చిన్నపిల్లల నుండి పెద్దవాళ్లవరకు మనం అందరూ నిత్యజీవితంలో యోగ ప్రక్రియలు ఎన్నో వాడుతూ వున్నాము.
ఉదాహరణకు -
గోపీ 10 వ తరగతి విద్యార్థి. బాగా చదువుతాడు. గోపీ సెక్షన్ లో, 30 మంది విద్యార్థులున్నారు. గోపీకి రాము బెస్ట్ ఫ్రెండ్. చదువులోనూ, ఆటలలోనూ, మాటల లోనూ, అన్నింట్లో గోపీ, రామూతో బాటే వుండాలని ఇష్టపడతాడు. తెల్లవారి లేస్తే గోపీకి మొదట జ్ఞాపకం వచ్చేది రామూ.
యిప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్షిప్ ను దాటి కాస్త ముందుకు వెడదాం.
ఒకవేళ, గోపీకి, రామూ మాత్రమే కాక , తన క్లాసులోని వారందరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా అయ్యారనుకొండి . ఒక్కో సారి అలా జరుగుతుంది . గోపీని వాళ్ళ మేష్టారు క్లాస్ లీడరుగా పెట్టారనుకొండి. అందరు విద్యార్థులను సమానంగా చూడవలసిన అవసరాలు వస్తుంటాయి. అప్పుడు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు కూడా .
అప్పుడు గోపీ మనస్థితి ఎలావుంటుంది ?
అప్పుడు తెల్లవారి లేస్తే గోపీకి ఎవరు జ్ఞాపకం వస్తారు ?
30 మంది పేర్లు చెప్పు కోకున్నా , గోపీ, నా ఫ్రెండ్స్ అందరూ సుఖంగా వుండాలనుకుంటాడా?
నా ఫ్రెండ్స్ అందరూ ఆరోగ్యంగా, రోగాలు లేకుండా - అందరూ క్లాస్ కు రావాలని అనుకుంటాడా?
నా ఫ్రెండ్స్ అందరూ ఏ ఆపదలూ లేకుండా భద్రంగా ఉండాలనుకుంటాడా?
నా ఫ్రెండ్స్ అందరూ ఏ శోకాలూ , దుఃఖాలూ లేకండా వుండాలనుకుంటాడా ?
యిలా గోపీ కాస్త స్ట్రాంగ్ గా మనస్సులో అనుకుంటే , గోపీ యోగా లో ప్రవేశించినట్టే.
యిదే, గోపీ సంస్కృతం లో చెప్పాలనుకుంటే ఈ శ్లోకం చెబుతాడు :
సర్వే భవంతు సుఖినః (లేదా సర్వే మిత్రాహ్ సుఖినో భవంతు )
సర్వే సంతు నిరామయాహ్
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్
యిది దేవుడికి చేసే ప్రార్థన కాదు . గోపీ మనసులో రేగిన బలమైన, నిస్స్వార్ధమైన కోరిక
యిలా హృదయపూర్వకంగా అనుకున్నప్పుడు గోపీ కొంత యోగిగా మారిపోతాడు. అందరికీ లీడరు గదా మరి .
మానసికంగా అందరూ నాలో వున్నారు , అందరి శ్రేయస్సూ నేను కోరుకుంటున్నాను - అనే భావనే యోగా లో ఒక ముఖ్యమైన భావన.
యిప్పుడు ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది .
గోపీ మనసులోని ఈ బలమైన, నిస్స్వార్ధమైన కోరికను చుట్టూ వున్న ప్రకృతి కూడా వింటుంది .
మనసులో అనుకున్నాసరే.
ప్రకృతి ఈ నిస్స్వార్ధమైన, న్యాయమైన కోరికను తప్పకుండా వింటుంది. ప్రకృతికి ఆ శక్తి ఉంది. ప్రకృతికి అనేక రకాల శక్తులున్నాయి
సరే . ఎంతైనా కొంత, ఈ గోపీ కోరికను నిజం చేద్దామని ప్రయత్నం చేస్తుంది.
దీన్ని యిప్పుడు పాశ్చాత్య దేశాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ అని పేరు పెట్టుకున్నారు.
యిప్పుడు యితని బలమైన కోరికకు ప్రకృతి బలం కూడా కొంత తోడవుతుంది .
ప్రకృతి ఇతన్ని చూసి 'శభాష్ ' అంటుంది . తన చెయ్యి చాస్తుంది , యితని చేతిలో చెయ్యి కలపడానికి .
యిది మనకు అనుభవం కావాలి . ప్రకృతి తో చెయ్యి కలపడం మనకు రకరకాలుగా అనుభవం కావచ్చు .
దీనిపై - ఇప్పుడొక ఎక్స్పరిమెంట్ చెయ్యొచ్చు .
సర్వే భవంతు సుఖినః - అందరూ సుఖంగా ఉండాలి - అని కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా ఒక్కసారి అనండి . అన్నారా ?
యిప్పుడు కళ్ళు మూసుకునే ,మీ చెయ్య చాచండి . మీ ముందు విశ్వమంతా వ్యాపించి యున్న ప్రకృతి మాత
అతి సుందరంగా చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉంది. మీ చెయ్యి వైపు తన చెయ్యి చాచింది. మీ చేతిని అందుకుంది - ఒక తల్లి తన బిడ్డ చేతిని పట్టుకున్నట్టు . ప్రకృతి మాత అదృశ్య హస్తం మీచేతిని తాకుతున్న అనుభూతిని మీరు పొందాలి.
యిది ఒక గొప్ప అనుభూతి . యిది మీరు పొందే వరకు మీరు ఈ ఎక్సపెరిమెంట్ చెయ్యొచ్చు .
మరొక సింపుల్ ఎక్స్పరిమెంట్ చేద్దాం.
మీచుట్టూ వున్న ప్రకృతి లో మహా గొప్ప చైతన్యము ఉంది . మీకున్న పంచేంద్రియాల శక్తి కంటే ఎన్నో కోట్ల రేట్లు అధికమైన శక్తి ఆమెకు ఉంది .
మీరు ఎక్కడ వున్నా ఆమె మీ చుట్టూ వుంది. మిమ్మల్ని చూస్తూనే వుంది.
మీరు మీ స్వార్థాని కోసం ఏ పని చేసినా దానితో ఆమెకు సంబంధం లేదు.
కానీ, మీరు సర్వే జనః సుఖినో భవంతు అన్నప్పుడు, దాని కోసం పనిచేసినప్పుడు - ఆమె శభాష్ అంటుంది . మీతో చేతులు కలుపుతాను- అంటుంది. ఆ అనుభూతిని మీరు పొందాలి .
ప్రయత్నించండి. ప్రకృతిమాత మా చుట్టూ వున్న అనుభూతిని మీరు పొందండి.
ఒంటి చేత్తో చప్పట్లు కొట్టగలరా? కొట్ట లేరు . కానీ ప్రకృతి తో కలిసి కొట్టగలరా ? కొట్ట గలరు. ప్రయత్నించి చూడండి . ఒక వైపు మీ చేయి. మరో వైపు ప్రకృతి తన చేయి కలపడం . ఆ అనుభూతి వచ్చే వరకు చెయ్యండి .
యిలా చేస్తూ ఉంటే - మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రకృతి శక్తి కూడా మీకు తోడవుతుంది
=సర్వే జనాః సుఖినో భవంతు
మీ
విజయమోహన్