ప్రపంచం లో మార్పు వొక్కటే ప్రతి క్షణం జరిగేది.ప్రతి అణువు లోనూ జరిగేది.
మార్పు ఆగదు. ఆపలేము.
ప్రతి ప్రాణి పుట్టుక, పెరుగుదల, అరుగుదల, చావు అన్నీ మార్పులో అంతర్భాగమే.
ప్రాణిగా - మనిషికీ ఇవేవీ తప్పదు.
అయితే చాలా మార్పులు - మనమే ఆలోచించి తీసుకు వచ్చేవి. అవి మంచా, కాదా, చూడాల్సిన అవసరం తప్పకుండా మనపై వుంది . ఎందుకంటే, మన కర్తృత్వం లో, మనం తీసుకువచ్చే మార్పులు విషయంలో - మనకు, ఎంతో కొంత స్వతంత్రం వుంది; కొన్ని పరిధులలో యిదా, అదా, మరోటా - అని ఆలోచించి - ఏది మంచిదో అది - చెయ్యగలిగే వెసులుబాటు వుంది. అందుకనే శ్రీ కృష్ణుడు "కర్మణ్యేవ అధికారస్తే - మా ఫలేషు కదాచన" అన్నాడు.
నువ్వు చేసే పనుల విషయం లో - నీకు పూర్తి అధికారం వుంది . కానీ వాటికి ఏ ఫలితం వస్తుందో - అది మాత్రం పూర్తిగా నీ అధీనంలో లేదు. నీ పనిని బట్టి, ప్రకృతి నియమాల బట్టి , నీకు ఏ ఫలితం రావాలో - అదే వస్తుంది గాని నువ్వు అనుకున్న ఫలితం రాక పోవచ్చు .
ఎందుకు నేను అనుకున్న ఫలితం రాలేదు? అంతా తారుమారు ఎందుకు అయ్యింది? ఈ ప్రశ్నలు అసంబద్ధమైనవి. ప్రకృతి నియమాలకు అనుగుణం గా చేసేపనికి ఆ నియమాలకు అనుగుణం గానే ఫలితాలు వస్తాయి. మనం అనుకున్నట్టు రావు. అయితే - ప్రకృతిలో ఎన్నో మార్గాలు వున్నాయి. ఆ మార్గాలలో ఉత్తమ మార్గాలు వున్నాయి. మధ్యమ మార్గాలు వున్నాయి. అధమ మార్గాలు వున్నాయి. వాటి వాటి ఫలితాలు వాటి వాటికి వున్నాయి.
స్థూలంగా చెప్పాలంటే - బుద్ధితో సంప్రతించి బుద్ధి మార్గంలో - వెళితే అది ఉత్తమ మార్గం. మనసుతో మాత్రం సంప్రతించి ఆ మార్గంలో, వెడితే అది అధమ మార్గము. బుద్ధికీ మనసుకూ - కూడా సబబైన మూడో మార్గం మధ్యే మార్గం.
ఈ రోజు వార్తలలో - వొక చిన్న వార్త. తమకు తాముగా - సెక్సు లో పాల్గొనడానికి 16 సంవత్సరాల వారికి కూడా హక్కు కల్పిస్తున్నారు(ట) - ప్రభుత్వం వారు.
కానీ, పెళ్ళికి మాత్రం 18-21 సంవత్సరాలు వయో పరిమితి అలాగే వుంటుంది. యిది మీకేమైనా అర్థం అయ్యిందా?
యిది, పెళ్ళికి ముందే - విశ్రుంఖల సెక్సు కు అనుమతినిచ్చినట్టు కాదా?
యిది - వస్తే మనం ఎవరినీ ఆపలేము. అమెరికాలో ఇప్పుడున్న వొక ప్రధాన సమస్య - చిన్న పిల్లల గర్భ ధారణ. ఏ వయసులో, ఎవరు, ఎప్పుడు పిల్లలను కంటారో, వారికి తండ్రి ఎవరో, ఎవరికీ తెలియటం లేదు.
యిక మన దేశంలోనూ - అటువంటి పరిస్థితి త్వరలో వచ్చేస్తుంది.
మనం యిక్కడ గమనించాల్సింది - ఈ స్వేచ్చా సెక్సుకూ - ప్రేమలకూ - ఏమీ సంబంధం లేదు.
యిది కేవలం శారీరక సంబంధమైన, హర్మోనుల్లో పుట్టిన వికారమే తప్ప - ప్రేమా కాదు, దోమా కాదు.
పిల్లలకు అర్థం కాక పోవచ్చు కాక. పెద్దలకైనా అర్థం అయ్యి చస్తే బాగుంటుంది.
ఎవరు పెద్దలు ? తమ స్వార్థం తప్ప ప్రజల క్షేమం గురించి ఏమీ పట్టని వారంతా - పెద్దలయి కూర్చుంటున్నారు .
అసలు సమస్య ఏమిటో అర్థం కాని వారు పెద్దలు గా వుంటున్నారు.
ఆడ మగ - అందరికీ 15 ఏళ్ళ వయస్సులో - వయో సంబంధమైన హార్మోనుల అలజడి ఎక్కువగా ఉంటుందనేది -అందరికీ తెలిసిన సత్యమే.
అయితే - ఆ వయసు నుండీ ప్రతి వొక్కరితో - సెక్సు లో, పాల్గొనచ్చు ,అని - పర్మిషన్ యివ్వడం, ఈ సమస్యకు అతి దారుణమైన, ప్రమాద కరమైన - సమాధానము
యివన్నీ లక్షలాది సంవత్సరాల నుండీ వున్న సమస్యలే. 14-15 సంవత్సరాలలో -ఈ హర్మోనుల అలజడి రావడం మనిషి పుట్టిన నాటి నుండీ వుంది.
కాకపోతే , ఆ రోజుల్లో, యిటువంటి సమస్యలకు - సంఘానికీ, ప్రతి మనిషికీ, ఎంతో కొంత, మేలు జరగ గల సమాధానాలు వెదికారు.
ఆ రోజుల్లో - బాల్య వివాహాలన్నారు. మంచి వాడిగా, వున్న వరుడిని చూసి, మంచి పిల్ల గా వున్న వధువును చూసి పెద్దలు చేసే వారు.
ఆహా. అది తప్పు. 18 - 21 ఏళ్ళ తరువాతే - పూర్తి పరిణితి వచ్చిన తర్వాతే, పెళ్లి జరగాలన్నారు మధ్యలో.
మాకు యిష్టం వచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అన్నారు తరువాత.
ఆ యిష్టం ఎలా వస్తుంది?
ఎలా వస్తుందంటే - 16 ఏళ్ళ వయసు నుండీ - పది మందితో తిరిగి- ఆ తిరగడమంటే ఏమిటో, యిప్పుడు అర్థం మారుతోంది - అలా తిరిగిన వారిలో తమకు నచ్చిన వాడిని / దానిని చేసుకోవడమే.
యిది మంచికంటారా? మంచి అని - ఎవరంటారో నాకు తెలీదు కాని - నేను మాత్రం మంచి కాదనే అంటాను.
మొదట కో-ఎజుకేషన్ కావాలన్నారు. తరువాత, సెక్సు-ఎజుకేషన్ కావాలన్నారు. యిప్పుడు అసలు సిసలు సెక్సు కావాలంటున్నారు, 16 ఏళ్ళ వయస్సులో. దీని తరువాత ఏమిటి?
ఏమీ లేదు. దీని తరువాత అమెరికాలో - గే-యిజం, లెస్బియనిజమ్ వచ్చాయి. స్కూళ్ళలో, మించితే కాలేజీల వరకు - మామూలు సెక్సు. ఆ తర్వాత, అవతలి వారెవరూ నచ్చక పోవడమూ -స్వలింగ సంపర్కానికి అలవాటు పడడమూ ; ఆ తరువాత ? మగవారికి, మగ వారితో పెళ్లి. ఆడవారికి ఆడవారితో పెళ్లి. ఎందుకు? ఏమో? యిది అమెరికాలో చాలా రాష్ట్రాలలో చట్ట బద్ధం చేసేసారు.
ఆ తరువాత ?? ఆ తరువాత ఎలా మారుతుందో మన ప్రవర్తన !! అది దేవుడికి కూడా తెలీదు.
మన దేశంలో , పూర్వకాలం లో - మగ వాడికి - చదువు పూర్తయ్యే వరకు వరకు బ్రహ్మచర్యము అలవాటు చేసే వారు. తనపై తనకు కొంత కంట్రోల్ వచ్చిన తర్వాత - పెళ్లి చేసే వారు. అది కూడా, 16 ఏళ్ళ వయస్సులో చేసేసే వారు. ఏ ఆటలాడినా - పెళ్లి అనే బంధంలో - వొకరితో వొకరు ఆడుకోండని విడిచే వారు.
ఈ రోజు కంట్రోల్ కాదు. విచ్చల విడి తత్త్వం అలవాటు చేస్తున్నారు .
ఈ భాగ్యానికి, 16 ఏళ్ళకే - పెళ్లి కీ అనుమతి ఇచ్చేస్తే పోలా ?
ఎవరో వొకరితో సెక్సు సంబంధం అలవాటవుతుంది. అదే ప్రేమగానూ మారుతుంది. అదేదో కాస్త ఆరోగ్య ప్రదం గానూ వుంటుంది.
వెయ్యి కాళ్ళ మంటపం లాంటిది మన సంస్కృతి. యిది బాగాలేదు, అది బాగా లేదు - అని వొక్కొక్క కాలూ పీకేస్తే - మంటపం కూలిపోతుంది. అదే జరిగింది అమెరికాలో . అదే జరుగుతూ వుంది మన దేశంలోనూ.
ఈ కలికాలాన్ని ఆప గలమా? ఊహూ. ఆపలేము. రేపటి నుండి - మాకు స్వేచ్చా సెక్సు కావాలి, కావాలి అంటూ, కేకలు వేసుకుంటూ కుర్రకారు ప్రదర్శనలు జరిపినా ఆశ్చర్య పోనక్కర లేదు. 16 కాదు - 14 నుండి కావాలి అన్నా - ఆశ్చర్యం అక్కర లేదు.
అడిగే వాడికీ తెలీదు, యిచ్చే వాడికీ తెలీదు - మనం ఎక్కడికి పోతున్నామో ?
కొస మెరుపు. ఎవరో వొకావిడ - తీరా తాళి కట్టే సమయంలో - హాల్ట్! అనింది. ఎందుకు, అంటే - నాకు , మరొకరితో, మరో మతం వాడితో ప్రేమ. వాడినే పెళ్లి చేసుకుంటా - అనింది. మరి, అంత వరకు నోరు మూసుకుని వుండి, మరో మగవాడి ప్రాణం తియ్యడం ఎందుకు? ఎంత ఖర్చు? ఎంత టైం , డబ్బు, గౌరవం, ఆఫీసు లో లీవూ వేస్టు? సరే. కోపాలు రావడం సహజం. వాళ్ళూ, వీళ్ళూ కొట్టుకున్నారట - అసలు దోషిని విడిచేసి.
ఈవిడ - అక్కడికెళ్ళి, ఏ నాలుగో పెళ్ళాం గానో, రాజ్యం చెయ్యొచ్చు. యిదొక ప్రేమా? కంపు కొట్టడం లేదా ? ఎవరన్నా గౌరవం లేదు. తమ హార్మోనుల గొడవ తప్ప మరొక ధ్యాస లేదు. మరొకరి కష్టం గురించి అసలు యోచన లేదు. పోనీ - తమ భవిష్యత్తు గురించి ఆలోచన వుందా అంటే - అదీ లేదు.
దేవుడెలాగూ శిక్ష వెయ్యనే వేస్తాడు. పోతే పొనీ.
16 ఏళ్ళలో - స్వేచ్చా సెక్సు - కనీసం వొక్క సంవత్సరమైనా, వొక్కరితోనే వుండాలి - అంటే ఎలా వుంటుంది? స్వేచ్చా సెక్సు ఎవరితోనో , పెళ్ళీ వాళ్ళతోనే - అంటే - ఎలా వుంటుంది?
పోనీ ఏకంగా, వొక్క సారి స్వెచ్ఛా సెక్సు జరిగితే - వెంటనే పెళ్లి చేసేసుకోవాలి - అంటే ఎలా వుంటుంది? అసలు స్వేచ్చా సెక్సు పెళ్లి కాని వాళ్ళతోనే - అంటే? అప్పుడు, నాయకులు, వినాయకులు, గూండాలు, టీనేజ్ బాలికలతో ఆడుకోవడం కాస్త తగ్గొచ్చు కదా. ప్రభుత్వం వారికి, ఇవేవీ పట్టడం లేదు. స్వేచ్చా సెక్సు కు, వయస్సు తగ్గించాలి - అదీ 16 ఏళ్ళకు - అంతే వారి ఆలోచన.
= మీ
వుప్పలధడియం విజయమోహన్

i agree
రిప్లయితొలగించండిమష్టారూ హార్మోనుల ని ఎందుకు బద్నాం చేస్తారు అవి కాస్త మంచివే కానీ మనుషులే ఎమొంకా...అంటే ఏలొంకా అని తిక్క తిక్క కారణాలు వెతికి సమర్పిస్తారు ఈ చట్టం మన "పెద్దల సభ"ఎలా అంగీకరించింది?నాకు అర్థం కావట్లా అంటే 16 యేట శృంగారం మొదలెట్టీ ఆడ వారు 2 యేల్ల తర్వాత మగవాళ్ళు 5ఏళ్ళ తర్వాత పెళ్ళి చేసుకుని సాదించేది ఎమిటి?కుటుంబాలు కూలిపోతాయి,మన పార్లమెంటులో ఎంగిలి కూడు తినే పెద్దమనుషులు చలామందే ఉన్నరు(అభిషెక్ సింఘ్వి...మొ..)అందుకని మాబోటి వెధవ ప్రాణులు కూడా ఎంగిలి కూడు తినమంటే ఎట్లా....అయినా అల్లుడికి విమాన యాణ చెకప్ రద్దు చేసె జి.వొ పాస్స్ చేసిన ప్రభుత్వానికి సాధ్యం కానిదేముంది చెప్పండి.
రిప్లయితొలగించండిఓటేసిన పాపం తలా పిడికెడు అనుభవించాలి తప్పదు మరి!
నిజమే . హార్మోనులున్నది సద్వినియోగం కావడానికే. మన దేశంలో పొరుగు సంస్కృతుల దండయాత్రలకు ముందు కూడా, ప్రేమ వివాహాలుండేవి. రామాయణ కాలం నుండి, మన కావ్యాలన్నిటిలో ప్రేమలూ వున్నాయి. ప్రేమ వివాహాలూ వున్నాయి. అవీ సంఘమంతా , అంగీకరించి చేసిన ప్రేమ వివాహాలు. నిజ జీవితంలో ప్రేమలకు, పెళ్లిళ్లకు ఎప్పుడూ స్థానం వుండేది. అయితే, పెళ్ళికి ముందు సెక్సు అన్నది మన వారు వొప్పుకొలేదు. ఎందుకంటే, అందులో పూర్తిగా, మగ వాడి స్వార్థం వుంటుంది ఽఅడదానికి రక్షణ వుండదు. దానికీ ప్రేమకూ సంబంధమే లేదు. కామాన్ని వొక సైన్స్ గా వొక శాస్త్రం గా రూపొందించిన సంస్కృతికి అంత మాత్రం తెలీదనుకోవడం ఈనాటి నాయకుల మూర్ఖత్వం. నిజానికి శివ పార్వతుల నుండి, ప్రతిదీ ప్రేమ వివాహమే. అయితే - ఈ నాడు, మన నాయకులు ప్రతిపాదిస్తున్న "విశృంఖల కామ" రాజ్యం వినాశనానికే అన్నది స్పష్టంగా తెలుస్తూ వుంది .
తొలగించండివినాశకాలం దాపురించినదిఅనటానికి ఇక వెరే ప్రమాణాలు అక్కరలేదు
రిప్లయితొలగించండిఆతరువాత ఏమిజరుగుతోంది అని మీరన్నారు
శరీరవాంచల వేడిలో విశృంఖల శృంగార వలన ఎయిడ్స్ లాంటి కొత్తరోగాలు విజృంభిస్తాయి జాతి నిర్వీర్యమై క్రుశిమ్చి నశిస్తుంది.
నిజమే. జాతి నిర్వీర్యం కావడానికి యింత కంటే పెద్ద ప్రమాదం అక్కర లేదు. ఈ రోజు వొకరితో, రేపొకరితో - తెల్లవారి వొకరితో, సాయంకాలం మరొకరితో - అనేది స్వతంత్రం కాదు; కుసంస్కారం అనే విషయం మన నాయకులకు తోచక పోవడం దురదృష్టం . దీని పరిణామాలు ఎంత చెడ్డవో - తెలిసేటప్పటికి -చెయ్యి దాటి పోతుంది
తొలగించండి