కొత్త రోగాలకు పాత మందులు
ఈ మధ్య ఎన్నో కొత్త కొత్త రోగాలూ వస్తున్నాయి. కొత్త కొత్త మందులూ వస్తున్నాయి.
మనకు తెలిసిన వాటిలో ప్రముఖం గా వుండే వైద్య విధానాలు - (1) అల్లోపతి (2) హోమియోపతి (3) ఆయుర్వేదం.
యింకా ఎన్నో వున్నాయి. యునాని, చైనీస్ ఆకుపంక్చర్ లాంటివి. కానీ మన దేశంలో, బాగా ఉపయోగంలో వుండేవి పై మూడూ.
నేను - అన్ని విధానాలనూ , ఎంతో, కొంత ఉపయోగించే వాడిని.
మూడూ కొన్ని, కొన్ని రోగాలకు ప్రత్యేక తరహాలలో ఉపయోగ పడతాయని నాకు అనిపిస్తుంది.
సర్జరీ కావాల్సిన పరిస్థితులలో, అల్లోపతి తప్పనిసరి. అలాగే మరికొన్ని రోగాలకూ అల్లోపతి బాగా పనికొస్తుంది. ఉదాహరణకి, కుక్క కాటు, పాము కాటు, కొన్ని జ్వరాలు, టీబీ లాంటి వాటికి అల్లోపతి మంచిది.
కానీ - చాలా రోగాలకు, అల్లోపతిలో సరి అయిన మందులు లేవు.
వాటిలో చాలా వాటికి ఆయుర్వేదంలో - చాలా మంచి మందులు వున్నాయి. కొన్నిటికి హోమియోపతి లో మంచి మందులు వున్నాయి.
ఆయుర్వేదం లక్షల ఏండ్ల అనుభవంతో వచ్చిన శాస్త్రం. మన దేశంలో పుట్టినది పెరిగినది. నా ఉద్దేశంలో తురుష్కుల , ఆంగ్లేయుల పాలన లేకుండా వుంటే యిప్పటికి ఆయుర్వేదంలో, ఎన్నో పరిశోధనలు జరిగేవే. ఎన్నో రకాల ప్రక్రియలు వచ్చేవే .
యిప్పుడైనా - భారత ప్రభుత్వం వారు - ఈ శాస్త్రానికి బహుళ ప్రాధాన్యత యిచ్చి, పరిశోధనలను ప్రోత్సహించ వలసిన అవసరం ఎంతైనా వుంది.
ఈ మధ్య - నాకు వచ్చిన సమాచారాల ప్రకారం - డెంగ్యూ వ్యాధి కి అల్లోపతి లో పెద్దగా మందులు లేవు. కానీ, ఆయుర్వేదం ప్రకారం - బొప్పాయ చెట్టు ఆకుల రసం -రోజుకు రెండు ఆకుల రసం యిస్తే చాలు, వెంటనే - రక్తం లోని ప్లేట్లెట్ల సంఖ్య గణ నీయంగా పెరిగి, జ్వరం కూడా తొందరాగా వుపశమిస్తుంది.
నాకు వచ్చిన ఈ సమాచారాన్ని నేను నాకు తెలిసిన వారందిరికీ పంపించాను. వారిలో నాకు బాగా తెలిసిన వారింట్లో దీన్ని అమలు చెయ్యడము జరిగింది . చాలా సత్ఫలితాలు వచ్చినట్టు వారి నాకు చెప్పడమూ జరిగింది.
బొప్పాయ ఆకులు, పండ్లు |
అందు వలన నాకు తెలిసిన ఈ వైద్యాన్ని పాఠకులందరికీ అంద జేస్తున్నాను. అల్లో పతి వైద్యం వద్దని అనడం లేదు. డాక్టర్ దగ్గరికి పోవద్దని చెప్పడం లేదు. తప్పకుండా వెళ్ళండి. కానీ, వొక ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడైన యాష్ చోప్రా గారిని కూడా అల్లోపతి మందులు రక్షింప లేకపోయాయి . కనుక మన దేశీయ వైద్యం, మన ప్రక్కనే దొరికే బొప్పాయి ఆకుల రసం త్రాగడం, మనల్ని రక్షిస్తే మంచిదే కదా. అందుకని రాస్తున్నాను.
అలాగే - వొక ఉపన్యాసంలో, స్వామీ రాందేవ్ గారు తిప్పతీగ రసం, డెంగ్యూ కు బాగా ఉపయోగపడుతుంది - అన్నారు. దీన్ని అమృతారిష్టము అని- టాబ్లెట్ల రూపంలో కూడా అమ్ముతారు. యిది జ్వరం వున్న వారు తీసుకుంటే - మంచిది. అసలు, ముందుగా తీసుకునే వారికి వ్యాధులు రాకుండా చేయగల సామర్థ్యం వుంది తిప్ప తీగకు.
ఈ వైద్యాలు మీకు తెలిసిన అందరికీ చెప్పండి.
అలాగే - ఆయుర్వేదంలో - మరెన్నో అద్భుతమైన మందులు వున్నాయి. నాకు తెలిసిన వాటిలో " అర్జున" అన్న మందు వొకటి. హృదయానికి, అనేక రకాలుగా శక్తి నిచ్చి, అనేక హృద్రోగాలనుండి - కాపాడగల సామర్థ్యం వుంది "అర్జున" కు.
హృద్రోగాలు వున్న వారైనా సరే , భవిష్యత్తులో - రావచ్చునేమో అన్న శంక వున్నా వారైనా సరే - అలాంటి ఏ శంకా లేని వారైనా సరే - "అర్జున" వాడడం చాలా మంచిది.
నేను వాడుతున్నాను. నాకు తెలిసిన వారు చాలా మంది వాడుతున్నారు.
అర్జున ఆకులు, పండ్లు, చెట్టు బెరడు |
యింటర్ నెట్ లో దీన్ని గురించి విస్త్మృత సమాచారం వుంది.
ఉదాహరణకు :
ఈ లింక్ క్లిక్ చేసి చూడండి ఇలాంటి మరిన్ని వున్నాయి. మీరు ఏ ఆయుర్వేద వైద్యుడిని అడిగినా చెబుతారు దీన్ని గురించి. - అయితే యిప్పుడు , దీని పై మరిన్ని పరిశోధనలు జరగడము, మరిన్ని సత్ఫలితాలు కనుగొనడమూ జరుగుతోంది.
అలాంటిదే - మరొక దివ్యౌషధము -ఆశ్వ గంధ - అన్నది . యిది కూడా ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి ఉపకరించే ఔషధం. యిది, ఎన్నో, ఎన్నో రోగాలకు, బలహీనతలకు చాలా, చాలా బాగా ఉపయోగ పడే ఔషధం. యిదీ నేను వాడుతున్నాను. చాలా మంది వాడుతున్నారు.
ఆశ్వ గంధ చెట్టు బెరడు, ఆకులు, పండ్లు |
దీన్ని గురించి కూడా యింటర్ నెట్ లో విస్త్మృత సమాచారం వుంది. ఉదాహరణకు :
యిలా ఎన్నో దివ్యౌషధాలు ఆయుర్వేదంలో వున్నాయి. రోగాలు రాకుండా కాపాడేవి కొన్ని. దీర్ఘ రోగాలను కూడా పోగొట్టేవి కొన్ని. వీటికి - అల్లోపతి మందులకున్న -సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. నిజానికి వొక రోగానికి తీసుకున్న మందు, మరెన్నో రోగాలకు కూడా పనికొస్తుంది. అయితే - -ఏదైనా మోతాదు మించి తీసుకోవడం పనికి రాదు. మితంగా తీసుకుంటే - అమృతం.
అమితంగా తీసుకునేది ఏదైనా తప్పే కదా.
నాకు తెలిసిన వాటిలో, చాలా మంచివి అని నేను నమ్మే వాటిని - కొన్నిటిని యిక్కడ చెప్పాను.
యివన్నీ మనకు దొరికేవే. మంచి ఆయుర్వేద తయారీ కంపెనీలు తయారు చేస్తున్నవే. యింట్లోనూ - చేసుకో గలిగేవే.
ఆరోగ్యమే మహా భాగ్యం కదా.
మీకు తెలిసిన వారికి చెప్పండి. ఎంత మంది ఆరోగ్యం బాగు పడితే అంత మంచిది.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
viluvaina samacharam share chesukunnandulaku thanks!
రిప్లయితొలగించండిnaaku challa atmeeyulaina vaariki eteevala jvaram vasthe papaya raw juice vadaamu! chaala manchi phalitham vachindi...
nenu kooda arjuna, aswagandha vadutoo arogyamga vunnanu!
అనూరాధ గారూ,
తొలగించండిమీ వ్యాఖ్యకు చాలా ధన్య వాదాలు. మీరిచ్చిన ప్రోత్సాహానికి సంతోషం
నిజానికి యిటువంటి, చాలా సులభమైన , మనకు చాలా దగ్గరున్న దివ్యౌషదాలు ఎన్నో వున్నాయి.
వాటిల్లో - వాటి ఫలితాన్ని నేను బాగా చూసిన వాటిని గురించి మొదట రాస్తున్నాను.
మీకు తెలిసుండొచ్చు. భగవద్ గీతలో -కూడా రోగాలు రాకుండా కాపాడుకునే పద్ధతులు ఎన్నో వున్నాయి.
అవీ ముందు ముందు రాస్తాను.
దయచేసి మిగతా పోస్టులు కూడా చదువుతూ ఉండండి.
ఆలస్యంగా సమాధానం యిచ్చినందుకు క్షమించండి.
చాలా సంతోషం. దీర్ఘదర్శి కూడా బ్లాగు కూడా మీ "తెలుగు వారి బ్లాగులు" లో చేర్చండి. మీకు తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా - నా హార్దిక శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి