ( మీ ఆహారం ప్రకారమే, మీ ఆరోగ్యము వుంటుంది - అని అర్థము)
చూసారా. యిటువంటి గొప్ప వారి అభిప్రాయాలెన్నో వున్నాయి. యిక్కడ కొన్నే యిచ్చాను.
యిందులో - రోగాల్ని పోగొట్టుకోవడానికీ, రాకుండా చేసుకోవడానికీ - మన మానసిక శక్తి , నమ్మకము గొప్ప మందులుగాను, వరాలుగాను ప్రతి వొక్కరూ చెప్పారు. కాన్సర్ లాంటి వ్యాధులను - తమ మానసిక శక్తి తో నయం చేసుకున్న వాళ్ళు ఎందరో వున్నారు. యిదే కాదు. ఎన్నో రకాల దీర్ఘ కాల రోగాలను - తమ మానసిక శక్తి పెంపొందించుకోవడం ద్వారా నయం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది వున్నారు.
మందులే వద్దని అనడం లేదు. డాక్టర్లు వద్దని అనడం లేదు. వాటినన్నిటేనీ మించిన రోగ నిరోధక, మరియు నివారక శక్తి మనలోనే వుందనడం నిర్వివాదాంశం - అంటున్నారు ఈ మహానీయులందరూ .
సంతోషం గా వుండడం వొక్క విషయం. చుట్టూ ఉన్న వారికి సంతోషం యివ్వడం - అంతకంటే ముఖ్య విషయం.
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుహ్ఖమే నరకమండ్రు తథ్యము సుమతీ - అన్నారు.
శాంతము, దయ, సంతోషము ఉన్న చోట రోగాలు రావు - ఎప్పుడో వచ్చినా త్వరగా పారిపోతాయి. యివి మీలో వుంటే - భూమిలోనే - మీరూ, మీ చుట్టూ ఉన్న వారూ - స్వర్గంలో ఉన్నట్టే.
వీటికి విరుద్ధమైనవి వున్నాయి. వాటిని గురించి - "కామ, క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యానాం దేహే తిష్టతి తస్కరాః" అని కూడా అన్నారు. వీటికి భయాన్ని కూడా జోడించుకోండి. యివి ఉన్న చోట - ఉన్న వారికి, వారి చుట్టూ ఉన్న వారికి రోగాలు తప్పవు. వచ్చేవి త్వరగా పోవు - ఎన్ని మందులు వాడినా.అంతే - అదే నరకం అన్న మాట.
- ఆరోగ్యాన్ని గురించి మరిన్ని విషయాలు మరో వ్యాసంలో
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి