14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

తెలంగాణా బిల్లు - సమైక్యాంధ్ర ఉద్యమం - అన్ని ప్రాంతాలకూ న్యాయం - సర్వే జనాః సుఖినో భవంతు


= తెలంగాణా బిల్లు =


పార్లమెంటులో  తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్ట బడింది. అందులో ఏముంది ? తెలంగాణా ప్రాంతం వొక ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని మాత్రం వుంది. 

యిక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోంది కదా . దాని మాటేమిటి ? ఎందుకని సమైక్యాంధ్ర ప్రజలు, నాయకులు అందరూ - ఈ రాష్ట్ర విభజన వద్దంటున్నారు ?  యివి  ఏదీ జాతీయ స్థాయి నాయకులు యోచనే చేయరా?

నాగేశ్వర రావు , రామారావు   గార్ల  నుండి , చిన్న స్థాయి   టెక్నిషియన్ వరకు సినిమా రంగమంతా  మద్రాసు నుండి హైదరాబాద్ కు "మన రాష్ట్రం" అంటూ, అనుకుంటూ వచ్చారు . ఎన్నో స్టూడియోలు , మరెన్నో సినిమారంగ  వ్యవస్థలు అంతర్జాతీయ స్థాయిలో  నిర్మించారు . చంద్రబాబు  గారు  తెచ్చిన ప్రతి సంస్థా , హైదరాబాదు కే తెచ్చారు. 

అలా వచ్చిన వారినెవరూ - యిది మీ రాష్ట్రం  కాదు - యిక్కడికెందుకొచ్చారు, యిక్కడెందుకున్నారు - అని అడగ లేదు; వారూ చెప్పవలసిన అవసరం రాలేదు. 

అంతే కాదు. రామారావు గారికి బ్రహ్మ రథం పట్టి తెలంగాణా వారంతా కూడా వారిని ముఖ్య మంత్రిని చెయ్య లేదా ? అప్పుడు  లేని వేర్పాటు భావం యిప్పుడెక్కడ నుండి  పుట్టుకొచ్చింది ? ఈ విషపుబీజం నాటిన వారెవ్వరు ? పెంచి పెద్ద  చేసిన వారెవ్వరు ? ప్రజలంతా కాస్త యోచన చెయ్యాలి .

రామారావు మాత్రమే  కాదు . చంద్రబాబు నాయుడు గారు, చివరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు , వేర్పాటు రాష్ట్ర వాదపు విష బీజాలు  తెలంగాణా లో పెద్దగా మొలవ లేదు ; పెరగ లేదు . యిదే  చరిత్ర . వారందరికీ వోటు వేసి గెలిపించిన  వారు తెలంగాణా ప్రజలు . అప్పుడు లేని అన్యాయం  ఎప్పుడు మొలిచొచ్చింది ? 

అన్యాయం, అన్యాయం అని TRS నేతలు ఘోషిస్తే - శ్రీకృష్ణ కమిటీ వేసారు . ఆయన లెక్కలన్నీ చూసి - అయ్యా ఏ అన్యాయమూ లేదు - జరుగ లేదు అని తేల్చి చెప్పారు . మరి - ఆ కమిటీ పైనే బురద చల్లారు TRS  నాయకులు .  కానీ , ఆ కమిటీ వారు చెప్పింది ఎలా తప్పు అన్నది ఎవరూ చెప్ప లేదు ; ఏది రైటో కూడా  వారు చెప్ప లేదు . యిప్పుడు తెలంగాణా  ఎందుకు - అన్న వాదం  మరో రకంగా తిరిగింది . 

మా వూళ్ళలో  - ఆంధ్ర వుద్యోగులు  వున్నారు - వుండకూడదు - అన్నారు. అదే మాకు జరిగిన అన్యాయం  అన్నారు.  పని గట్టుకుని వాళ్ళ యిళ్లకు  వెళ్లి  - మీరు మీ ప్రాంతానికి  వెళ్లి పొండి - అన్నారు . మేము శాంతంగా  చెబుతున్నాం - వెళ్ళిపొండి - అన్నారు, బెదిరించారు . యివన్నీ వార్తాపత్రికలలో  కూడా వచ్చాయి .  యిది ఎంత అరాచకమైన , క్రూరమైన, చట్ట వ్యతిరేకమైన చర్య ? అయ్యా - ఉద్యోగులు అలా ఎలా వెళ్లి పోగలరు ? అసలు, ఎవరయినా  అలా  యెలా  వెళ్లి పోగలరు? అలా వెళ్ళ గొట్టే అధికారం TRS వారికి గానీ, మరెవరికి  గానీ ఎవరిచ్చారు?  యిది అడగాల్సింది ఎవరు ? తెలంగాణా ప్రజలే  అడగాలి.  వొకాయన అంటారు - పక్క వాడికి అన్యాయం జరిగేటప్పుడు  మీరు అడ్డుకోక   పొతే , ఆ తరువాత  జరిగే అన్యాయం మీకే , అని . 

ఇప్పుడున్న వినాయకులు తెలంగాణా పాలకులైతే - ఈ విద్వేషాల బీజాలు పెరగడం తప్ప మరో గొప్ప పనేమే జరగదనేది తథ్యం .

తెలంగాణా లో ఎన్ని పరిశ్రమలు  పెట్టారు! ఎన్ని విశ్వవిద్యాలయాలు పెట్టారు ! అందు వలన తెలంగాణా కు న్యాయం జరిగింది కాదా ? ఎలా జరగలేదంటారు?  

నాకు మాత్రం మొదటి నుండీ ఈ పధ్ధతి నచ్చ లేదు . రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లోనూ - యివి రావాలి. వొక IIT  కానీ , IIM  కానీ , ISB  కానీ మరే అత్యున్నత విద్యాసంస్థ కానీ , రాయలసీమ లో కానీ , కోస్తా ప్రాంతం లో గానీ  ఎందుకు లేదు ? వొక్క IT రంగ సంస్థ కూడా - తెలంగాణా ప్రాంతం తప్ప - మరెక్కడా ఎందుకు పెట్ట బడ లేదు ? వొక్క జాతీయ / అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కూడా మిగతా ప్రాంతాల్లో ఎందుకు లేదు? యిక్కడే జరిగింది తప్పు . అన్ని ప్రాంతాల లోనూ - అటువంటి సంస్థలు వస్తే , ఈ వేర్పాటు వాదాలు  రావు ; వుండవు ; వచ్చినా , రాష్ట్రాలను విభజించినా  పెద్ద ప్రశ్న లేదు .  యిప్పుడు ప్రశ్న అదే . మేమూ ,మీరూ  అభివృద్ధి చేసిన  ముఖ్యమైన ప్రాంతం మీది - మాకేమీ హక్కు లేదు అంటే - అది అన్యాయం  కాదా .

66 ఏళ్ళ తరువాత కూడా - రాయలసీమలో త్రాగడానికి వూళ్ళలో నీళ్ళు లేవు . రామారావు గారు కూడా హైదరాబాదుకు , మద్రాసుకు  నీళ్ళు వస్తే చాలనుకున్నారు . ఆయన వుంటే - యివన్నీ చేసేవారేమో - నాకు తెలీదు .  కర్ణాటకా  వారు ముందు  యిటు వైపు వస్తున్న నీళ్ళు , వాళ్ళ రాష్ట్రంలో  నిలిపేస్తే -అడిగే వాడే లేడు మన రాష్ట్రంలో . యిప్పుడు సమస్య  తెలంగాణా రాష్ట్రం వస్తే - రాయల సీమకు - కనీసం త్రాగు నీళ్ళు అన్ని ప్రాంతాలకూ  రావాలి . వస్తుందా ? లేదా , TRS  వారు అది జరగనివ్వరా ? జరగనివ్వరనేది అందరి అభిప్రాయం.  కేంద్ర ప్రభుత్వం వారు రాయలసీమ కు ఏం న్యాయం చేస్తారు ? యిది - ఏవీ , పార్లమెంటులోని  బిల్లులో లేవు .  విభజిస్తే - ఏ ప్రాంతం వాళ్లకు , ఏం న్యాయం చేస్తాం - అన్న అంశం ఏదీ - ఈ బిల్లులో లేదు. యిదీ వొక బిల్లేనా ? తొందర పడి తాతాచార్యులు మతం మార్చుకున్నాడట. అలా వుంది పరిస్థితి . మన దేశంలో ఈ మధ్య వచ్చిన చాలా చట్టాలు తొందరపాటుతో చేసిన చట్టాలే . కోడలు ఫిర్యాదు చేస్తే - యింట్లో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని వొక చట్టం . కొంత మంది కోడళ్ళు ఆరడికి గురి అవుతున్న మాట నిజమే . ఎవరూ కాదనటం లేదు. కానీ, ఎంతో మంది కోడళ్లు పెళ్ళైన వెంటనే , యింటిని విడగొట్టడమూ , యింట్లో ఏ బాధ్యతలూ తీసుకోక పోవడమూ అంతే నిజం. మొత్తానికి ఎవరిది తప్పైనా , అది సాంతంగా విచారించి, సమస్యను పరిష్కరించాలా ? యింట్లో వాళ్లందిరినీ జైల్లో  పెట్టాలా ? సరే ; జైల్లో పెట్టిన తరువాత , ఆ కోడలితో , ఆ భర్త కానీ, యింట్లో వాళ్ళు కానీ ఎలా వొకటిగా వుంటారు ? యిదా ఆ కోడలి సమస్యకు పరిష్కారం ? ఈ చట్టం క్రింద ఎవరికీ ఏ రకమైన న్యాయమూ జరగడం లేదు - నాకు తెలిసినంత వరకూ . తెలంగాణా చట్టమూ అంతే . విడగొట్టడం గురించి మాట్లాడుతున్నదే తప్ప - తరువాత ఏమిటన్నది ఏమీ మాట్లాడడం  లేదు .

మన దేశంలో ప్రజలను విడగొట్టడం అంత సులభమైన పని మరొక్కటి లేదు . మీకన్యాయం జరిగింది ; జరిగింది ; అంతా వారివలనే - అంటే చాలు . నిజమే కాబోలు అనుకునే ప్రజలు మనం . ఏమన్యాయం జరిగింది; ఎప్పుడు జరిగింది ? ఎవరి వలన జరిగింది? యివి అడిగే వాడూ లేదు; చెప్పే వాడూ లేడు . 

నిజమే.  ప్రజలందరికీ అన్యాయం జరిగింది - కొన్ని విషయాల్లో . యిది అన్ని ప్రాంతాల్లోనూ  జరిగింది . ఉదాహరణకు , భూ ఆక్రమణలు . యివి పెద్ద ఎత్తున, అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి .  హైదరాబాదు లోనూ జరిగాయి . తిరుపతి లోనూ జరిగాయి . మరెన్నో ప్రాంతాల్లో జరిగాయి . వీటిలో కూడా - కొన్ని ధనిక కుటుంబాలకు చెందిన , కొన్ని  కులాల వారు మాత్రమే   చాలా ఎక్కువ గా చేశారు , చేస్తున్నారు - అన్న విషయం అందరికీ తెలుసు . వీరే రాజకీయాల్లోనూ, రౌడీ యిజం లోనూ, పేరు  మోశారన్నది మనకందరికీ తెలుసు. అంటే - ఆ కులాల వారందరూ అలా చేస్తున్నారని కాదు . చేస్తున్న వారిలో - కొన్ని కులాల వారు చాలా ఎక్కువ అన్నది అందరికీ తెలిసిన విషయం . అదే కులాలలో మంచి నాయకులూ  వున్నారు . 

యిప్పుడు రాజకీయాలు అంటే రౌడీ ఇజం అన్న స్థాయికి దిగిపోయింది . యిటువంటి నాయకులకు యెదురుగా , సాధారణ ప్రజలకు ఎవరికీ న్యాయమూ లేదు ; రక్షణ కూడా లేదు - అన్న విషయం అందరికీ తెలుసు .

మనం మంచి నాయకులను ఎన్నుకుంటే - అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది . లేదా - ఏ ప్రాంతానికీ , న్యాయం జరుగదు . సాధారణ ప్రజలు కులాల వారీ, మతాల వారీ కాకుండా  మంచి వాళ్లకు వోటు వేస్తే , మంచే జరుగుతుంది . మన రాష్ట్రంలో - మనం మంచి  నాయకుడి కోసం వెదకాలే తప్ప , రాష్ట్ర విభజన కోసం కాదు . 

లాంకో హిల్ ఎక్కడ పోయినా - సాధారణ ప్రజలకు పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ, ప్రతి ప్రాంతం లోనూ త్రాగే నీళ్ళు  కావాలి కదా . వుద్యోగావకాశాలు అందరికీ కావాలి కదా. పరిశ్రమలు అన్ని చోట్లా రావాలి కదా . గొప్ప విద్యా సంస్థలు అన్ని చోట్లా రావాలి కదా . అన్నీ హైదరాబాదులో పెడితే , కనీసం యికపై వొప్పుకోకండి. మహబూబ్ నగర్  లోనూ రావాలి ; చిత్తూరు లోనూ రావాలి ; శ్రీకాకుళం  లోనూ రావాలి . 

అన్నీ చెప్పినా - చిట్ట చివర , నాకనిపించేది  ఏమిటంటే - ప్రజలుగా  మనం అందరం  వొకటే . దయ చేసి , మీరు వేరు, మేము వేరు -అనకండి. ఈ వేర్పాటు వాదానికి  అంతు  లేదు. ఎంతగానో వొకరినొకరు అభిమానించే  భార్యాభర్తల మధ్య కూడా - యిటువంటి వేర్పాటు విషబీజాల ద్వారా, విడిపోయే పరిస్థితులు  కల్పించే వారున్నారు. విడిపోయే వారూ వున్నారు. అది ఎంత తప్పో ఎప్పుడో తెలుస్తుంది . చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే వొరిగేది ఏమీ లేదు . మాకు నవాబులైనా ఫరవాలేదు ,కానీ మీరు వద్దు - అనే మూర్ఖుల మాట నమ్మ వద్దు . 

సరే . రాష్ట్రాలు విభజించాల్సిందే - అనుకుంటే ; కాస్త  ముందు  చూపుతో,అన్ని ప్రాంతాలకూ న్యాయం జరిగే లాగా వున్న బిల్లు వస్తే - కొంతలో కొంత మేలు .

సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్




15 కామెంట్‌లు:

  1. baga chepparu kani naku telisi meru bjp partiki chendinavaru, varu e bill ki support ivadam enthavarku correct,mee vayasalu baguntai nenu mee abimanini lok satta leader jp gari meeru o vayasam rayandi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను కొంత వరకు నరేంద్ర మోడీ గారి అభిమానిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆయన PM గా వస్తే మేలని అనుకునే వాడిని. ఈ దేశంలో వున్న నిజమైన సెక్యూలర్ వాదులలో ఆయన వొకరని నా అభిప్రాయం. ఆయన మతాలను గురించి కానీ , కులాలను గురించి కానీ చెడ్డగా మాట్లాడడం నేను విన లేదు.

      జైట్లీ గారు , సుష్మా గారు కూడా నాకు నచ్చారు . అంతకు మించి BJP పార్టీ పాలసీ లన్నీ నాకు నచ్చాయనో, నేను BJP పార్టీలో చేరాలనో - ఎప్పుడూ అనుకోలేదు. రామ మందిరం కట్టడాన్ని పొలిటికల్ ఎజెండా గా కొంత మంది BJP నాయకులు అప్పుడప్పుడూ చెప్పడం - నాకు అసలు నచ్చని విషయం. రామమందిరం నిజంగా కట్టాలనే చిత్త శుద్ధి వున్నట్టు కూడా నాకు అస్సలు అనిపించదు. కట్టాలంటే అయోధ్య లోనే - ఎక్కడో వొక స్థలంలో ప్రపంచ ప్రఖ్యాతంగా వుండేటట్టు కట్టొచ్చు. లేదంటే - న్యాయ స్థానం తీర్పు వచ్చే వరకు , సమస్య సమసి పోయే వరకు వేచి వుండాల్సిందే.

      తెలంగాణా బిల్లు విషయం లో - కాంగ్రెస్ , BJP - రెండు పార్టీలకు సరైన అవగాహన లేదనే నా అభిప్రాయం. ప్రతి వేర్పాటు ఉద్యమానికీ - మంచి నాయకుడు (లు) లేక పోవడమే కారణమని నా అభిప్రాయం . అలాగే ఏ ప్రాంతమైన చాలా వెనుకబడితే - దానికి ముఖ్య కారణం నాయకత్వ లోపమే.

      రామారావు గారి కాలం లో గానీ , చంద్ర బాబు కాలంలో గానీ అన్ని ప్రాంతాల ప్రజలు వారిని బాగా ఆదరించారు . అప్పుడు వేర్పాటు వాదులను హర్షించ లేదు . మరి వేర్పాటు ఉద్యమం వుధృతం ఎప్పుడు అయ్యింది? ఎలా అయ్యింది ? ఈ ప్రశ్నకు సమాధానమే TRS . మంచి నాయకులు పోయారు. TRS కు బలం వచ్చింది. అంతే .

      నాకు బాగా నచ్చిన నాయకులలో వొకరు JP గారు . తప్పకుండా వారిని గురించి రాస్తాను . మీ వ్యాఖ్యకు చాలా సంతోషం .

      తొలగించండి
  2. నిజమే ప్రజలము అందరూ ఒక్కటే. అలాంటప్పుడు దేశంలో 28 రాష్ట్రాలు అవసరమా? మదరాసు నుండి ఆంద్ర రాష్ట్రం ఎందుకు వేరు పడింది? అక్కడ "విద్వేషాల బీజాలు" రెచ్చగొట్టింది ఎవరో మరిచిపోయారా?

    అన్యాయం వేరే, నష్టం వేరే. తెలంగాణా ఏర్పడితే ఆంధ్రకు అన్యాయం జరిగితే అదేంటో చెప్పండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంధ్రా మద్రాసు భాషా ప్రయుక్త రాష్ట్రాల తో వాళ్ళు కూడా విడిపోవటానికి సహాయం చేస్తే విద్వేషాలు రెచ్చగొట్టటం అని క్వోట్స్ లో పెట్టి రాస్తున్నావు. సాక్ష్యాలు చూపిస్తావా?

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. కేవలం మద్రాసు గురించే ఇద్దరూ పట్టుగా ఉన్నారు కొన్ని రోజులు. తర్వాత రాష్ట్ర సాధన ముందు అది చిన్న విషయమని వొదిలేసి వచ్చారు. అప్పుడు విద్వేషాలు లేవు.నాయకు లంతా హుందా అయిన వ్యక్తిత్వాలు గలవాళ్ళు. మీ ఉద్యమ నేత ఉద్యమాన్ని కాంగ్రెసుకి బల్ల కింద నుంచి చెయ్యి తడిపే పధ్ధతిలో తెచ్చే తెలంగాణాని సాధించి పెట్టుతుంటే దానికి పౌరుషం రావడం లేదు నీకు. అన్నిటికీ ఇంత షార్ప్ గా జవాబిస్తావు, నేను విలీనం గురించి అడిగిన ప్రశ్నకి మాట్లాడవేం?

      తొలగించండి
    4. హరిబాబు గారూ, కోట్స్ నేను పెట్టలేదు. వ్యాసకర్త వాడిన కోట్లను చూపించాను. Please read the post & ascertain the context.

      భాషాప్రాతిపదిక అంటే ఏమిటి? ఒక భాషకు ఒక రాష్ట్రం కాదు, ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలి.

      PS: మన ఇద్దరి మధ్య ఏకవచనం వాడెంత స్నేహం కానీ పరిచయం కానీ లేదనుకుంటా

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    6. అయితే చెప్పండి భాషా ప్రయుక్త రాష్ట్రాలనే నినాదంతో మొదట స్వాతంత్ర్యానంతరం విడిపోయిన మొదటి రాష్ట్రం ఇది. ఇది విడిపోయిన వెంటనే కేవలం 3 సంవత్సరాల లోపు గుజరాతీలు గుజరాత్లోనూ, మరాఠీ లంతా మహా రాష్ట్ర లోనూ అనదరూ యెవరికి వారు ఒకే రాష్ట్రంగా యెందుకు యేర్పడ్డారు.మనిషిని కలిపేది మొదట భాష కాబట్టి. పుట్టిన ప్రతివాడికి మొదట తన ప్రాంతం గురించి తెలియక ముందే భాష అనుభవం లోకి వస్తుంది.

      ఇక్కద మనందరం వాదించుకునే కాంటెక్ష్ట్ విభజన గురుంచీ దాని అనుబంధ విషయాల గురించే. చెప్పలేని జవాబును దాటవెయ్యటం అంటే యెమిటన్న మాట? -ఒక భాషకు ఒక రాష్ట్రం కాదు, ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలి. - యేమిటీ గందరగోళం?యేం చెప్పదల్చుకున్నారో మీకయినా సరిగ్గా అర్ధమయినదా?

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    8. జై గారూ, విలీనం ద్వారా జరిగే విభజనని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను. ఆ పాయింటు మీద కామెంటు వేసేటప్పుడు కామేంటు పరుషంగా ఉండడం వల్ల నేను మొత్తం విభజననే వ్యతిరేకించే వీర సమైక్య వాది నని మీరు పొరబదకండి.విభజనని విలీనం ద్వార వచ్చే లాభాన్ని ఆశించకుండా పెద్ద మనిషి తరహాగా చెయ్యాలనుకుంటే కాంగ్రెసు యేం చేసి ఉండేదో తెలుసా?ప్రతి పక్షాలు యెటూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలనీ యెటు పోయి యెటు వస్తుందో అని రెండు ప్రాంతాల్లో రెండు మాటలు మాట్లాడటం చేస్తే చెయ్యవచ్చు గానీ ఇక్కడ కూడా తనే అధికారంలో ఉన్నప్పుడు ఆ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన పార్టీ లోని వాళ్ళనె మీ మీ ప్రాంతాలకి యేది న్యాయమో మీరే చెప్పండని ఒక చోట కూర్చోబెట్టి యెంతో ప్రశాంతంగా చెయ్యగలిగి ఉండేది.అవునా?

      విలీనం చెయ్యకుండా కేవలం సీట్ల సర్దుబాటు వల్ల తను లాభ పడలేనని తెలిసిపోయింది. విలీనం ప్రతి పాదన తనే చేశాడు గాబట్టి మీ ఉద్యమ నేత సిధ్ధంగానే ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళని ఒప్పించటం యెలా?దాని కోసమే ఈ భీబత్సమయిన నాటకానికి తెరతీసింది.తెరాసా లో చీలిక గానీ తిరుగుబాట్లు కానీ జరగకుండా మీ ఉద్యమ నేత కున్న తెలంగాణా ప్రదాత అనే కీర్తి చెరగకుండా ఉంటేనే పని నిక్కచ్చిగా జరుగుతుంది. అది చాలా సుతారంగా జరగాలి.అందుకు యేం చేయాలి?మీరు నా ప్రశ్నకి చాలా ఇబ్బంది పడ్డారు గదూ. సరిగా ఈ ప్రశ్ననే తెరాసా లో విలీనానికి ఒప్పుకోని వారి ముందు పెట్టి మానసికంగా తెలంగాణా ఇప్పుడే కావాలంటే విలీనానికి ఒప్పుకోక తప్పదనే కలరు ఇవ్వడానికే ఇదంతా జరుగుతున్నది.కికురె విభజనని వ్యతిరేకించడం దగ్గిర్నుంచి లోక్ సభలో వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం వరకూ అంతా తెరాసా లో విలీనానికి వ్యతిరేకత లేకుండా మానసికంగా బ్రేక్ చెయ్యటానికే. మీకూ తెలిసే ఉండొచ్చు.

      అసలు అతను చేసిన మొదటి ప్రమాదకరమయిన పని యేమిటంటే ఒక రాజకీయ ఉద్యమం లోకి ఉద్యోగుల్ని లాగడం. ఇది వరకు ఉద్యమాల్లో కుర్రాళ్ళు వచ్చారు, కొన్ని గెలిచాయి, కొన్ని ఓడాయి. ఓడినా మళ్ళీ బుధ్ధిగా చదువుకుని పైకి రావటం తప్ప దాని వల్ల యే హానీ లేదు, కానీ ఉద్యోగులు అలా కాదు. చాణక్యుడు అప్పుడే చెప్పాడు, "నీటిలో ఉన్న చేప నీళ్ళు తాగకుండా ఉందటం యెంత అసంభవమో ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా ఉండటమూ అంతే " అని. అలా అని ఇందిరా గాంధీ లాగ సహజమే గదా అనీ అనలెదు!జాగ్రత్తలు చెప్పాడు. అయితే అలాంటి వాళ్ళకి ఇప్పుడు రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్న రుచి కూడా తగిల్తే ఇక రేపటి రోజున ప్రజా ప్రతినిధుల మాట వింటారా? నువ్వేంటి నాకు చెప్పేది, కావాలంటే ఆ సీట్లో నేనే కూర్చోగలను అనే పరిస్థితి వస్తే?

      నీవు నేర్పిన విద్యయే అన్నట్టు ఇప్పుడు కికురె ద్వారా ఏపీ యంజీవోస్ తయారయ్యారు.మనస్పూర్తిగా నేను నా మనసులో మాట చెప్తున్న్నా .ఒక మనిషి గానీ జాతి గానీ మరొకరితో నేను నీతో కలిసుండ దల్చుకోలేదు అని తెగేసి చెప్తే అవతలి వాడికి యే మాత్రం సిగ్గు లజ్జా ఉన్నా బలవంతంగా కలిపి ఉంచాలని అనుకోడు. నేను ఆ కాటగిరీ లోకి చచ్చినా వెళ్ళను.అర్ధం చేసుకోండి.

      తొలగించండి
    9. 'తెలంగాణా ఏర్పాటుకు మేం సుముకం, మాకు ఒటైయ్యండి, మేము తెలంగాణా ఏర్పాటుకు కృషి చేస్తాం' అని తెలంగాణాలో ఇల్లుల్లు సీమన్ద్ర నాయకులు ఓట్ల కోసం రాజకీయం చేస్తే అది తప్పు కాదు, అది ఒక మహత్కార్యం, అలానే అటువంటి పార్టీలకు ఓట్లేసిన జనాలు ఇప్పుడు సమైక్యంద్ర అంటే కూడా తప్పు లేదు. సీమన్ద్ర నాయకులు తప్ప మరెవరైనా రాజకేయాలు చేస్తే వారు నీచులు, అది సమైక్యంద్ర ద్వంద నీతి.

      తొలగించండి
    10. "స్వాతంత్ర్యానంతరం విడిపోయిన మొదటి రాష్ట్రం ఇది"

      Are you referring to Andhra (1953) or AP (1956)?

      "ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలి"

      The linguistic states principle means there can be two (or more) states with the same official language.

      "విలీనం ద్వారా జరిగే విభజన"

      I suggest you ask these questions to TRS people. I don't belong to any party.

      తొలగించండి
  3. Sri Krishna Committe cheppina Option lo ne Telangana Formation kooda vundi.... Ika annyam antara.... I am from Paloncha in Khammam District where Kinnerasani Dam is located. In 2009, the Govt. of AP decided to lift the Kinnerasani water to Davaleshwaram only for the victory of Undavalli.... that summer Kinnerasani river wholly dried up and there was no water for Kothagudem Thermal Power Station, no water for Paloncha and Kothagudem towns, no water for the farmers and even 1000 of wild animals died in Kinnerasani Sanctuary. This was only because of greedy Seemandhra Govt. For the victory of Undavalli they simply lift the water from Kinnerasani with police protection on the dam.... To save the KTPS from lack of water, Govt. planned to supply water from Godavari through pipeline and an amount of 200 crores were allotted.... Gross root level jarigina ilanti annyaalu enno...

    రిప్లయితొలగించండి