19, నవంబర్ 2012, సోమవారం

PSORIASIS - GREAT WAYS TO GET RID OF - గొప్ప చిట్కాలు - సోరియాసిస్-యితర చర్మ సమస్యలు


skin Problems- Psoriasis - Good way to get rid of

చిన్న రోగాలు- పెద్ద సమస్యలు - గొప్ప చిట్కాలు 

సోరియాసిస్-యితర చర్మ సమస్యలు 


గత వొక దశాబ్దం గా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి.

హృద్రోగ సమస్యలు, ఊపిరి తిత్తుల వ్యాధులు , చక్కెర వ్యాధి, రక్త పోటు లాంటివి ఎన్నో - యిప్పుడు చాలా సాధారణమై పోయాయి.

వీటిలో దేనికీ - అల్లోపతీ వైద్యంలో - సరైన . పూర్తి నయం చేసే మందులే లేవు. పోగొట్టడం కాదు - ఎక్కువ బాధ పెట్టకుండా చేయడం వుండటం మాత్రమే వారు  చేయ గలుగుతున్నారు . దీన్ని వారు రోగాల మేనేజ్మెంట్ -అంటున్నారు 

యివి నయమైతే - వారి మందులకు విక్రయం వుండదు  గనుక వారు - యిదే మంచిది అనుకున్నట్టు    - వొక్కో సారి అనిపిస్తుంది .

హృద్రోగాలు రాకుండా కాపాడే మందులు ఆయుర్వేదంలో ఎన్నో వున్నాయి. అందులో - ప్రశస్తమైనవి "అర్జున" చెట్టు నుండి వచ్చే మందులు. అలాగే ఆశ్వ గంధ ; ఇలాంటి ప్రశ స్తమైన మందులు  చాలా రోగాలు రాకుండా కాపాడతాయి. వచ్చిన రోగాలనూ, క్రమంగా, తగ్గించేస్తాయి.

చదివే వారికి నా విన్నపం ఏమంటే - వీటిని గురించి - మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

సరే.  కొన్ని వ్యాధులు ప్రాణ హాని చేయవు కానీ. మానసికంగా చాలా బాధ పెడతాయి. అటువంటి వాటిలో - చర్మ రోగాలు ముఖ్యమైనవి. అందులో వొకటి సొరియాసిస్. యిది ఎందుకు వస్తుందో - యిదిమిత్థంగా  ఎవరికీ తెలీదు.

కానీ, మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో వొక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే - డ్రై స్కిన్ -వుంటే  యిది రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే - చలి కాలం ; ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే .

తెల్లవారి 5 గంటల కాలంలో - సూర్యుడి కిరణాల్లో - విటమిన్-డీ. ఎక్కువగా వుంటుంది.అది తగులుతూ వుంటే - చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు రావు.

అలాగే చర్మం పొడి గా కాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే - అలోవేరా, ఈవియాన్ లాంటి ఆయింట్మెంట్లు ఎక్కువ గా వాడడం వలన చాలా ప్రయోజనం కనిపిస్తుంది . వీటిలో విటమిన్.డీ. కూడా వుండే ఆయింట్మెంట్లు యిప్పుడు ఎన్నో మార్కెట్లో వున్నాయి. అవి చాలా మంచివి.

యివన్నిటితోబాటు - మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే - పసుపు కలసిన మంచి  ఆయింట్మెంట్లు -ఎన్నో మార్కెట్ లో వున్నాయి. ఉదాహరణకు, వీకో టర్మేరిక్ లాంటివి.  అవి - చర్మ సౌందర్యానికి అని చెబుతున్నారు. కానీ, చర్మ రోగాలకు, ముఖ్యంగా, సోరియాసిస్ కు బాగా పని చేయడం  నేను చూసాను.. సోరియాసిస్ వున్న వారు, యివి అన్నీ వొకే సారి వాడినా తప్పు లేదు. వాడి చూడండి. మీకు చక్కటి ఫలితం కనిపిస్తుంది.

యివి కాక, ఆయుర్వేదాలోనూ ,సిద్ధ వైద్యం లోనూ - చాలా మంచి మందులే వున్నాయి. ఉదాహరణకు - స్వామీ రాందేవ్ గారి వద్ద దొరికే మందులు , తై లాలూ బాగా పని చేస్తాయి. (కాయకల్పవటి తైలము, టాబ్లెట్లు , మహామంజుష్ట టాబ్లెట్లు లాంటివి). వీటన్నిటితో బాటు - టర్మరిక్, ఆలోవేరా  ఆయింట్మెంట్లు (విటమిన్.డీ కలసినవి ) తప్పక వాడండి. 

సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు అతి ముఖ్య వైద్యము - వాటిని గురించి వర్రీ కాక పోవడమే. ముఖ్యంగా - అది చర్మపు పైపొరకు మాత్రం వచ్చే వ్యాధి  - చర్మం లోని రెండో  పొరని కూడా అది బాధించదు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. లోపలి అన్ని అంగాలు బాగా పని చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి.

వీటిలో - మనలో వుండే భయము, సిగ్గు మాత్రమే ముఖ్య రోగం కాని - అవి రెండూ వదిలేస్తే - నిజమైన రోగం ఏమీ బాధించదు -అనేది గుర్తుంచుకోవాలి.

నిజానికి - చాలా రోగాలకు మనలోని భయము, సిగ్గు - మిగతా వారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో వొక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన  బాధ ఏమీ వుండదు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యండి.  మీకు తప్పకుండా తగ్గుతుంది. తగ్గుతుందన్న  నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి. 

చాలా రోగాలు మనో జనితమైనవి. మనసుతోనే తగ్గించుకోగలిగేవి.

మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే వుందన్న నమ్మకంతో చెయ్యండి. గెలుపు మీదే .

ఈ రోగాలున్న వారికి ప్రక్క నున్న వారు -వీరికి అన్ని రకాలుగా ప్రోత్శాహం యివ్వాలి. ఈ చర్మరోగాలు, ప్రక్క నున్న  వారికి ఎవరికీ రావు. వీలైతే వారికి ఆయింట్మెంట్లు మీరే పుయ్యవచ్చు. అది చాలా మంచిది.

మనకు వచ్చే రోగాలన్నీ పోగలిగేవే. యిది గొప్ప సూత్రం. ప్రతి రోగానికీ మందు వుంది. సగం మందు మనలోనే  వుంది. దాంతోనే పూర్తిగా పోవచ్చు కూడా. సగం మందు బయట వుంది. 

ధైర్యే , సాహసే, ఆరోగ్య లక్ష్మి. (అధైర్యే, భయే, అనారోగ్య ప్రాప్తి).


= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 





2 కామెంట్‌లు:

  1. మంచి ఉపయోగకరమైన విషయాల్ని ప్రస్తావించారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్య కు ధన్య వాదాలు. మీ బ్లాగ్ కు వెళ్లి చూసాను. చాలా బాగుంది.

      మనిషిని- రోగానికంటే భయం ఎక్కువ బాధిస్తుంది. భయం లేని వాడిని ఏ రోగమూ పెద్దగా బాధించదు. ఈ అంశం పైన వున్న మెడికల్ మిరాకుల్స్ చాలా వున్నాయి. కేవలం భయం లేక పోవడంతో, ఏ మందూ లేకుండా సంపూర్ణంగా కుదిరిన పెద్ద పెద్ద రోగాలు వచ్చిన, యిప్పుడు బాగున్న మనుషులు ఎంతో మంది వున్నారు.

      మన దేశంలో - ఆలస్యము, భయము - రెండూ పెద్ద సమస్యలే. భయ పెట్టే వారు, భయ పడే వారు ఎక్కువ.

      అయితే, మన దేశంలో - ఏ రోగమూ రాకుండా చేసుకోగల మందులు - అనేకం వున్నాయి. నిజంగా దివ్యౌషదాలే.

      అందులో - నాకు బాగా తెలిసినవి చాలా మందికి - తెలీనివి యిక్కడ కొన్ని పరిచయం చేస్తున్నాను.

      యివి కాక - యిక ముందు మన ఉపనిషత్తులు, గీత లాంటి వాటిలోని - గొప్ప అంశాలు - యిప్పటి మన సమస్యలకు పరిష్కారాలు - యివి ఈ బ్లాగులో పరిచయం చేయాలని అనుకుంటూ వున్నాను. యివి, ఆంగ్లంలో నా బ్లాగు - వైజ్ స్పిరిచువల్ ఐడియాస్ .బ్లాగ్ స్పాట్.కాం లో ఇప్పటికే ఎన్నో వున్నాయి.

      తొలగించండి