ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తోలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఏం తెలుపుతున్నాయ్?
తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందుంది. అన్ని ప్రాంతాలలోనూ. ఆ తరువాత అసలు కాంగ్రెస్సు, ఆ తరువాత, వై.యస్. ఆర్. పీ - వీరందరికంటే క్రింద - తె. రా. స.
యింకా రెండవ విడత, మూడవ విడత ఎన్నికలు జరుగనున్నాయి.
ముందు. ముందు, ఏం జరుగుతుందో - మనకు తెలీదు. కానీ. ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణ ఎలా చేయాలో , దాని ఫలితాలు ఏమిటో చూద్దాం .
మొదటి అంశం - చంద్ర బాబు గారి నాయకత్వం పైన చాలా మందికి నమ్మకం వుందని తెలుస్తోంది . అదీ - రాష్ట్రం లోని 3 ప్ర్రాంతాల లోనూ. తెలుగు దేశం పార్టీ లోని మిగతా నాయకులు కూడా - యింకా గట్టిగా, వారికి అండగా నిలిస్తే - వారు మళ్ళీ ఈ రాష్ట్రానికి CM కావచ్చు - అనిపిస్తోంది. అదే కాక, తెలంగాణా ప్రాంతం లో తె. రా.స. కంటే, ప్రజలకు, యింకా తె.దె.పా పైన, కాంగ్రెసు పైనే ఎక్కువ మక్కువ అనేది తెలుస్తోంది. ముఖ్యంగా, తెలుగు దేశం పైన. ఈ ప్రజాభిప్రాయాన్ని - ఢిల్లీ లోని - నేతలు బాగా మనసులో పెట్టుకొవాలి. తె. రా. స. ఏది చెబితే, అదే, ప్రజాభిప్రాయం అనుకోవడానికి - లేదు అని తెలంగాణా ప్రజలు చెబుతున్నారు కదా.
రెండవ అంశం : వై.యస్. ఆర్. పీ ఎంత ప్రచారం చేసినా - కాంగ్రెసు కు కూడా అన్ని ప్రాంతాల లోనూ మంచి బలం వుందనేది తెలుస్తోంది. అంటే - కిరణ్ కుమార్ గారి నాయకత్వమో, మరేదో, వారిని ఆకర్షించిందనేగా అర్థం.
మూడవ అంశం : వై.యస్. ఆర్. పీ మూడవ స్థానంలో వుండడం కూడా, గొప్ప విషయమే. జగన్ గారిపై నున్న ఆరోపణలు, యిప్పటి వరకు విదితమైన విషయాలు ఎన్నో ఆరోపణలకు బలం యిచ్చేవిగా వున్నాయి. అయినా వారి పార్టీ కి కూడా చాలా బలం వుందనేది తేలుతూ వుంది. అంటే , లోపాలెన్నో వున్నా, నాయకత్వ లక్షణాలు కూడా వున్నాయని తెలుస్తోంది. అదే గాక,మరేదైనా కారణాలు కూడా ఉన్నాయా?
నాలుగవ అంశం : తె. రా. స -ఎన్ని మాటలు మాట్లాడినా, వారిపై, ఎవరికీ ఎక్కువ మక్కువ, నమ్మకం లేదనేది తెలుస్తోంది. పదవికి రాక ముందే ఇలాంటి మాటలు ఇలాంటి చేతలు, వుంటే - పదవికొస్తే - ఎలా వుంటారో - అనే భయం ప్రజలకు వుండొచ్చు. మమతా గారు పశ్చిమ బెంగాల్ లో యిలాగే మాట్లాడే వారు. యిప్పుడు ఎలా మాట్లాడుతున్నారో- వారు గానీ, వారి క్రింద నున్న నాయకులు గానీ - యిది మనకు తెలుస్తోంది. అదే కథ ఇక్కడా జరగొచ్చు. - అని, ప్రజలు అనుకుంటూ వుండవచ్చు.
సరే. ఏ పార్టీ, మందు కోసం, ఎంత ఖర్చు పెట్టింది - అనేది కూడా వొక అంశమే. మరి ఎన్ని విధాల్లో, ఎలా వోట్లు కొన బడ్డాయి -అనే అంశం కూడా రాజకీయ విశ్లేషకులు చూడాల్సిందే. కులం,మతం ప్రాతిపదిక పైన ఎన్ని వోట్లు పడ్డాయి - అలా జరగడం మనం ఎప్పుడు విడిచి పెడతాం - అన్నదీ చర్చనీయాంశం.
యివన్నీ వొక ప్రక్క. వోటు వేసి గెలిచిన వ్యక్తి యిక ముందు తన ప్రజలకు ఏమేం మేలు చేస్తాడనేది ప్రధానాంశం. ప్రజలు ఆయనను నిలదీసి - అన్ని పనులూ చేయించుకోవాలి. అప్పుడే అది పంచాయితీ రాజ్ అవుతుంది.
సర్వేజనాః సుఖినో భవంతు .
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి