క్యాన్సర్ మహమ్మారి పట్ల
మన కర్తవ్యం ఏమిటి ?
ఈ మధ్య, కాన్సర్ వ్యాధి చాలా ఎక్కువై పోతోంది ఎవరికి వస్తుందో , ఎప్పుడు వస్తుందో , ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. చిన్న పాపల నుండి ముసలి వారి వరకు - ఎవరికైనా , ఎప్పుడైనా రావచ్చు . వచ్చిన వారి కుటుంబాలలో అనంతమైన భయం , నిరాశ చోటు చేసుకుంటూ వున్నాయి.
ఆలోపతీ చికిత్స మహా నగరాల్లోనే ఉంది. గ్రామాల్లోని వారు , చిన్న ఊర్లలో వున్న వారు ఈ ఖరీదైన అలోపతీ చికిత్స పొందడం చాలా కష్టంగా వుంది. ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో తెలియదు . ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు. చివరికి పూర్తిగా నయమయినట్టా , కాదా అని కూడా తెలియదు. మళ్ళీ తిరగబెడుతుందా అన్న సంగతీ తెలియదు.
కాన్సర్ వ్యాధిని నయం చెయ్యడానికి ఆపరేషన్, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్మ్యూనోథెరపీ, టార్గెట్టెడ్ థెరపీ, హార్మోన్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, ప్రెసిషన్ మెడిసిన్ లు ఆలోపతీ వైద్యంలో ప్రధానంగా వుంటున్నాయి. యివన్నీ కాన్సర్ కాస్త తక్కువ స్టేజి లో వుంటే బాగా పనిచేస్తాయి. ముదిరిన తర్వాత వీటి ప్రయోజనం ఎలా వుంటుందో చెప్పలేం .
ప్రధానంగా ,కాన్సర్ ను TNM సిస్టం ప్రకారం, సైజు ను బట్టి మొదట (T సిస్టం) 4 స్టేజి లుగా గుర్తు పడతారు. 1 అంటే కాన్సర్ గడ్డ చిన్నది, 4 అంటే బాగా పెద్దది అని అర్థం. తరువాత , ఎన్ని లింఫ్ నోడ్స్ కు ప్రాకింది తెలుసుకుని (N సిస్టం ), 0 నుండి 3 వరకు నంబర్స్ యిస్తారు. M సిస్టం ప్రకారం - ఒక చోటి నుండి మరోచోటికి కాన్సర్ ప్రాకిందా అని నిర్ణయిస్తారు . 0 అంటే ఒకే చోట ఉంది . 1 అంటే మరో చోటికి కూడా ప్రాకింది అని అర్థం . ఇవన్నీ రక రకాల టెస్టులు , స్కాన్ ల ద్వారా తెలుసుకుంటారు.
ఆ తరువాత , వైద్య పధ్ధతి కాన్సర్ స్పెషలిస్ట్స్ నిర్ణయిస్తారు . కాన్సర్ ను మొదట్లోనే గుర్తు పట్టడానికి కొన్ని వైద్య విధానాలు వున్నాయి . ఫెకెల్ ఆకల్ట్ టెస్ట్ , కాలోనోస్కోపీ లాంటివి 50 ఏళ్ళ పైబడ్డ వారు చేయించుకోవాలి. ఆడవాళ్లు మామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవాలి . ఇలాంటి టెస్టులు అన్ని వూళ్ళలో వున్నాయో లేదో తెలీదు.
సరే . మనమేం చెయ్యవచ్చు - అది చూద్దాం.
కాన్సర్ వ్యాధి ని కనిబెట్టడానికి C.A.U.T.I.O.N. అన్న పదం ద్వారా మనం చెయ్యదగిన సూచనలు చెబుతారు.
C – Colorectal cancer.మన మల మూత్ర విసర్జన లలో ముఖ్యమైన మార్పులు మనం గమనించాలి . దీని ద్వారా కాన్సర్ రావడాన్ని ముందుగా తెలుసుకోవచ్చు . ఈ మార్పులు కొలెరెక్టల్ కాన్సర్ కు గుర్తు కావచ్చు . కాన్సర్ మాత్రమే కాదు. jaandice లాంటి వ్యాధులు కూడా మనం సులభంగా చెయ్య గలిగే మల మూత్ర పరిశీలన ద్వారా కనిబెట్ట వచ్చు. కలర్ మారినా , రక్తం పడుతున్నా , మరే మార్పు వున్నా మనం చూడాలి . డాక్టర్ ను అడగాలి. 4 నెలలకు ఒక సారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసుకోవాలి.
A – A sore that does not heal in a normal amount of time. చర్మము , నోరు లాంటి ప్రదేశాల్లో వచ్చి , ఎన్నాళ్లయినా ఆరని పుండ్లు వుంటే అక్కడ కాన్సర్ రావచ్చు అనడానికి అవి సంకేతం .వీటిని మాన్పుకోవాలి. డాక్టర్ ను శ్రద్ధగా ముందస్తుగా అడగాలి .
U – Unusual bleeding or discharge. మల,మూత్ర , వెజైనా లాంటి ద్వారాల గుండా వచ్చే అధిక రక్త స్రావము , మరేదైనా స్రావము - వాటికి సంబంధించిన ఏ బాహ్య లేదా అంతర్ అంగాలలో వచ్చే క్యాన్సర్లకు సంకేతం .వీటిని గురించి కూడా జాగ్రత్త పడాలి.
T – Thickening of breast tissue or a lump. స్త్రీలలో రొమ్ముల్లో పెరిగే టిష్యూ లు,గడ్డలు అక్కడ కాన్సర్ రావడానికి సంకేతం కావచ్చు. అలాగే మగవారిలో టెస్టికల్స్ లో గడ్డలు పెరగడం కూడా.యివి మనమే అప్పుడప్పుడూ చూసి, గడ్డలు వుంటే , డాక్టర్ ను కన్సల్ట్ చెయ్యాలి . యివి కాన్సర్ గడ్డలే కానవసరం లేదు . మామూలు క్రొవ్వు లాంటి గడ్డలు కూడా కావచ్చు.
I – Indigestion and/or difficulty IN swallowing. అజీర్తి కానీ, ఆహారం మింగ లేక పోవడం తరచుగా ఉంటే - గొంతునుండి ప్రేవుల వరకు ఎక్కడైనా కాన్సర్ రావడానికి సంకేతం కావచ్చు.యివి కూడా మనం మందుల ద్వారా మొదటనే పోగొట్టుకుంటే మంచిది.
O – Obvious changes to moles or warts. చర్మము పైన మచ్చలు , పులి పురులు లాంటివి పెరగడం కూడా చర్మపు కాన్సర్ కు సంకేతం కావచ్చు .ఇలాంటివి వుంటే , స్కిన్ స్పెషలిస్ట్స్ ద్వారా సులభంగా , బాధ లేకుండా, మొదటనే తీసేసుకోవచ్చు. అశ్రద్ధ మంచిది కాదు.
N – Nagging cough. 4 వారాల మించి తగ్గని దగ్, గు గొంతు మరియు ఊపిరి తిత్తుల కాన్సర్ కు సంకేతం కావచ్చు.దగ్గుకు మంచి మందులు వున్నాయి . వెంటనే పోగొట్టుకొండి. వారం దాటితే డాక్టర్ ను తప్పకుండా చూడండి.
యివన్నీ తప్పకుండా కాన్సర్ ఉందని చెప్పడానికి ఆధారాలు , నిదర్శనాలు కావు . కానీ , యివన్నీ , మనం ఆరంభ దశలోనే పోగొట్టుకోవడానికి వుపకరించే మంచి సంకేతాలు .
ఇక , కాన్సర్ రాకుండా వుండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం .
దీనికి సాధారణంగా 10 ముఖ్య సూత్రాలు చెబుతారు .
1. పొగాకు, పొగాకు పొగ విడిచి పెట్టండి. యివి త్రాగే వారి నుండి మనకు వచ్చే పొగ మరీ అనర్థ దాయకం . మనదేశంలో మనషులు తిరిగే ప్రాంతాలలో పొగ త్రాగడం నిషేధించారు . మీరు మనుషులే గనుక పొగ త్రాగడం మానండి . మీకు, మీ వారికీ, చుట్టూ వున్న వారికీ ప్రమాదం తప్పించండి.
2. మీ భోజన పద్ధతులు బాగుండాలి. saturated fat, red meat లాంటివి విడిచి పెట్టండి. పండ్లు కూరగాయలు, ధాన్యాలు ఎక్కువ చేయండి. నూనెలో వేయించినవి, కాల్చిన ఆహారాలు బాగా తగ్గించండి.
3. శారీరక పరిశ్రమ , వ్యాయామము తగినంతగా వుండాలి. యోగా చాలా మంచిది.
4. శరీరం బలంగానూ, సన్నగానూ వుండేలాగా చూసుకొండి. Obesity - అంటే శరీరంలో భాగాల్లో కొవ్వు పేరుకు పోవడం కాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది.
5. మద్యపానం వదిలేయండి . లేదా , బాగా తగ్గించండి.
6. రేడియేషన్ - సెల్ ఫోన్లు , సెల్ టవర్స్ , స్కేన్ టెస్టులు యివన్నీ రేడియేషన్ కలిగించేవి. వీటికి దగ్గరుండడం బాగా తగ్గించండి. రాత్రి పూట సెల్ ఫోన్లను మీకు తప్పకుండా దూరంగానే వుంచండి.పిల్లలకు సెల్ ఫోన్లు ఆట వస్తువులు కాకూడదు. వారి బలహీనమైన చెవి నరాల పైన , మెదడు పైన రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది . దయ చేసి సెల్ ఫోన్లు పిల్లలకు ఇవ్వకండి. యిచ్చి వాళ్ళను అల్పాయుష్కులు , రోగ గ్రస్తులు చెయ్యకండి
7. కొన్ని పారిశ్రామిక విషాలు మన చుట్టూ వున్నాయి. ఆస్బెస్టాస్,బెంజీన్, లాంటివి . వాటిని దూరంగా వుంచండి.
8. వైరస్ ఇన్ఫెక్షన్ లు రాకుండా చూసుకోండి.
9. చిన్న, చిన్న డోసు లలో, ఆస్పిరిన్ అప్పుడప్పుడూ తీసుకోవడం కాన్సర్ రాకుండా చూస్తోంది - అంటారు.
10. విటమిన్ డ్, ఏ, బి 17 లు కాన్సర్ రాకుండా కాపాడతాయని అంటారు .
యివి కాక , ఈ మధ్య తెలిసొస్తున్న మన నాటు వైద్యాలు కొన్ని చాలా మంచివని తెలుస్తున్నాయి . యివి కాన్సర్ వున్నా . లేకున్నా , రాకుండా వుండడానికి , వస్తే నయం కావడానికి మనం పాటించ గలిగేవి .
1. గచ్ఛ కాయ పప్పు ఒకటి , దానితో 4 మిరియాల గింజలు పొడి చేసి - రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకుంటూ ఉంటే - కాన్సర్ గడ్డలు, ఇతరమైన ఏ గడ్డలు శరీరంలో వున్నా , కరిగిపోతాయని, ఒక వైద్య నిపుణుడు , యిప్పటికి వంద సార్లయినా చెప్పాడు. యిది చెయ్యడం చాలా మంచిదని నా అభిప్రాయం .
2. సముద్ర పాల ఆకు రసం రోజుకు రెండు సార్లు తీసుకుంటూ ఉంటే - కొన్ని నెలలలో కాన్సర్ నయమవుతుందని ఎంతో మంది చెబుతున్నారు. యిప్పుడు వీటి చూర్ణము , ట్యాబ్లేట్ల్ ఇంటర్నెట్ ద్వారా తెప్పించుకోవచ్చు .
3. ఒకటిన్నర కిలోల కారట్లు , రసం తీసి, ఒక రోజులో త్రాగాలి . యిలా ప్రతి రోజూ చేస్తూ వుంటే కొన్ని నెలలలో కాన్సర్ పూర్తిగా నయమవుతుందని చాలా మంది చెబుతున్నారు.
4. గో మూత్రము పరిశుద్ధి చేసి తీసుకుంటే కాన్సర్ నయమవుతుంది -అని చాలా మంది చెబుతున్నారు .
5. పసుపు, పుదీనా రసము, గార్లిక్ , జింసెంగ్ , అల్లము, వెల్లుల్లి -యివన్నీ కాన్సర్ రాకుండా కాపాడే దివ్య ఔషధాలే . యివి మనం వాడాలి . కాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలి.
5. యివన్నిటినీ మించి మీ యిళ్ళలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం , ధైర్యం పెంచుకోవడం , ఆరోగ్యకరమైన , ఆహ్లాద కరమైన కుటుంబంగా వుండడం - చాలా ముఖ్యం .
సర్వే జనాః సుఖినో భవంతు
ఆరోగ్య ప్రాప్తి రస్తు
= మీ
ఉప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి