కామ్ప్రెహెన్సివ్ ట్రీ టైజ్
ఆన్ పతంజలి యోగ సూత్రాస్
వొక్క సంవత్సరంగ దీర్ఘదర్శి తెలుగు బ్లాగ్ మౌనం గా వుండవలసి వచ్చింది . అందుకు కారణం యిదో - నేను రాసిన ఈ ఆంగ్ల పుస్తకం :
ఈ పుస్తకం రాయడానికి నాకు 2-3 సంవత్సరాల పైనే పట్టింది . 740 పేజీలు A 4 సైజ్ పుస్తకం యిది . అంతా పతంజలి రాసిన యోగ సూత్రాల గురించే . నాకు తెలిసినంత వరకు ,యోగ సూత్రాల గురించి యింత వివరణగా ,సిద్ధాంత పరంగానూ, ఆచరణ పరంగానూ చెప్పిన పుస్తకం మరొక్కటి లేదు .
వీటిని - యోగ నిష్ణాతులైన రామకృష్ణ మిషన్ స్వామీజీ లకు, మిగత యోగా గురువులకు , లైబ్రరీ లకు యూనివర్సిటీ లకు పంపించడం జరిగింది. చాలా మంది రామకృష్ణ మిషన్ స్వామీజీలు తమ ఆశీస్సులు , తమ హర్షం , తమ ప్రోత్సాహాలను చాలా బాగా వ్యక్తీకరించారు (లెటర్ల ద్వారా, ఫోన్ కాల్ ద్వారా , ఈ మెయిల్ ద్వారా నాకు ఎంతో ప్రోత్సాహం యిచ్చారు. అలాగే ద్రావిడియన్ యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ గారు కూడా ఫోన్లో తమ ప్రోత్సాహం వ్యక్తీకరించారు. ఇంకా , ప్రతి రోజూ, ఈ ప్రోత్సాహ వాహిని సాగుతూనే వుంది యిప్పటి వరకూ .
పూరీ రామకృష్ణ మిషన్ స్వామీజీ గారు, స్వామీ పరిశుద్ధానంద యిలా అన్నారు :
"ఈ పుస్తకం అత్యున్నతమైన సెల్ఫ్ హెల్ప్ పుస్తకం అనటం లో సందేహం లేదు .
"ఈ అద్భుతమైన వివరణాత్మక పుస్తకం లో యోగా ను గురించి మీ రెంత అధ్యయనం చేసారో బాగా తెలుస్తూ వుంది ... యిది యోగా ను దేశ విదేశాల్లో వ్యాపింపజేయడానికి ,చాలా బాగా ఉపయోగ పడగలదు . అందులోనూ , మన ప్రధాన మంత్రి గారు పోయిన సంవత్సరం లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరంభించిన నేపథ్యంలో , దీని ఉపయోగం చాలా వుంది
.
"యింత అత్యంత ఉపయోగకరమైన పుస్తకం మానవాళి కి అందించడానికి మీరు పడ్డ శ్రమకు మా హృదయపూర్వక సంతోషాన్ని వెలి బుచ్చుతున్నాము .
"రామకృష్ణ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు వుండుగాక ...... "
యిది స్వామీజీ గారు వ్రాతపూర్వకంగా అంగ్లంలో రాసి పంపారు . దాదాపు యిలాగే మదురై , బెంగుళూరు స్వామీజీలు ఫోన్ చేసి నాతో మాట్లాడి ఎంతో ప్రోత్సహించారు . అలాగే ద్రావిడియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఫోన్ చేసి చాలా బాగా అభినందించారు; ప్రోత్సహించారు.
నా వరకు నాకు - నా శ్రమ, ఈ అభినందనల పరంపర అన్నీ ఈశ్వరార్పణం. శివునాజ్ఞ లేనిది చీమైనా కదలదు . ఆయన ఆజ్ఞ అయితే ఏదైనా జరుగుతుంది . అంతే .
అయితే , మానవ ప్రయత్నం లేనిదే దైవ సాహాయ్యం వుండదు కదా . మన ప్రయత్నం వుండాలి . నేను యిది పూర్తిగా నమ్ముతాను .
ఈ పుస్తకం యింకా కొంత మంది మహానుభావుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తోంది . ఆ తరువాత నే , మార్కెట్ లో విక్రయాలు, యివన్నీ .
ఈ పుస్తకం లో -వొక్కొక్క యోగ సూత్రానికీ పూర్తి వివరణ యివ్వడమే కాకుండా, ఆ సూత్రప్రకారం సాధకుడు ఆచరించవలసిన , పాటించ వలసిన ఎక్సర్సైజ్ లు కూడా యివ్వడం జరిగింది . అంటే - సూత్రం చదివిన వెంటనే - ఆచరణలో కూడా పెట్టె య్యడమే, తద్వారా , దాని పూర్తి ఫలితాన్ని పొందడమే పుస్తకం వుద్దేశ్యం . చాలా సూత్రాలకు యిలా యివ్వడం జరిగింది .
ప్రతి దినం వొక యోగ సాధకుడుగా మీరు ఆచరించ దాగిన దైనిక చర్య కూడా సులభంగా, ఆచరణ యోగ్యంగా , మీ టైం ప్రకారం చెయ్య దగినట్టుగా, యివ్వడం జరిగింది . అయినా పతంజలి ఆదేశించిన నియమాలన్నీ పాటించ డమూ జరిగింది . కొండల్లో, కోనల్లో, గుహలలో, అరణ్యాలలో మాత్రమే కాదు , ఇళ్ళల్లో కూడా యోగా పూర్తిగా ఎలా సాధించ వచ్చో చెప్పడం జరిగింది .
పతంజలి మహర్షి చెప్పింది మాత్రమే కాక , శ్రీకృష్ణ భగవానుడు, ఉపనిషత్తులు, శంకరాచార్యులు - యోగాచరణ గురించి చెప్పినవి కూడా యిందులో విశదంగా పొందు పరచడం జరిగింది .
అష్టాంగ యోగా కొరకు - మీరు ఈ పుస్తకం దాటి పోననవసరం లేకుండా వుండటమే నా వుద్దేశ్యం . సిద్ధాంత పరం గానూ , ఆచరణ పరంగానూ , ఈ పుస్తకం చాలు - అన్నంతగా వుంటుంది . అంటే , గురువు వద్దని చెప్పటం లేదు . కొంత గురు ముఖంగా నేర్చుకుంటే మేలు . కానీ, మీ వూళ్ళో, మీ దగ్గర్లో ఎక్కడా , గురువే లేకుంటే ? యోగా మర్చిపోవాలా ? అక్కర్లే దు . అప్పుడూ యోగా చెయ్యొచ్చు . చెయ్యాలి . యోగా భారత దేశం ప్రపంచానికిచ్చిన గొప్ప విజ్ఞానం . యిది అందరికంటే మనమే ఎక్కువగా నేర్చుకోవాలి .
అష్టాంగ యోగా అంటే - శరీరాన్ని రకరకాలుగా బంధించే విన్యాసాలు కాదు . యిది మొదట మనకు తెలియాలి. ఆ విన్యాసాల అవసరం పతంజలి అష్టాంగ యోగా లో చాలా తక్కువ . దాదాపు అవసరం లేనంత తక్కువ . యోగా అనేది మనసుతో మనం ఆడే ఆట . మనసును మన అధీనం లో సంతోషంగా వుంచుకునే విజ్ఞానం . ఆ పైన మనసును దాటి, మనలను గురించి మనం పూర్తిగా తెలుసుకునే విజ్ఞానం యిది .
ఇదండీ కథ...
సర్వే జనాః సుఖినో భవంతు
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి