18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

what are we? = WHAT DO WE OWN? = MANA SWANTHAM AINADHI EMITI?= TELUGU

మన స్వంతము ఐనది ఏమిటి? ఎక్కడుంది?

మనం పుట్టినప్పుడు ఒక్క అడుగు ఎత్తు వుండే వాళ్ళం.
పెరిగే కొద్దీ అయిదు  నుండీ  ఆరు ఆరున్నర అడుగుల ఎత్తు వరకూ ఎదిగాం.
మనకు తెలుసు, ఇదంతా భూమి నుండీ వచ్చిన ఆహారము నుండీ గాలి నుండీ నీళ్ళ నుండీ వచ్చిందని.

ప్రతి రోజూ మళ్ళీ   ఎక్కడి నుండీ వచ్చిన్దో  అక్కడికే  తిరిగి వెళ్లి పోతూ కూడా వుంది.
అందుకే మళ్ళీ మళ్ళీ ఆహారం తినాలి. నీళ్ళు తాగాలి. గాలి పీల్చాలి.
లేదంటే ఈ శరీరం మీ దగ్గర ఉండదు. దీని ఉనికి మీ దగ్గర కాదు. 
మీ చుట్టూ వున్నా పంచ భూతాల దగ్గర. అక్కడి నుండీ వస్తుంది. అక్కడికే వెళ్లి పోతూ వుంటుంది.
 మీధన్నట్టు, మీ దగ్గర వున్నట్టు మీరు భ్రమ పడుతూ వుంటారు.

మీ మనస్సు కూడా మీదు కాదు. నాలుగు రోజుల పాటు ఆహారం తినకండా వుండండి.
మీ మనస్సు ఖాళీ అయి పోతుంది. మీకేమీ జ్ఞాపకం ఉండదు.

ఈ శరీరమూ, ఈ మనస్సూ మీరు కాదు. మీదీ కాదు. ఇవి ఏవీ మీరు నిలుపుకోలేరు.
కనిపించే శరీరమూ మీది కాదు. అనిపించే మనస్సూ మీది కానప్పుడు, మరి మీరు ఎవరు?
ఇదండీ రమణ మహర్షుల వారిలో, బుద్ధుల వారిలో, మరెంతో మంది జ్ఞానుల మనస్సులలో  తలెత్తిన ప్రశ్న.

ఇది తెలియాలంటే  అప్పుడప్పుడూ కాస్సేపు కళ్ళు మూసుకుని, మనస్సు లోపలి కి వెళ్ళాలి.
మనస్సును కాస్త పరిశుభ్రం చెయ్యాలి.
పరిశుభ్రమైన మనస్సును ఈ ప్రశ్న అడగాలి.
ప్రశాంతంగా ప్రపంచమంతా చూడాలి.
ఎక్కడ చూసినా మీరే.
అంతా మీరే. అయినా ఏదీ మీరు కాదు. ఏదీ మీది  కాదు.
అంతటా ఏదో జగన్నాటకం నిరంతరం జరిగి పోతూ వుంది.
అంతా మారి పోతూ వుంది. మీశరీరం, మనస్సులతో సహా.

కానీ మారని మీరు ఎక్కడో వున్నారు.
ఆ మారని మీరు మాత్రమే నిజమైన మీరు.
మిమ్మల్ని మీరు కనుక్కోండి.
మీరు అంతటా వున్నారు.
మీకు పుట్టుక, చావు రెండూ లేదు. మీరు ఎల్లప్పుడూ వున్నారు; వుంటారు.
ప్రతి ప్రాణి లోనూ  ప్రతి వస్తువు లోనూ అంతర్లీనంగా దాగి వున్నా చైతన్యం  మీరే.
మీరు ప్రపంచం లోని మహదానందము యొక్క అంశం.
మీరు -
సత్ చిత్ ఆనంద స్వరూపులు.
ఎల్లప్పుడూ వున్నా,వుండే చైతన్య, ఆనంద స్వరూపులు.
అది తెలుసు కోవదానికే మన ఈ ప్రయత్నాలన్నీ.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి