మీరు ఎవరి మాట వినాలి?
మీ మాట ఎవరు వింటారు?
ఆకాశము మీ మాట వింటుందా? వినదు.
భూమీ మీ మాట వినదు.
నీరూ మీ మాట వినదు.
గాలీ మీ మాట వినదు.
అగ్నీ మీ మాట వినదు.
మీ పొరుగు వారు మీ మాట ప్రకారమే నడుస్తారా?
లేదు.
అంతెందుకు. మీ భార్యా (భర్తా) పిల్లలు కూడా కొద్ది సార్లు మాత్రమే మీ మాట వింటారు.
మిగతా సమయాలలో మీరు వారి మాట వినాలని వారి పట్టుదల.
మీ కుక్క కూడా అన్ని విషయాల్లో మీ మాట వినదు.
ప్రపంచము లోని ఎవరూ, ఏదీ, మీ మాట వినటం లేదనేది తెలుస్తూనే వుంది కదా!
సరే. కనీసం, మీరు మీ మాట వింటున్నారా?
అదీ లేదు తెలుసా?
ఈ నిమిషం లో మీరు ఎం చేస్తే మంచిదో చెప్పండి చూద్దాం.
ఇదా? అదా? ఇంకోక్కటా? మరోటా? సరిగ్గా తేల్చి ద్వైదీ భావం లేకుండా చెప్పండి మరి.
చెప్పలేరు. మీకు నిజంగా ఏది కావాలో మీకు కూడా సరిగ్గా తెలీదు.
కాబట్టి మీరు కూడా మీ మాట ప్రకారం నడుచు కోవడం చాలా కష్టం.
ఎందుకు?
మీ మాట వెనుక మీ మనసు వుంది.
మనసు నిండా ఆలోచనలే.
ఒకే ఆలోచన వుంటే, మనసు ప్రకారం మాటా, మాట ప్రకారం మీరూ ఉండొచ్చు.
ప్రయత్నించి చూడండి చూద్దాం.
ఒకే ఒక విషయాన్ని గురించి ఒక అయిదు నిమిషాలు మరో ధ్యాస లేకుండా ఆలోచించండి చూద్దాం.
చేయలేరు. మీరే కాదు. దాదాపు ఎవరూ చేయలేరు.
ఎం దుకంటే - మీ మనసు - ఏ వొక్క ఆలోచన పైనా - స్థిరంగా - కొంత సేపు కూడా నిలువలేదు.
అంటే -
మీరే మీ మాట వినలేరు; వినరు. అంతే మరి.
చిన్న మాట.
మీరు నా మాట వినొచ్చు. నేను మీ మాట వినొచ్చు.
కాని మీ మాట మీరు, నా మాట నేను వినడం చాలా కష్టం!!
అదండీ మనసు చేసే గారడీ.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి