హిందూ మతంలోని లోటుపాట్లు, రుగ్మతలు
ఈ రోజు టీవీ 9 ఛానల్ లో స్వామీ పరిపూర్నానంద గారి ఆవేదన,దానికి విరుద్ధంగా కొంత, సపోర్ట్ గా కొంత, రాజకీయ వాదులు మాట్లాడడం, వినడం జరిగింది.
రాజకీయాలు ప్రక్కన బెడితే - మనం చాలా సులభంగా చూడగలిగే విషయం -ప్రతి మతం లోనూ - ఈ రోజు కొన్ని రుగ్మతలు, కొన్ని లోటుపాట్లు చోటు చేసుకున్నాయన్న విషయం.
ఏదో హిందూ మతం లోనే అన్ని లోటుపాట్లు వున్నాయనుకోవడం- ప్రపంచాన్ని , అందులో వివిధ దేశాల్లో జరుగుతున్న విషయాల్ని పూర్తిగా విస్మరించడమే అవుతుంది. ఈ రోజు ప్రపంచంలో - యుద్దాలు జరిగితే - అది హిందూ మతం వలన మాత్రం కాదు. ఇండియా లో పుట్టిన ఏ మతం వలనా కాదు.
మొదటి ప్రపంచ యుద్ధం కానీ , రెండవ ప్రపంచ యుద్ధం గానీ - ఆ తరువాత - ఈ రోజు వరకు జరుగుతున్న అనేక యుద్ధాల్లో - పాల్గొంటున్న మతాల వారెవరు? మనం కాదు
వొక మతం వాళ్ళే తమలో తాము - మత ప్రాతిపదికపై - కొట్టు కుంటున్న దేశాలు ఎన్నో వున్నాయి. మా మతంలో - అంతా బాగుంది - ఎవరిపై విద్వేషం లేదు - ఏ రకమైన భేద భావాలు లేవు - అని చెప్పడం - నిజానికి చాలా దూరం.

అయితే - యివి - మొదట - దేవుడే చెప్పాడా ప్రవక్త చెప్పాడా - ఆ తరువాత మతంలో చోటు చేసుకున్నాయా -అన్నది - వివాదాంశం .
సరే. హిందూ మతంలో - రాముడు కానీ కృష్ణుడు కానీ - అట్టడుగు వాళ్ళకే ప్రాధాన్యత యిచ్చినట్టు - మనకు తేట తెల్లంగా తెలుస్తూనే వుంది.
శంకరాచార్యుల వారు -అంటరానితనం
పాటించ రాదని - తననే వొక ఉదాహరణగా - తనకు మహా శివుడే చెప్పినట్టు - గొంతెత్తి చెప్పారు.
అప్పుడు కూడా - మనం మారక - పోతే - తప్పు మనదా ? మతానిదా?
హిందూయిజం - ఎన్నో రకాలుగా మొదటి నుండీ - మారుతున్న మతమే కానీ , మారని మతం కాదు. మొన్న మొన్న ద్వాపరయుగంలో కూడా - శ్రీకృష్ణుడు - గీతోపదేశం చేసాడు. అది పాటిస్తున్నామా లేదా ?
శంకరాచార్యుల వారు ఎన్నెన్ని చెప్పారు ? రామానుజుల వారు ఎన్నెన్ని చెప్పారు ?
అందరిలో నిన్ను; నీలో
అందరినీ; చూడకపోతే - నీకు జ్ఞానం లేదనే నిర్దిష్టంగా చెప్పారు.
అది వొక ప్రక్కన వుండనియ్యండి. దాన్ని గురించి మరింత విశదంగా మరో సారి చూద్దాం.
యిప్పుడు ముఖ్యంగా - మనం చూసే లోటుపాట్లు కొన్ని చూద్దాం.
వొకటి ఆలయ ప్రవేశం.దేవుడి దగ్గర కు వెళ్ళడానికి - ప్రతి వొక్కరికీ హక్కు దేవుడే యిచ్చాడు . భక్త కన్నప్ప వెల్ల లేదా? తిన్నడు వెల్ల లేదా? శివుడు వద్దన్నాడా?
ఎక్కడైనా , హిందువులైన వారికి ఎవరికైనా - ఆలయ ప్రవేశం లేదంటే - అది సరి చేయడానికి - 66 సంవత్సరాలు అక్కర లేదు వొక్క రోజు చాలు. కాకపోతే - నేను తాగేసి వెడతాను బూతులు మాట్లాడుతాను - అని అనే వారికి; దేవుడి విగ్రహం పై ఏ నమ్మకం లేని వారికి, దేవుడి విగ్రహాలు పగుల గొట్టాలి - అనే వారికి - ఆలయ ప్రవేశం - మిగతా వారికి మంచిది కాదు.
సర్దార్ వల్లభాయి పటేల్ గారు చేసినట్టు - నమ్మకం వుండి, రావాలనుకున్న -వారినందిర్నీ- గుడి లోపలికి పోలీసో , మిలటరీనో - సహాయం తీసుకుని - తీసుకెళ్ళి పోవడమే.అంతే. అన్ని కులాల్లో - సమానత్వం వుండాలన్న భావన వున్న వారు చాలామంది వున్నారు. వారి సహాయమూ - తోడూ తీసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు మిగతా వారు మారడం చాలా సులభంగా జరిగి పోతుంది.
ఎవడెవడు వద్దని అంటాడో - అడ్డు కుంటాడో - వారిని ఆ గుడి నుండీ - వొక సంవత్సరం నాళ్ళు - బహిష్కరించండి. తప్పే లేదు. మరొకరి హక్కులకు అడ్డం నిలిచే వాళ్లకు అలాంటి శిక్ష తగినదే. ఈ ఆలయ ప్రవేశం - అనే వొక సమస్య - వొక్క రోజులో పరిష్కరించ వచ్చు .
అలాగే - టీ అంగళ్లు ,హోటళ్ళలో - వివక్షత వుంటే - ఆ హోటల్లు మూసేయండి . తప్పే లేదు. ఎవరి హక్కుకూ -ఎవరూ అడ్డు నిలవడం సరి కాదు. కాకపోతే - శుభ్రత లాంటి విషయాలు - చూడాల్సిందే . ఏ కులం ఏ మతం వారైనా - తాగేసి రావడమో, శుభ్రత లేకుండా రావడమో, బూతులు, మాట్లా డడమో - చెయ్య రాదు. యివి - వొక్కరని కాదు - చాలా కులాల వారు చేస్తున్నారు . అగ్ర వర్ణాల / వర్గాల వాళ్ళు కూడా చేస్తున్నారు .ఏ సమాజం లో నైనా - యివి పనికి రావు.
మాట్లాడుతూ వుంటే - సమస్యలు పరిస్ద్ష్కారం కావు. శ్రీకృష్ణుడు ఎన్నో చేసాడు.శంకరాచార్యులు చేసారు. రామానుజులూ చేసారు. మనం చెయ్యడం లేదు.వూరికే మాట్లాడుతూ ఉన్నాము.
గోటి తో పోయేదానికి - గోరూ ఉపయోగించడం లేదు . గొడ్డలీ ఉపయోగించడం లేదు. అసలేమీ చెయ్యడం లేదు. సంవత్సరాల తరబడీ - వూరికే మాట్లాడుతూ ఉన్నాము.
మతోద్దారకులూ, సమాజోద్దారుకులూ - అయిన హిందువులందరూ - రంగం లోకి దిగి - సమస్యను - పరిష్కరించండి. వొక్క రోజు కాకున్నా వొక-నెలలో - కనీసం - ఆంధ్ర ప్రదేశ్ లో - ఈ సమస్యలు రూపు మాపండి . అదే విధంగా - వారికి సహాయంగా -ప్రభుత్వం నిలవాలి . చట్ట పరంగా ప్రభుత్వం అందరి హక్కులనూ కాపాడాలి కదా.
యివన్నీ ఏదో విప్లవం లాగా చేయాల్సిన పనేం లేదు. చాలా శాంతి యుతంగా, చెయ్యగల పనే. సులభమైన పనే. చెయ్యాలి - తప్పదు.
చేసి - అందరికీ మార్గ దర్శకులుగా నిలవండి.

స
ర్వే జనాః సుఖినో భవంతు .
=మీ
ఉప్పల దడియం విజయ మోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి