19, ఏప్రిల్ 2011, మంగళవారం

అన్యాయం సహించొద్దు ! = జయ ప్రకాష్ నారాయణ గారు = నాలుగు ఎద్దులు = వొక్క సిం హము =ఏది ఎలా గెలుస్తుంది?



"అన్యాయము చేయను.
అన్యాయానికి బలి కాను.
నా ఎదురుగా అన్యాయము జరిగితే సహించను."

అన్నారు జయ ప్రకాష్ నారాయణ గారు ఏదో వొక  టి వి  ప్రోగ్రాము లో.
బాగుంది. 

కానీ, అన్యాయాన్ని సహించని వారందరూ - ఏకమై వొకటిగా పోరాడితే ఫలితము బాగుంటుంది.



నాలుగు ఎద్దులు వొక్కటైతేనే అన్యాయమనే  సిం హాన్ని జయించొచ్చు.  

వొక్కటి గా కాకుండా, విడి విడి గా వుంటే - అన్యాయమనే సిం హము - మన లాంటి  ఎద్దుల నందరినీ కబళిం చేస్తుంది.

అదే జరుగుతోంది -    మన పవిత్ర భారత దేశములో.

అన్యాయాన్ని  సహించని వాళ్ళం తా వొక్క త్రాటి పైన నిలవాలి.

అలా నిలిస్తే, అన్యాయము సమసి పోవడం ఖాయం.

 అలా నిలవనంత కాలం - మనం సమసి పోవడమూ అంతే ఖాయం.

మరేం చేద్దాం - చెప్పండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్  

16, ఏప్రిల్ 2011, శనివారం

NAA MAATA NENU VINAALI (TELUGU) = MY ADVICE, I MUST LISTEN

మన మాట అందరూ వినడం లేదు.
నిజమే.
కాని, మనమూ వాళ్ళందరి మాట వినడం లేదు కదా!
లోకం అలాగే వుంటుంది.
ఎవరి మాట వారిదే.
ఎవరి గోల వారిదే.
కాక పోతే, వచ్చిన చిక్కల్లా - నా మాట నేనే వినడం లేదు.
నాకు కావలిసిన్దేదో నాకే తెలీదు.
నేను బాగా చదివితే బాగు పడతాను.
నేను మంచి ఆహారం మాత్రమే తింటే ఆరోగ్యముగా వుంటాను.
కోపాలు, తాపాలు లేకుండా వుంటే సంతోషముగా వుంటాను.
కానీ, అలా వుండటం లేదు?
ఎందుకు?
ఎందుకు, నా మాట నేనే వినడం లేదు?
నేను ఒక్కరు కాదు.
నాలో వొద్దనే వాడొకడు; కావాలనే వాడు ఇంకొకడు వున్నారు.
వొద్దో,కావాలో తెలీని మహానుభావుడు యింకోకడున్నాడు.

ఎవడు నేను?
నేను ఎవడో తెలుసుకుంటే ఈ సమస్య సమసి పోతుంది.

మీ = 
వుప్పలధడియం విజయమోహన్









ఎన్నో ముఖ్య విషయాలలో ఎంపిక మీదే! = మీ ఇల్లు నందన వనం కావడమో, చప్పగా వుండడమో - మీ ఎంపికే.


జీవితం లో చాలా విషయాలలో మనకు  ఎంపిక సామర్థ్యము యివ్వ బడ లేదు.
నిజమే.

మీ  పుట్టుక విషయములో  - మీ పాత్ర ఏమీ లేదు. ఏవేవో జరుగుతాయి. మీరు పుడతారు.

అంతే.

మీ అభిప్రాయాల్ని అడిగే వారెవరూ లేరప్పుడు. 

మీకు పుట్టే వారి విషయం లోను - మీకు పెద్దగా ఎంపిక లేదు. 

ఎంపికుంటే - మీ కొడుకో, కూతురో - ఎలా వుం డాలనుకుంటున్నారో  -  అలా మీరు పుట్టించే వారు కారా?

మీరనుకుంటున్నట్టు - వాళ్ళు పెరగడమూ లేదు. చదవడమూ లేదు. 

మీ మనసులో - ఎన్నో రకాల అసంతృప్తి. 

చాలా విషయాల్లో - మీకు   ఎంపిక సామర్థ్యము లేదు.   ఆ అధికారము మీకు యివ్వ బడ లేదు.

కానీ-

ఎన్నో ముఖ్య విషయాలలో మీకు ఎంపిక వుంధి.
ఈ క్షణంలో సంతోషంగా ఉండాలా? ఆ ఎంపిక మీదే!
ఈ క్షణంలో ప్రతి వొక్కరి తోనూ స్నేహంగా ఉండాలనుకోవడం - అధి  మీరు ఎన్నుకోవాల్సిందే!


 ఈ క్షణంలో - మీరేం మాట్లాడాలో -  అధి కూడా మీరు ఎన్నుకోవాల్సిందే!


మీ భార్య తోనో, భర్త తోనో - ప్రేమ పూర్వకం గా రెండు మాటలు మాట్లాడాలని ఎవరు అనుకోవాలి?

మీరే!  ఆ ఎంపిక మీదే!

అదే ఎంపిక - వారూ చేసుకుంటే -   మీ యింట్లో - ఆనందం - వెల్లి విరియదా!


మీరు వారి కేం చేస్తారో - ఏమేం చేస్తారో - అది మీ ఎంపిక - వారు దానికెలా ప్రతి స్పందిస్తారో -  అది వారి ఎన్నిక.

అదే విధంగా -వారు మీకేం చేస్తారో,  ఏమేం చేస్తారో - అది వారి ఎంపిక - మీరు   దానికెలా ప్రతి స్పందిస్తారో -  అది మీ  ఎన్నిక.

మీ ఇల్లు నందన వనం కావడమో, చప్పగా వుండడమో,  నరకంగా మారడమో - మీ (యిద్దరి) ఎంపికే.


= మీ


వుప్పలధడియం విజయమోహన్

7, ఏప్రిల్ 2011, గురువారం

భయము = నిర్భయము = సంతోషం = = TELUGU BLOG



మనిషి కున్న అతి పెద్ద జబ్బు ఏమిటి?
కాన్సరా? ఎయిడ్సా?  హృద్రోగామా?

ఇవేవీ కాదు.

మనిషిని పట్టి అతిగా బాధించే అతి పెద్ద జబ్బు పేరు "భయం".

భయం లేని వాణ్ణి ఏ జబ్బూ ఏమీ చేయ లేదు.

భయపడే వాడికి ఏ జబ్బైనా విపరీతంగా బాధ పెట్టేదే!

శరీరానికి జబ్బులు వస్తాయి. రాకుండా వుండవు.

భయం మాత్రం మీకు రాకుండా చూసుకుంటే  మీ జీవితం హాయిగా  గడిచి పోతుంది.

మనిషి కున్న మహా భయం చావును గురించి, అట. మనిషికే గాదు, ప్రతి ప్రాణికీ చావంటే - భయం. కానీ - చాలా ప్రయోగాల ద్వారా తెలిసింది ఏమిటంటే - భయం లేని వాడికి, చావు చాలా సులభం, కష్టం లేనిదీ అని.

పతంజలి మహర్షి యోగ సూత్రాల ద్వారా - తెలిసేది ఏమిటంటే - చావు అంటే భయమూ,  బ్రతుకు  పై తీపి - ఈ రెండింటిని     "అభినివేశం" అంటారు ఆయన - వీటికి కారణం - అజ్ఞానం లేదా అవిద్య  అని చెప్పారు.

ఎప్పుడో, రాబోయే దాన్ని గురించి యిప్పుడు భయపడడం, దుహ్ఖించడం - చాలా అవివేకం అంటారు ఆయన.  ఈ భయానికి విరుగుడు - ధ్యానం అంటారు ఆయన.

ధైర్యమున్న చోట భయముండదు. భయమున్న చోట ధైర్యముండదు. భయానికి కారణం అజ్ఞానమే.

మీకు ఏది కావాలో - మీరే నిర్ణయం చేసుకోవాలి. ధైర్యమా? భయమా?

హిమాలయాల్లో, వొంటరిగా వున్న వారికి  లేని భయం - మీ యింట్లో - మీకు  ఎందుకు ?

మనిషికున్న గొప్ప వరం - ఈ క్షణం.

ఈ క్షణం లో మనం వున్నాం. మరో క్షణంలో మనమే కాదు - ఎవరుంటారో ఎవరికీ తెలీదు.

ఈ క్షణంలో - మీరు సుఖంగా వుండ గలిగే, సంతోషంగా వుండ గలిగే అవకాశం పూర్తిగా వుంది.

మీ రోగాలను పక్కన పెట్టండి.మీ సమస్యల నన్నిటినీ  పక్కన పెట్టండి.

ముఖ్యంగా మీ అన్ని భయాలనూ మూట కట్టి పక్కన పెట్టండి - లేదా సముద్రంలో వేసెయ్యండి.

అవి ఏవీ మీకు అక్ఖర లేదు.

ఈ క్షణం మీది. దీన్ని మీ నుండి ఎవరూ తీసేయ్య లేరు.

ఈ క్షణం  లో ఆనందంగా వుండండి.

పాట పాడండి. డాన్సు చెయ్యండి. ఈల వెయ్యండి. నవ్వండి. ఆడండి. హాయిగా మాట్లాడండి.

సంతోషంగా వుండే మరే పని అయినా చెయ్యండి.

భయాన్ని మాత్రం దగ్గరికి రానివ్వకండి. అది పనికిరాని అలవాటు మాత్రమే.

ధైర్యం గా వుండే వాడే సంతోషంగా వుండగలడు.


సంతోషంగా వుండడం అలవాటుగా మార్చుకోండి.

రోగాలు మనల్ని ఏమీ చెయ్య లేవు.

ఒక్క జీవిత కాలం మనం సంతోషంగా ఉందాం.

= మీ

వుప్పలధడియం  విజయమోహన్
  





3, ఏప్రిల్ 2011, ఆదివారం

UGADHI = KHARA NAAMA SAMVATHSARAM = HEARTIEST GREETINGS

రెండు వేల పదకొండు, ఏప్రిల్ నెల నాలుగవ తేదీ.
ఈ  రోజు  ఖర నామ సంవత్సర ఉగాది.
అందరికీ నా శుభాకాంక్షలు.
ప్రతి సంవత్సరమూ మంచిదే.
కొంత మంచి జరుగుతుంది. కొంత చెడ్డ.
మన మనసు మంచిదయితే ప్రకృతి కూడా మంచి గానే స్పందిస్తుంది.
మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి జరుగుతుంది.
ఏది ఏమైనా మనం చేయ గలిగిన మంచి కొంత ఎక్కువగానే చేద్దాం.
సంవత్సరం మంచి గానే వుంటుంది.
ఏప్రిల్ ఒకటవ తేదీ నాడు - పలమనేరు (చిత్తూర్ జిల్లా) లో, ధ్యానం గురించి ఒక సత్సంగాన్ని - నన్ను నిర్వహించమని అడిగారు. 
దాదాపు తొంభై  మంది  ధ్యాన సాధకులు వచ్చారు, ఆ సంత్సంగానికి.
ఆ సత్సంగాన్ని గురించి మీరు వయ్స్ స్పిరిచువాల్ఐడియాస్ .బ్లాగ్స్పోట్.కం  లో చదవచ్చు.

చిన్న ఊర్లలో యింత  మార్పు ఇంత సులభంగా వస్తుందని -చాలా సంతోషంగా వుంది.

మంచి చేసే వాళ్ళు  చాలా మంది వున్నారని మనం  గ్రహించ వచ్చు.

మీ-
వుప్పలధడియం విజయమోహన్




 


4, మార్చి 2011, శుక్రవారం

మీ జీవితం, మీ సంతోషం - మీ అలవాట్లలోనే వుంది. = HABITS = THEIR EFFECT = TELUGU

మనమూ  -   మన అలవాట్లు


మన అలవాట్లు మనల్ని ఎలా శాసిస్తాయో మనం గమనిస్తున్నామా?

అలవాట్లు మంచివైనా , చెడ్డవైనా మన జీవితాల పైన వాటి అధికారం, వాటి  శాసనం  చెలాయిస్తాయి.

ఉదయం లేచి ప్రార్థన చేయడం మీకు అలవాటు అనుకోండి. అది మంచి అలవాటే అయినా, దానికి కూడా మీరు లోబడి, ఆ అలవాటు ప్రకారమే మీరు నడుచుకునే లాగా చేస్తుంది.

ఫలితం మంచిదే. జీవితంలో - మిమ్మల్ని - ముందుకు తీసుకు వెళ్ళుతుంది. అయినా - ఆ అలవాటుకు, మీరు లోబడి ఉన్నారన్న విషయం మరిచి పోలేం. అవునా. మీ అలవాట్లు మిమ్మల్ని, రకరకాలుగా - శాసించుతాయి. 

మరి పొగ త్రాగడం, గంజాయి పీల్చడం, డ్రగ్స్ వంటివి, మిమ్మల్ని తమకు బానిస చేసుకోవడం మాత్రం కాకుండా, మీ జీవితాన్ని పీల్చి, పిప్పి చేసి మిమ్మల్ని అధః పాతాళానికి నొక్కి పడవేస్తాయి.

చెడు అలవాట్ల వరకు - మీరు మొదటిసారి,  ప్రతి సారి -  'నో'  అనే చెప్పాలి.
మీ స్నేహితుడు చెప్పాడనో, మీ పై అధికారి చెప్పాడనో,  ఒక్క సారి చెడు అలవాటుకు గురి అయ్యారంటే - చెడు పదార్ధం తీసుకున్నారంటే , మీ జీవితాన్ని, మీరే చెడుపుకున్నట్టే.

మీ మంఛి స్నేహితుడు కూడా మీకొక మంఛి అలవాటే.

మీ చెడు స్నేహితుడు కూడా మీకొక చెడు అలవాటే.

మీకు తెలుసా - చెడు అలవాటు చేసుకోవడానికి - వొక్క క్షణం చాలు.

కానీ - మం ఛి అలవాటు చేసుకోవడానికి - కనీసం మండలం  (45 నుండి 48 ) రోజులు పడుతుంది.

మంచి స్నేహితుడు మీకుంటే- ఎటువం టి కారణం కోసమైనా - విడవకండి.

అదే విధం గా చెడ్డ వాని స్నేహితం ఏ కారణం కోసమూ  చేయకండి.

మంచి అలవాటు - ఎటువం టి కారణం కోసమైనా - విడవకండి.

ఎటువం టి కారణం కోసమైనా -  చెడు అలవాటు - చేసుకోకండి.

కోపంగా వుండటం వొక అలవాటు.  అసూయ వొక అలవాటు. ద్వేషం వొక అలవాటు.

కామం వొక అలవాటు. లోభము వొక అలవాటు..

మీరు బాగా గమనింఛాలి.  ఈ అలవాట్లు మిమ్మల్ని - మీ సంతోషాన్ని -  తినేసే రాక్షసులు.

అలాగే - మంచిగా మాట్లాడడం  వొక అలవాటు. సహాయం చేయడం వొక అలవాటు.

సం తోషంగా వుండటం వొక అలవాటు.

మీ అలవాట్లేమిటో - చూసుకోండి.

వొక  మండలం పాటు - జాగ్రత్తగా చూసుకుం టే - ఎటువంటి, మంఛి అలవాటు నైనా సాధించ వచ్చు.

మీ జీవితం,  మీ సంతోషం - మీ అలవాట్లలోనే వుంది. 


= మీ

వుప్పలధడియం విజయమోహన్

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

what are we? = WHAT DO WE OWN? = MANA SWANTHAM AINADHI EMITI?= TELUGU

మన స్వంతము ఐనది ఏమిటి? ఎక్కడుంది?

మనం పుట్టినప్పుడు ఒక్క అడుగు ఎత్తు వుండే వాళ్ళం.
పెరిగే కొద్దీ అయిదు  నుండీ  ఆరు ఆరున్నర అడుగుల ఎత్తు వరకూ ఎదిగాం.
మనకు తెలుసు, ఇదంతా భూమి నుండీ వచ్చిన ఆహారము నుండీ గాలి నుండీ నీళ్ళ నుండీ వచ్చిందని.

ప్రతి రోజూ మళ్ళీ   ఎక్కడి నుండీ వచ్చిన్దో  అక్కడికే  తిరిగి వెళ్లి పోతూ కూడా వుంది.
అందుకే మళ్ళీ మళ్ళీ ఆహారం తినాలి. నీళ్ళు తాగాలి. గాలి పీల్చాలి.
లేదంటే ఈ శరీరం మీ దగ్గర ఉండదు. దీని ఉనికి మీ దగ్గర కాదు. 
మీ చుట్టూ వున్నా పంచ భూతాల దగ్గర. అక్కడి నుండీ వస్తుంది. అక్కడికే వెళ్లి పోతూ వుంటుంది.
 మీధన్నట్టు, మీ దగ్గర వున్నట్టు మీరు భ్రమ పడుతూ వుంటారు.

మీ మనస్సు కూడా మీదు కాదు. నాలుగు రోజుల పాటు ఆహారం తినకండా వుండండి.
మీ మనస్సు ఖాళీ అయి పోతుంది. మీకేమీ జ్ఞాపకం ఉండదు.

ఈ శరీరమూ, ఈ మనస్సూ మీరు కాదు. మీదీ కాదు. ఇవి ఏవీ మీరు నిలుపుకోలేరు.
కనిపించే శరీరమూ మీది కాదు. అనిపించే మనస్సూ మీది కానప్పుడు, మరి మీరు ఎవరు?
ఇదండీ రమణ మహర్షుల వారిలో, బుద్ధుల వారిలో, మరెంతో మంది జ్ఞానుల మనస్సులలో  తలెత్తిన ప్రశ్న.

ఇది తెలియాలంటే  అప్పుడప్పుడూ కాస్సేపు కళ్ళు మూసుకుని, మనస్సు లోపలి కి వెళ్ళాలి.
మనస్సును కాస్త పరిశుభ్రం చెయ్యాలి.
పరిశుభ్రమైన మనస్సును ఈ ప్రశ్న అడగాలి.
ప్రశాంతంగా ప్రపంచమంతా చూడాలి.
ఎక్కడ చూసినా మీరే.
అంతా మీరే. అయినా ఏదీ మీరు కాదు. ఏదీ మీది  కాదు.
అంతటా ఏదో జగన్నాటకం నిరంతరం జరిగి పోతూ వుంది.
అంతా మారి పోతూ వుంది. మీశరీరం, మనస్సులతో సహా.

కానీ మారని మీరు ఎక్కడో వున్నారు.
ఆ మారని మీరు మాత్రమే నిజమైన మీరు.
మిమ్మల్ని మీరు కనుక్కోండి.
మీరు అంతటా వున్నారు.
మీకు పుట్టుక, చావు రెండూ లేదు. మీరు ఎల్లప్పుడూ వున్నారు; వుంటారు.
ప్రతి ప్రాణి లోనూ  ప్రతి వస్తువు లోనూ అంతర్లీనంగా దాగి వున్నా చైతన్యం  మీరే.
మీరు ప్రపంచం లోని మహదానందము యొక్క అంశం.
మీరు -
సత్ చిత్ ఆనంద స్వరూపులు.
ఎల్లప్పుడూ వున్నా,వుండే చైతన్య, ఆనంద స్వరూపులు.
అది తెలుసు కోవదానికే మన ఈ ప్రయత్నాలన్నీ.