శేషాచలం లో మానవ హక్కులు
సామూహిక హక్కులు
శేషాచలం అడవుల్లో యెర్ర చందనం వృక్షాలను అక్రమం గా కొట్టడమూ , ఆ కలపను అక్రమంగా రవాణా చెయ్యడమూ చాలా కాలం గానే జరుగుతూ వుంది . కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకు పట్టించుకోలేదో , ఎవరు చెబుతారు ?
యిప్పుడు చంద్రబాబు గారు ముఖ్య మంత్రి గా వచ్చారు . తెలంగాణా విడి పోయిన తర్వాత , రాష్ట్రానికి పెద్దగా నిధుల కొరత అనే సమస్య కూడా వచ్చి పడింది.
మొట్టమొదటి నుండి ముఖ్య మంత్రి గారు, మిగతా మంత్రులూ చెబుతూనే వున్నారు - వొక్క ఈ యెర్ర చందనం అక్రమ రవాణా ను నిలిపి ప్రభుత్వ పరంగా దాన్ని అమ్మ గలిగితే , ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్ధిక సమస్యలు తీరుతాయని .
ఎన్నో వేల, లక్షల కోట్ల విలువ గలిగిన ఈ యెర్ర చందనం - స్మగ్లర్ల చేతిలో పడి - ఆంధ్ర ప్రజల వుమ్మడి సొత్తు , స్మగ్లర్ల సొత్తుగా మారి పోతూ వుంది . యింత విలువ గలిగిన, ఆంధ్ర ప్రజల వుమ్మడి సొత్తు దొంగలు దోచుకు పోతూ వుంటే , అది ప్రజలందరి మానవ హక్కుల ఉల్లంఘన కాదా ? యిది నిలపడానికి మానవ హక్కుల సంఘాలు ఏం చేశాయి ? ఏం చేస్తున్నాయి ? దీన్ని గురించి వారెవరికీ ఏమీ పట్టినట్టు లేదు . అయ్యా ! ఈ యెర్ర చందనం చంద్రబాబు సొత్తు కాదు . మీ సొత్తే . అది పోతే , మీ అందరి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే .
వ్యక్తి హక్కులూ ముఖ్యమే . కానీ , సామూహిక హక్కులు అంత కంటే ముఖ్యం . అది పట్టించుకోరా ?
సరే . ప్రజలందరి వుమ్మడి సొత్తు పోతూ వుంటే - ప్రజలేం చేస్తున్నారు ? అదేదో చంద్ర బాబు స్వంత విషయమే గాని తమ విషయం కాదన్నట్టు వున్నారు . మన ప్రజలలో ఈ స్తబ్దత పోవాలి .
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
వుప్పలధడియం విజయమోహన్
ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
రిప్లయితొలగించండిమహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.
సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*