ఉగాది -2015
ప్రకృతి లో
మామిడీ , చెరుకూ , వేపా , మిరపా, ఉప్పూ , చింతా - షడ్రుచులకు ప్రతీకలు .
అవి కలసిన ఉగాది పచ్చడి
జీవితంలో
సంతోషానికి , మాధుర్యానికి , కష్టాలకూ , శోకాలకూ , బాధలకూ , రోగాలకూ ,
నిజానికి నవ రసాలకూ ప్రతీకగా నిలుస్తుంది .
అన్నిటినీ
స్థిత ప్రజ్ఞత తో స్వీకరించే తెలుగు మనసులకు
మన్మథ నామ సంవత్సర ఉగాది నాడు
నా హార్దిక శుభాకాంక్షలు
ఈ సంవత్సరంలో -
మీ జీవితాల్లో
సంతోషం , ఆరోగ్యం
ప్రేమ , కరుణ
ఐశ్వర్యం , ఆర్ద్రత
నిండాలని -
మీ చుట్టూ వున్న వారిలో, మీ పట్ల
మీ చుట్టూ వున్న వారి పట్ల , మీలో
స్నేహం, ప్రేమ పండాలనీ
ఈ సంవత్సరం , మీ జీవితంలో
ఒక నవ వసంతం కావాలనీ
మీకు నా శుభాకాంక్షలు , శుభాభినందనలు తెలియజేస్తున్నాను .
ఈ సంవత్సరంలో
మనలో ప్రతి వొక్కరూ
మనకంటే తక్కువ స్థితిలో వున్న
మరొక్కరి జీవితాన్ని
ఆదుకోవాలని , వుద్ధరించాలనీ
ఆశిస్తున్నాను ; ఆ శక్తి , మానసికత మనలో
అ దేవుడు నింపాలనీ
ప్రార్థిస్తున్నాను .
= మీ
వుప్పలధడియం విజయమోహన్
PS :- పతంజలి యోగ సూత్రాల పై వ్యాఖ్యానంగా వొక పుస్తకం రాస్తూ వుండడం వలన - ఈ మధ్య కాలం లో బ్లాగులో ఎక్కువగా రాయడం జరగలేదు . మరో నెలలోపు అది పూర్తి అయి పోతుందని నా నమ్మకం . ఆ తరువాత , ఈ బ్లాగులో , మరింత విస్తృతంగా రాయడం జరుగుతుంది
గత రెండు నెలలుగా మీ బ్లాగ్ లో టపాలు ఏమీ కనిపించటం లేదు.
రిప్లయితొలగించండిఎప్పుడు తెలిసిన / తెలియని విషయాల పైన చాలా వివరంగా ఉంటాయి మీ టపాలు..
రాబోయే రోజుల్లొ మరిన్ని టపాలు వ్రాయాలని కోరుకుంటూ!!
సెలవు!!